Soft Bank Corporation
-
ఓయో ఫౌండర్ రితేష్ అగర్వాల్ పెళ్లిలో ఆసక్తికర ఘటన!
ఆతిథ్యం, ప్రయాణ సేవల(ట్రావెల్ టెక్) కంపెనీ ఓయో అధినేత రితేష్ అగర్వాల్ (Ritesh Agarwal) వివాహం ఘనంగా జరిగింది. రితేశ్ అగర్వాల్- గీతాన్షా దంపతుల వివాహానికి సాఫ్ట్‌బ్యాంక్ చైర్మన్ మసయోషి సన్ హాజరయ్యారు. మసయోషితో పాటు ఎయిర్ టెల్ చైర్మన్ సునీల్ భారతీ మిట్టల్, పేటీఎం సీఈవో విజయ్ శేఖర్ శర్మ, లెన్స్ కార్ట్ సీఈవో పియోష్ బన్సాల్ వంటి కార్పొరేట్ దిగ్గజాలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా రితేష్ అగర్వాల్ దంపతులు సాఫ్ట్ బ్యాంక్ చైర్మన్ మసయోషి సన్ పాదాలకు నమస్కరించి ఆశీర్వాదం తీసుకోవడం దేశీయ కార్పొరేట్ వరల్డ్‌లో ఆసక్తికరంగా మారింది. ఇక మసయోషి పర్యటనపై విజయ్ శేఖర్ శర్మ ట్వీట్ చేశారు. ఈ రోజు వెలకట్టలేని ఆనందం. మస నవ్వుతూ, సంతోషంగా ఉన్న ఈ ఆనంద సమయాల్లో భారత పర్యటన చేయడం..దేశీయ స్టార్టప్‌లపై అతనికి ఉన్న నమ్మకం, సపోర్ట్‌కు కృతజ్ఞతలు అంటూ మసయోషితో దిగిన ఫోటోల్ని ట్వీట్ చేశారు. కేంద్ర జల్‌శక్తిశాఖ సహాయమంత్రి ప్రహ్లాద్ సింగ్ పటేల్ సైతం పెళ్లికి హాజరై వారికి శుభాకాంక్షలు తెలిపారు. Ultimate joy today, seeing Masa smiling, happy and enjoying his India trip. Everyone of us had tons of gratitude for his belief and support given to our Startups. pic.twitter.com/pt33w0AwyE — Vijay Shekhar Sharma (@vijayshekhar) March 7, 2023 గత వారం తన వివాహ వేడుక ఆహ్వాన పత్రికను ప్రధాని నరేంద్ర మోదీకి అందజేశారు. ఢిల్లీలో తన తల్లి, కాబోయే భార్యతో కలిసి మోదీ వద్దకు వెళ్లిన రితేశ్.. ప్రధానికి పెళ్లి ఆహ్వానపత్రిక అందజేసి ఆయన ఆశీస్సులు తీసుకున్నారు. ఆ ఫోటోలను రితేష్ అగర్వాల్ ట్విటర్లో షేర్ చేశారు. -
విజన్ ఫండ్ సీఈఓకు రెట్టింపు వేతనం
ముంబై: జపాన్ దిగ్గజ సంస్థ సాఫ్ట్ బ్యాంక్ గ్రూప్‌కు చెందిన విజన్ ఫండ్ తీవ్ర నష్టాలను చవిచూస్తుంది. ప్రస్తుతం విజన్ ఫండ్ రూ.1700 కోట్ల నష్టాలను ఎదుర్కొంటుంది. ఈ సంక్షోభ సమయంలో విజన్ ఫండ్ సీఈఓ రాజీవ్ మిశ్రాకు రెట్టింపు వేతనాన్ని(కోటి యాబై లక్షల డాలర్లు) పెంచడం పట్ల మార్కెట్ నిపుణులు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. త్వరలోనే విజన్ ఫండ్ పది శాతం ఉద్యోగులకు ఉద్వాసన పలకనుందన్న ఊహాగానాల నేపథ్యంలో రాజీవ్ మిశ్రాకు రెట్టింపు వేతనం పెంచడంతో ప్రాధాన్యత సంతరించుకుంది. ప్రస్తుతం టోక్యో, కాలిఫోర్నియాలో విజన్ ఫండ్ సంస్థ కార్యకలాపాలు నిర్వహిస్తుంది. తాజాగా సాప్ట్ బ్యాంక్ తిరిగి పుంజుకోవడానికి అక్షయ్ నహేతా సీనియర్ వైస్ ప్రెసిడెంట్‌గా, సీనియర్ అడ్వైజర్‌గా కెంటారోను నియమించుకోనున్నట్లు కంపెనీ వర్గాలు తెలిపాయి. సీఈఓ వేతన పెంపుకు సంబంధించి కారణాలను మాత్రం కంపెనీ వెల్లడించలేదు. -
సాఫ్ట్‌బ్యాంక్ గ్రూప్‌లో ఉద్యోగుల ఉద్వాసన?
