Cotton Corporation of India
-
ధరలేక దిగాలు
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో ధాన్యం రైతు దగా పడుతున్నట్లుగానే పత్తి రైతు కూడా చిత్తవుతున్నాడు. మద్దతు ధర కల్పనకు తేమ శాతం సాకుతో కాటన్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (సీసీఐ) మోకాలడ్డుతుంటే అంతర్జాతీయ మార్కెట్‌ను సాకుగా చూపి వ్యాపారులు సిండికేట్‌గా మారిపోయారు. ఫలితంగా గతంలో ఎన్నడూలేని విధంగా పత్తి ధర పతనమైందని.. సర్కారు తీరువల్ల పెట్టుబడి కూడా దక్కడంలేదని రైతులు గగ్గోలు పెడుతున్నారు. రాష్ట్రంలో పత్తి సాధారణ విస్తీర్ణం 14.91 లక్షల ఎకరాలు. గతేడాది 15 లక్షల ఎకరాల్లో సాగవగా ఈ ఏడాది 9.82 లక్షల ఎకరాల్లో సాగైంది. వరదలు, వర్షాలకు తోడు గులాబీ తెగులు ప్రభావంతో ఎకరాకు 4–6 క్వింటాళ్లకు మించి దిగుబడి రావడంలేదంటున్నారు. ఈ ఏడాది కనీస మద్దతు ధరగా మధ్యస్థ రకానికి క్వింటా రూ.7,121, పొడవు రకానికి రూ.7,521గా కేంద్రం నిర్ణయించింది. కానీ, ఈ ఏడాది తొలితీత ప్రారంభానికి ముందే మార్కెట్లో ధరల పతనం మొదలైంది. గతేడాది క్వింటా రూ.10వేలకు పైగా పలికిన పత్తి ప్రస్తుతం మార్కెట్లో గ్రేడ్‌ను బట్టి క్వింటా రూ.4వేల నుంచి రూ.5,800 మించి పలకడంలేదు. మరోవైపు.. ఏటా అక్టోబరు మూడోవారంలో ప్రారంభం కావాల్సిన సీసీఐ కేంద్రాలు ఈ ఏడాది నవంబరు 11నాటికి కానీ ప్రారంభం కాలేదు. పైగా.. 33 ఏఎంసీల పరిధిలో 61 జిన్నింగ్ మిల్లులు ఏర్పాటుచేయాలని సంకలి్పంచగా, 45 జిన్నింగ్ మిల్లుల్లో మాత్రమే కొనుగోళ్లు మొదలయ్యాయి. సుదూర ప్రాంతాల్లో కేంద్రాలు.. ఇక కొనుగోలు కేంద్రాలను మారుమూలనున్న మిల్లుల వద్ద ఏర్పాటుచేయడంతో రవాణా, లోడింగ్ చార్జీలు రైతులకు తడిసిమోపెడవుతున్నాయి. ఉదా.. వైఎస్సార్ జిల్లాలో ఒక్క కేంద్రం ఏర్పాటుచేయలేదు. ఈ జిల్లాకు చెందిన రైతులు నంద్యాలకు తీసుకెళ్లి అమ్ముకోవాల్సిన దుస్థితి ఏర్పడింది. అలాగే, గుంటూరు జిల్లా తాడికొండ రైతులు కూడా 30 కిలోమీటర్ల దూరంలో ఉన్న ప్రత్తిపాడు మండలంలోని కోయపాలెం మిల్లుకు వెళ్లాల్సి వస్తోంది. పోనీ ధర పెరిగే వరకు నిల్వచేసుకుందామనుకుంటే క్వింటాకు రూ.400–500 వరకు అద్దెలు చెల్లించాల్సి రావడంతో చేసేదిలేక అయినకాడకి అమ్ముకుంటున్నారు. తేమ శాతం పేరిట కొర్రీలు..కేంద్ర నిబంధనల మేరకు 8 శాతం తేమతోనే పత్తిని కొనుగోలు చేస్తారు. ఆ తర్వాత 12 శాతం వరకు ఒక్కో శాతం చొప్పున ఎమ్మెస్పీ ధరలో కోత విధిస్తారు. కృష్ణా, ఎన్టీఆర్, గుంటూరు, పల్నాడు, కర్నూలు జిల్లాల్లో పత్తి పిందె, పూతకొచ్చే దశలో కురిసిన అధిక వర్షాల కారణంగా తేమ శాతం 15–30 శాతం చొప్పున నమోదవుతుండగా, ప్రస్తుతం కురుస్తున్న మంచు ప్రభావంతో పెరుగుతున్న తేమశాతం రైతులకు ఇబ్బందికరంగా మారింది. కేంద్రాల్లో ఏర్పాటుచేసిన రెండు రకాల యంత్రాల్లో ఒక్కోదాంట్లో ఒక్కో రీతిలో తేమ శాతం నమోదవడంతో రైతులు నష్టపోతున్నారు. జిన్నింగ్ పరిశ్రమల యాజమాన్యాలతో సీసీఐ అధికారులు కుమ్మక్కై సర్వర్ నెమ్మదిగా ఉందని, తేమ శాతం ఎక్కువగా ఉందనే సాకులు చెబుతూ మద్దతు ధర దక్కనీయకుండా చేస్తున్నారని రైతులు ఆరోపిస్తున్నారు. తేమ శాతం అధికంగా ఉన్న పత్తిని నిల్వచేస్తే రంగు మారుతుండగా, నాణ్యమైన దిగుబడులొచి్చన చోట కేంద్రాలు ఏర్పాటుచేయకపోవడంతో దూర ప్రాంతాలకు వెళ్లలేక రైతులు అయినకాడకి అమ్ముకోవల్సిన దుస్థితి ఏర్పడింది.ఒక్క కేంద్రం కూడా ఏర్పాటుచేయలేదు.. మా జిల్లాలో ఒక్క కేంద్రం కూడా ఏర్పాటుచేయలేదు. ఫలితంగా నంద్యాల జిల్లాలోని కేంద్రానికి వెళ్లాల్సి వస్తోంది. ఇక్కడి నుంచి వేలకు వేలు ఖర్చుపెట్టి లారీల్లో పత్తిని తీసుకుకెళ్తే అక్కడ నిమ్ము ఎక్కువగా ఉందని నాణ్యతలేదని రేటు తగ్గించేస్తున్నారు. మా జిల్లా నుంచి ఎవరు వెళ్లడంలేదు. ఇక్కడే అమ్ముకుంటున్నారు. గతేడాది మద్దతు ధరకు మించి పలికింది. ఈ ఏడాది రూ.6 వేలకు మించి పలకడంలేదు. దీంతో పాతది, ఇప్పటిదీ కలిపి దాదాపు 400 క్వింటాళ్ల పత్తిని ఇంట్లోనే ఉంచుకున్నాను. – నంద్యాల భాస్కర్‌రెడ్డి, రాజుపాలెం, వైఎస్సార్ జిల్లా ఎకరాకు రూ.5వేల నష్టం.. గతేడాది నవంబరులోనే గుంటూరు, ఒడిశా, రాయగడ, గుణుపూర్ ప్రాంతాలకు చెందిన వర్తకులు క్వింటా రూ.7వేలకు పైగా కొనుగోలు చేశారు. కానీ, ఈ ఏడాది రూ.6వేలకు మించి కొనడంలేదు. ఇలా అయితే ఎకరాకు రూ.3వేల నుంచి రూ.5వేల వరకు నష్టపోవాల్సి వస్తోంది. ప్రభుత్వం ప్రకటించిన మద్దతు ధర ఏ ఒక్కరికీ లభించడంలేదు. – పెద్దకోట జగన్నాథం, కర్లెం, కొత్తూరు మండలం, శ్రీకాకుళం జిల్లా -
విచారణ లేకుండా ఉద్యోగస్తుల తొలగింపా?
ఉద్యోగుల్ని తొలగిస్తూ సీసీఐ ఇచ్చిన ఉత్తర్వులు రద్దుచేసిన హైకోర్టు సాక్షి, హైదరాబాద్: ఉద్యోగంలో చేరే సమయంలో తప్పుడు అనుభవ ధ్రువీకరణ పత్రాలు సమర్పించారంటూ ప్రొబేషన్‌లో ఉన్న పలువురు జూనియర్ పత్తి కొనుగోలుదారులను తొలగిస్తూ కాటన్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (సీసీఐ) జారీ చేసిన ఉత్తర్వులను ఉమ్మడి హైకోర్టు రద్దు చేసింది. తొలగించిన జూనియర్ పత్తి కొనుగోలుదారులను ఆ పోస్టుల్లోకి వెంటనే తీసుకోవాలని సీసీఐని ఆదేశించింది. తొలగించిన నాటి నుంచి విధుల్లోకి తిరిగి తీసుకునేంత వరకు వారికి చెల్లించాల్సిన జీతభత్యాలను కూడా చెల్లించాలని స్పష్టం చేసింది. శాఖాపరమైన విచారణ జరపకుండానే ఆ ఉద్యోగులను తప్పించడం సరికాదంది. అయితే వారిపై అభియోగాలు నమోదు చేసి, శాఖాపరమైన విచారణ జరిపి, దోషులుగా తేలితే తగిన చర్యలు తీసుకోవచ్చునని తెలిపింది. అందుకు ఈ ఉత్తర్వులు ఎంత మాత్రం అడ్డంకి కాదని స్పష్టం చేసింది. ఈ మేరకు న్యాయమూర్తి జస్టిస్ ఎం.ఎస్.రామచంద్రరావు ఇటీవల తీర్పు వెలువరించారు. -
‘ప్రత్తి’పాపం మాఫీయేనా?
♦ సీఎంకు విజిలెన్స్ ఇచ్చిన నివేదిక బుట్టదాఖలు ♦ గుంటూరు జిల్లాలో రైతుల నుంచి తక్కువ ధరకు పత్తిని కొనుగోలు చేసిన ‘కీలక’ మంత్రి! ♦ బోగస్ రైతుల పేర్లతో సీసీఐకి అధిక ధరలకు విక్రయం ♦ 47,903.91 క్వింటాళ్లు బోగస్ రైతుల నుంచి సీసీఐ కొనుగోలు చేసినట్లు నిర్ధారణ ♦ సీసీఐ మేనేజర్‌పై బదిలీ వేటు వేసిన కేంద్రం సాక్షి, హైదరాబాద్: పత్తి రైతుల కడుపు కొట్టి కోట్లాది రూపాయలు కొల్లగొట్టిన కీలక మంత్రికి ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు దన్నుగా నిలుస్తున్నారు. గుంటూరు జిల్లాలో సీసీఐ(కాటన్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా) సేకరించిన పత్తిలో.. 80 శాతం పత్తిని బోగస్ రైతుల నుంచే కొనుగోలు చేసినట్లు విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ విభాగం తేల్చింది. సీబీఐ దర్యాప్తులో సైతం ఇదే వెల్లడైంది. విజిలెన్స్, సీబీఐ నివేదికల ఆధారంగా సీసీఐ మేనేజర్ ఆర్.జయకుమార్‌పై కేంద్రం బదిలీ వేటు వేసింది. కానీ.. సీఎం చంద్రబాబు మాత్రం విజిలెన్స్ నివేదికను బుట్టదాఖలు చేసి, కుంభకోణానికి సూత్రధారి అయిన కీలక మంత్రికి బాసటగా నిలుస్తున్నారు. గతేడాది పత్తికి క్వింటాలుకు మొదటి రకానికి రూ.4050, రెండో రకానికి రూ.3750ను కనీస మద్దతు ధర (ఎమ్మెస్పీ)గా కేంద్రం నిర్ణయించింది. రైతులకు గిట్టుబాటు ధర దక్కేలా చేసేందుకు దేశవ్యాప్తంగా సీసీఐని రంగంలోకి దించింది. గుంటూరు జిల్లాలో జిన్నింగ్ పరిశ్రమలను గుప్పిట్లో పెట్టుకున్న ఓ కీలక మంత్రి, సీసీఐ అధికారులతో కుమ్మక్కయ్యారు. మార్కెట్ యార్డుల్లో సీసీఐ పత్తిని కొనుగోలు చేయకుండా చేసిన కీలక మంత్రి దళారీల ద్వారా తక్కువ ధరలకే రైతుల నుంచి పత్తిని ఖరీదు చేశారు. అదే పత్తిని ఎమ్మెస్పీ ధరలకు సీసీఐకి విక్రయించి కోట్లాది రూపాయలు కొల్లగొట్టారు. విజిలెన్స్ విచారణలో రట్టు గుంటూరు జిల్లాలో పత్తి కొనుగోళ్లలో అక్రమాలపర్వంపై రైతు సంఘాలు ఉద్యమించాయి. సీబీఐతోపాటు విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ విభాగం ఈ అక్రమాలపై దర్యాప్తు చేసింది. సీసీఐ పత్తి కొనుగోలు చేసిన రైతులను విజిలెన్స్ అధికారులు విచారించారు. 900 మంది రైతులను విచారిస్తే.. ఇందు లో 719 మంది రైతులు బోగస్‌గా తేలింది. 719 మంది రైతుల నుంచి 47,903.91 క్వింటాళ్ల పత్తిని కొనుగోలు చేసినట్లు సీసీఐ అధికారులు రికార్డులు సృష్టించారు. సీసీఐ కొనుగోలు చేసిన పత్తిని జిన్నిం గ్ మిల్లులకు పంపి ప్రాసెసింగ్ చేయిస్తుంది. ఇందు కు సంబంధించిన రికార్డులు జిన్నింగ్ మిల్లుల వద్ద లేవన్నది విజిలెన్స్ దర్యాప్తులో వెల్లడైంది. సీసీఐ కొనుగోలు చేసిన పత్తిలో 80 శాతం బోగస్ రైతుల నుంచి సేకరించిందేనని విజిలెన్స్ నిర్ధారించింది. సీసీఐ అధికారులతో కలిసి ఓ కీలక మంత్రి రూ.75 కోట్లకుపైగా కొల్లగొట్టినట్లు సీబీఐ విచారణలో వెల్లడైనట్లు సమాచారం. సీబీఐ ప్రాథమిక నివేదికతోపాటూ విజిలెన్స్ నివేదికను పరిగణనలోకి తీసుకున్న కేంద్రం.. సీసీఐ మేనేజర్ జయకుమార్తోపాటూ ముగ్గురు బయ్యర్లపై బదిలీ వేటు వేసింది. సూత్రధారికి అభయం! విజిలెన్స్ నివేదికలపై ఇటీవల సీఎం చంద్రబాబు సమీక్షించారు. పత్తి కుంభకోణంపై విజిలెన్స్ ఇచ్చిన నివేదికపై దృష్టి సారించకపోవడం గమనార్హం. విజిలెన్స్ నివేదికపై చర్యలు తీసుకుంటే.. కీలక మంత్రిపై కేసు నమోదు చేయాల్సి వస్తుంది. ఇది రాజకీయంగా ప్రభుత్వాన్ని ఇరకాటంలోకి నెడుతుందని సీఎం ఆందోళన చెందుతుండటం, కీలక మంత్రి తనకు అత్యంత సన్నిహితుడు కావడంతో నివేదికను బుట్టదాఖలు చేసినట్లు అధికారవర్గాలు అభిప్రాయపడుతున్నాయి. సీఎం దన్నుగా నిలుస్తోండటంతో ఈ ఏడాదీ సీసీఐ అధికారులతో కలిసి పత్తి రైతులను లూటీ చేయడానికి ఆ కీలక మంత్రి పావులు కదుపుతున్నారు. -
యుద్ధ ప్రాతిపదికన పత్తి కొనండి
సాక్షి, హైదరాబాద్: కాటన్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (సీసీఐ) కొనుగోలు కేంద్రాలను తక్షణమే అన్ని చోట్లా ప్రారంభించి, యుద్ధ ప్రాతి పదికన పత్తిని కొనుగోలు చేయాలని మార్కెటింగ్ శాఖ మంత్రి హరీశ్‌రావు అధికారులను ఆదేశించారు. బుధవారం ఆర్థిక శాఖ మంత్రి ఈటల రాజేందర్‌తో కలసి ఆయన సీసీఐ కేంద్రాల్లో పత్తి కొనుగోళ్లపై కరీంనగర్ కలెక్టరేట్ నుంచి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్ష నిర్వహించారు. మార్కెటింగ్, పౌర సరఫరాలు, సీసీఐ అధికారులు ఈ సమీక్షలో పాల్గొన్నారు. మొత్తం 84 కేంద్రాలకు గాను సీసీఐ ఇప్పటి వరకు 62 కేంద్రాలు ఏర్పాటు చేసి 24 చోట్ల మాత్రమే పత్తి కొనుగోలు చేస్తోందన్నారు. వెంటనే అన్ని కేంద్రాల్లో సిబ్బందిని నియమించడతో పాటు, ఉదయం ఆరు గంటల నుంచే సీసీఐ సిబ్బంది కొనుగోలు ప్రారంభించాలన్నారు. వారంలో ఐదు రోజుల పాటు సీసీఐ, రైతుల నుంచి పత్తి కొనుగోలు చేయాలన్నారు. సీసీఐ విజ్ఞప్తి మేరకు రైతులకు గుర్తింపు కార్డులు జారీ చేయడంతో పాటు, కొనుగోలు కేంద్రాల వద్ద తూకం యంత్రాలను ఏర్పాటు చేశామని మంత్రి హరీశ్‌రావు తెలిపారు. అయితే పత్తి కొనుగోలు విషయంలో సీసీఐ నుంచి తగినంత సహకారం అందడం లేదని మంత్రి అసంతృప్తి వ్యక్తం చేశారు. స్థానికంగా నెలకొన్న సమస్యలపై సీసీఐ సీఎండీ బీకే మిశ్రాతో మంత్రి ఫోన్లో మాట్లాడారు. కాగా, మిల్లర్ల నుంచి ధాన్యం కొనుగోలు, మార్కెఫెడ్ ద్వారా మొక్కజొన్న కొనుగోలుపై మంత్రులు హరీశ్, ఈటల సమీక్ష నిర్వహించారు. మార్కెటింగ్‌శాఖ డెరైక్టర్ శరత్, అదనపు డెరైక్టర్ లక్ష్మీబాయి తదితరులు ఈ సమావేశంలో పాల్గొన్నారు. -
మరో 7 కేంద్రాలు ఏర్పాటు చేయండి
సీసీఐ సీఎండీ బీకే మిశ్రాకు మంత్రి హరీశ్‌రావు విజ్ఞప్తి సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో పత్తి కొనుగోలుకు గత ఏడాది ఏర్పాటు చేసిన 83 కేంద్రాలతో పాటు అదనంగా మరో 7 కేంద్రాలు ఏర్పాటు చేయాలని కాటన్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా(సీసీఐ) అధికారులకు మంత్రి హరీశ్‌రావు విజ్ఞప్తి చేశారు. బుధవారం సచివాలయంలో సీసీఐ సీఎండీ బీకే మిశ్రాతో మంత్రి హరీశ్‌రావు సమావేశమయ్యారు. సంస్థ వరంగల్, ఆదిలాబాద్ జనరల్ మేనేజర్లు, వ్యవసాయ శాఖ ముఖ్యకార్యదర్శి పార్థసారథి, మార్కెటింగ్ శాఖ డైరక్టర్ డాక్టర్ శరత్ సమావేశంలో పాల్గొన్నారు. అక్టోబర్ పది నుంచి 30వ తేదీలోపు సీసీఐ కొనుగోలు కేంద్రాలు ప్రారంభించాలని అధికారులను మంత్రి ఆదేశించారు. గత ఏడాది పత్తి కొనుగోలు సందర్భంగా ఎదురైన సమస్యలను దృష్టిలో పెట్టుకుని కార్యాచరణ ప్రణాళిక సిద్ధం చేసుకోవాలని, సీసీఐ కొనుగోలు కేంద్రాల వద్ద మార్కెటింగ్ శాఖ తరఫున సిబ్బందిని నియమించి, కొనుగోళ్లు సాఫీగా సాగేలా చూడాలన్నారు. జిల్లాలవారీగా పత్తి రైతులను గుర్తించి, వారి వివరాలను ఆన్లైన్లో ఉంచాలని ఆదేశించారు. కొనుగోలు చేసిన పత్తికి 48 గంటల లోపు రైతుల ఖాతాలోకి ఆన్లైన్లో డబ్బులు జమ చేయాలని సీసీఐ అధికారులను ఆదేశించారు. పత్తి కొనుగోలు కేంద్రాల ప్రారంభానికి ముందు హమాలీలతో సమావేశాలు నిర్వహించాలని, సీసీఐ అధికారులతో కలసి తూకపు యంత్రాలు, మౌలిక సౌకర్యాలను పరిశీలించాలని మార్కెటింగ్ శాఖ అధికారులకు సూచించారు. పత్తిలో తేమ 12 శాతానికి తక్కువ వుండేలా రైతులు జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. ఈ అంశంపై మార్కెటింగ్ శాఖ అధికారులు విస్తృత ప్రచారం చేయాలని ఆదేశించారు. ఈ ఏడాది కేంద్రం పత్తికి రూ.4,100 కనీస మద్దతుధర ప్రకటించిందని సీసీఐ సీఎండీ బీకే మిశ్రా వెల్లడించారు. -
పత్తి బేళ్లకు రెక్కలు!
