జపాన్ దిగ్గజ సంస్థ సాఫ్ట్ బ్యాంక్ గ్రూప్‌కు చెందిన విజన్ ఫండ్ త్వరలోనే కీలక నిర్ణయం తీసుకోనున్నట్లు కంపెనీ వర్గాలు భావిస్తున్నాయి. ప్రస్తుతం విజన్ ఫండ్ రూ.1800 కోట్ల తీవ్ర నష్టాలను ఎదుర్కొంటుంది. ఈ క్రమంలో నష్టాలను తగ్గించుకునే క్రమంలో భాగంగా 10 శాతం ఉద్యోగులకు ఉద్వాసన పలకనున్నట్లు సంస్థ వర్గాలు తెలిపాయి. ప్రస్తుతం టోక్యో, కాలిఫోర్నియాలో విజన్ ఫండ్ సంస్థ కార్యకలాపాలు నిర్వహిస్తుంది. మొదటగా విజన్ ఫండ్‌లో అత్యధిక వేతనాలు అందుకుంటున్న వారిని తొలగించాలని సంస్థ భావిస్తున్నట్లు టోక్యోకు చెందిన కోజీ హిరయి అనే ఆర్థిక నిపుణుడు విశ్లేషించాడు.
ప్రస్తుతం సాఫ్ట్‌బ్యాంక్ అలీబాబా గ్రూప్‌కు తమ షేర్లను అమ్మనున్నట్లు పేర్కొన్నారు. కాగా కంపెనీకి చెందిన ఉన్నతాధికారులు మాత్రం 500మంది వరకు ఉద్యోగుల తొలగింపు ఉండవచ్చని భావిస్తున్నారు. ప్రస్తుతం చైనా, అమెరికా విభేదాల నేపథ్యంలో తమ మిత్రపక్షమైన అలీబాబా గ్రూప్‌తో ఒప్పందాలు కుదుర్చుకునేందుకు ఇబ్బందులు ఎదురుకావచ్చని సాఫ్ట్‌బ్యాంక్ సంస్థ ఆవేదన వ్యక్తం చేస్తోంది.
Comments
Please login to add a commentAdd a comment