జపాన్ దిగ్గజ సంస్థ సాఫ్ట్ బ్యాంక్ గ్రూప్‌కు చెందిన విజన్ ఫండ్ త్వరలోనే కీలక నిర్ణయం తీసుకోనున్నట్లు కంపెనీ వర్గాలు భావిస్తున్నాయి. ప్రస్తుతం విజన్ ఫండ్ రూ.1800 కోట్ల తీవ్ర నష్టాలను ఎదుర్కొంటుంది. ఈ క్రమంలో నష్టాలను తగ్గించుకునే క్రమంలో భాగంగా 10 శాతం ఉద్యోగులకు ఉద్వాసన పలకనున్నట్లు సంస్థ వర్గాలు తెలిపాయి. ప్రస్తుతం టోక్యో, కాలిఫోర్నియాలో విజన్ ఫండ్ సంస్థ కార్యకలాపాలు నిర్వహిస్తుంది. మొదటగా విజన్ ఫండ్‌లో అత్యధిక వేతనాలు అందుకుంటున్న వారిని తొలగించాలని సంస్థ భావిస్తున్నట్లు టోక్యోకు చెందిన కోజీ హిరయి అనే ఆర్థిక నిపుణుడు విశ్లేషించాడు. ప్రస్తుతం సాఫ్ట్‌బ్యాంక్ అలీబాబా గ్రూప్‌కు తమ షేర్లను అమ్మనున్నట్లు పేర్కొన్నారు. కాగా కంపెనీకి చెందిన ఉన్నతాధికారులు మాత్రం 500మంది వరకు ఉద్యోగుల తొలగింపు ఉండవచ్చని భావిస్తున్నారు. ప్రస్తుతం చైనా, అమెరికా విభేదాల నేపథ్యంలో తమ మిత్రపక్షమైన అలీబాబా గ్రూప్‌తో ఒప్పందాలు కుదుర్చుకునేందుకు ఇబ్బందులు ఎదురుకావచ్చని సాఫ్ట్‌బ్యాంక్ సంస్థ ఆవేదన వ్యక్తం చేస్తోంది. -
సాఫ్ట్‌బ్యాంక్‌తో భారతీ జట్టు
ఫాక్స్‌కాన్‌తో కూడా కలిసి జేవీ ఏర్పాటు సౌర విద్యుత్ ప్రాజెక్టుల నిర్మాణంపై దృష్టి న్యూఢిల్లీ: దేశీయంగా భారీ ఎత్తున సౌర విద్యుత్ ప్రాజెక్టులను ఏర్పాటు చేసే దిశగా టెలికం దిగ్గజం భారతీ ఎంటర్ప్రైజెస్, జపాన్‌కి చెందిన సాఫ్ట్‌బ్యాంక్ కార్పొరేషన్, తైవాన్ సంస్థ ఫాక్స్‌కాన్‌తో చేతులు కలిపింది. ఈ జాయింట్ వెంచర్ సంస్థ ఎస్బీజీ క్లీన్టెక్ ...సౌర విద్యుత్ రంగంలో దాదాపు 20 బిలియన్ డాలర్లు ఇన్వెస్ట్ చేయనుంది. భారత్‌లో 20 గిగావాట్ల పునరుత్పాదక విద్యుత్ ప్రాజెక్టులను నిర్మించాలని లక్ష్యంగా నిర్దేశించుకుంది. ఇందులో సాఫ్ట్‌బ్యాంక్‌కు మెజారిటీ వాటాలు ఉంటాయి. భారతీ ఎంటర్ప్రైజెస్, ఫాక్స్‌కాన్ సంస్థలకు మైనారిటీ వాటాలు ఉంటాయి. సౌర ప్రాజెక్టులకు అవసరమైన యంత్రపరికరాల తయారీలో ఫాక్స్‌కాన్ సహకారం అందిస్తుందని సాఫ్ట్‌బ్యాంక్ సీఈవో మసయోషి సన్ తెలిపారు. భారత్‌లోనే వీటి తయారీ చేపట్టాలని యోచిస్తున్నట్లు ఆయన వివరించారు. జపాన్‌తో పోలిస్తే భారత్‌లో రెండింతల సూర్య రశ్మి ఉంటుందని, సోలార్ పార్క్ ఏర్పాటు వ్యయాలు దాదాపు సగమే ఉంటాయని ఆయన తెలిపారు. జాయింట్ వెంచర్ కంపెనీకి మనోజ్ కొహ్లి ఎగ్జిక్యూటివ్ చైర్మన్‌గాను, రామన్ నందా సీఈవోగాను వ్యవహరిస్తారని భారతీ ఎంటర్ప్రైజెస్ చైర్మన్ సునీల్ మిట్టల్ తెలిపారు. మరోవైపు, మసయోషి సన్, సునీల్ మిట్టల్‌తో కలిసి జపాన్ బ్యాంక్ ఫర్ ఇంటర్నేషనల్ కోఆపరేషన్ సీనియర్ ఎండీ తదాషి మెయిడా .. ప్రధాని నరేంద్ర మోదీని కలిశారు. భారత్‌లో పునరుత్పాదక విద్యుత్ రంగంలో ఇన్వెస్ట్ చేయడంపై వారు చర్చించినట్లు ప్రధాని కార్యాలయం ఒక ప్రకటనలో తెలిపింది.