♦ సీసీఐ గోడౌన్ నుంచి రూ.50 లక్షల విలువైన పత్తి మాయం! ♦ రైతుల పేర్లతో దళారీలు, పారిశ్రామికవేత్తల దోపిడీ ♦ రవాణా చార్జీలు కూడా బొక్కేసిన బయ్యర్లు ♦ వ్యవసాయ మంత్రి ఇలాకాలో మాయాజాలం చిలకలూరిపేట : కాటన్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (సీసీఐ) గోదాము నుంచి భారీ మొత్తంలో పత్తి బేళ్లు మాయమైన ఘటన తీవ్ర చర్చనీయాంశమైంది. సాక్షాత్తూ రాష్ట్ర వ్యవసాయశాఖ మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు ఇలాకాలో జరిగిన ఈ వ్యవహారం ఆలస్యంగా వెలుగుచూసింది. సీసీఐ పత్తి కొనుగోళ్లలో భారీ కుంభకోణం జరిగినట్టు ఇప్పటికే ఆరోపణలు వెల్లువెత్తుతున్న సంగతి తెలిసిందే. ఈ కుంభకోణంపై సీబీఐతో విచారణ జరిపించాలని ప్రతిపక్ష నేతలు, ప్రజా సంఘాల ప్రతినిధులు గట్టిగా డిమాండ్ చేస్తున్నారు. పత్తి పంటకు మద్దతు ధర కల్పించే లక్ష్యంతో ఏర్పాటైన సీసీఐ అందుకు విరుద్ధంగా వ్యవహరిస్తోందని, దళారీలు, వ్యాపారులు, పారిశ్రామికవేత్తలకు కొమ్ముకాస్తోందనే విమర్శలు వినపడుతున్నాయి. తాజాగా రూ.50 లక్షల విలువైన పత్తి బేళ్లు మాయమైన విషయం బయటపడటంతో భారీ ఎత్తున అవినీతి జరిగిందని స్పష్టమవుతోంది. కుంభకోణం జరిగింది ఇలా.. ఈ ఏడాది ఇతర దేశాల నుంచి ఆర్డర్లు లేకపోవటంతో పత్తి కొనుగోలుకు వ్యాపారులు ముందుకు రాలేదు. పెద్దమొత్తంలో పత్తిని దిగుమతి చేసుకొనే చైనా కూడా కొనుగోళ్లకు ఆసక్తి చూపకపోవటంతో ధర పతనమైంది. ఈ నేపథ్యంలో రైతులను ఆదుకునేందుకు సీసీఐ రంగంలోకి దిగింది. క్వింటా పత్తికి రూ.4,050 మద్దతు ధర ప్రకటించి రాష్ట్రంలోని వివిధ మార్కెట్ యార్డుల్లో 43 కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేసింది. చిలకలూరిపేట నూతన మార్కెట్ యార్డులోని కొనుగోలు కేంద్రాన్ని మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు ప్రారంభించారు. మార్కెట్ యార్డులో సవాలక్ష కారణాలతో వేధించే బయ్యర్లకు భయపడిన రైతులు ఎప్పట్లాగే ఈసారి కూడా వ్యాపారులు, దళారులకే అమ్మారు. రైతులకు క్వింటాకు రూ.3,500 వరకు చెల్లించిన దళారులు, వ్యాపారులు అదే పత్తిని సీసీఐ కొనుగోలు కేంద్రాల్లో రూ.4,050కు విక్రయించి భారీగా లబ్ధి పొందారు. ఈ వ్యవహారంలో సీసీఐ అధికారులు వారికి పూర్తి సహకారం అందజేసి తమ వంతు వాటా పొందారని సమాచారం. దీంతోపాటు రవాణా చార్జీలు చెల్లించినట్టు చూపి ఆ సొమ్మును జేబులో వేసుకున్నట్టు తెలిసింది. ఇదో రకం దోపిడీ.. నవంబరులో ప్రారంభించిన సీసీఐ కొనుగోలు కేంద్రా లు రైతుల ఆదరణ లేక బోసిపోయాయి. కాని రికార్డుల్లో మాత్రం కోనుగోలు కేంద్రంలో వేలు క్వింటాళ్ల పత్తి కొనుగోలు జరిగినట్లు నమోదు చేశారు. గ్రామాల్లో కొనుగోలు చేసిన పత్తిని నేరుగా వ్యాపారులు జన్నింగ్ మిల్లులకు తరలించారు. సీసీఐ కేంద్రంలో కొనుగోలు చేసిన పత్తిని జిన్నింగ్ మిల్లులకు చేర్చటానికి రవాణా చార్జీలు ప్రభుత్వమే చెల్లిస్తుంది. కాని ఇక్కడ జరిగింది వేరు. సీసీఐ కేంద్రంలో పత్తి కోనుగోళ్లు నామమాత్రంగా జరిగాయి. రైతుల నుంచి నేరుగా మిల్లులకు పత్తి తరలి పోవటంతో ఇక్కడ రవాణా చార్జీలు ఉండవని తెలిసింది. బయ్యర్లు మాత్రమే రవాణా చార్జీల పేరుతో భారీ దోపిడీకి పాల్పడ్డారనే ఆరోపణలు వినవస్తున్నాయి. మాయమైన లారీ మాటేమిటి...? ఈ ఏడాది రెండు నెల కిందట యడ్లపాడు మండలంలో జిన్నింగ్ అనంతరం తరలింపునకు సిద్ధంగా ఉన్న ఓ గోడన్ నుంచి కొన్ని ప్రెస్సింగ్ బేళ్లు మాయమయ్యా యి. వే బిల్లులు, లారీ నంబర్లు తారుమారు చేసి గుర్తుతెలియని వ్యక్తులు రెండు లారీల్లో ప్రెస్సింగ్ బేళ్లు తరలించారు. ఈ సంగతి గోప్యంగా ఉంచిన అధికారులు విచారణ చేపట్టినా ఇంతవరకు ఆచూకీ తేల్చలేకపోయారు. అనంతరం ఈ విషయంపై యడ్లపాడు పోలీసుస్టేషన్లో ఫిర్యాదు చేశారు.ఈ విషయాన్ని యడ్లపాడు ఎస్ఐ ఉమామహేశ్వరావు కూడా ధ్రువీకరించారు. కాగా ఆ రెండు లారీల్లో గోడౌన్ నుంచి తీసుకువెళ్లిన పత్తిబేళ్లను గణపవరం లోని ఒక పారిశ్రామిక వేత్తకు విక్రయించినట్టు సమాచారం. పారిశ్రామికవేత్త, సీసీఐ అధికారులు చిలకలూరిపేట రూరల్ పోలీ స్స్టేషన్లో పంచాయితీ నిర్వహించగా ఎటువంటి కేసులు లేకుండా పత్తిబేళ్లను తిరిగి ఇచ్చేందుకు ఒప్పం దం జరిగినట్లు తెలిసింది. ఈ వ్యవహారంపై పోలీసుల ను సాక్షి వివరణ కోరగా పత్తిబేళ్లు పోయినట్లు తమకు సమాచారం అందలేదని చిలకలూరిపేట రూరల్ సీఐ తెలపటం విశేషం. కాగా జరిగిన అవినీతి దందాపై సీబీఐతో విచారణ జరిపించాలని పలు పార్టీలు, ప్రజాసంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. -
సర్కార్కే టోకరా!
ప్రస్తుతం మార్కెట్లో పత్తికి పెద్దగా డిమాండ్ లేదు. దీంతో ఇప్పటికే తీవ్ర నష్టాల్లో ఉన్న పత్తిరైతును ఆదుకోవాలనే ఉద్దేశంతో ప్రభుత్వం క్వింటాల్ పత్తికి రూ.రూ.3,750- రూ.4,050 మధ్య చెల్లిస్తోంది. కానీ ఈ మద్దతు మాత్రం రైతుకు దక్కడం లేదు. వ్యాపారులే రైతుల అవతారం ఎత్తి సర్కార్ మద్దతును దక్కించుకుంటున్నారు. రైతుల నుంచి పత్తి కొనుగోలు చేస్తున్న సీసీఐ చెల్లింపులకు కనీసంగా 10 రోజుల సమయం తీసుకుంటుంది. కానీ తీవ్ర ఇబ్బందుల్లో ఉన్న రైతులు అన్ని రోజులు ఆగలేక మద్దతు ధర కంటే రూ.400 తక్కువకే వ్యాపారికి విక్రయిస్తున్నారు. రైతుల నుంచి పత్తి కొన్న వ్యాపారులు రైతుల పేరుమీదే సీసీఐకి పత్తిని అమ్ముకుని సొమ్ము చేసుకుంటున్నారు. దీంతో వ్యాపారికి అటు మార్కెట్ ఫీజు వడ్డన తప్పడంతో పాటు క్వింటాల్‌కు రూ.400 అదనంగా లభిస్తోంది. గజ్వేల్: జిల్లాలో ఈసారి 1.25 లక్షల హెక్టార్లలో పత్తి సాగులోకి వచ్చింది. వర్షాభావ పరిస్థితులతో పంటకు అపార నష్టం కలిగింది. పరిస్థితులు కలిసివస్తే ఎకరాకు 20 క్వింటాళ్ల చొప్పున మొత్తం 60 లక్షల పైచిలుకు క్వింటాళ్ల దిగుబడి వచ్చేది. కానీ కాలం కలిసి రాకపోవడంతో సాగైన పంటలో 50 శాతానికిపైగా పంట దెబ్బతినింది. ప్రస్తుతం 25 నుంచి 30 లక్షల క్వింటాళ్ల దిగుబడులు మాత్రం చేతికందే అవకాశముంది. ఇప్పటివరకు సీసీఐ జిల్లాలోని గజ్వేల్, సిద్దిపేట, జహీరాబాద్, సదాశివపేట, జోగిపేట, తొగుట, వట్పల్లి కేంద్రాల ద్వారా 3.21 లక్షల క్వింటాళ్ల పత్తిని కొనుగోలు చేసింది. ప్రైవేట్ వ్యాపారులు మాత్రం కేవలం 11 వేల పైచిలుకు క్వింటాళ్ల పత్తిని మాత్రమే కొనుగోలు చేశారని సర్కార్ లెక్కలు చెబుతున్నాయి. నిజానికి ప్రతిఏటా ఈ సీజన్లో అంతర్జాతీయ మార్కెట్లో డిమాండ్ ఎక్కువగా ఉండడంతో పత్తి ధర ఎంఎస్పీ (మినిమమ్ సపోర్ట్ ప్రైస్) కంటే ఎక్కువ పలుకుతుంది. దీంతో రైతులకు ఎంతో ప్రయోజనం కలిగేది. కానీ ఈ సారి పరిస్థితి తారుమారైంది. దీంతో తప్పనిసరి పరిస్థితుల్లో రైతులంతా ‘ప్రభుత్వ మద్దతు ధర’పైనే ఆధారపడాల్సి వస్తోంది. ఇలాంటి పరిస్థితుల్లో సీసీఐ కేంద్రంలో పత్తి విక్రయిస్తే డబ్బులు ఆలస్యమవుతాయనే కారణంతో రైతులు మద్దతు ధర రూ.3,750- రూ.4,050 కంటే రూ. 300 నుంచి రూ.400 తక్కువైనా ప్రైవేట్ వ్యాపారులకే విక్రయిస్తున్నారు. రైతుల నుంచి రైతుపేరుతోనే అమ్ముతారు చిన్న, సన్నకారు రైతుల నుంచి కొనుగోలు చేసిన పత్తిని వ్యాపారులు తిరిగి సీసీఐ(కాటన్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా)కే విక్రయిస్తున్నారు. సాధారణంగా సీసీఐ నిబంధనల ప్రకారం రైతులు తమ పట్టాదారు పాసుపుస్తకాలను సమర్పించి, మార్కెట్ యార్డుల్లో తక్‌పట్టీని పొందిన తర్వాతే తమ ఉత్పత్తులను విక్రయించి ప్రభుత్వ మద్దతు ధర పొందాల్సి ఉంటుంది. రైతు సీసీఐకి పత్తి విక్రయించిన10 రోజుల్లో చెక్కురూపంలో చెల్లింపులు జరుగుతాయి. కానీ వ్యాపారులు రైతుల వద్ద కొనుగోలు చేసిన పత్తిని వారి పాస్బుక్కుల జిరాక్స్‌లు, అక్కౌంట్ నంబర్లు తీసుకొని రైతుల పేరుతోనే సీసీఐ విక్రయిస్తూ మద్దతు ధర పొందుతున్నారు. నిజానికి వ్యాపారులు తాము లావాదేవీలు లెక్కలు చూపితే వారి కొనుగోళ్ల విలువలో 1 శాతం మార్కెట్ ఫీజు చెల్లించాల్సి ఉంటుంది. అందువల్లే వ్యాపారులు ఇటు మార్కెట్ఫీజును ఎగొట్టడంతో పాటు రైతుల పేరుతో పత్తిని విక్రయించి మద్దతును దక్కించుకుంటున్నారు. గజ్వేల్‌లో ప్రస్తుత సీజన్లో సీసీఐ ఇప్పటివరకు 97 వేల క్వింటాళ్ల పత్తిని కొనుగోలు చేసింది. మద్దతు ధర క్వింటాలుకు సుమారు రూ.4వేల చొప్పున లెక్కిస్తే మొత్తం దీని విలువ సుమారు రూ.39 కోట్ల వరకు ఉంటుంది. ఇందుకుగానూ సీసీఐ మార్కెట్ యార్డుకు రూ.39 లక్షల మార్కెట్ ఫీజు చెల్లించాల్సి ఉంటుంది. నిజానికి సీసీఐ కొనుగోలు చేసిన 97 వేల క్వింటాళ్లలో 80 శాతానికిపైగా ప్రైవేట్ వ్యాపారులకు చెందిన ఉత్పత్తులే ఉంటాయి. ఈ లెక్కన రైతుల పేరిట తమ ఉత్పత్తులను అమ్ముకోవటం ద్వారా సుమారు రూ.30 లక్షల వరకు మార్కెట్ ఫీజు ఎగవేసినట్టు స్పష్టమవుతుంది. వ్యాపారులు మాత్రం తాము ఇప్పటివరకు కేవలం 10 వేల క్వింటాళ్ల పత్తిని మాత్రమే కొనుగోలు చేశామని (దీని విలువ సుమారు రూ. 4 కోట్లు) లెక్కలు చూపుతూ కేవలం రూ.4 లక్షలు మాత్రమే మార్కెట్ ఫీజు చెల్లించనున్నారు. అధికారుల అండదండలతో ఈ అక్రమం నడుస్తుందనే ఆరోపణలున్నాయి. అన్నీ కాకిలెక్కలు..! పత్తి కొనుగోళ్ల తీరుపై మార్కెటింగ్ శాఖ చెబుతున్న లెక్కలు విస్మయం కలిగిస్తున్నాయి. జిల్లాలోని సీసీఐ కొనుగోలు కేంద్రాల ద్వారా రెండ్రోజుల క్రితం వరకు 3.17 క్వింటాళ్ల పత్తిని కొనుగోలు చేశారని మార్కెటింగ్ శాఖ చెబుతోంది. వారి లెక్కల ప్రకారం ప్రైవేట్ వ్యాపారులు కొనుగోలు చేసింది 11 వేల పైచిలుకు క్వింట్లాళ్లే. అందులో 10 వేలకుపైగా లావాదేవీలు కూడా గజ్వేల్‌లో జరిగాయని కాకిలెక్కలు చెబుతున్నారు. జిల్లాలోని సిద్దిపేట, తొగుట, జోగిపేట, జహీరాబాద్, సదాశివపేట, వట్‌పల్లిల్లో ప్రైవేట్ వ్యాపారులు చాలామందే ఉన్నా, వారు మాత్రం పత్తిని కొనుగోలు చేయలేదన్నది సర్కార్ లెక్కల సారాంశం. కొనుగోలు చేసినా పదుల సంఖ్యలో క్వింటాళ్లల్లో మాత్రమే కొనుగోలు చేశారంట. నిజానికి సీసీఐ కొనుగోలు చేసిన పత్తి ఉత్పత్తుల్లో 50 శాతానికిపైగా ప్రైవేట్ వ్యాపారులే ఉంటాయని తెలుస్తోంది. దీన్ని బట్టి సీసీఐ కొనుగోలు చేసిన 3.21 క్వింటాళ్ల విలువ సుమారు రూ.12.5 కోట్లకుపైగా ఉంది. దీని ప్రకారం ఆయా మార్కెట్ యార్డులకు ఆ సంస్థ రూ.1.25 కోట్ల మేర మార్కెట్ ఫీజు చెల్లించాల్సి ఉంటుంది. ఇందులో సగానికిపైగా వ్యాపారుల ఉత్పతులున్నాయని తెలుస్తుండగా, వారు తమ ఉత్పత్తులను రైతుల పేరిట అమ్ముకోవటంవల్ల రూ.62.5 లక్షల మేర మార్కెట్ ఫీజు ఎగవేశారని చెప్పొచ్చు. మరి కొన్ని రోజులూ పరిస్థితి ఇలానే ఉంటే కోట్లల్లో మార్కెట్ కమిటీలు ఆదాయాన్ని కోల్పోవడం ఖాయం. ఈ వ్యవహారంపై విచారణ జరిపితే ఎన్నో వాస్తవాలు వెలుగులోకి వచ్చే అవకాశముంది. జిన్నింగ్ మిల్లుల్లో ఇష్టారాజ్యం... జిన్నింగ్ మిల్లుల్లోనూ సీసీఐ అధ్వర్యంలో కొనుగోళ్లను చేపట్టవచ్చనే వెసులుబాటును ప్రభుత్వం కల్పించడం వ్యాపారులకు వరంగా మారింది. సీసీఐ సిబ్బంది అంతా జిన్నింగ్ మిల్లుల్లోనే ఉంటూ కొనుగోళ్లు సాగిస్తున్నారు. దీంతో వ్యాపారులు రైతుల రూపేణా పెద్ద ఎత్తున తమ ఉత్పత్తులను మిల్లులకు తరలిస్తున్నారు. -
వి‘పత్తి’!
పరిగి: ఆరుగాలం కష్టించిన అన్నదాతకు ప్రభుత్వ ‘మద్దతు’ కరువైంది. పత్తి రైతుకు చివరికి పుట్టెడు దుఃఖం తప్ప ఏమీ మిగలని పరిస్థితి ఎదురవుతోంది. రైతులకు అందుబాటులో ఉండేలా సీసీఐ (కాటన్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా) ఆధ్వర్యంలో ఏర్పాటు చేస్తున్న కొనుగోలు కేంద్రాలు మూణ్నాళ్ల ముచ్చటే అవుతున్నాయి. దీంతో దళారులను ఆశ్రయించి నష్టపోవాల్సి వస్తోంది. పరిగి వ్యవసాయ మార్కెట్లో గత నెల మంత్రి మహేందర్‌రెడ్డి, ఎమ్మెల్యే రామ్మోహన్‌రెడ్డి ఆర్భాటంగా పత్తి కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించారు. మరుసటిరోజే కొనుగోలు కేంద్రం అడ్డా మార్చేశారు. మహబూబ్‌నగర్ జిల్లా కొందుర్గు మండలం లాల్‌పహాడ్‌లోని ఓ ప్రైవేటు జిన్నింగ్ మిల్లులో కొనుగోళ్లు జరుపుతున్నారు. రైతులు తమ పంటను అంత దూరం తీసుకెళ్లేందుకు వ్యయప్రయాసలు పడాల్సి వస్తోంది. ఒకవేళ కష్టపడి అక్కడి వరకు పత్తి తీసుకెళ్లినా. మిల్లు వద్ద ట్రాక్టర్లతో రోజుల తరబడి పడిగాపులు కాయాల్సి వస్తోంది. ఈ అవస్థలు పడలేని రైతులు గత్యంతరం లేక గ్రామాల్లోకి వచ్చే దళారులకే పత్తిని విక్రయిస్తున్నారు. దళారులు, జిన్నింగ్ మిల్లు యాజమాన్యంతో సీసీఐ అధికారులు కుమ్మక్కై కొనుగోలు కేంద్రాన్ని మార్చారని ఆరోపిస్తున్నారు. సీసీఐ తీరును నిరసిస్తూ సోమవారం పరిగి మార్కెట్‌కు చేరుకున్న రైతులు మార్కెట్ సెక్రటరీ చంద్రశేఖర్‌ను నిలదీశారు. కొనుగోళ్లు పరిగిలోనే జరపాలని డిమాండ్ చేశారు. నష్టపోతున్న రైతులు.. పత్తి కొనుగోలు ప్రక్రియ అంతా గందరగోళంగా మారింది. లాల్‌పహాడ్ జిన్నింగ్ మిల్లులో స్థలం లేదంటూ వారానికి మూడు రోజులు సెలవు ప్రకటిస్తున్నారు. పత్తి తీసుకుని మిల్లుకు వెళ్లాక సీసీఐ సిబ్బంది రైతుల నుంచి తీసుకోవడానికి నిరాకరిస్తుండటంతో దిక్కుతోచని పరిస్థితి తలెత్తుతోంది. జిన్నింగ్‌మిల్లు యజమానులు క్వింటాలుకు రూ.3,500 నుంచి 3,600 చెల్లించి పత్తిని కొనుగోలు చేస్తున్నారు. రైతులు అంతదూరం పత్తిని తీసుకెళ్లి తిరిగి రాలేక అయిన కాడికి అక్కడే ప్రైవేటు వ్యాపారులకు విక్రయిస్తున్నారు. దీంతో క్వింటాలుకు రూ. 400 నుంచి రూ.500 వరకు నష్టపోతున్నారు. రోజుల తరబడి నిరీక్షణ.. పత్తి కొనుగోలు కేంద్రం పరిగిలో ఏర్పాటు చేసి తూకాలు మహబూబ్‌నగర్ జిల్లా లాల్‌పహాడ్ వద్ద చేస్తుండడం పలు విమర్శలకు తావిస్తోంది. కొనుగోలు కేంద్రం బోర్డును మాత్రం పరిగి వ్యవసాయ మార్కెట్లో తగిలించారు. అక్కడికి రైతులు పత్తి తీసకువస్తే ఇక్కడ కాదు లాల్‌పహాడ్‌కు వెళ్లమంటున్నారు. అంతదూరం వెళ్లాక పంటతో తిరిగి వెనక్కి వెళ్లలేరు కాబట్టి ఏం చేసినా నడుస్తుందులే అనుకుని తేమ సాకుతో ధర నిర్ణయిస్తున్నారు. మిల్లులోనే తూకాలు వేసి పత్తిని కొనుగోలు చేస్తున్నారు. రైతులు వాహనాలు వెతుక్కుని.. అందులో పత్తి నింపి.. ఆ తరువాత పరిగిలోని కొనుగోలు కేంద్రానికి, అక్కడి నుంచి లాల్‌పహాడ్‌కు వెళ్లి.. తేమ చూపించుకుని.. తూకాలు వేయించుకుని విక్రయించటం తతంగా మారింది. మరోవైపు రోజుల తరబడి ఉండాల్సి రావడంతో తీసుకెళ్లిన వాహనకిరాయి తడిసి మోపెడవుతోంది. ఇంత చేసినా పత్తి కొనుగోలు చేశాక మరోవారం రోజులకు గానీ చెక్కులలివ్వడంలేదు. ఇవేం తిప్పలు..? గత శనివారం పత్తి ట్రాక్టర్లో నింపుకుని పరిగికి వస్తే లాల్‌పహాడ్ వెళ్లమన్నారు. అక్కడికి వెళ్లాక తీసుకునేందుకు సీసీఐ వారు ఒప్పుకోలేదు. ఇదేమని నిలదీస్తే స్థలం లేదు.. అందుకే మూడు రోజులు సెలవులిచ్చామన్నారు. చేసేదిలేక అక్కడే జిన్నింగ్ మిల్లు యజమానులకు విక్రయించాం. ఇంత దూరం వచ్చాక ఎలాగూ తిరిగి వెళ్లలేరు కదా అని క్వింటాలుకు రూ.3,600కు కొనుగోలు చేశారు. దళారులు తీసుకువస్తే మాత్రం వెంటనే కొనుగోలు చేస్తున్నారు. - హన్మంతురెడ్డి, రైతు, రాఘవాపూర్ -
పత్తి పోటెత్తె..
