సీసీఐకి రైతుల షాక్ !
సంస్థకు విక్రరుుంచేందుకు వెనుకంజ
తక్కువ ధర అరుునా.. వ్యాపారుల వైపే మొగ్గు
వెంటనే డబ్బులు ఇవ్వకపోవడం..
బ్యాంకుల కొర్రీలే కారణం
వరంగల్ సిటీ :ఆరుగాలం శ్రమించి పండించిన పంటను ఎక్కువ రేటుతో కొనుగోలు చేసే వారికి విక్రరుుంచేందుకు రైతులు పోటీపడతారు. ఇందులోనూ.. తెల్లబంగారాన్ని ప్రభుత్వ రంగ సంస్థ అరుున కాటన్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియూకు అమ్ముకునేందుకే ఎగబడతారు. వ్యాపారులు తమ జిమ్మిక్కులతో ధర తగ్గించి కొనుగోలు చేసినప్పుడల్లా... సీసీఐ కొనుగోలు చేయూలంటూ రైతులు ఆందోళనకు దిగిన సందర్భాలు ఎన్నో ఉన్నారుు. ఎన్ని రోజులు ఆలస్యమైనా సరే... ఆ సంస్థ అధికారులు కొనుగోళ్లు చేసేవరకూ కర్షకులు రోజుల తరబడి పత్తి బస్తాలతో మార్కెట్‌లోనే వేచి ఉండేవారు. ప్రభుత్వ మద్దతు ధర అందుతుండడమే ఇందుకు ప్రధాన కారణం. అలాంటిది... ఆసియూలోనే అతి పెద్దదిగా పేరొందిన వరంగల్ ఏనుమాముల మార్కెట్‌లో సీన్ రివర్స్ అరుుంది. పత్తి బస్తాలతో మంగళవారం మార్కెట్‌కు తరలివచ్చిన రైతులు తమ పం ట ఉత్పత్తులను సీసీఐకి అమ్మడానికి వెనుకంజ వేశారు. మంగళవారం మార్కెట్‌కు సుమారు 20 వేల పత్తి బస్తాలు వచ్చారుు. ఉదయం సీసీఐ అధికారులు 1,600 పత్తి బస్తాలను కొనుగోలు చేశారు. మరికొన్ని బస్తాలను కొనుగోలు చేస్తున్న క్రమంలో సీ న్ మారింది. రైతులందరూ ప్రైవేట్ వ్యాపారులకు విక్రరుుంచేందుకు మొగ్గుచూపా రు. మార్కెట్ అధికారులు నచ్చజెప్పినా... వారు సీసీఐకి విక్రరుుంచేందుకు ససేమిరా అన్నారు. సీసీఐకి అమ్మినదానికంటే రూ. 100 నుంచి రూ.200 తక్కువ అయినా... అడ్తిదారుల ద్వారా వ్యాపారులకే అ మ్మా రు. ముందుగా ప్రభుత్వ మద్దతు ధర క్విం టాల్‌కు రూ.4,050తో సీసీఐకి అమ్మిన రైతులు సైతం మనసు మార్చుకుని... వ్యా పారులకే విక్రరుుంచడం విశేషం. ఒక్క అ గ్రంపాడ్‌కు చెందిన రైతు వెంకటేశ్వర్లు మా త్రమే సీసీఐకి 25 బస్తాల పత్తిని అమ్మాడు.
కారణం ఇదే..
పత్తి బస్తాలను సీసీఐకి విక్రరుుంచకపోవడంపై ‘సాక్షి’ ఆరా తీసింది. విక్రరుుంచిన వెంటనే సీసీఐ డబ్బులివ్వదని, వాళ్ల చు ట్టూ కాళ్లరిగేలా తిరగాలని పలువురు రైతు లు చెప్పారు. పంటల సాగు కోసం తెచ్చిన అప్పులు కుప్పలుగా పేరుకుపోయూయని.. మిత్తి కట్టేందుకు ఎంతో కొంతకు అమ్ముకున్నామని కొందరు తెలిపారు. చెక్‌లు ఇస్తుండడంతో బ్యాంకుల్లో ఇబ్బం దులు ఎదురవుతున్నాయని.. బ్యాంకులో అప్పు ఉంటే వారి ఖాతాల్లో జమ చేసుకుంటున్నారని.. అందుకనే తక్కువ వచ్చి నా... వ్యాపారులకే అమ్ముకున్నామని మరి కొందరు వాపోయూరు. అరుుతే.. అడ్తివ్యాపారులు ఏకమై రైతులను భయభ్రాంతులకు గురిచేసినట్లు వినికిడి. అందుకే అమ్మిన రైతులు సైతం అమ్మకాలు రద్దు చేసుకున్నట్లు మార్కెట్ వార్గాల్లో ప్రచారం జరుగుతోంది.