ఖమ్మం వ్యవసాయం : ఖమ్మం వ్యవసాయ మార్కెట్లో ఏర్పాటు చేసిన కాటన్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా(సీసీఐ) కేంద్రానికి మంగళవారం పత్తి భారీగా అమ్మకానికి వచ్చింది. సుమారు 45 వేల పత్తి బస్తాలు విక్రయానికి వచ్చాయి. గత గురువారం సీసీఐ కేంద్రంలో పత్తి కొనుగోలు చేశారు. ఆ రోజు కూడా సుమారు 30 వేల బస్తాలు అమ్మకానికి వచ్చాయి. ఒక్క రోజులో పత్తి కొనుగోళ్లు పూర్తిగాక పోవడంతో శుక్రవారం కూడా కొనుగోళ్లు చేశారు. శనివారం అమావాస కావడం, మార్కెట్‌కు సెలవు దినం కావడంతో ఆ రోజు కాంటాలు తదితర పనులు పూర్తికాలేదు. దీంతో గురువారం సీసీఐ కేంద్రానికి వచ్చిన సరుకు కాంటాలు తదితర పనులు సోమవారానికి పూర్తయ్యాయి. దీంతో నాలుగు రోజుల పాటు సీసీఐ కేంద్రంలో కొత్తగా సరుకు కొనుగోళ్లు జరప లేదు. దీంతో మంగళవారం సీసీఐ కేంద్రానికి పత్తి పోటెత్తింది. తప్పని కొనుగోలు కష్టాలు మంగళవారం కూడా గురువారం నాటి పరిస్థితులే పునరావృతమయ్యాయి. ఖమ్మం సీసీఐ కేంద్రంలో పత్తి కొనుగోళ్లకు ఒక్క బయ్యరును మాత్రమే ఏర్పాటు చేశారు. దీంతో ఆ ఒక్క బయ్యరు సీసీఐ కేంద్రానికి అమ్మకానికి వచ్చిన 45 వేల బస్తాలను ఒక్క రోజులో కొనుగోలు చేయటం సాధ్యం కావడం లేదు. అంతేకాకుండా ఇదే బయ్యరుకు కొత్తగూడెం, చండ్రుగొండ సీసీఐ కేంద్రాలలో పత్తి కొనుగోళ్ల పనిని కూడా అప్పగించారు. ఒక్క బయ్యరుకు మూడు కేంద్రాల్లో పత్తి కొనుగోళ్ల పని అప్పగించడంతో సరుకు కొనుగోళ్లలో తీవ్ర జాప్యం జరుగుతోంది. సీసీఐ కేంద్రానికి పత్తి అమ్మకానికి తెచ్చిన రైతులు రోజుల తరబడి పడిగాపులు కాయాల్సి వస్తోంది. సరుకు కొనుగోలుకు రెండు నుంచి మూడు రోజులు పడుతుండగా సరుకు కాంటాలకు మరో రెండు రోజులు పడుతుంది. మొత్తంగా రైతులు సీసీఐ కేంద్రానికి పత్తి అమ్మకానికి తీసుకొస్తే వారం రోజులు ఆ కేంద్రం చుట్టూ తిరగాల్సి వస్తుంది. ఇక అమ్మిన సరుకు చెక్కులు 20 రోజులకైనా రావటం లేదు. వాటి కోసం కూడా రైతులు మార్కెట్ కార్యాలయం చుట్టూ తిరగాల్సి వస్తోంది. సీసీఐ కేంద్రంలో పత్తి అమ్మకానికి రైతులు తీవ్ర అవస్థలు పడక తప్పటం లేదు. మంగళవారం అమ్మకానికి తెచ్చిన సరుకులో అదే రోజు కేవలం 15 వేల బస్తాలను మాత్రమే కొనుగోలు చేశారు. మరో 25 వేల బస్తాలను బుధవారం కొనుగోలు చేస్తారని అధికారులు చెబుతున్నారు. ఒక్క రోజులో 25 వేల బస్తాలు కొనుగోలు చేసే పరిస్థితులు కనిపిండచం లేదు. బుధవారం ఖమ్మం సీసీఐ కేంద్రంలో పత్తి కొనుగోళ్లు జరపడం లేదని కొత్తగా రైతులు సీసీఐ కేంద్రానికి సరుకు అమ్మకానికి తీసుకురావొద్దని మార్కెట్ అధికారులు ప్రకటించారు. మళ్లీ ఎప్పుడు కొనుగోలు చేస్తారనేది ప్రశ్నార్థంకంగానే ఉంది. సీసీఐ కొనుగోళ్లు సజావుగా లేకపోవడం, డబ్బు సకాలంలో చేతికి అందకపోవడంతో విసుగు చెందుతున్న రైతులు ప్రైవేటు వ్యాపారులు, దళారులను ఆశ్రయిస్తున్నారు. సీసీఐ ఇబ్బందులను భరించలేక రైతులు తక్కువ ధరకు ప్రైవేటు వ్యాపారులకు సరుకును అమ్ముకుంటున్నారు. సీసీఐకి విక్రయించడంకంటే ప్రైవేటు వ్యాపారులకు అమ్ముకోవడమే మేలని రైతులు భావిస్తున్నారు. -
పత్తి కొనుగోలుకు సీసీఐ మరోమారు విముఖత
ఖమ్మం వ్యవసాయం: పత్తి కొనుగోలుకు సీసీఐ (కాటన్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా) అధికారులు ఆసక్తి కనబరచటం లేదు. ఖమ్మం వ్యవసాయ మార్కెట్లో ఏర్పాటు చేసిన సీసీఐ కేంద్రానికి గురువారం అమ్మకానికి వచ్చిన దాదాపు 25 వేల పత్తి బస్తాలను కొనేందుకు సీసీఐ బయ్యర్లు విముఖత వ్యక్తం చేశారు. వాస్తవానికి బుధవారం రాత్రి నుంచే వారు వెనుకడుగు వేశారు. బుధవారం రాత్రి 7 గంటల తరువాత గరువారం పత్తి కొనుగోలు చేయలేమని మార్కెట్ అధికారులకు సీసీఐ బయ్యర్ తెలిపారు. జీళ్లచెరువు వద్ద ఉన్న జిన్నింగ్ మిల్లులో పత్తి అన్లోడ్ చేయటానికి ఇబ్బందిగా ఉందని, మాయిశ్చర్ మిషన్లు సక్రమంగా పని చేయటం లేదని, సోమవారం కొనుగోలు చేసిన సరుకు కాంటాలు పూర్తికాలేదనే కారణాలు చూపుతూ సరుకు కొనుగోలుకు విముఖత వ్యక్తం చేశారు. సోమవారం సరుకును కొనుగోలు చేసిన సీసీఐ మంగళ, బుధవారాల్లో దార్ని కాంటాలు పెట్టాలని గురువారం తిరిగి కొనుగోళ్లు జరుపుతామని ప్రకటించింది. ఆ విధంగానే మార్కెట్ అధికారులు మంగళ, బుధ వారాల్లో సీసీఐ పత్తి కొనుగోళ్లు ఉండవని ప్రకటించారు. గురువారం నుంచి కొనుగోళ్లు ఉంటాయని బుధవారం రాత్రి నుంచే రైతులు సీసీఐ కేంద్రానికి పత్తి తీసుకురావడం ప్రారంభించారు. తీరా బుధవారం రాత్రి సీసీఐ బయ్యర్ గురువారం కూడా కొనుగోళ్లు చేయలేమని చెప్పారు. దీనికి మార్కెట్ అధికారులు అంగీకరించలేదు. గురువారం ఉదయం 9 గంటల వరకు కూడా సీసీఐ బయ్యర్ పత్తి కొనుగోలుకు రాకపోవటంతో వరంగల్ జోన్ మార్కెటింగ్ శాఖ జాయింట్ డెరైక్టర్, ఖమ్మం వ్యవసాయ మార్కెట్ పర్సన్ ఇన్చార్జి సుధాకర్, ఖమ్మం మార్కెట్ ఉన్నత శ్రేణి కార్యదర్శి బయ్యర్ వశిష్టను మార్కెట్ కార్యాలయానికి పిలిపించారు. పత్తి కొనుగోలు చేయటానికి పలు ఇబ్బందులున్నాయని బయ్యర్ అధికారులకు చెప్పారు. అందుకు అధికారులు అంగీకరించ లేదు. సరుకును కొనుగోలు చేయాలని చెప్పారు. ఉదయం వేళలో మాయిశ్చర్ ఉంటుందని కాలం గడిపి 11:30 గంటల సమయంలో కొనుగోళ్లను ప్రారంభించారు. కేంద్రానికి వచ్చిన 25వేల బస్తాలలో కేవలం 12 వేల బస్తాలను మాత్రమే కొనుగోలు చేశారు. వీటిని కూడా బయ్యర్ అనుచరులు మాయిశ్చర్ మిషన్‌తో పరీక్షలు నిర్వహించి కొనుగోలు చేశారు. సాయంత్రం 4:30 గంటల తరువాత కొనుగోళ్లను నిలిపివేయటంతో తమ సరుకును కూడా కొనుగోళ్లు జరపాలని రైతులు ఆందోళన చేశారు. మార్కెట్ అధికారులు బయ్యర్‌ను సంప్రదించి సరుకు కొనుగోలు చేయాలని కోరారు. శుక్రవారం సరుకు కొనుగోలు చేస్తానని చెప్పారు. అధికారులు రైతులకు సర్ది చెప్పారు. సీసీఐ కేంద్రానికి పత్తి అమ్మకానికి తీసుకువస్తే రోజుల తరబడి మార్కెట్లో పడిగాపులు కాయాల్సివస్తుందని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. -
అక్రమ దందాకు సీఛీఐ
సాక్షి ప్రతినిధి, ఆదిలాబాద్ : పత్తి రైతుకు భరోసా ఇవ్వాల్సిన సీసీఐ(కాటన్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా) దళారులు, వ్యాపారులకు అండగా నిలుస్తోందనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి. రైతుల పత్తిని మాత్రమే కనీస మద్దతు ధరకు కొనుగోలు చేయాల్సిన ఈ కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థ జిన్నింగ్ మిల్లుల యజమానులు, దళారుల పత్తిని యథేచ్ఛగా అక్రమంగా కొనుగోలు చేస్తోంది. వీరితో కుమ్మక్కవుతున్న సీసీఐ అధికారులు పెద్ద ఎత్తున అక్రమ దందాకు తెరలేపారు. రైతులు తీసుకువచ్చిన పత్తిలో తేమ అధికంగా ఉందంటూ తిరస్కరిస్తున్న సీపీవోలు (కాటన్ పర్చేస్ ఆఫీసర్లు).. తమతో కుమ్మక్కైన వ్యాపారుల పత్తి నాణ్యతను ఏ మాత్రం పరిశీలించకుండానే కొనుగోళ్లు చేస్తున్నారనే ఆరోపణలు గుప్పుమంటున్నాయి. ఈ అక్రమాల్లో ఆ సంస్థలోని కింది నుంచి పైవరకు స్థాయిని బట్టి ముడుపులు చేతులు మారుతున్నాయనే ఆరోపణలు వ్యక్తమవుతున్నాయి. ఈ వ్యవహారాల్లో సీపీవోలు కీలకంగా వ్యవహరిస్తున్నారనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి. అక్రమ కొనుగోళ్లు.. 30 శాతానికి పైనే.. ఈ కొనుగోలు సీజన్లో సీసీఐ జిల్లాలో 22 కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేసింది. ఇప్పటి వరకు 5.14 లక్షల క్వింటాళ్ల పత్తిని కొనుగోలు చేసినట్లు మార్కెటింగ్ శాఖ గణాంకాలు చెబుతున్నాయి. ఈ పత్తి విలువ సుమారు రూ.208 కోట్ల వరకు ఉంటుంది. ఇలా సీసీఐ కొనుగోలు చేసిన పత్తిలో సుమారు 30 శాతం పైగా పత్తిని దళారులు, వ్యాపారుల వద్దే కొనుగోలు చేసినట్లు ఆరోపణలున్నాయి. ఈ అక్రమ కొనుగోలు చేసిన పత్తి విలువ సుమారు రూ.50 కోట్లకుపైగానే ఉంటుందంటే.. ఈ కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థలో ఏ మేరకు అక్రమాలు జరుగుతున్నాయో అర్థం చేసుకోవచ్చు. బినామీ రైతుల పేరుతో.. ఆరుగాలం శ్రమించి పండించిన పత్తికి కనీస మద్దతు ధరైనా దక్కుతుందనే ఎంతో ఆశతో రైతులు సీసీఐ కొనుగోలు కేంద్రాలకు తీసుకువస్తున్నారు. తీరా ఇక్కడికి వచ్చాక పత్తిలో తేమ శాతం 12 మించి ఉందంటూ కాటన్పర్చేజ్ అధికారులు రైతుల పత్తిని కొనుగోలును తిరస్కరిస్తున్నారు. చేసేదేమీ లేక ఆ రైతులు ఆ పత్తిని ప్రైవేటు వ్యాపారులకు విక్రయించాల్సిన పరిస్థితి ఏర్పడుతోంది. దీన్ని ఆసరాగా చేసుకుని వ్యాపారులు ధరలో రూ.300 నుంచి రూ.400 వరకు కోత విధించి క్వింటాల్‌కు రూ.3,500 నుంచి 3,600 చొప్పున కొనుగోలు చేస్తున్నారు. ఇలా రైతుల వద్ద కొనుగోలు చేసిన ఇదే పత్తిని బినామీ రైతుల పేరుతో సీసీఐకి రూ.4,050 (కనీస మద్దతు ధర) చొప్పున విక్రయిస్తున్నారు. ఒక్కో క్వింటాల్‌పై సుమారు రూ.400 చొప్పున సీసీఐ అధికారులు, వ్యాపారులు కలిసి పంచుకుంటున్నారు. ఇలా నిత్యం వేల క్వింటాళ్ల అక్రమ కొనుగోళ్లతో రూ.లక్షలు దండుకుంటున్నారు. బోగస్ పట్టాదారు పాసుపుస్తకాల జిరాక్స్‌లను పెట్టి ఈ అక్రమాలకు పాల్పడుతున్నారు. చెక్కుల విధానంతో అక్రమాలకు ఊతం.. రైతుల వద్ద కొనుగోలు చేసిన పత్తికి సంబంధించిన డబ్బుల చెల్లింపుల్లో ప్రస్తుతం చెక్కుల విధానం అమలవుతోంది. కానీ నేరుగా రైతుల ఖాతాల్లో జమ చేసే విధానం ఉంటే ఈ అక్రమ కొనుగోళ్లకు చాలా వరకు చెక్ పడుతుంది. కానీ ఈ ఖాతాల్లో జమ చేసే విధానాన్ని అమలు చేయడంలో సీసీఐ అధికారులు కావాలనే జాప్యం చేస్తున్నారనే ఆరోపణలున్నాయి. ఈ విధానం అమలయ్యేలా చూడాల్సిన జిల్లా అధికార యంత్రాం గం కూడా ఆ దిశగా చర్యలు తీసుకోకపోవడం తీవ్ర విమర్శలకు దారితీస్తోంది. గతేడాది సీజన్లో నేరుగా రైతుల బ్యాంకు ఖాతాల్లోనే పత్తి డబ్బులు జమ చేసే వారు. దీంతో ఈ అక్రమాలకు చెక్ పడింది. కానీ ఈ ఏడాది కొనుగోలు సీజన్ ఊపందుకున్నా ఆన్లైన్ చెల్లింపుల విధానం ఇంకా అమలు చేయడం లేదు. విజిలెన్స్ దృష్టి సారించాలి.. సీసీఐ కొనుగోలు కేంద్రాల్లో జరుగుతున్న అక్రమ దందాపై కాటన్ కార్పొరేషన్ విజిలెన్స్ విభాగం దృష్టి సారించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. కొనుగోళ్ల తీరుపై పూర్తిస్థాయిలో విచారణ చేపడితే రూ.కోట్లలో జరుగుతున్న అక్రమ దందా వెలుగు చూస్తుందని పత్తి రైతులు పేర్కొంటున్నారు. సీసీఐ కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థ కావడం జిల్లాలో అడిగే నాథుడే లేకపోవడంతో అధికారులు ఆడిందే ఆట.. పాడిందే పాట అన్న చందంగా తయారైందనే ఆరోపణలున్నాయి. -
పత్తికి అదనపు ధర చెల్లించండి
గిద్దలూరు : రైతులు కష్టపడి పండించిన పత్తికి అదనపు ధర వచ్చేలా సీసీఐ అధికారులు చర్యలు తీసుకోవాలని గిద్దలూరు ఎమ్మెల్యే, వైఎస్సార్ సీపీ జిల్లా అధ్యక్షుడు ముత్తుముల అశోక్‌రెడ్డి కోరారు. స్థానిక మార్కెట్ యార్డు ప్రాంగణంలో సీసీఐ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన పత్తి కొనుగోలు కేంద్రాన్ని ఆయన సోమవారం ప్రారంభించారు. గిద్దలూరు నియోజకవర్గ ప్రాంత రైతులు నాణ్యమైన పత్తి పండిస్తారని సీసీఐ సీనియర్ కాటన్ పర్చేజ్ అధికారి పి.చంద్రారెడ్డితో చెప్పారు. జిల్లాలో పత్తి పండించే అన్ని ప్రాంతాల్లో కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసి దళారుల బారి నుంచి రైతులను కాపాడాలని ఎమ్మెల్యే విజ్ఞప్తి చేశారు. ఈ సీజన్లో ఎక్కువ మంది రైతులు పత్తి సాగు చేశారని, వర్షాభావ పరిస్థితులతో దిగుబడులు తగ్గిపోయి పెట్టిన పెట్టుబడులు కూడా వచ్చే పరిస్థితి లేదని విచారం వ్యక్తం చేశారు. ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొంటున్న రైతులను ఆదుకునేందుకు ప్రభుత్వం ముందుకు రావాలని కోరారు. పంట పూర్తయ్యే వరకూ సీసీఐ కేంద్రాలు కొనసాగించాలన్నారు. పత్తి రైతులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని ఆర్థికంగా ఎదగాలని ఎమ్మెల్యే ముత్తుమల ఆకాంక్షించారు. అనంతరం రైతులకు ధరలు ఎలా చెల్లిస్తారని ప్రశ్నించారు. తేమ 8 నుంచి 12 శాతం వరకు ఉన్న పత్తిని మాత్రమే కొనుగోలు చేస్తున్నట్లు అధికారులు చెప్పారు. 8 శాతం తేమ ఉన్న పత్తికి రూ.4,050లు, తేమశాతం ఎక్కువగా ఉంటే ఒక్కో శాతానికి రూ.40.50ల చొప్పున తగ్గించి చెల్లిస్తామన్నారు. జిల్లాలో ఏడు కేంద్రాలు ఏర్పాటు చేశామని, ఈ ఏడాది గిద్దలూరు, దర్శి మార్కెట్ యార్డుల్లో కూడా కొత్తగా కేంద్రాలు ప్రారంభించినట్లు చంద్రారెడ్డి వివరించారు. నిబంధనలకు లోబడే రైతుల నుంచి పత్తి కొనుగోలు చేస్తామని ఆయన వివరించారు. కార్యక్రమంలో ఎంపీపీ కడప వంశీధర్‌రెడ్డి, వైఎస్సార్సీపీ రైతు విభాగం జిల్లా అధికార ప్రతినిధి దప్పిలి రాజేంద్రప్రసాద్‌రెడ్డి, పట్టణ కన్వీనర్ మోపూరి బ్రహ్మం, నగర పంచాయతీ కో ఆప్షన్ సభ్యుడుదమ్మాల జనార్దన్, నాయకులు సూరా పాండురంగారెడ్డి, ఓబుల్‌రెడ్డి, పాశం మురళి, మార్కెట్ యార్డు మాజీ చైర్మన్ ఆర్డీ రామకృష్ణ, కార్యదర్శి వి.ఆంజనేయులు, పత్తి కొనుగోలు కేంద్రం సహాయ అధికారి రోశయ్య పాల్గొన్నారు. -
ఛీసీఐని‘బంధనాలు’
ఖమ్మం వ్యవసాయం: కాటన్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (సీసీఐ) కేంద్రాల్లో రైతులు నిలువుదోపిడీకి గురవుతున్నారు. పత్తికి ప్రభుత్వం ప్రకటించిన మద్దతు ధర కాగితాలపైనే కనిపిస్తున్నా..వాస్తవంగా ఆ రేటు వారికి అందటం లేదు. నిబంధనల పేరుతో ఓవైపు సీసీఐ కేంద్రాల్లో పత్తిని కొనుగోలు చేయడం లేదు. ఇదే అదునుగా దళారులు ఇష్టారాజ్యంగా ధర నిర్ణయిస్తూ కొనుగోలు చేస్తుండటంతో రైతులు దిక్కుతోచని స్థితిలో కొట్టుమిట్టాడుతున్నారు. ల్లాలో 10 కేంద్రాలు ఏర్పాటు చేస్తున్నట్లు ప్రకటించిన సీసీఐ ఇప్పటి వరకు కేవలం రెండు కేంద్రాలనే తెరవడంతో దళారుల పంట పండుతోంది. పత్తి పంట అక్టోబర్ నెల ప్రారంభం నుంచి మార్కెట్‌కు అమ్మకానికి వస్తుంది. ప్రభుత్వం పత్తి అమ్మకానికి వచ్చే సమయం నుంచే సీసీఐ కేంద్రాలను ఏర్పాటు చేసి కొనుగోలు చేయాలని నిర్ణయించింది. జిల్లాలో అక్టోబర్ 3, 4 వారాల్లో సీసీఐ కేంద్రాలు ఏర్పాటు చేయనున్నట్లు అధికార యంత్రాంగం ప్రకటించింది. అక్టోబర్ 17న ఖమ్మం వ్యవసాయ మార్కెట్లో రెండు సీసీఐ కేంద్రాలను ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. అయితే సీసీఐ అధికారులు 17వ తేదీన మార్కెట్‌కు వచ్చినా కొనుగోళ్లను మాత్రం ప్రారంభించలేదు. ఈ నేపథ్యంలో ఖమ్మం ఎంపీ, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ తెలంగాణ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ పొంగులేటి శ్రీనివాసరెడ్డి మార్కెట్‌ను సందర్శించారు. సీసీఐ పత్తి కొనుగోళ్లను ప్రారంభించలేదని చెప్పడంతో ఎంపీ అక్కడి నుంచే ఆ శాఖకు సంబంధించిన చీఫ్ మేనేజర్‌తో ఫోన్లో మాట్లాడారు. స్పందించిన సీసీఐ అదేనెల 24వ తేదీ నుంచి కొనుగోళ్లు ప్రారంభించింది. జిల్లాలో ఒక్క నేలకొండపల్లిలో నవంబర్ 3వ తేదీన కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించారు. ఇది మినహా జిల్లాలో మిగతా ఎక్కడా కొనుగోలు కేంద్రాలను ప్రారంభించకపోవడంతో దళారులదే ఇష్టారాజ్యమైంది. తేమ పేరుతో తిరస్కరణ సీసీఐ కేంద్రాల్లో పత్తి అమ్ముకుందామని గంపెడాశతో వచ్చిన రైతులు ఇక్కడి నిబంధనలు చూసి బెంబేలెత్తుతున్నారు. తేమ 12 శాతం కంటే తక్కువ ఉండాలనే నిబంధన రైతుల పాలిట శాపంగా మారింది. అసలే శీతాకాలం కావడం, మార్కెట్‌కు రైతులు రాత్రిపూట పత్తిని తీసుకు వస్తుండటంతో మంచు కారణంగా తేమశాతం పెరుగుతోంది. దీన్ని అడ్డుపెట్టుకొని తేమశాతం ఎక్కువగా ఉందనే పేరుతో సీసీఐ సరుకు కొనుగోలుకు విముఖత తెలుపుతోంది. పత్తి అమ్మకానికి తెచ్చే రైతులు భూ ధ్రువీకరణ పత్రాలు తీసుకురావాలనే నిబంధన కూడా రైతులను ఇబ్బందులపాలు చేస్తోంది. అనేకమంది రైతులు భూమిని కౌలుకు తీసుకుని సాగు చేస్తున్నారు. వీరు పత్తిని సాగుచేసినట్లుగా వీఆర్వో నుంచి ధ్రువీకరణ పత్రం తీసుకురావడం ఇబ్బందికరంగా మారింది. ఈ పత్రం ఉంటేనే మార్కెట్ లోకి పత్తిని అనుమతిస్తున్నారు. అనేకమంది రైతులకు వీఆర్వోలు అందుబాటులో లేక ఇబ్బంది పడుతున్నారు. ఎలాగోలా పత్తిని అమ్మిన రైతులకు చెక్‌లు వెంటనే ఇవ్వడం లేదు. పత్తిని అమ్మిన 15 రోజుల తర్వాత కానీ చెక్‌లు రావడం లేదు. దళారుల పన్నాగం.. సీసీఐ నిబంధనలను దళారులు తమకు అనుకూలంగా మల్చుకున్నారు. తేమశాతం, డబ్బు చెల్లింపుల్లో 15 రోజుల వ్యవధి తదితర ఇబ్బందులు సీసీఐలో చోటు చేసుకోవడంతో వీటిని ఆసరాగా చేసుకుని దళారులు రైతుల నుంచి క్వింటాలు రూ.3,500లోపు ధరకు పత్తిని కొనుగోలు చేస్తున్నారు. గ్రామాల్లో కొనుగోలు చేసిన పత్తిని బినామీ రైతుల పేర్లతో దళారులు, కొందరు కమీషన్‌వ్యాపారులు, వ్యాపారులు సీసీఐ కేంద్రాలకు తరలిస్తున్నారు. అధికారుల అండదండలతో ప్రభుత్వ మద్దతు ధరకు అమ్ముకుంటున్నారు. ఇదే అదనుగా భావించి పొరుగు జిల్లాలకు చెందిన కొందరు దళారులు లారీల్లో పత్తిని తీసుకువచ్చి అమ్మకానికి ప్రయత్నించిన ఉదంతాలు ఉన్నాయి. దీన్ని అధికారులు గుర్తించి అడ్డుకున్నారు. ఇలా సీసీఐకి ఎక్కువ మొత్తంలో దళారులే పత్తిని అమ్ముకుంటుండగా నిజమైన రైతులు నష్టపోతున్నారు. దీన్ని దృష్టిలో పెట్టుకొని సీసీఐ కొద్దిరోజుల క్రితం బయ్యర్లనూ మార్చింది. నూతనంగా వచ్చిన బయ్యర్లు తేమశాతం ఏమాత్రం ఎక్కువగా ఉన్నా కొనుగోలు చేయడానికి నిరాకరిస్తుండటంతో రైతులూ ఇబ్బంది పడాల్సి వస్తోంది. ఫలితమివ్వని చర్యలు సీసీఐ కేంద్రంలో అమ్మకాలకు చెక్ పెట్టేందుకు ప్రభుత్వశాఖలు చర్యలకు పూనుకున్నాయి. దళారులకు సంబంధించిన పత్తిని సీసీఐకి విక్రయిస్తుండగా రెవెన్యూ, పోలీస్ అధికారులు అడ్డుకున్నారు. దీనిపై మార్కెట్లోని కమీషన్‌వ్యాపారులు, వ్యాపారులు అభ్యంతరం తెలిపారు. రైతులే సీసీఐ కేంద్రంలో అమ్ముకుంటుంటే అనవసరంగా తమపై తప్పుడు కేసులు బనాయిస్తున్నారని బుధవారం మార్కెట్‌కు వచ్చిన వివిధ పంట ఉత్పత్తుల కొనుగోళ్లను నిలిపివేశారు. కొందరు వ్యాపారులు రైతులను సీసీఐ అధికారులపైకి ఉసిగొల్పుతున్నారని సమాచారం. నీరుగారుతున్న ప్రభుత్వ లక్ష్యం జిల్లాలో ఖమ్మం, నేలకొండపల్లి మినహా ఎక్కడా సీసీఐ కేంద్రాలు ప్రారంభం కాకపోవడంతో రైతులు పండించిన పత్తిని ప్రైవేట్ వ్యాపారులకు అమ్ముకోవాల్సి వస్తోంది. ప్రభుత్వం పత్తి క్వింటాలుకు రూ.4,050 మద్దతు ధరగా నిర్ణయించి సీసీఐ ద్వారా కొనుగోలు చేయాలని నిర్ణయించింది. మిగతా చోట్ల సీసీఐ కేంద్రాలు ఏర్పాటు చేయకపోవడంతో రైతులు ప్రైవేట్ వ్యాపారులకు రూ.3,500ల చొప్పున అమ్ముకోవాల్సి వస్తోంది. ఖమ్మంలో సీసీఐ కేంద్రం ద్వారా ఇప్పటి వరకు కేవలం 55,345 క్వింటాలు, నేలకొండపల్లి సీసీఐ కేంద్రంలో 1,657 క్వింటాలను మాత్రమే సీసీఐ కొనుగోలు చేసింది. ప్రైవేట్ వ్యాపారులు ప్రస్తుత సీజన్లో దాదాపు 2.50లక్షల క్వింటాలుకు పైగా పత్తిని కొనుగోలు చేశారు. ఇంకా మధిర, ఏన్కూరు, భధ్రాచలం, వైరా, బూర్గంపాడు, కొత్తగూడెం, చండ్రుగొండలలో సీసీఐ కేంద్రాలను ఏర్పాటు చేయాల్సి ఉంది. -
అక్రమార్కులపై గురి
ఖమ్మం వ్యవసాయం : ఖమ్మం వ్యవసాయ మార్కెట్లోని సీసీఐ (కాటన్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా)కొనుగోలు కేంద్రంలో జరుగుతున్న అక్రమాలపై రెవెన్యూ, పోలీస్‌శాఖలు పంజా విసిరాయి. ఈ కేంద్రంలో రైతులు తాము పండించిన పంటను నేరుగా అమ్ముకునే కన్నా బినామీ రైతుల పేరిట దళారులు, కమీషన్‌వ్యాపారులు, వ్యాపారుల సరుకే అధికంగా అమ్మకాలు జరుగుతున్నట్లు సోమవారం అధికారుల తనిఖీల్లో బయటపడింది. ఖమ్మం ఆర్డీవో వినయ్ కృష్ణారెడ్డి, మార్కెట్ ఉన్నత శ్రేణి కార్యదర్శి మహ్మద్ అబ్దుల్ జావీద్, ఖమ్మం మార్కెటింగ్‌శాఖ సహాయ సంచాలకులు ఎం.ఏ అలీం, ఖమ్మం డీఎస్పీ బాలకిషన్‌రావు, ఖమ్మం అర్బన్ ఎమ్మార్వో వెంకారెడ్డి, ఖమ్మం త్రీటౌన్ సీఐ రెహమాన్‌లు సీసీఐ కేంద్రానికి వచ్చిన పత్తి రైతులదా ? దళారులదా ? బినామీ రైతుల పేరిట కమీషన్ వ్యాపారులు తెస్తున్నారా ? అనే అంశాలను పరిశీలించారు. ఈ పరిశీలనలో సీసీఐ కేంద్రంలో జరిగే అక్రమాలన్నీ బయటపడ్డాయి. అసలేం జరిగింది ఖమ్మం వ్యవసాయ మార్కెట్లో ఏర్పాటు చేసిన సీసీఐ కేంద్రంలో రైతులు అమ్మకానికి తీసుకువచ్చే సరుకు కన్నా దళారులు, కమీషన్‌దారులే ఎక్కువ సరుకును అమ్మకానికి తీసుకువచ్చి అమ్ముతున్నారు. దళారులు, కమీషన్‌వ్యాపారులు రైతుల వద్ద క్వింటాలుకు రూ,3,000 నుంచి రూ.3,500 వరకు కొనుగోలు చేసి సీసీఐ కేంద్రంలో వారికి సంబంధించిన రైతుల పేరిట క్వింటాలుకు ప్రభుత్వ మద్దతు ధర రూ.4,050 వరకు అమ్మకాలు చేస్తున్నారు. నిబంధనల మేరకు 8-12 తేమ శాతం ఉన్న సరుకును మాత్రమే సీసీఐ కొనుగోలు చేస్తుంది. కానీ కమీషన్‌దారులు 12 శాతానికి మించి తేమ ఉన్న సరుకును తీసుకువచ్చి అమ్ముతున్నారు. ఖమ్మం సీసీఐ కేంద్రానికి నిత్యం 30 వేల బస్తాలకు పైగా సరుకు అమ్మకానికి వస్తుంది. నిబంధనల మేరకు సరుకు ఉండకపోవటంతో సీసీఐ కొనుగోలుదారులు సరుకును కొనుగోలు చేయలేమని తేల్చి చెబుతున్నారు. గేటు వద్ద సరుకును మాయిశ్చర్ యంత్రంతో పరీక్షించి, నిబంధనలకు లోబడి ఉన్న రైతుల సరుకును మాత్రమే లోనకు అనుమతించాలని నిర్ణయించారు. ఆదివారం రాత్రి ఆ దిశగా అధికారులు ప్రయత్నాలు చేశారు. రైతుల ముసుగులో అక్రమార్కులు సరుకును తీసుకువచ్చి లోనకు అనుమతించాలని అధికారులపై ఒత్తిడి చేశారు. అధికారులు అందుకు అంగీకరించకపోవటంతో గేట్ల తాళాలు పగులగొట్టి సరుకును లోనకు తీసుకువెళ్లి దిగుమతి చేశారు. ఈ వ్యవహారంలో కొందరు అక్రమార్కుల ఆగడాలను అధికారులు ఉన్నతాధికారుల దృష్టికి తీసుకుపోయారు. ఈ వ్యవహారాన్ని జిల్లా జాయింట్ కలెక్టర్ కె.సురేంద్రమోహన్ సీరియస్‌గా తీసుకొని ఖమ్మం ఆర్డీవో వినయ్‌కృష్ణారెడ్డి, ఖమ్మం అర్బన్ ఎమ్మార్వో వెంకారెడ్డిలను రంగంలోకి దించారు. ఈ వ్యవహారంలో శాంతి భద్రతలను కల్పించాలని పోలీస్ శాఖను కూడా కోరారు. ఖమ్మం డిఎస్పీ బాలకిషన్ రావు నేతృత్వంలో త్రీటౌన్ సీఐ రహమాన్, సీసీఎస్ సీఐ విశ్వేశ్వర రావులు పోలీసు బలగాలతో మార్కెట్‌కు వచ్చారు. రెవెన్యూ, మార్కెట్, పోలీస్ అధికారుల బృందం సరకు వద్దకు వెళ్లి ఆ సరుకుకు సంబంధించిన రైతుల వివరాలు, వారు నిజమైన రైతులేనా అనే విషయాలను పరిశీలించారు. చింతకాని, తిరుమలాయపాలెం, బోనకల్లు తదితర మండలాలకు చెందిన రైతులమని శేషయ్య, వెంకటేశ్వర్లు, నాగరాజు తదితరులు చెప్పుకొచ్చారు. వీఆర్వో నుంచి ధ్రువీకరణపత్రం తీసుకొచ్చారా..? అని ప్రశ్నించగా తాము తీసుకురాలేదని, అంతా కమీషన్వ్యాపారే చూసుకుంటున్నారని తెలిపారు. ఈ వ్యవహారాన్నంతటిని అధికారులు వీడియోలో, కెమెరాల్లో (ఫోటోలు) రికార్డు చేశారు. ఒక్కొక్కటిగా అక్రమ వ్యవహారం బయటపడుతుండటంతో ఆ ప్రాంతంలో ఉన్న దళారులు, కమీషన్వ్యాపారుల అక్కడ నుంచి జారుకున్నారు. పంట పండించి అమ్మకానికి తీసుకువచ్చిన రైతులు మినహా మిగిలిన వారు తమతమ సరకును బయటకు తీసుకువెళ్లాలని మైకులో ప్రకటించారు. కొందరు సరుకును సీసీఐ కేంద్రం నుంచి బయటకు తరిలించారు. పోలీసుల అదుపులో 15 వాహనాలు కృష్ణా, నల్లగొండ జిల్లాలతో పాటు ఖమ్మం జిల్లాలోని పలు ప్రాంతాల నుంచి దళారులు, కమీషన్‌వ్యాపారులు సీసీఐ కేంద్రంలో అమ్మకానికి తీసుకువచ్చిన దాదాపు 15 పత్తి లారీలు, వ్యాన్లను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఆయా వాహనాల డ్రైవర్లను సరుకు ఎక్కడిదని పోలీసులు అడిగి తెలుసుకున్నారు. పత్తిని తీసుకువచ్చిన వ్యాపారుల వివరాలను డ్రైవర్లు పోలీసులకు ఇచ్చారు. ఆయా వ్యాపారులకు పోలీస్ అధికారులు ఫోన్లు చేయగా స్విచ్ ఆఫ్ వస్తుండటంతో వాహనాలను అదుపులోకి తీసుకున్నారు. వ్యాపారులకు వార్నింగ్ సీసీఐ కేంద్రానికి అమ్మకానికి వచ్చిన పత్తి బస్తాలపై ఏఎన్ఆర్, ఎంఎన్ఆర్, కేఆర్ఆర్ వంటి రాతలు ఉండటంతో వాటి ఆధారంగా కమీషన్ వ్యాపారులను గుర్తించి వారిని మార్కెట్‌కు పిలిపించారు. సీసీఐ కేంద్రంలోకి అక్రమంగా సరుకును తీసువచ్చి రైతుల పేరిట అమ్మకాలు చేస్తున్నారని, ఆ విధానాన్ని మానుకోకపోతే తీవ్ర పరిణామాలు ఉంటాయని ఆర్డీవో, డీఎస్పీలు హెచ్చరించారు. ఆదివారం రాత్రి ఒక కమీషన్వ్యాపారి మార్కెట్ అధికారులపై దౌర్జన్యం చేశాడనే వ్యవహారాన్ని అధికారులు చర్చించి ఆ వ్యాపారిపై చట్టపరంగా చర్యలు తీసుకోవాలని నిర్ణయించారు. అనంతరం ఖమ్మం చాంబర్ ఆఫ్ కామర్స్ అధ్యక్ష, కార్యదర్శులు మేళ్లచెరువువెంకటేశ్వరరావు, చిన్ని కృష్ణారావు, ఉపాధ్యక్షులు గొడవర్తి శ్రీనివాస రావు తదితరులను అధికారులు మార్కెట్‌కు పిలిపించి వారితో సమావేశం నిర్వహించారు. వ్యాపారులు చట్టాన్ని ఉల్లఘంచరాదని, అలా చేస్తే చర్యలు తీసుకుంటామని చెప్పారు. పోలీస్ పహారా మధ్య కొనుగోళ్లు సోమవారం మధ్యాహ్నం పోలీసు పహారా మధ్య ఆర్డీవో, ఎంఆర్వో, మార్కెట్ అధికారుల సమక్షంలో సీసీఐ బయ్యర్లు పత్తిని కొనుగోళ్లు ప్రారంభించారు. బ్లాక్ లిస్టులో ఖమ్మం సీసీఐ కేంద్రం ? ఖమ్మం వ్యవసాయ మార్కెట్లో ఏర్పాటు చేసిన సీసీఐ కేంద్రంలో అక్రమాలు చోటు చేసుకుంటున్నాయని, నాణ్యత లేని పత్తి అమ్మకానికి వస్తోందని, బయ్యర్లను కొందరు ఇబ్బంది పెడుతున్నారని సీసీఐకి సమాచారం అందింది. గతంలో కూడా ఇక్కడ అక్రమాలు జరిగాయని సీసీఐ గుర్తించింది. ఈ కేంద్రాన్ని నిర్వహించటం ఇబ్బందికరంగా ఉందని బ్లాక్ లిస్టులో పెట్టాలనే యోచనలో ఆ శాఖ ఉన్నతాధికారులు ఉన్నట్లు తెలిసింది. -
పేరుకే కేంద్రం.. కొనుగోళ్లు శూన్యం
గజ్వేల్: పత్తి రైతుకు వెన్నుదన్నుగా నిలవాల్సిన సీసీఐ (కాటన్ కార్పోరేషన్ ఆఫ్ ఇండియా) కొనుగోళ్లలో చొరవ చూపడం లేదు. ఉత్పత్తులు మార్కెట్లోకి రావడం ఊపందుకున్నా, ఏదో కొన్నామంటే కొన్నామంటూ కేంద్రాలను నామమాత్రంగా నడిపిస్తోంది. ఈ నేపథ్యంలోనే సీసీఐ ఇప్పటివరకు జిల్లాలో 1,327 క్వింటాళ్లు మాత్రమే కొనుగోలు చేయగలిగింది. ఇదే అదనుగా భావించిన వ్యాపారులు రైతుల వద్ద మద్దతు ధర కంటే తక్కువగా రూ.3,300 నుంచి రూ. 3,700 పత్తిని కొనుగోలు చేస్తున్నారు. ఇప్పటికే వేలాది క్వింటాళ్ల పత్తిని పక్కరాష్ట్రానికి తరలించి దండుకుంటున్నారు. తాము దగా పడుతున్నామని తెలిసి కూడా రైతన్నలు విధిలేని పరిస్థితుల్లో దళారులు ఇచ్చింది తీసుకుని ఆరుగాలం శ్రమించి పండించిన పంటను అప్పగిస్తున్నారు. ‘మద్దతు’ ఇవ్వని సీసీఐ జిల్లాలో ఈసారి 1.25 లక్షల హెక్టార్లలో పత్తి సాగైంది. పరిస్థితులు కలిసి వస్తే సుమారు 3 లక్షల మెట్రిక్ టన్నులకు పైగా దిగుబడులు వచ్చే అవకాశముండేది. కానీ ఈసారి తీవ్ర వర్షాభావ పరిస్థితుల వల్ల అంతా తారుమారైంది. వర్షాభావం, కరెంటు కోతలతో సరిగా నీరందక దిగుబడిలో సగానికి సగం తగ్గింది. మరోవైపు చేతికందిన పంటకు కూడా మద్దతు ధర దక్కకపోవడం రైతులను కుంగదీస్తోంది. పత్తి రైతుకు మద్దతు కల్పించేందుకు జిల్లాలోని గజ్వేల్, సిద్దిపేట, తొగుట, జోగిపేట, జహీరాబాద్, వట్పల్లి, సదాశివపేటల్లో సీసీఐ(కాటన్ కార్పోరేషన్ ఆఫ్ ఇండియా) కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేసింది. ఇందులో ఇప్పటివరకు గజ్వేల్, సిద్దిపేట, జహీరాబాద్, జోగిపేట కేంద్రాలు మాత్రమే తెరిచారు. వీటిన్నంటిలో కలిపి ఇప్పటి వరకు మొత్తం 1,327 క్వింటాళ్ల పత్తిని మాత్రమే కొనుగోలు చేశారు. ఇందులోనూ అత్యల్పంగా సిద్దిపేట సెంటర్లో కేవలం 32 క్వింటాళ్లు మాత్రమే అధికారులు కొనుగోలు చేశారు. ఇక గజ్వేల్‌లో సెప్టెంబర్ 20న కేంద్రం ప్రారంభమైతే, వాతావరణ ప్రతికూల పరిస్థితులు, సెలవుల కారణంతో ఐదంటే ఐదు రోజులే కొనుగోళ్లు జరిగాయి. దీంతో ఈ సెంటర్ నుంచి సీసీఐ 246 క్వింటాళ్ల పత్తిని రైతులనుంచి కొనుగోలు చేసింది. ఈ నేపథ్యంలో రైతులు ప్రైవేట్ వ్యాపారులను ఆశ్రయించడం అనివార్యంగా మారింది. దళారుల దందా మార్కెట్లోకి వస్తున్న పత్తిని అంచనా వేస్తున్న దళారులు సీసీఐ కంటే రెట్టింపు స్థాయిలో కొనుగోళ్లు జరిపారు. అయితే రైతుల అవసరాన్ని ఆసరాగా చేసుకుని రూ.3,300 నుంచి రూ.3,600 మాత్రమే చెల్లిస్తున్నారు. దీంతో ప్రభుత్వం ప్రకటించిన రూ. 3,750-రూ.4,050 మద్దతు ధర కూడా రైతులకు దక్కడం లేదు. గజ్వేల్‌లో ఇప్పటివరకు ప్రైవేట్ వ్యాపారులు సుమారు 500 క్వింటాళ్లకుపైగా పత్తిని కొనుగోలు చేశారు. గుజరాత్, మహారాష్ట్రలలో తెల్లబంగారానికి అధిక ధర పలుకుతుండడంతో వ్యాపారులంతా ఇక్కడ రైతులవద్ద తక్కువ ధరకు కొన్న పత్తిని పొరుగు రాష్ట్రాలకు తరలిస్తూ దండుకుంటున్నారు. ఈ లెక్కన ఒక్క గజ్వేల్ ప్రాంతంలోనే ధర రూపేణా రైతులు ఇప్పటికే లక్షల్లో నష్టపోయారు. జిల్లా అంతటా ఇదే పరిస్థితి నెలకొంది. -
సీసీఐకి రైతుల షాక్ !
సంస్థకు విక్రరుుంచేందుకు వెనుకంజ తక్కువ ధర అరుునా.. వ్యాపారుల వైపే మొగ్గు వెంటనే డబ్బులు ఇవ్వకపోవడం.. బ్యాంకుల కొర్రీలే కారణం వరంగల్ సిటీ :ఆరుగాలం శ్రమించి పండించిన పంటను ఎక్కువ రేటుతో కొనుగోలు చేసే వారికి విక్రరుుంచేందుకు రైతులు పోటీపడతారు. ఇందులోనూ.. తెల్లబంగారాన్ని ప్రభుత్వ రంగ సంస్థ అరుున కాటన్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియూకు అమ్ముకునేందుకే ఎగబడతారు. వ్యాపారులు తమ జిమ్మిక్కులతో ధర తగ్గించి కొనుగోలు చేసినప్పుడల్లా... సీసీఐ కొనుగోలు చేయూలంటూ రైతులు ఆందోళనకు దిగిన సందర్భాలు ఎన్నో ఉన్నారుు. ఎన్ని రోజులు ఆలస్యమైనా సరే... ఆ సంస్థ అధికారులు కొనుగోళ్లు చేసేవరకూ కర్షకులు రోజుల తరబడి పత్తి బస్తాలతో మార్కెట్లోనే వేచి ఉండేవారు. ప్రభుత్వ మద్దతు ధర అందుతుండడమే ఇందుకు ప్రధాన కారణం. అలాంటిది... ఆసియూలోనే అతి పెద్దదిగా పేరొందిన వరంగల్ ఏనుమాముల మార్కెట్లో సీన్ రివర్స్ అరుుంది. పత్తి బస్తాలతో మంగళవారం మార్కెట్‌కు తరలివచ్చిన రైతులు తమ పం ట ఉత్పత్తులను సీసీఐకి అమ్మడానికి వెనుకంజ వేశారు. మంగళవారం మార్కెట్‌కు సుమారు 20 వేల పత్తి బస్తాలు వచ్చారుు. ఉదయం సీసీఐ అధికారులు 1,600 పత్తి బస్తాలను కొనుగోలు చేశారు. మరికొన్ని బస్తాలను కొనుగోలు చేస్తున్న క్రమంలో సీ న్ మారింది. రైతులందరూ ప్రైవేట్ వ్యాపారులకు విక్రరుుంచేందుకు మొగ్గుచూపా రు. మార్కెట్ అధికారులు నచ్చజెప్పినా... వారు సీసీఐకి విక్రరుుంచేందుకు ససేమిరా అన్నారు. సీసీఐకి అమ్మినదానికంటే రూ. 100 నుంచి రూ.200 తక్కువ అయినా... అడ్తిదారుల ద్వారా వ్యాపారులకే అ మ్మా రు. ముందుగా ప్రభుత్వ మద్దతు ధర క్విం టాల్‌కు రూ.4,050తో సీసీఐకి అమ్మిన రైతులు సైతం మనసు మార్చుకుని... వ్యా పారులకే విక్రరుుంచడం విశేషం. ఒక్క అ గ్రంపాడ్కు చెందిన రైతు వెంకటేశ్వర్లు మా త్రమే సీసీఐకి 25 బస్తాల పత్తిని అమ్మాడు. కారణం ఇదే.. పత్తి బస్తాలను సీసీఐకి విక్రరుుంచకపోవడంపై ‘సాక్షి’ ఆరా తీసింది. విక్రరుుంచిన వెంటనే సీసీఐ డబ్బులివ్వదని, వాళ్ల చు ట్టూ కాళ్లరిగేలా తిరగాలని పలువురు రైతు లు చెప్పారు. పంటల సాగు కోసం తెచ్చిన అప్పులు కుప్పలుగా పేరుకుపోయూయని.. మిత్తి కట్టేందుకు ఎంతో కొంతకు అమ్ముకున్నామని కొందరు తెలిపారు. చెక్‌లు ఇస్తుండడంతో బ్యాంకుల్లో ఇబ్బం దులు ఎదురవుతున్నాయని.. బ్యాంకులో అప్పు ఉంటే వారి ఖాతాల్లో జమ చేసుకుంటున్నారని.. అందుకనే తక్కువ వచ్చి నా... వ్యాపారులకే అమ్ముకున్నామని మరి కొందరు వాపోయూరు. అరుుతే.. అడ్తివ్యాపారులు ఏకమై రైతులను భయభ్రాంతులకు గురిచేసినట్లు వినికిడి. అందుకే అమ్మిన రైతులు సైతం అమ్మకాలు రద్దు చేసుకున్నట్లు మార్కెట్ వార్గాల్లో ప్రచారం జరుగుతోంది. -
పత్తి రైతులను దోపిడీ చేయడం ...
సాక్షి ప్రతినిధి, ఆదిలాబాద్ : పత్తి రైతులను దోపిడీ చేయడం షురువైంది. ప్రైవేటు వ్యాపారుల ఎత్తుగడలు ఫలించాయి. ధరలో కోత విధించి దండుకోవడానికి అధికారికంగానే లైన్ క్లియరైంది. రాష్ట్రంలో ఏ మార్కెట్లోనూ లేనివిధంగా తేమ శాతం పేరుతో సీసీఐ (కాటన్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా) కొనుగోళ్ల నుంచి తప్పుకోవడంతో పత్తి రైతులకు ప్రైవేటు వ్యాపారులే దిక్కయ్యారు. దీన్ని ఆసరాగా చేసుకుని వ్యాపారులు ధర దోపిడీ పర్వానికి తెరలేపారనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఆరుగాలం శ్రమించి పండించిన పత్తి పంటకు కనీస మద్దతు ధర కల్పించండి మహాప్రభో అంటూ మూడు రోజులుగా రోడ్డెక్కి నెత్తినోరు మొత్తుకున్నా పత్తి రైతుల ఆవేదన చివరకు అరణ్య రోదనగానే మిగిలిపోయింది. రైతుల ఉత్పత్తులకు కనీస మద్దతు ధర అందేలా వ్యాపారుల పట్ల కఠినంగా వ్యవహరించాల్సిన మార్కెటింగ్ శాఖ అధికారులు దగ్గరుండి కనీస మద్దతు ధరలో కోత విధిస్తుండడం విమర్శలకు దారితీస్తోంది. కొనుగోళ్లతోపాటే దోపిడీ ప్రారంభం.. రెండు రోజులుగా నెలకొన్న ప్రతిష్టంభనకు తెరపడి మంగళవారం ఎట్టకేలకు పత్తి కొనుగోళ్లు ప్రారంభమయ్యాయని జిల్లా అధికార యంత్రాంగం ఊపిరి పీల్చుకుంటే.. ప్రారంభమైంది కొనుగోళ్లు కాదని, ప్రైవేటు వ్యాపారుల దోపిడీ అని పత్తి రైతులు లబోదిబోమంటున్నారు. ధరలో రూ.350 చొప్పున కోత విధించడంతో మార్కెట్ యార్డుకు పది క్వింటాళ్లు తెస్తున్న రైతులు సగటున రూ.3,500 నుంచి రూ.5,000 వరకు నష్టపోవాల్సి వస్తోంది. పెరిగిన సాగు వ్యయానికి, వచ్చిన రాబడికి భారీ మొత్తంలో తేడా ఉండడంతో ఆందోళన చెందుతున్నారు. సీసీఐ ధర క్వింటాల్‌కు రూ.3,885.. కనీస మద్దతు ధర క్వింటాల్‌కు రూ.4,050 చొప్పున కొనుగోలు చేయాల్సిన సీసీఐ తేమ పేరుతో రూ.3,885కి ధర తగ్గించింది. తేమ శాతం 17కు మించి ఉన్న పత్తిని అసలు కొనుగోలు చేయడం లేదు. అంతకుమించి తేమ ఉన్న పత్తిని వ్యాపారులు తీసుకుంటున్నారు. ప్రస్తుత వాతావరణ పరిస్థితుల్లో 20 శాతానికి మించి తేమ ఉంటుండటంతో రైతులకు ప్రైవేటు వ్యాపారులే దిక్కవుతున్నారు. దీంతో యార్డుకు వస్తున్న పత్తిలో కనీసం ఐదు శాతానికి మించి సీసీఐ కొనుగోలు చేయడం లేదు. నేటి నుంచి కొనుగోళ్లు బంద్.. ప్రారంభమైన ఒక్క రోజులోనే పత్తి కొనుగోళ్లకు బ్రే క్ పడింది. సోమవారం అసలు కొనుగోళ్లే ప్రారంభం కాలేదు. మంగళవారం నుంచి తూకాలు వేస్తున్నారు. ఇంతలోనే దీపావళి పండుగ పురస్కరించుకుని ఈ నెల 22 నుంచి 26 వరకు మార్కెట్ యార్డుల్లో కొనుగోళ్లు జరగవని ఆదిలాబాద్ మార్కెట్ కమిటీ కార్యదర్శి ఎ.కిష్టాగౌడ్ మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈ నెల 27 నుంచి తిరిగి కొనుగోళ్లు ప్రారంభమవుతాయని పేర్కొన్నారు. రైతులు ఈ విషయాన్ని గమనించాలని విజ్ఞప్తి చేశారు. -
పత్తి కొనుగోలుపై తీవ్ర ఉత్కంఠ
ఆదిలాబాద్:పత్తిరైతుల దీనస్థితిని పట్టించుకునే నాథుడే కరువయ్యాడు. పండిన పంటకు గిట్టుబాటు ధర రాక విలవిల్లాడుతున్నాడు. పత్తిరైతు అననుకూల వాతావరణ పరిస్థితులు తట్టుకుని సాగుచేసినా వచ్చిన దిగుబడిని అమ్ముకునేందుకు మార్కెట్ సౌకర్యం లేక తీవ్రంగా నష్టపోతున్నాడు. జిల్లాలో పత్తి కొనుగోలు తొలిరోజే ఉత్కంఠ పరిస్థితులకు దారితీసింది. ఆదివారం పత్తి కొనుగోలుకు వచ్చిన సీసీఐ(కాటన్ కార్పోరేషన్ ఆఫ్ ఇండియా) అధికారులు ఆంక్షలు పెట్టడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. పత్తిలో 12 శాతం తేమ మించితే కొనుగోలు చేయలేమని సీసీఐ అధికారులు తేల్చిచెప్పడంతో రైతులు లబోదిబోమంటున్నారు. పత్తి కొనుగోలుకు ప్రయివేటు వ్యాపారులు కూడా ఆసక్తి చూపకపోవడంతో రైతలు తీవ్ర డైలామాలో పడ్డారు. ఇంకా పత్తికొనుగోలు ప్రారంభం కాకపోవడంతో రైతులు సీసీఐ అధికారులను దిగ్భందించి నిరసన చేపట్టారు. -
పత్తి కొనుగోలులో సీసీఐ కొర్రీలు
ఖమ్మం వ్యవసాయం: కాటన్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (సీసీఐ) తన బుద్ధిని మరోసారి బయటపెట్టింది. పత్తి కొనుగోళ్ల ఆరంభంలోనే కొర్రీలు పెట్టింది. ఖమ్మం వ్యవసాయ మార్కెట్లో శుక్రవారం సీసీఐ ద్వారా పత్తి కొనుగోళ్లు జరిపేందుకు ఇద్దరు బయ్యర్లు వచ్చారు. సీసీఐ నిబంధనల ప్రకారం విడి పత్తిని రైతులు అమ్మకానికి తీసుకురావాలి. కానీ మార్కెటింగ్‌శాఖ గ్రామాల్లో వివిధ రకాలుగా ప్రచారం చేసింది. గతంలో ఎప్పుడూ రైతాంగం విడి పత్తిని మార్కెట్‌కు తీసుకువచ్చిన దాఖలాలు లేవు. 2012-13 సంవత్సరంలో సీసీఐ పత్తి కొనుగోళ్లు జరిపినప్పుడు రైతులు సరుకును బస్తాల్లోనే మార్కెట్‌కు తీసుకువచ్చి అమ్మారు. అదే తరహాలో శుక్రవారం కూడా సీసీఐ కేంద్రానికి రైతులు బస్తాల్లోనే పత్తిని తెచ్చారు. బయ్యర్లు విడిగా తీసుకువచ్చిన పత్తిని నిబంధనల మేరకు కొనుగోలు చేస్తామని తేల్చి చెప్పారు. మార్కెటింగ్‌శాఖ అధికారులు కూడా బయ్యర్లకే వంతపాడారు. కమీషన్‌వ్యాపారులు, దిగుమతిశాఖ ప్రతినిధులు మాత్రం విడిగా పత్తిని తీసుకురావటం కష్టమన్నారు. కొందరు ైరె తులు మార్కెటింగ్‌శాఖ అధికారులను కలిసి విడిగా పత్తిని తేలమని తేల్చి చెప్పారు. గత్యంతరం లేక అధికారులు బయ్యర్లతో మాట్లాడారు. బస్తాల్లో తెచ్చిన పత్తిని కొనుగోలు చేసేందుకు ఒప్పించారు. పత్తిని పరిశీలించిన బయ్యర్లు మార్కెట్‌కు అమ్మకానికి వచ్చిన పత్తిని బయ్యర్లు పరిశీలించారు. పత్తిలో 15-20 శాతం తేమ ఉందన్నారు. సీసీఐ నిబంధనల ప్రకారం 8 నుంచి 12 శాతం మాత్రమే తేమ ఉండాలన్నారు. నిబంధనలకు అనుగుణంగా పంటలేదన్న పేరుతో కొనుగోళ్లు జరుపలేదు. సీసీఐ కొనుగోళ్లపై ఆశతో.. సీసీఐ కొనుగోళ్లు జరుపుతుందనే ఆశతో రైతులు పెద్ద ఎత్తున పత్తిని అమ్మకానికి తీసుకువచ్చారు. అంతర్జాతీయంగా ఎగుమతులు లేకపోవడంతో కొద్దిరోజులుగా పత్తి ధర బాగా క్షీణిస్తోంది. క్వింటాలు రూ.5 వేల వరకు ఉన్న పత్తి ఏకంగా రూ. 3000 నుంచి రూ. 3,500 వరకు మాత్రమే పలుకుతోంది. ఈ ఏడాది కేంద్ర ప్రభుత్వం పత్తికి రూ.4,050 మద్దతు ధరగా ప్రకటించింది. ప్రైవేటు వ్యాపారులు క్వింటాలు రూ. 3,000 నుంచి రూ. 3,500లకు మాత్రమే కొనుగోలు చేస్తున్నారు. ప్రభుత్వం ప్రకటించిన మద్దతు ధరకైనా అమ్ముకోవచ్చనే ఆశతో సీసీఐ కేంద్రానికి తీసుకొచ్చారు. దాదాపు 14వేల బస్తాలను రైతులు శుక్రవారం అమ్మకానికి తెచ్చారు. ఆరంభంలోనే బయ్యర్లు కొనుగోలులో ఆటంకాలు సృష్టించారు. తేమశాతం అధికంగా ఉందని కొనేందుకు నిరాకరించారు. మార్కెటింగ్‌శాఖ అధికారులు కూడా తాము ఏమి చేయలేమని చేతులెత్తేశారు. దిక్కుతోచని స్థితిలో రైతులు వ్యాపారులకే క్వింటాలు రూ.3,000 నుంచి రూ.3,500లకు అమ్ముకొని వెళ్లారు. వ్యాపారులతో కుమ్మక్కై కావాలనే సీసీఐ కొర్రీలు పెట్టిందనే వాదనలు వినిపిస్తున్నాయి. తేమశాతం అధికంగా ఉండటం వల్లనే కొనలేదు: సుధాకర్, జేడీఎం, వరంగల్ మార్కెటింగ్‌శాఖ సీసీఐ కేంద్రానికి తీసుకు వచ్చిన పత్తిలో తేమశాతం అధికంగా ఉంది. అందుకే బయ్యర్లు కొనుగోలు చేయలేదు. రైతులు సరుకును ఆరబెట్టుకొని అమ్మకానికి తెస్తే బయ్యర్లు కొనుగోళ్లకు ముందుకు వస్తారు. -
ఉద్యోగాలు
అంబేద్కర్ యూనివర్సిటీ న్యూ ఢిల్లీలోని అంబేద్కర్ వర్సిటీ వివిధ ఉద్యోగాల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది. సిస్టమ్ అడ్మినిస్ట్రేటర్ (ఐటీ) అర్హతలు: 55శాతం మార్కులతో కంప్యూటర్ సైన్స్/ ఐటీ/ బీటెక్ లేదా ఎంసీఏ జూనియర్ సిస్టమ్ అడ్మినిస్ట్రేటర్ (ఐటీ) అర్హత: కంప్యూటర్ సైన్స్/ ఎలక్ట్రికల్ ఇం జనీరింగ్/ ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్(బీటెక్/ బీఈ)/ఎమ్మెస్సీ/ఎంసీఏ ఉత్తీర్ణత. జూనియర్ ఎగ్జిక్యూటివ్ (ఐటీ) అర్హత: కంప్యూటర్ సైన్స్‌లో బీఈ లేదా బీటెక్/ ఎమ్మెస్సీ కంప్యూటర్ సైన్స్/ ఐటీ/ ఎంసీఏ/ ఎంబీఏ ఉత్తీర్ణత. టెక్నికల్ అసిస్టెంట్ అర్హత: బీఎస్సీతో పాటు కంప్యూటర్స్‌లో డిప్లొమా ఉండాలి. ఆన్లైన్ రిజిస్ట్రేషన్‌కు చివరి తేది: నవంబర్ 14 వెబ్సైట్: http://aud.ac.in/ కాటన్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా కాటన్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ (సీసీఐఎల్), వరంగల్ కింది పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.టెంపరరీ క్లర్క్: 150 1) ఫీల్డ్ అసిస్టెంట్ 2) డాక్యుమెంట్ అసిస్టెంట్/ ఆఫీస్ స్టాఫ్ (అకౌంట్స్) 3) ఆఫీస్ స్టాఫ్ (జనరల్) అర్హతలు: ఏదైనా బ్యాచిలర్స్ డిగ్రీ ఉండాలి. అకౌంట్స్ విభాగానికి బీకామ్‌తో పాటు కంప్యూటర్ పరిజ్ఞానం అవసరం. వయసు: 27 ఏళ్లకు మించకూడదు. దరఖాస్తులకు చివరి తేది: అక్టోబర్ 31 వెబ్సైట్: www.cotcorp.gov.in -
సీసీఐ మీనమేషాలు..
సాక్షి ప్రతినిధి, ఆదిలాబాద్ : పత్తి రైతుకు ఈ ఏడాది ‘మార్కెట్’ కష్టాలు తప్పేలా లేవు. ఈ సీజనులో పత్తి కొనుగోళ్లకు ప్రైవేటు వ్యాపారులు ప్రస్తుతానికి ఆసక్తి చూపకపోవడంతో రైతులు సీసీఐ (కాటన్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా)పైనే ఆశలు పెట్టుకున్నారు. కానీ.. ప్రభుత్వ రంగ సంస్థ పత్తి కొనుగోళ్లను ప్రారంభించడంలో మీనమేషాలు లెక్కిస్తోంది. ఈ నెల 27 వరకు కొనుగోళ్లు ప్రారంభించే ప్రసక్తే లేదని సంస్థ అధికారులు తేల్చిచెబుతున్నారు. దీంతో పత్తి రైతుల పరిస్థితి అగమ్యగోచరంగా తయారైంది. ఖరీఫ్ ప్రారంభంలో కరువు.. తర్వాత అధిక వర్షాలు.. ఇలా ప్రతికూల పరిస్థితులను ఎదుర్కొని రైతులు పత్తిని పండించి అమ్ముకుందామంటే దిక్కుతోచని పరిస్థితి నెలకొంది. వెంటనే పత్తి కొనుగోళ్లు ప్రారంభించాలని గురువారం హైదరాబాద్‌లో నిర్వహించిన సమీక్షలో రాష్ట్ర మార్కెటింగ్ శాఖ మంత్రి టి.హరీష్‌రావు అధికార యంత్రాంగాన్ని ఆదేశించారు. కానీ.. సీసీఐ తీరును పరిశీలిస్తే ఈ ఆదేశాలు ఇప్పట్లో అమలుకు నోచుకునే పరిస్థితి కనిపించడం లేదు. రైతులు మాత్రం పత్తిని మార్కెట్ యార్డులకు తరలిస్తున్నారు. సోమవారం నుంచి ప త్తిని ఆదిలాబాద్ మార్కెట్ యార్డు కు తీసుకువస్తామని రైతు సంఘాల నాయకులు కలెక్టర్ ఎం.జగన్మోహన్ను కలిసి విజ్ఞప్తి చేశారు. అదే జరి గితే యార్డుకు వచ్చిన పత్తిని కొనుగోలు చేసే వారెవరో తెలియక మా ర్కెటింగ్ శాఖ అధికారులు తలలు పట్టుకోవాల్సి వస్తోంది. బేల, తల మడుగు, ఆదిలాబాద్ మండలాల పరిధిలోని పలు గ్రామాల్లో రైతులు పత్తిని మార్కెట్ యార్డుకు తరలించేందుకు సిద్ధంగా ఉన్నారు. ఇప్పటికే కరీంనగర్, ఖమ్మం, వరంగల్ జిల్లాల్లో పత్తి కొనుగోళ్లు ప్రారంభమయ్యాయి. పత్తి కనీస మద్దతు ధర క్వింటాలుకు రూ.4,050లుగా ప్రభుత్వం నిర్ణయించింది. అయితే.. ఈసారి కూడా పత్తి రైతుకు కనీస మద్దతు ధర లభించే అవకాశాలు కనిపించడం లేదు. జిల్లాలో ప్రధానంగా ఆదిలాబాద్‌తోపాటు, భైంసా మార్కెట్ యార్డుకు రైతులు ఎక్కువగా పత్తిని తీసుకువస్తారు. 21 కేంద్రాల ద్వారా పత్తి కొనుగోళ్లు.. ఈ సీజన్లో ఆదిలాబాద్, నిజామాబాద్ జిల్లాల్లో 21 కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చే స్తామని సీసీఐ ఆదిలాబాద్ బ్రాంచ్ మేనేజర్ అర్జున్ధవా పేర్కొన్నారు. ఈ మేరకు సీసీఐ ఆయా కేంద్రాల పరిధిలో ఉన్న జిన్నింగ్ మిల్లులతో ఒప్పందం కుదుర్చుకుంది. కానీ.. కొనుగోళ్లు మాత్రం మరో పక్షం రో జుల తర్వాతేనని ఆ సంస్థ అధికారు లు చెబుతున్నారు. వ్యవసాయ శాఖ గణాంకాల ప్రకారం ఈ ఖరీఫ్ సీజ న్లో ఆదిలాబాద్ జిల్లాలో 3.18 లక్ష ల హెక్టార్లలో పత్తి సాగు చేసినట్లు అంచనాకొచ్చారు. ఈ లెక్కన సు మారు 35 నుంచి 40 లక్షల క్వింటాళ్ల పత్తి మార్కెట్‌కు వచ్చే అవకాశాలున్నట్లు మార్కెటింగ్ శాఖ అంచనా. అయితే.. ఈ సీజనులో పత్తి కొనుగోళ్లపై ఇటీవల అఖిలపక్ష నాయకులతో సమావేశం నిర్వహించిన జి ల్లా అధికార యంత్రాంగం, ఈనెల 14న ప్రైవేటు వ్యా పారులతో సమావేశం కావాలని నిర్ణయించారు. -
జాబ్స్, అడ్మిషన్స అలర్ట్స్
కాటన్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా కాటన్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా కింద పేర్కొన్న ఉద్యోగాల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది. ►అసిస్టెంట్ మేనేజర్(మార్కెటింగ్). ఖాళీలు: 20. అర్హత: ఎంబీఏ/పీజీడీబీఎం(మార్కెటింగ్/అగ్రికల్చర్) ఉత్తీర్ణత. ►జూనియర్ కాటన్ పర్చేజర్. ఖాళీలు: 80. అర్హత: బీఎస్సీ అగ్రికల్చర్ ఉత్తీర్ణత. రిజిస్ట్రేషన్‌కు చివరి తేది: అక్టోబర్ 21. వెబ్సైట్: www.cotcorp.gov.in ఐబీపీఎస్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ బ్యాంకింగ్ పర్సనల్ సెలెక్షన్ కింద పేర్కొన్న ఉద్యోగాల నియామకానికి దరఖాస్తులు కోరుతోంది. ► రీసెర్చ్ అసోసియేట్. ఖాళీలు: 4. అర్హతలు: పీజీలో హెచ్ఆర్ఎం లేదా సైకాలజీ/ఎడ్యుకేషన్ ఉత్తీర్ణత. ► హిందీ ట్రాన్స్‌లేటర్. ఖాళీలు: 2 అర్హత: హిందీ/ఇంగ్లిష్ సబ్జెక్టులతో ఏదైనా పీజీ ఉత్తీర్ణత. దరఖాస్తులకు చివరి తేది: అక్టోబర్ 16. వెబ్సైట్: www.ibps.in బాబా అటామిక్ రీసెర్చ్ సెంటర్ ముంబైలోని బాబా అటామిక్ రీసెర్చ్ సెంటర్ (బార్క్) కింద పేర్కొన్న పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది. ► విజిటింగ్ సైంటిస్ట్. ఖాళీల సంఖ్య: 4 అర్హత: ఫిజిక్స్‌లో పీహెచ్‌డీతో పాటు రీసెర్చ్‌లో అనుభవం ఉండాలి. దరఖాస్తులకు చివరి తేది: అక్టోబర్ 31. వెబ్సైట్: www.barc.gov.in స్పైసెస్ బోర్డ్ ఆఫ్ ఇండియా కోచిలోని స్పైసెస్ బోర్డ్ ఆఫ్ ఇండియా వివిధ ఉద్యోగాల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది. ►డిప్యూటీ డెరైక్టర్(అకౌంట్స్)ఠి డిప్యూటీ డెరైక్టర్ ఠి సైంటిస్ట్ బి ఠి సైంటిస్ట్ బి(కెమిస్ట్రీ) ఠి సైంటిస్ట్ అసిస్టెంట్ దరఖాస్తులు తదితర పూర్తి వివరాల కోసం వెబ్సైట్ చూడొచ్చు. దరఖాస్తులకు చివరి తేది: అక్టోబర్ 10. వెబ్సైట్: www.indianspices.com ఇన్స్టిట్యూట్ ఆఫ్ లైఫ్ సెన్సైస్‌లో పీహెచ్డీ భువనేశ్వర్‌లోని ఇన్స్టిట్యూట్ ఆఫ్ లైఫ్ సెన్సైస్... పీహెచ్‌డీలో ప్రవేశానికి దరఖాస్తులు కోరుతోంది. ►పీహెచ్డీ. అర్హత: ఎమ్మెస్సీ/ఎంటెక్/ఎంఫార్మ్ ఉత్తీర్ణత. దరఖాస్తులకు చివరి తేది: అక్టోబర్ 22. వెబ్సైట్: www.ils.res.in ఐఐఎస్ఈఆర్లో పీహెచ్డీ ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ ఎడ్యుకేషన్ అండ్ రీసెర్చ్.. పీహెచ్‌డీలో ప్రవేశానికి దరఖాస్తులు కోరుతోంది. అర్హత: సంబంధిత సబ్జెక్టుతో పీజీ ఉత్తీర్ణత. దరఖాస్తులకు చివరి తేది: అక్టోబర్ 19. వెబ్సైట్: www.iiserkol.ac.in బిర్లా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్మెంట్లో పీజీడీఎం నోయిడాలోని బిర్లా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్మెంట్.. పీజీ డిప్లొమా ఇన్ మేనేజ్మెంట్ కోర్సులో ప్రవేశానికి దరఖాస్తులు కోరుతోంది. విభాగాలు: జనరల్, ఇంటర్నేషనల్ బిజినెస్, ఇన్సూరెన్స్ బిజినెస్ మేనేజ్మెంట్, రిటైల్ మేనేజ్మెంట్. అర్హతలు: ఏదైనా బ్యాచిలర్స్ డిగ్రీతోపాటు క్యాట్/ గ్జాట్/ మ్యాట్/ జీమ్యాట్/ సీమ్యాట్ స్కోరు ఉండాలి. దరఖాస్తులకు చివరి తేది: డిసెంబర్ 30 వెబ్సైట్: http://bimtech.ac.in -
ఉద్యోగాలు
కాటన్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా కాటన్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా కింద పేర్కొన్న ఉద్యోగాల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది. అసిస్టెంట్ మేనేజర్(మార్కెటింగ్) ఖాళీలు: 20 వయసు: 35 ఏళ్లు దాటకూడదు. అర్హతలు: ఎంబీఏ/పీజీడీబీఎం(మార్కెటింగ్/అగ్రికల్చర్) ఉత్తీర్ణత జూనియర్ కాటన్ పర్చేజర్ ఖాళీలు: 80 వయసు: 27 ఏళ్లు దాటకూడదు. అర్హతలు: బీఎస్సీ అగ్రికల్చర్ ఉత్తీర్ణత ఆన్లైన్ రిజిస్ట్రేషన్‌కు చివరి తేది: అక్టోబర్ 21 వెబ్సైట్: http://www.cotcorp.gov.in/ ఐబీపీఎస్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ బ్యాంకింగ్ పర్సనల్ సెలక్షన్.. కింద పేర్కొన్న ఉద్యోగాల నియామకానికి దరఖాస్తులు కోరుతోంది. రీసెర్చ్ అసోసియేట్ ఖాళీలు: 4 వయసు: 21 నుంచి 30 ఏళ్ల మధ్య ఉండాలి. అర్హతలు: హెచ్ఆర్తో పాటు సైకాలజీ/ఎడ్యుకేషన్ లేదా మేనేజ్మెంట్లో పీజీ ఉత్తీర్ణత హిందీ ట్రాన్స్‌లేటర్ ఖాళీలు: 2 వయసు: 21 నుంచి 30 ఏళ్ల మధ్య ఉండాలి. అర్హతలు: హిందీ / ఇంగ్లిష్ సబ్జెక్టులతో ఏదైనా పీజీ ఉత్తీర్ణత చివరి తేది: అక్టోబర్ 16 వెబ్సైట్: http://www.ibps.in/ స్పైసెస్ బోర్డ్ ఆఫ్ ఇండియా కోచిలోని స్పైసెస్ బోర్డ్ ఆఫ్ ఇండియా వివిధ ఉద్యోగాల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది. డిప్యూటీ డెరైక్టర్(అకౌంట్స్) డిప్యూటీ డెరైక్టర్ సైంటిస్ట్ బి సైంటిస్ట్ బి(కెమిస్ట్రీ) సైంటిస్ట్ అసిస్టెంట్ దరఖాస్తులు తదితర పూర్తి వివరాల కోసం వెబ్సైట్ చూడొచ్చు. చివరి తేది: అక్టోబర్ 10 వెబ్సైట్: www.indianspices.com -
పత్తి కొనుగోళ్లకు ఏర్పాట్లు చేయండి
ఆదిలాబాద్ అర్బన్ : ఖరీఫ్ సీజన్లో రైతులు పండించిన పత్తిని కొనుగోలు చేయడానికి జిల్లాలోని అన్నీ మార్కెట్ యార్డుల్లో ఏర్పాట్లు చేయాలని అటవీ, పర్యావరణశాఖ మంత్రి జోగు రామన్న ఆదేశించారు. ఆదివారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో పత్తి కొనుగోళ్లకు సంబంధించి వ్యవసాయ మార్కెటింగ్‌శాఖ ఆధ్వర్యంలో అఖిలపక్ష సమావేశం నిర్వహించారు. కలెక్టర్ ఎం.జగన్మోహన్ అధ్యక్షతన జరిగిన ఈ సమావేశానికి సబ్ కలెక్టర్ ప్రశాంత్ జీవన్ పాటిల్, అదనపు ఎస్పీ పనసారెడ్డి, ఎంపీ గోడం నగేశ్, నిర్మల్ ఎమ్మెల్యే అల్లోల ఇంద్రకరణ్‌రెడ్డి, బోథ్ ఎమ్మెల్యే రాథోడ్ బాపురావు, డీసీసీబీ చైర్మన్ దామోదర్‌రెడ్డి, మార్కెటింగ్ ఏడీ శ్రీనివాస్, ఆర్డీవోలు అరుణశ్రీ, సుధాకర్‌రెడ్డి, జేడీఏ రోజ్‌లీల, రైతు సంఘం నాయకులు గోవర్ధన్, ముడుపు ప్రభాకర్‌రెడ్డి, టీఆర్ఎస్ పశ్చిమ జిల్లా అధ్యక్షుడు లోక భూమారెడ్డి, కమీషన్ ఏజెంట్లు, జిన్నింగ్, ప్రెస్సింగ్ మిల్లుల యజమానులు, అఖిలపక్షం, రైతు సంఘం ప్రతినిధులు హాజరయ్యారు. మరో నెలరోజుల్లో పత్తి సీజన్ ప్రారంభం కానుండడంతో రైతులే నేరుగా మార్కెట్ యార్డుల్లో పత్తి విక్రయించేందుకు ప్రభుత్వం కల్పించాల్సిన ఏర్పాట్లు, మద్దతు ధర తదితర అంశాలపై చర్చించారు. సమావేశంలో మంత్రి రామన్న మాట్లాడుతూ పత్తికి మద్దతు ధరను ప్రభుత్వం రాష్ట్ర స్థాయిలో ప్రకటిస్తుందని పేర్కొన్నారు. రైతుల నుంచి పత్తిని కాటన్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (సీసీఐ) మద్దతు ధరతో కొనుగోలు చేస్తుందన్నారు. అన్ని మార్కె ట్ యార్డుల్లో తూనికల యంత్రాలు ఏర్పాటు చేయాలని ఆదేశించారు. 12 శాతం వరకు తేమ కలిగిన పత్తిని కొనాలని చెప్పారు. ప్రతీ రోజు పత్తి ధరల వివరాలను బోర్డులపై నమోదు చేయాలన్నారు. తేమశాతం, కొనుగోళ్ల తీరుపై రైతులకు అవగాహన కల్పించేందుకు గ్రామాల్లో ప్రచార కార్యక్రమాలు నిర్వహించాలని పేర్కొన్నారు. వ్యవసాయ, రెవెన్యూ, పోలీసు శాఖల ఆధ్వర్యంలో మానిటరింగ్ కమిటీలు ఏర్పాటు చేసి, పర్యవేక్షించాలని పేర్కొన్నారు. ప్రతీ మార్కెట్‌ను అధికారులు సందర్శించాలన్నారు. ఒక రోజు మంత్రి, మరో రోజు ఎంపీ, ఇంకో రోజు కలెక్టర్ ఇలా.. నిరంతరం మార్కెట్లను పర్యవేక్షించాలని ఆదేశించారు. పంట ఇంటికి చేరినప్పటి నుంచి పత్తి కొనుగోళ్లు ప్రారంభించాలన్నారు. సీసీఐ ద్వారా అధిక మొత్తంలో కొనుగోలు చేయాలని చెప్పారు. మద్దతు ధర కల్పించాలి.. : ఎమ్మెల్యే సమావేశంలో ఎమ్మెల్యే ఇంద్రకరణ్‌రెడ్డి మాట్లాడుతూ ఖరీఫ్‌లో పత్తి రైతులు రెండు సార్లు విత్తనాలు విత్తుకున్నారని, పత్తికి మద్దతు ధర కల్పిం చాల్సిందేనని అన్నారు. కలెక్టర్ ఎం.జగన్మోహన్ మాట్లాడుతూ రైతుల సమస్యలు, ఇతర వివరాలు తెలిపేందుకు కలెక్టరేట్లో కంట్రోల్ రూం ఏర్పాటు చేస్తామన్నారు. సిబ్బందిని అందుబాటులో ఉంచాలని మార్కెటింగ్‌శాఖ అధికారులను ఆదేశించారు. మార్కెటింగ్ ఏడీ శ్రీనివాస్ మాట్లాడుతూ అన్ని మార్కెట్లను కంప్యూటరైజ్డ్ చేశామన్నారు. మార్కెట్లలో అన్ని సౌకర్యాలు కల్పించామని తెలిపారు. సీసీఐ మేనేజర్ అర్జున్ ధవే మాట్లాడుతూ జిల్లాలో 20 కేంద్రాల ద్వారా పత్తి కొనుగోలు చేస్తామన్నారు. రైతులకు సంబంధించి బ్యాంకు ఖాతా నంబర్, పాసుపుస్తకం జిరాక్స్ కాపీలు అందించాలని, కొనుగోళ్లకు సంబంధించిన డబ్బులు రైతు ఖాతాలో జమ చేస్తామని చెప్పారు. రైతు సంఘం నాయకుడు గోవర్ధన్ మాట్లాడుతూ పత్తి రైతులకు బీమా సౌకర్యం కల్పించాలన్నారు. గ్రామాల్లో రోడ్లు సరిగా లేక రైతులు ఇబ్బంది పడుతున్నారని, రైల్వే క్రాసింగ్‌ల వద్ద బ్రిడ్జీలు నిర్మించాలని రైతు సంఘం నాయకులు కోరారు. -
మార్కెట్ మాయ!
చేవెళ్ల, న్యూస్‌లైన్: మద్దతు ధరను ప్రభుత్వం అరకొరగా పెంచుతుండటం, దీన్ని ఆసరా చేసుకున్న వ్యాపారులు మద్దతు ధర కంటే ఎక్కువ చెల్లిస్తూ ఆశ చూపుతుండటం.. వెరసి మార్కెట్ మాయాజాలంలో చిక్కి పత్తి రైతులు విలవిల్లాడుతున్నారు. సీసీఐ కేంద్రాల్లో ధర స్థిరంగా ఉంటుందన్న విషయం గ్రహించిన వ్యాపారులు రైతులు పంటను మార్కెట్‌కు తీసుకొచ్చే సమయంలో మద్దతు ధర కంటే ఓ వందో.. రెండు వందల రూపాయలో ధర పెంచి రైతులకు ఆశ చూపించి పత్తి ఎగరేసుకుపోయారు. సీసీఐ కొనుగోలు కేంద్రంలో మద్దతు ధరకు, అలాగే వ్యాపారులు స్వల్పంగా పెంచిన ధరకు జిల్లావాప్తంగా పలువురు రైతులు పత్తి పంట అమ్ముకున్నారు. ఈ ధరలకు పత్తి పంటను అమ్ముకున్న దాదాపు 70శాతం మంది రైతులు ప్రస్తుతం బహిరంగ మార్కెట్లో ధర పెరగడంతో గుండెలు బాదుకుంటున్నారు. ఆరుగాలం కష్టపడి పండించిన పత్తికి గిట్టుబాటు ధర రాక అల్లాడిన రైతన్నకు అంతా అయిపోయాక ధర పెరగడం మూలిగే నక్కపై తాటికాయ పడ్డ చందంగా మారింది. ఒక్కసారిగా క్వింటాలుకు సుమారు రూ.వెయ్యికి పైగా ధర పెరగడంతో ఇప్పటికే పత్తిని అమ్ముకున్న రైతు పరిస్థితి అగమ్యగోచరంగా తయారైంది. మరోవైపు సీసీఐ కొనుగోలు కేంద్రాలను మూసివేయడంతో పలు గ్రామాల్లో రైతుల ఇళ్లలో పత్తి ఇంకా నిల్వ ఉంది. ఈ పత్తిని మొత్తం కొనుగోలు చేసేందుకు రంగంలోకి దిగిన వ్యాపారులు ఏకంగా గ్రామాల్లోకే వెళ్తున్నారు. ప్రభుత్వ మద్దతు ధర కంటే సుమారు రూ.800ఎక్కువ చెల్లిస్తూ పత్తి కొనుగోలు చేసి జిన్నింగ్ మిల్లులకు తరలిస్తున్నారు. చేవెళ్ల వ్యవసాయ డివిజన్లో చేవెళ్ల, మొయినాబాద్, శంకర్పల్లి, షాబాద్ మండలాల్లో పత్తి పంట అధిక విస్తీర్ణంలో సాగు చేస్తారు. గత ఖరీఫ్ సీ జన్‌లో డివిజన్వ్యాప్తంగా 14,340 హెక్టార్లలో పత్తి పంట సాగయ్యింది. పంట కొనుగోలుకు చేవెళ్ల వ్యవసాయ మార్కెట్లో సీసీఐ కేంద్రాన్ని ప్రారంభించింది. ‘మద్దతు’ తక్కువ.. బహిరంగ మార్కెట్లో ధర ఎక్కువ ప్రభుత్వం పత్తిపంటకు నిర్ణయించిన మద్దతు ధర గతంతో పోలిస్తే ఏమాత్రం ఆశాజనకంగా లేకపోవడంతో పలువురు రైతులు సీసీఐకి పంట అమ్ముకోవడానికి ఉత్సాహం చూపలేదు. పత్తి పంటకు 2012 సంవత్సరంలో క్వింటాలుకు రూ.3900 ఉన్న మద్దతు ధరను ప్రభుత్వం 2013లో మరో వంద రూపాయలు పెంచి రూ.4వేలుగా ఖరారు చేసింది. జిల్లావ్యాప్తంగా ఏర్పాటు చేసిన సీసీఐ కొనుగోలు కేంద్రాల్లో ఈ ధరే చెల్లించారు. అయితే సీజన్ ప్రారంభంలోనే వ్యాపారులు పత్తిని క్వింటాలుకు రూ.4200-4300కి కొనుగోలు చేశారు. బహిరంగ మార్కెట్లో ధర ఎక్కువగా ఉండటంతో సీసీఐ కొనుగోలు కేంద్రాల్లో పంట అమ్ముకోవడానికి రైతులు ఆసక్తి చూపలేదు. 2012లో పత్తి కొనుగోలు కేంద్రాల వద్ద క్యూకట్టిన రైతులు ధర వ్యత్యాసంతో ఈసారి వాటివైపు కన్నెత్తి కూడా చూడలేదు. ఇదిలా ఉంటే నెల రోజుల క్రితం వ్యాపారులు పత్తి పంట క్వింటాలుకు రూ.5వేలు చెల్లించి కొనుగోలు చేసినా సీసీఐ మాత్రం రూ.4వేలకు ఒక్కపైసా పెంచలేదు. ప్రస్తుతం వ్యాపారులు పత్తి ధరను కొద్దిగా తగ్గించి క్వింటాలు రూ.4,800కి కొనుగోలు చేస్తున్నారు. -
నిన్న పత్తి.. నేడు కందులు..
ఆదిలాబాద్ అగ్రికల్చర్, న్యూస్‌లైన్ : ప్రభుత్వ రంగ సంస్థలు సీసీఐ, మార్క్‌ఫెడ్ అలసత్వం రైతులకు శాపంగా మారుతోంది. సకాలంలో కొనుగోళ్లు ప్రారంభించకపోవడంతో పత్తి, కందులకు ధర పలకడం లేదు. ప్రైవేటు వ్యాపారులు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తూ తక్కువ ధరకే పత్తి, కందులు కొనుగోలు చేస్తున్నారు. దీంతో రైతులు నష్టపోవాల్సి వస్తోంది. ఇప్పటికే 80 శాతం వరకు రైతులు పత్తి విక్రయించారు. కాటన్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా(సీసీఐ) తాపీగా గిట్టుబాటు ధర చెల్లిస్తామంటూ రంగంలోకి దిగింది. ధర పెరగడంతో బడా వ్యాపారులకే లాభం చేకూరింది. కందుల కొనుగోళ్లలోనూ మార్క్‌ఫెడ్‌దీ అదే తీరు కనిపిస్తోంది. జిల్లాలో ఆదిలాబాద్, నిర్మల్, ఉట్నూర్, ఆసిఫాబాద్, బెల్లంపల్లి, సిర్పూర్ డివిజన్లలో 90,238 ఎకరాల్లో కంది సాగైంది. ఎకరానికి నాలుగు క్వింటాళ్ల లెక్కన 3.60లక్షల క్వింటాళ్లు దిగుబడి వస్తుందని వ్యవసాయ శాఖ అధికారులు అంచనా వేశారు. వర్షాలు, పూత దశలో వాతావరణంలో మార్పు, తుపాన్, కాత దశలో ఎండు తెగులు కారణంగా దిగుబడి తగ్గింది. ఎకరానికి మూడు క్వింటాళ్ల వరకు వచ్చినట్లు తెలుస్తోంది. జిల్లాలోని 17మార్కెట్ యార్డుల్లో ఇప్పటికే కొనుగోళ్లు ప్రారంభించాల్సి ఉన్నా ఎక్కడా ప్రారంభం కాలేదు. దీంతో రైతులు గత్యంతరం లేక దళారులను ఆశ్రయించి మద్దతు ధర లభించక నష్టపోతున్నారు. ప్రభుత్వం ఇప్పటికే కనీస మద్దతు ధర క్వింటాల్‌కు రూ.4,300గా ప్రకటించింది. ప్రైవేటు వ్యాపారులు వారం రోజుల క్రితం ఆదిలాబాద్ వ్యవసాయ మార్కెట్లో క్వింటాల్‌కు రూ.4,150 చెల్లించి కొనుగోలు ప్రారంభించారు. శనివారం వరకు రూ.3,550 నుంచి రూ.3,850 వరకు ధర చెల్లించారు. మార్కెట్లో కందిపప్పు ప్రియం.. ప్రస్తుతం మార్కెట్లో కిలో కందిపప్పు ధర రూ.72 పలుకుతోంది. ఈ లెక్కన క్వింటాల్ కందులకు రూ.5వేల నుంచి రూ.5,500 ధర పలకాలి. కానీ రైతులు కందులు అమ్మబోతే అడవి.. కొనబోతే కొరివి అన్న చందంగా తయారైంది. రైతులు కంది సాగుకు ఎకరానికి రూ.10వేల నుంచి రూ.15వేల వరకు పెట్టుబడి పెట్టారు. పురుగు మందు, కూలీల ధరలు పెరిగిపోయాయి. ఇటు దిగుబడి రాక.. అటు మద్దతు ధర లేక రైతులు దిగులు చెందుతున్నారు. మార్కెట్లో మద్దతు ధర లభించేలా చూడాల్సిన అధికారులు చూసీచూడనట్లు వ్యవహరిస్తున్నారనే ఆరోపణలున్నాయి. పెట్టుబడే అధికం.. క్వింటాలు కందులు నూర్పిడి చేస్తే మిల్లు ఖర్చు లు పోనూ 74 కిలోల వరకు కంది పప్పు, 22 కిలోల వరకు దాణా వస్తుంది. మిల్లు ఖర్చులు తదితర వాటిని తీసివేసి.. మార్కెట్‌యార్డులో వ్యాపారులు చెల్లిస్తున్న ధర రూ.3,800తో పో ల్చితే కందిపప్పు ధర కిలోకు రూ.60 దాట వద్దు. ప్రస్తుతం కొనుగోలు చేస్తున్న కిరాణ దు కాణ పప్పు ధరతో పోలిస్తే రైతుకు రావాల్సిన మద్దతు ధర రూ.5వేల నుంచి రూ.5,500వరకు వ్యాపారులు చెల్లించాలి. దిగుబడిపై రాబడి తగ్గగా.. పెట్టుబడి పెరిగింది. పత్తిలో నష్టాలు చవిచూసిన రైతులు.. కందులు ఆదుకుంటాయని ఆశించగా నిరాశే ఎదురవుతోంది. -
జాడలేని సీసీఐ
ఆదిలాబాద్ అగ్రికల్చర్, న్యూస్‌లైన్ : రెండు నెలల క్రితం పత్తి కొనుగోళ్లు అట్టహాసంగా ఆరంభించిన సీసీఐ వెయ్యి క్వింటాళ్లు మాత్రమే కొనుగోలు చేసింది. దీంతో జిల్లాలో ప్రైవేటు వ్యాపారులు చెప్పిన ధరకే రైతులు విక్రయిస్తున్నారు. సీసీఐ అధిక ధర చెల్లిస్తామంటున్నా రైతులు కన్నెత్తి చూడటం లేదు. ప్రధాన కారణం ప్రభుత్వం నిబంధనలు విధించడంతో ప్రైవేట్‌కే విక్రయిస్తున్నారు. ఆదిలాబాద్ మార్కెట్ యార్డులో అక్టోబర్ 30న కొనుగోళ్లు ప్రారంభించారు. రైతులు పట్టాపాసు పుస్తకం, బ్యాంక్ ఖాతా నంబర్‌తోపాటు వీఆర్వో ధ్రువీకరణపత్రం తీసుకురావాలని, 8 శాతం తేమ నిబంధన కారణంగా రైతులు వెనుకంజ వేస్తున్నారు. తీసుకొచ్చిన పత్తిలో నాణ్యత పేరిట కొర్రీలు పెడుతుండటంతో రైతులు ప్రైవేట్ వ్యాపారులను ఆశ్రయించి నష్టాలు చవిచూస్తున్నారు. రైతులను ఆదుకుంటామని, గిట్టుబాటు ధర కల్పిస్తామని అధికారులు పేర్కొన్నా లాభం లేదు. 17 కేంద్రాల్లో కొనుగోళ్లు నిల్ జిల్లా వ్యాప్తంగా 17 మార్కెట్ యార్డులు ఉన్నాయి. వీటిలో సీసీఐ కాంటాలు తెరిచినా పత్తి విక్రయించడానికి రైతులు ముందుకు రావడం లేదు. కాగా, భైంసా మార్కెట్ యార్డులో 473 క్వింటాళ్లు, లక్సెట్టిపేటలో 532 క్వింటాళ్ల పత్తి కొనుగోళ్లు జరి పారు. 1,005 క్వింటాళ్ల పత్తిని మాత్రమే కొనుగోలు చేసినట్లు అధికారుల లెక్కలు చెబుతున్నాయి. గతేడాది 12 మార్కెట్ యార్డుల ద్వారా డిసెంబర్ నెల చివరి వరకు 12.13 లక్షల క్వింటాళ్ల పత్తిని కొనుగోలు చేసింది. ఈ ఏడాది వెయ్యి క్వింటాళ్లు కూడా కొనుగోలు చేయలేదు. సవాలక్ష నిబంధనలు సీసీఐ అధికారులు నిబంధన పేరిట ఇబ్బందులకు గురిచేస్తున్నారని రైతులు వాపోతున్నారు. నిబంధనలు లేకుండా గతేడాది కొనుగోలు చేసిన విధంగా ఈసారి కూడా కొనుగోలు చేపట్టాలని రైతులు కోరుతున్నారు. సీసీఐ ద్వారా కొనుగోలు చేస్తే రైతులకు మేలు జరగడంతోపాటు ప్రభుత్వానికి ఆదాయం పెరిగే అవకాశం ఉంది. సీసీఐ అధికారులు అలాంటి దిశగా చర్యలు చేపట్టకపోవడంతో కొనుగోళ్లు జరగక పోవడానికి కారణమని తెలుస్తోంది. మార్కెట్ యార్డులో ప్రైవేట్ వ్యాపారుల కంటే ప్రతీరోజు పత్తి వేలంలో పది.. ఇరవై రూపాయలు పెంచుతున్నప్పటికీ రైతులు ఆసక్తి చూపడం లేదు. ప్రైవేట్ వ్యాపారులు 12 శాతం తేమ వరకు ఎలాంటి కోత విధించకుండా కొనుగోలు చేస్తుండగా సీసీఐ మాత్రం 8 శాతం వరకే ప్రకటించిన ధరను చెల్లిస్తున్నారు. జిల్లా వ్యాప్తంగా.. జిల్లా వ్యాప్తంగా ఇప్పటివరకు 13.17 లక్షల క్వింటాళ్ల పత్తిని ప్రైవేట్ వ్యాపారులు కొనుగోలు చేశారు. గతేడాది డిసెంబర్ చివరి వరకు 12,82 లక్షల క్వింటాళ్ల పత్తి మార్కెట్ యార్డుల్లో కొనుగోళ్లు జరిగింది. గతేడాది మొత్తం 17 మార్కెట్ యార్డుల్లో 27.36 లక్షల క్వింటాళ్ల పత్తి కొనుగోళ్లు జరిగింది. ఈయేడాది ఇప్పటివరకు 17.99 లక్షల క్వింటాళ్ల పత్తి కొనుగోళ్లు జరిగింది. అధిక వర్షాల కారణంగా ఈ ఏడాది పత్తి పంట దిగుబడి తగ్గింది. గతేడాది ఎకరానికి 15 నుంచి 20 క్వింటాళ్ల వరకు దిగుబడి రాగా, ఈ ఏడాది 6 నుంచి 10 వరకు కూడా దిగుబడి రావడం లేదని రైతులు పేర్కొంటున్నారు. ఈసారి పెట్టుబడి కూడా వచ్చే పరిస్థితి కనిపించడం లేదని వాపోతున్నారు. క్వింటాలుకు కనీసం రూ.6వేలు మద్దతు ధర చెల్లిస్తే కొంతమేరకు నష్టం పూడ్చుకునే వీలుంటుందని పేర్కొంటున్నారు. -
బేరాల్లేని సీసీఐ
సత్తెనపల్లిరూరల్,న్యూస్‌లైన్: అట్టహాసంగా భారత పత్తి సంస్థ (సీసీఐ) ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రం పత్తి లేక వెలవెల బోతోంది. పత్తి రైతును ఆదుకుంటామని , గిట్టుబాటు ధర కల్పిస్తామని చెబుతూ సత్తెనపల్లి వ్యవసాయ మార్కెట్ యార్డు ఆవరణలో ఈ నెల 16న పత్తి కొనుగోలు కేంద్రాన్ని ఏర్పాటు చేశారు. మద్దతు ధరగా క్వింటాకు రూ. 4 వేలు ప్రకటించారు. సవాలక్ష నిబంధనల పేరిట కనీస ధరగా రూ. 3200 నుంచి ఆరంభించారు. సత్తెనపల్లి డివిజన్ పరిధిలో సత్తెనపల్లి, ముప్పాళ్ల, పెదకూరపాడు, మేడికొండూరు, ఫిరంగిపురం మండలాల్లో సుమారు 25 వేల హెక్టార్లలో పత్తి పంట సాగు చేశారు. సత్తెనపల్లి సీసీఐ కేంద్రంలో ముప్పాళ్ల, సత్తెనపల్లి, పెదకూరపాడు మండలాల్లోని కొన్ని గ్రామాలకు చెందిన రైతులు పత్తిని అమ్ముకొనే అవకాశం ఉంది. నష్టమే అధికం.... ఆయా గ్రామాల్లోని రైతులు సీసీఐ కేంద్రం వల్ల లాభం కంటే నష్టమే అధికంగా ఉందని వాపోతున్నారు. పత్తిని బోరాలకు తొక్కి లారీకి ఎత్తటానికి క్వింటాకు రూ. 40 లు, వాటిని సీసీఐ కేంద్రానికి తరలించటానికి కనీసం రూ.1000 లు బాడిగ లేనిది ఏ వాహనం రాదు. తర్వాత వాహనంలోంచి దించటానికి సీసీఐ కేంద్రంలోని కూలీలు బోరానికి రూ.30 తీసుకుంటారు. ఈ ఖర్చులన్నీ పోను క్వింటాకు రైతుకు గాను రూ. 3200 నుంచిరూ. 3600 మాత్రమే లభిస్తున్నాయి. పైగా అమ్మిన పత్తికి బిల్లులు కూడా దాదాపు 15 రోజులు వరకు రావడంలేదు. ఇన్ని వ్యయప్రయాసలకోర్చి తీసుకువస్తే సీసీఐ కేంద్రంలో నాణ్యత, తేమ పేరుతో క్వింటాకు ఎంత తగ్గిస్తారో తెలియని అయోమయ పరిస్థితి. తేమ శాతం 11 ఉంద ని , కొనలేమని బయ్యర్ చెబితే దానిని తిరిగి ఇంటికి తీసుకెళ్లటం అదనపు భారం. ఇన్ని ఖర్చులు భరించేందుకు సిద్ధంగా లేమని రైతులు గట్టిగా చెబుతున్నారు. దానిక ంటే బహిరంగ మార్కెట్లోనే గిట్టుబాటు ధర లబిస్తుందని చెబుతున్నారు. వ్యాపారులు ఇంటి వద్దకే వచ్చి క్వింటాకు రూ. 3800 నుంచి రూ. 4000 వరకు చెల్లించి తీసుకువెళుతున్నారని చెబుతున్నారు.సీసీఐతో పోల్చుకుంటే ఇదే లాభసాటిగా ఉందంటున్నారు. కొనుగోళ్లు ఒకరోజుతోనే సరి... సీసీఐ కేంద్రం ప్రారంభించి నేటికి 15 రోజులు కావస్తున్నా కొనుగోలు చేసింది కేవలం 1133 క్వింటాళ్లు మాత్రమే. ఇవి కూడా ప్రారంభించిన రోజు కొనుగోళ్లు. అప్పటి నుంచి క్వింటా కూడా కొనుగోలు చేయలేదు. గత వారంలో విజిలెన్స్ అధికారులు సీసీఐ కేంద్రాన్ని సందర్శించి ఇక్కడి లోపాలను గుర్తించి రైతుల నుంచి వివరాలు నమోదు చేసుకున్నారు. భద్రతా చర్యలు, గిట్టుబాటు ధరపై న విచారణ జరిపారు. గిట్టుబాటు ధర సరిపోదని, తేమ శాతం పేరుతో తిరస్కరించటం సరికాదని కొంతమంది రైతులు అధికారుల దృష్టికి తెచ్చారు. వర్షాలకు తడిసిన పత్తిని ప్రభుత్వమే కొనకుంటే ఎవరు కొంటారని రైతులు ప్రశ్నిస్తున్నారు. ఏదిఏమైనా సీసీఐ కేంద్రాల పనితీరు మూణ్ణాళ్ల ముచ్చటగానే మిగిలిపోయింది. -
పత్తి రైతు దగా
ఖమ్మం గాంధీచౌక్, న్యూస్‌లైన్: ప్రభుత్వం జిల్లాలో సీసీఐ(కాటన్ కార్పోరేషన్ ఆఫ్ ఇండియా)కొనుగోలు కేంద్రాలను పూర్తి స్థాయిలో ఏర్పాటు చేయకపోవటం వ్యాపారులకు, దళారులకు వరంగా మారింది. పత్తి ధర క్వింటాల్‌కు రూ.4000 నుంచి రూ.4400ల వరకు ఉన్నా వ్యాపారులు ఆ ధర పెట్టకుండా రైతులను దోచుకుంటున్నారు. తుపానులు, అధిక వర్షాల కారణంగా ఈ ఏడాది పత్తి పంట దిగుబడి తగ్గింది. దీంతో ఆ పంట ఉత్పత్తికి డిమాండ్ ఉన్నా వ్యాపారులు కుంటి సాకులు చెబుతూ నాణ్యత ఉన్న సరుకుకు కూడా తక్కువ ధర పెడుతున్నారు. ఈ ఏడాది కేంద్ర ప్రభుత్వం పత్తి మద్దతు ధర క్వింటాల్‌కు రూ.4000గా నిర్ణయించింది. ప్రభుత్వం సీసీఐ కేంద్రాలను ఏర్పాటు చేసి తేమశాతం ఆధారంగా మద్దతు ధరతో రైతు సరుకును కొనుగోలు చేయాల్సి ఉంటుంది. అయితే ఈ ఏడాది వర్షాలు, నాణ్యత లేమి వంటి సాకులతో సీసీఐ సరుకు కొనుగోలుకు ముందుకు రాలేదు. జిల్లాలో 12 సీసీఐ కేంద్రాలను ఏర్పాటు చేసి రైతుల సరుకును కొనుగోలు చేయించాలని జిల్లా అధికార యంత్రాగం ప్రణాళిక రూపొందించింది. అయితే ఆచరణలో విఫలమైంది. కేవలం 5 కేంద్రాలను మాత్రమే ప్రారంభించి కొనసాగిస్తోంది. పత్తి కొనుగోళ్లలో సీసీఐ వెనుకంజ వేయటాన్ని వ్యాపారులు ఆసరాగా చేసుకున్నారు. మార్కెట్లలో సీసీఐ కేంద్రాల ఏర్పాటు చేయకపోవటంతో గ్రామాల్లోనే పంట ఉత్పత్తిని అమ్ముకుంటున్నారు. వర్షాల కారణంగా పంట నాణ్యత కోల్పోయిందని, తేమశాతం అధికంగా ఉందని, పంట రంగు మారిందని రకరకాలుగా సాకులు చెబుతూ క్వింటాల్ పత్తిని గ్రామాల్లో రూ.3000 నుంచి రూ.3400 వరకే కొనుగోలు చేస్తున్నారు. వ్యవసాయ మార్కెట్లలో రూ.3000 నుంచి రూ.3600 వరకు పెడుతున్నారు. ధరలో దగా చేయటంతో పాటు, కాంటాలలోనూ దోపిడీ చేస్తున్నారు. మాన్యువల్ కాంటాలను వినియోగిస్తూ తక్కువ తూకం చూపిస్తూ రైతులను మోసం చేస్తున్నారు. కాంటాలలో ఒక్కో క్వింటాల్ 5 నుంచి 10కిలోల మోసం జరుగుతోందని రైతులు ఆరోపిస్తున్నారు. వ్యవసాయ మార్కెట్లలో కూడా తూకాల్లో మోసం జరుగుతోంది. ఎలక్ట్రానిక్ కాంటాల విధానం అమలు జరుగుతున్నా, ఎలక్ట్రానిక్ రీడింగ్ రైతులకు అర్థంగాక పోవటం, గ్రాములను లెక్కలోకి తీసుకోక పోవంటతో ఇక్కడ కూడా మోసం జరుగుతుంది. ఒక వైపు సీసీఐ కేంద్రాలు ఏర్పాటు చేయకపోగా, మరో వైపు అక్రమ వ్యాపారాలు చేసే వారిని నిరోధించడంలో కూడా అధికారులు విఫలమయ్యారు. వ్యాపారుల, దళారుల అక్రమాలు అధికారుల అండదండలతోనే జరుగుతున్నాయని రైతులు ఆరోపిస్తున్నారు. వర్షాలు, తుపానుల కారణంగా దిగుబడులు తగ్గి నష్టాల ఊబిలో ఉన్న రైతులను వ్యాపారుల దగా కన్నీరే మిగిల్చుతోంది. అధికారులు స్పందించి కాంటాలలో జరుగుతున్న మోసాలను అరికట్టాలని, గిట్టుబాటు ధర అందేవిధంగా చర్య తీసుకోవాలని రైతులు డిమాండ్ చేస్తున్నారు. -
పత్తిరైతు విలవిల
ఒంగోలు టౌన్, న్యూస్‌లైన్: పత్తిరైతుల దీనస్థితిని పట్టించుకునే నాథుడే కరువయ్యాడు. పండిన పంటకు గిట్టుబాటు ధర రాక విలవిల్లాడుతున్నాడు. జిల్లాలో 1.60 లక్షల ఎకరాల్లో ఈఏడాది పత్తి సాగు చేశారు. పర్చూరు, ఇంకొల్లు, అద్దంకి, గిద్దలూరు, యర్రగొండపాలెం, మార్కాపురం, దర్శి ప్రాంతంలో పత్తిని అధికంగా సాగు చేస్తున్నారు. ఆగస్టు ఆఖరు నుంచి సాగు మొదలుపెట్టిన పత్తిరైతు అననుకూల వాతావరణ పరిస్థితులు తట్టుకుని సాగుచేసినా వచ్చిన దిగుబడిని అమ్ముకునేందుకు మార్కెట్ సౌకర్యం లేక తీవ్రంగా నష్టపోతున్నాడు. అందిన కాడికి అమ్ముకుంటున్నారు:పత్తి పంట వేసి మూడు నెలలు కావస్తుండడంతో విలవిల ఇప్పటికే పత్తి తీతలు మొదలయ్యాయి. రెండు తీతలు పూర్తైమూడో తీతలోకి వచ్చారు. అయితే పండించిన పత్తికి సక్రమమైన మార్కెట్ సౌకర్యం లేకపోవడంతో నిల్వ చేసుకునే వీలులేక రైతులు వచ్చిన కాడికి తెగనమ్ముకుంటున్నారు. ఇదే అదనుగా చేసుకుని వ్యాపారులు ఇష్టానుసారంగా కొనుగోలు చేస్తున్నారు. కొద్దిగా రంగు మారినా, తడిసినా అసలు కొనుగోలు చేయడంలేదు. ప్రభుత్వం క్వింటా పత్తికి * 4 వేలు మద్దతు ధర ప్రకటించినా రైతుకు ఆ ధర దక్కడం లేదు. వ్యాపారులు నాణ్యమైన పత్తికి క్వింటా * 3,200 చెల్లిస్తుండగా..నాణ్యతలేని పత్తిని అసలు కొనుగోలు చేయడం లేదు. సీసీఐ కేంద్రాలు అడిగింది ఏడు చోట్ల..తెరిచింది ఒక్కచోటే: కాటన్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (సీసీఐ) ఉన్నా పత్తి రైతుకు ఒరిగిందేమీ లేదు. జిల్లాలో ఏడుచోట్ల సీసీఐ కేంద్రాలు ఏర్పాటు చేయాలని రైతులు అధికారులను కోరారు. ఈ ఏడాది అక్టోబర్ 29న, డిసెంబర్ 3న రెండు దఫాలుగా జాయింట్ కలెక్టర్ యాకూబ్‌నాయక్ రైతు సంఘాల నేతలు, మార్కెటింగ్ శాఖ అధికారులు, సీసీఐ ప్రతినిధులతో చర్చలు జరిపారు. ఈనెల 3న జరిగిన సమీక్షలో రెండు మూడు రోజుల్లో సీసీఐ కేంద్రాలు మార్కాపురం ప్రాంతంలో ఒకటి, పర్చూరు ప్రాంతంలో మరొకటి ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చినా మార్కాపురంలో మాత్రమే గురువారం ఏర్పాటు చేశారు. పర్చూరులో ఇంకా తెరవలేదు. నేరుగా వ్యవసాయ మార్కెటింగ్ శాఖ కార్యాలయాల్లో కొనుగోలు కేంద్రాలు ఏర్పాటుచేసి రైతులు పండించిన పత్తిని కొనుగోలు చేయించాల్సిన మార్కెటింగ్ శాఖ అధికారులు నిద్రావస్థలో ఉన్నారు. -
ఇలా అయితే ఎలా?
పత్తి కొనుగోలు కేంద్రాల ఏర్పాటు విషయంలో కేంద్ర సర్కారు జిల్లా రైతులకు మొండి చేయి చూపింది. రాష్ట్రవ్యాప్తంగా 91 సీసీఐ (కాటన్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా) కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేయాలని నిర్ణయించిన ప్రభుత్వం, జిల్లాకు మాత్రం ఒక్కటి కూడా మంజూరు చేయలేదు. దీంతో సుమారు 50 వేల ఎకరాలలో పత్తిని సాగు చేస్తున్న జిల్లా రైతాంగం ప్రయోజనాలను గాలికొదిలేసినట్లయిందనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి. సాక్షి, నిజామాబాద్: జిల్లాలో మద్నూర్, జుక్కల్, బిచ్కుంద, పిట్లం తదితర మండలాలలో రైతులు ఎక్కువగా పత్తి పంటను సాగు చేస్తుంటారు. ఇక్కడి రైతులకు ఖరీఫ్‌లో పత్తి ప్రధాన పంట. తీవ్ర ప్రతికూల పరిస్థితులను ఎదుర్కొంటూ ఆరుగాలం శ్రమించి పండించిన ఈ పంటకు గిట్టుబాటు ధర అందక రైతులు ఏటా తీవ్రంగా నష్టపోతున్నారు. చేతి కందిన పంటను విక్రయించడానికి అనేక ఇబ్బందులు పడాల్సివస్తోంది. సీసీఐ కొనుగోలు కేంద్రం అందుబాటులో లేకపోవడంతో వారు ప్రైవే టు వ్యాపారులను ఆశ్రయి ంచక తప్పడం లేదు. దీన్ని ఆసరగా చేసుకుని వ్యాపారులు ధరలో కోత పెడుతున్నారు. తేమ శాతం అధికంగా ఉందని, స్టేఫుల్లెంత్ (నాణ్యత) తక్కువగా ఉం దంటూ ధర తగ్గించడంతో రైతులు తీవ్రంగా నష్టపోతున్నారు. పెట్టిన పెట్టుబడులు కూడా చేతికందక నష్టాల ఊబిలో కూరుకుపోతున్నారు. ఎందుకు ఇలా ప్రభుత్వ కొనుగోలు కేంద్రం అందుబాటులో ఉంటే వ్యాపారుల దోపిడీకి చెక్ పడే అవకాశాలుంటాయి. పక్కనే ఉన్న ఆదిలాబాద్ జిల్లాకు 18, కరీంనగర్, నల్గొండకు 12 చొప్పున, మెదక్‌లో ఐదు, వరంగల్‌లో 11 పత్తి కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఎందుకోగానీ నిజామాబాద్ జిల్లాను మాత్రం విస్మరించింది. ఒక్క కేంద్రాన్ని కూడా మంజూరు చేయలేదు. ప్రస్తుతం మద్నూర్ మార్కెట్ యార్డులో పత్తి క్రయ విక్రయాలు జరుగుతున్నాయి. గురువారం ఈ మార్కెట్‌కు 875 క్వింటాళ్ల పత్తి అమ్మకానికి రాగా, క్వింటాళుకు రూ. 4365 నుంచి రూ.4430 వరకు ధర పలికింది. ప్రభుత్వం పత్తికి కనీస మద్దతు ధర క్వింటాళుకు రూ. 4,000గా ప్రకటించింది. ప్రస్తుతానికి ధర నిలకడగా ఉన్నప్పటికీ, కొనుగోలు కేంద్రం మంజూరు కాకపోవడంతో వ్యాపారులు రానున్న రోజుల్లో ధర తగ్గించే అవకాశాలున్నాయని రైతులు ఆందోళన చెందుతున్నారు. కొనుగోలు కేంద్రం రైతులకు అందుబాటులో ఉంటే స్థానిక వ్యాపారులు జిమ్మిక్కులకు పాల్పడే అవకాశాలు తక్కువగా ఉంటాయనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. ధర తగ్గితే రైతులు పత్తిని పక్క జిల్లాలకు తీసుకెళ్లి విక్రయించాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. నాఫెడ్ కొనుగోళ్లు నామమాత్రమే గత ఏడాది సీజనులో కూడా ప్రభుత్వం జిల్లాలో కొనుగోలు కేంద్రాన్ని ఏర్పాటు చేయలేదు. నాఫెడ్ ద్వారా పత్తిని కొనుగోళ్లు చేస్తామని ప్రకటించింది. కేవలం వారం పది రోజులలోనే ఈ కేంద్రాలు మూతపడ్డాయి. దీంతో రైతులు చేసేదేమీ లేక వ్యాపారులకే పత్తిని విక్రయించాల్సి వచ్చింది. ఈసారి కూడా కొనుగోలు కేంద్రం మంజూరు కాకపోవడంతో రైతులకు ఇబ్బందులు తప్పేలా లేవు. ప్రస్తుతానికి కనీస మద్దతు ధర అందుతోందని, అలా అందని పక్షంలో నాఫెడ్ ద్వారా కొనుగోలు కేంద్రాన్ని ప్రభుత్వం ఏర్పాటు చేస్తోందని మార్కెటింగ్‌శాఖ ఉన్నతాధికారులు పేర్కొంటున్నారు. -
ధర లేదు.. సీసీఐ రాదు
సాక్షి, గుంటూరు: జిల్లా అంతటా మార్కెట్ యార్డుల్లో పత్తి కొనుగోలు కేంద్రాలు ప్రారంభించే విషయంలో సీసీఐ (భారత పత్తి సంస్థ) అలసత్వాన్ని కనబరుస్తోంది. అదిగో ఇదిగో అంటూ కాలయాపన చేస్తోంది. దీంతో చేతికందిన పత్తిని రైతులు తప్పనిసరి పరిస్థితుల్లో దళారులు, వ్యాపారులకు అమ్ముకుంటున్నారు. తడిసిన పత్తి, గుడ్డికాయ పేరుతో దళారులు సరైన ధర నిర్ణయించడం లేదు. దీంతో క్వింటాకు రూ.500 నుంచి రూ.600 వరకు రైతులు నష్టపోతున్నారు. ఈ ఏడాది జిల్లాలోని పల్నాడు ప్రాంతంలో రైతులు 1.44 లక్షల ఎకరాల్లో పత్తి సాగు చేశారు. నవంబరు రెండో వారం నుంచే దిగు బడి మొదలైంది. ఇప్పటికే రైతులు ఎకరాకు 10 క్వింటాళ్ల చొప్పున ఇళ్లకు చేర్చారు. దీన్ని గుర్తించిన కాటన్ జిన్నింగ్ మిల్లులు, వ్యాపారులు పత్తి కొనుగోలుకు దళారులను రంగంలోకి దించారు. క్వింటా పత్తిని రూ.3600 నుంచి రూ.4000 వరకు కొంటున్నారు. గురజాల, దాచేపల్లి, పిడుగురాళ్ల, రాజుపాలెం, సత్తెనపల్లి, నర్సరావుపేట, వినుకొండ, నకరికల్లు ప్రాంతాల్లోని పత్తి అక్టోబరులో కురిసిన భారీ వర్షాలకు పాడవటంతో దళారులు, వ్యాపారులు తక్కువ ధరకు కొనేందుకు బేరమాడుతున్నారు. గుడ్డికాయ, తడిసిన పత్తంటూ రేటు కోసేస్తున్నారు. సీసీఐ కొనుగోలు కేం ద్రాలు లేనందున గత్యంతరం లేక రైతులు వీరికే పత్తిని విక్రయిస్తున్నారు. ఇదే అదనుగా వ్యాపారులు తక్కువలో తక్కువగా క్వింటాలుకు రూ.3500 మాత్రమే చెల్లిస్తున్నారు. దీంతో రైతుల పరిస్థితి దయనీయంగా మారింది. ఏటా డిసెంబరు మొదటి వారంలో పత్తి కొనుగోలు కేంద్రాలు ప్రారంభించే సీసీఐ అధికారులు ఈ ఏడాది ఎందుచేతనో మీనమేషాలు లెక్కిస్తున్నారు. కిందటేడాది డిసెంబరు మొదటి వారంలోనే జిల్లా అంతటా ఉన్న 10 మార్కెట్ యార్డుల్లో కొనుగోలు కేంద్రాలను తెరిచి ఏడాది మొత్తం మీద 7.38 లక్షల క్వింటాళ్ల పత్తిని కొనుగోలు చేసిన సీసీఐ ఈ ఏడాది ఇంకా ముందుకు రాకపోవడం ఇబ్బందికరంగా మారిందని రైతులు గగ్గోలు పెడుతున్నారు. సీసీఐ డీజీఎంను కలిసిన ఆర్జేడీ.. కాగా గురువారం మధ్యాహ్నం గుంటూరు వచ్చిన సీసీఐ డిప్యూటీ జనరల్ మేనేజర్ చతుర్వేదిని మార్కెటింగ్ శాఖ రీజినల్ జాయింట్ డెరైక్టర్ కాకుమాను శ్రీనివాసరావు కలిశారు. జిల్లాలో సీసీఐ కొనుగోలు కేంద్రాల ఏర్పాటుపై మాట్లాడారు. నర్సరావుే ప టలో ఇప్పటికే ఒక కొనుగోలు కేంద్రం న డుస్తోందనీ, ఈ నెల 16న రెండో కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించేందుకు ఏర్పాట్లు చేశామని చతుర్వేది వివరించారు. నెలాఖరులోగా పిడుగురాళ్ల, సత్తెనపల్లి, మాచర్ల, వినుకొండ యార్డుల్లోనూ ప్రారంభిస్తామని పేర్కొన్నారు. ఇప్పటికే పత్తి కొనుగోలు చేసే సీసీఐ బయ్యర్లతో మాట్లాడామనీ, సీసీఐ నిర్ణయించిన కనీస మద్దతు ధర కంటే బహిరంగ మార్కెట్లో రైతులకు మంచి ధర లభిస్తున్న నేపథ్యంలో పత్తి రైతులకు పెద్దగా ఇబ్బందులేమీ లేవని సీసీఐ వర్గాలు పేర్కొన్నాయి. ఏదిఏమైనా వారంలోగా అన్ని యార్డుల్లో సీసీఐ కేంద్రాలు తెరిచి సరైన ధరకు పత్తి కొనుగోలు చేయాలని రైతులు కోరుతున్నారు. -
అదో దళారీ సంస్థ
గజ్వేల్, న్యూస్‌లైన్: సీసీఐ (కాటన్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా) తీరుపై సీపీఐ రాష్ట్ర కార్యదర్శి నారాయణ మండిపడ్డారు. దళారిపాత్ర పోషిస్తున్న సంస్థగా సీసీఐని ఆయన పేర్కొన్నారు. రైతులు నానా ఇబ్బందులు పడి తమ పంటలను విక్రయించుకున్నాక సీసీఐ కొనుగోలు కేంద్రం ఏర్పాటు చేస్తే లాభమేమిటని ప్రశ్నించారు. బుధవారం గజ్వేల్‌లోని మార్కెట్ యార్డును సందర్శించిన నారాయణ, పత్తి కొనుగోళ్లను పరిశీలించారు. అక్కడే ఉన్న పలువురు పత్తిరైతులతో మాట్లాడి వారి సమస్యలను తెలుసుకున్నారు. అనంతరం విలేకరులతో మాట్లాడుతూ సీసీఐ తీరుపై ధ్వజమెత్తారు. రైతుకు అండగా నిలవాల్సిన ఈ సంస్థ రైతులకు, వ్యాపారులకు మధ్య దళారీగా మారిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. రైతులు పూర్తిగా తమ ఉత్పత్తులను తెగనమ్ముకున్నాక.... ఆలస్యంగా రంగం ప్రవేశం చేయడం ఆ సంస్థకు పరిపాటిగా మారిందన్నారు. ఈ పరిణామం వ్యాపారులకు కలిసివ స్తోందన్నారు. ఈపాటికి సీసీఐ కొనుగోలు కేంద్రాలను ప్రారంభించి ఉంటే రైతుకు లాభం జరగడమే కాకుండా వ్యాపారులకు భయం ఉండేదన్నారు. గజ్వేల్ మార్కెట్ యార్డులో రైతులు తీసుకువచ్చిన ఉత్పత్తులను నిల్వ చేసుకునే అవకాశం లేకపోవడంతో, వారంతా తమ పత్తిని వెంటనే వ్యాపారులకు అమ్ముకుని వెళ్తున్నారన్నారు. ఈ దుస్థితిని మార్చడానికి ప్రభుత్వం చర్యలు చేపట్టాలని డిమాండ్ చేశారు. మరోపక్క రైతులు అమ్ముకునే ఉత్పత్తుల్లో నుంచి రెండుశాతం కోత పెడుతూ డబ్బులు చెల్లిస్తున్నారని, ఆ రెండుశాతం కోత ఎందుకని ప్రశ్నించారు. రైతులను దోచుకునే విధంగా వ్యవహరిస్తే సహించేదిలేదని హెచ్చరించారు. సీసీఐ ఇప్పటికైనా నిబంధనలు సడలించుకుని ప్రైవేట్ వ్యాపారులతో పోటీగా కొనుగోళ్లు చేపట్టి రైతులను ఆదుకోవాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో సీపీఐ రాష్ట్ర నాయకురాలు పశ్య పద్మ, ప్రకాశ్, జిల్లా నాయకులు మంద పవన్, రహ్మాన్, కోట కిశోర్, క్రిష్ణమూర్తి తదితరులు పాల్గొన్నారు. కస్తుర్భా పాఠశాల సందర్శన గజ్వేల్‌లోని కస్తుర్భాగాంధీ విద్యాలయను సీపీఐ రాష్ట్ర నారాయణ సందర్శించారు. ఈ సందర్భంగా పాఠశాలలోని పరిసరాలు, భోజనం తదితర అంశాలను పరిశీలించారు. విద్యార్థినులతో మాట్లాడి వారి సమస్యలను తెలుసుకున్నారు. వసతిగృహాల్లో ఉంటున్న విద్యార్థులు ఎదుర్కొంటున్న సమస్యలను ప్రభుత్వం వెంటనే పరిష్కరించాలని డిమాండ్ చేశారు. ఇందులో ఏ మాత్రం నిర్లక్ష్యంగా వ్యవహరించినా సహించేది లేదన్నారు. -
పత్తి కష్టాలు పుట్టెడు
గజ్వేల్, న్యూస్‌లైన్: పుట్టెడు కష్టాలతో పత్తి రైతులు అల్లాడుతున్నారు. ఇంకా సీసీఐ (కాటన్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా) కొనుగో ళ్లు ప్రారంభించకపోవడం.. దళారులు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తుండటంతో మద్దతు ధర కరువైంది. సీసీఐ తీరుపై రైతుల నుంచి తీవ్ర నిరసన వ్యక్తమవుతున్నది. ప్రతి ఏటా నవంబర్ మొదటి వారంలో కొనుగోలు కేంద్రాలను ప్రారంభించే ఈ సంస్థ ఈసారి ఇంకా చడీచప్పుడు లేకుండా ఉండటంపై రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ‘మద్దతు ధర’తో ప్రమేయం లేకుండా ప్రైవేట్ వ్యాపారులతో పోటీ పడుతూ ‘కమర్షియల్ పర్చేజ్’ చేపట్టడానికి ముందుకు రావాల్సిన సీసీఐలో ఇంకా కదలికపోవడం ఆందోళనకు దారితీస్తోంది. జిల్లాలో ఈసారి 1.20లక్షల హెక్టార్లలో పత్తి సాగైంది. సుమారు 2.6లక్షల మెట్రిక్ టన్నులకు పైగా దిగుబడులు వచ్చే అవకాశముంది. పత్తి రైతుల అవసరాల దృష్ట్యా జిల్లాలోని గజ్వేల్, సిద్దిపేట, తొగుట, జోగిపేట, జహీరాబాద్‌లలో సీసీఐ కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేశారు. మార్కెట్లోకి వెల్లువలా ఉత్పత్తులు రావడం ఊపందుకున్నా ఈ కేంద్రాలను ఇంకా తెరవలేదు. ఈ పరిణామం వ్యాపారులకు కలిసి వస్తున్నది. పత్తికి ప్రభుత్వం రూ.4వేలు మద్దతు ధరను ప్రకటించినా గజ్వేల్‌లో వ్యాపారులు మాత్రం రూ.3,500కు మించి ధరను చెల్లించలేదు. తడిసిన పత్తిని అతి తక్కువ ధరకు కొనుగోలు చేశారు. ఇలా కొనుగోలు చేసిన పత్తిని గుజరాత్, మహారాష్ట్రతోపాటు జమ్మికుంట, గుంటూరు మార్కెట్లకు తరలిస్తూ వ్యాపారులు మాత్రం రూ.4600వరకు ధరను పొందుతున్నారు. ఈ లెక్కన ఒక్క గజ్వేల్ ప్రాంతంలోనే రైతులు ఇప్పటికే లక్షల్లో నష్టపోయారు. గతేడాదితో పోలీస్తే ఈసారి వర్షాలు సకాలంలో కురవడం వల్ల ఉత్పత్తులు తొందరగా మార్కెట్లోకి వచ్చాయి. సీసీఐ ముందుచూపుతో ఆలోచించి కమర్షియల్ పర్చేజ్‌తో కొనుగోలు కేంద్రాలను తెరిచి ఉంటే రైతులకు నష్టం వాటిల్లకుండా ఉండేది. ‘ఏ’ గ్రేడ్ పత్తికి మాత్రమే రూ.4,300 చెల్లిస్తున్నారు. ఏ మాత్రం లోపాలు కనిపించినా రూ.3,900కి మించి ధర ఇవ్వడం లేదు. ఇందులోనూ క్వింటాలుకు 2 కిలోల చొప్పున కోత పెడుతున్నారు. ‘కమర్షియల్ పర్చేజ్’ లేనట్టేనా? 2011 నవంబర్ నెలలో పత్తి ధర పైపైకి ఎగబాకింది. రూ.4వేల నుంచి ప్రారంభమైన ధర డిసెంబర్, జనవరి నెలలో రూ.7వేల పైచిలుకు పలికింది. అంతర్జాతీయ పత్తి మార్కెట్లో ఏర్పడిన డిమాండ్ కారణంగా ధర అమాంతం పెరిగింది. నిజానికి ప్రభుత్వ కనీస మద్దతు ధర రూ.3,000మాత్రమే. సీసీఐ కేంద్రం నిబంధనల ప్రకారం మద్దతు ధరకే పత్తిని కొనుగోలు చేయాలి. కానీ నిబంధనలను సడలించుకొని ‘కమర్షియల్ పర్చేజ్’ పేరిట సీసీఐ కూడా పోటీ పడి కొనుగోళ్లు చేపట్టింది. గరిష్టంగా గజ్వేల్‌లో రూ.7వేల వరకు ధరను కూడా చెల్లించింది. కానీ రేండేళ్లుగా సీసీఐ సక్రమంగా కొనుగోళ్లను చేపట్టడం లేదు. గతేడాది వారంలో ఒకటి రెండురోజుల మాత్రమే కొనుగోళ్లను చేపట్టడం వల్ల రైతుల తీవ్రంగా నష్టపోయారు. ఈసారి కూడా సీసీఐ ‘కమర్షియల్ పర్చేజ్’కు దిగుతుందనే సంకేతాలు వెలువడ్డాయి. కానీ ఇప్పటివరకు స్పష్టత లేకపోవడంతో రైతుల ఆశలు సన్నగిల్లాయి. తెల్లబంగారానికి రెండోసారి తుఫాన్ దెబ్బ.... నెల రోజుల క్రితం ఎడతెరిపిలేకుండా కురిసిన తుపాన్ ధాటికి తీవ్ర పంట నష్టానికి గురైన పత్తి రైతులు తాజాగా శనివారం కురిసిన వానకు బెంబేలెత్తిపోతున్నారు. ముసురుతో గజ్వేల్ యార్డులో పత్తి లావాదేవీలు జరగలేదు. ఇలాగే వర్షం కురిస్తే నష్టం తప్పదని రైతులు ఆందోళన చెందుతున్నారు. -
పత్తి కష్టాలు పుట్టెడు
గజ్వేల్, న్యూస్‌లైన్: పుట్టెడు కష్టాలతో పత్తి రైతులు అల్లాడుతున్నారు. ఇంకా సీసీఐ (కాటన్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా) కొనుగో ళ్లు ప్రారంభించకపోవడం.. దళారులు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తుండటంతో మద్దతు ధర కరువైంది. సీసీఐ తీరుపై రైతుల నుంచి తీవ్ర నిరసన వ్యక్తమవుతున్నది. ప్రతి ఏటా నవంబర్ మొదటి వారంలో కొనుగోలు కేంద్రాలను ప్రారంభించే ఈ సంస్థ ఈసారి ఇంకా చడీచప్పుడు లేకుండా ఉండటంపై రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ‘మద్దతు ధర’తో ప్రమేయం లేకుండా ప్రైవేట్ వ్యాపారులతో పోటీ పడుతూ ‘కమర్షియల్ పర్చేజ్’ చేపట్టడానికి ముందుకు రావాల్సిన సీసీఐలో ఇంకా కదలికపోవడం ఆందోళనకు దారితీస్తోంది. జిల్లాలో ఈసారి 1.20లక్షల హెక్టార్లలో పత్తి సాగైంది. సుమారు 2.6లక్షల మెట్రిక్ టన్నులకు పైగా దిగుబడులు వచ్చే అవకాశముంది. పత్తి రైతుల అవసరాల దృష్ట్యా జిల్లాలోని గజ్వేల్, సిద్దిపేట, తొగుట, జోగిపేట, జహీరాబాద్‌లలో సీసీఐ కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేశారు. మార్కెట్లోకి వెల్లువలా ఉత్పత్తులు రావడం ఊపందుకున్నా ఈ కేంద్రాలను ఇంకా తెరవలేదు. ఈ పరిణామం వ్యాపారులకు కలిసి వస్తున్నది. పత్తికి ప్రభుత్వం రూ.4వేలు మద్దతు ధరను ప్రకటించినా గజ్వేల్‌లో వ్యాపారులు మాత్రం రూ.3,500కు మించి ధరను చెల్లించలేదు. తడిసిన పత్తిని అతి తక్కువ ధరకు కొనుగోలు చేశారు. ఇలా కొనుగోలు చేసిన పత్తిని గుజరాత్, మహారాష్ట్రతోపాటు జమ్మికుంట, గుంటూరు మార్కెట్లకు తరలిస్తూ వ్యాపారులు మాత్రం రూ.4600వరకు ధరను పొందుతున్నారు. ఈ లెక్కన ఒక్క గజ్వేల్ ప్రాంతంలోనే రైతులు ఇప్పటికే లక్షల్లో నష్టపోయారు. గతేడాదితో పోలీస్తే ఈసారి వర్షాలు సకాలంలో కురవడం వల్ల ఉత్పత్తులు తొందరగా మార్కెట్లోకి వచ్చాయి. సీసీఐ ముందుచూపుతో ఆలోచించి కమర్షియల్ పర్చేజ్‌తో కొనుగోలు కేంద్రాలను తెరిచి ఉంటే రైతులకు నష్టం వాటిల్లకుండా ఉండేది. ‘ఏ’ గ్రేడ్ పత్తికి మాత్రమే రూ.4,300 చెల్లిస్తున్నారు. ఏ మాత్రం లోపాలు కనిపించినా రూ.3,900కి మించి ధర ఇవ్వడం లేదు. ఇందులోనూ క్వింటాలుకు 2 కిలోల చొప్పున కోత పెడుతున్నారు. ‘కమర్షియల్ పర్చేజ్’ లేనట్టేనా? 2011 నవంబర్ నెలలో పత్తి ధర పైపైకి ఎగబాకింది. రూ.4వేల నుంచి ప్రారంభమైన ధర డిసెంబర్, జనవరి నెలలో రూ.7వేల పైచిలుకు పలికింది. అంతర్జాతీయ పత్తి మార్కెట్లో ఏర్పడిన డిమాండ్ కారణంగా ధర అమాంతం పెరిగింది. నిజానికి ప్రభుత్వ కనీస మద్దతు ధర రూ.3,000మాత్రమే. సీసీఐ కేంద్రం నిబంధనల ప్రకారం మద్దతు ధరకే పత్తిని కొనుగోలు చేయాలి. కానీ నిబంధనలను సడలించుకొని ‘కమర్షియల్ పర్చేజ్’ పేరిట సీసీఐ కూడా పోటీ పడి కొనుగోళ్లు చేపట్టింది. గరిష్టంగా గజ్వేల్‌లో రూ.7వేల వరకు ధరను కూడా చెల్లించింది. కానీ రేండేళ్లుగా సీసీఐ సక్రమంగా కొనుగోళ్లను చేపట్టడం లేదు. గతేడాది వారంలో ఒకటి రెండురోజుల మాత్రమే కొనుగోళ్లను చేపట్టడం వల్ల రైతుల తీవ్రంగా నష్టపోయారు. ఈసారి కూడా సీసీఐ ‘కమర్షియల్ పర్చేజ్’కు దిగుతుందనే సంకేతాలు వెలువడ్డాయి. కానీ ఇప్పటివరకు స్పష్టత లేకపోవడంతో రైతుల ఆశలు సన్నగిల్లాయి. తెల్లబంగారానికి రెండోసారి తుఫాన్ దెబ్బ.... నెల రోజుల క్రితం ఎడతెరిపిలేకుండా కురిసిన తుపాన్ ధాటికి తీవ్ర పంట నష్టానికి గురైన పత్తి రైతులు తాజాగా శనివారం కురిసిన వానకు బెంబేలెత్తిపోతున్నారు. ముసురుతో గజ్వేల్ యార్డులో పత్తి లావాదేవీలు జరగలేదు. ఇలాగే వర్షం కురిస్తే నష్టం తప్పదని రైతులు ఆందోళన చెందుతున్నారు.