సాక్షి ప్రతినిధి, ఆదిలాబాద్ : పత్తి రైతుకు ఈ ఏడాది ‘మార్కెట్’ కష్టాలు తప్పేలా లేవు. ఈ సీజనులో పత్తి కొనుగోళ్లకు ప్రైవేటు వ్యాపారులు ప్రస్తుతానికి ఆసక్తి చూపకపోవడంతో రైతులు సీసీఐ (కాటన్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా)పైనే ఆశలు పెట్టుకున్నారు. కానీ.. ప్రభుత్వ రంగ సంస్థ పత్తి కొనుగోళ్లను ప్రారంభించడంలో మీనమేషాలు లెక్కిస్తోంది. ఈ నెల 27 వరకు కొనుగోళ్లు ప్రారంభించే ప్రసక్తే లేదని సంస్థ అధికారులు తేల్చిచెబుతున్నారు. దీంతో పత్తి రైతుల పరిస్థితి అగమ్యగోచరంగా తయారైంది.
ఖరీఫ్ ప్రారంభంలో కరువు.. తర్వాత అధిక వర్షాలు.. ఇలా ప్రతికూల పరిస్థితులను ఎదుర్కొని రైతులు పత్తిని పండించి అమ్ముకుందామంటే దిక్కుతోచని పరిస్థితి నెలకొంది. వెంటనే పత్తి కొనుగోళ్లు ప్రారంభించాలని గురువారం హైదరాబాద్‌లో నిర్వహించిన సమీక్షలో రాష్ట్ర మార్కెటింగ్ శాఖ మంత్రి టి.హరీష్‌రావు అధికార యంత్రాంగాన్ని ఆదేశించారు. కానీ.. సీసీఐ తీరును పరిశీలిస్తే ఈ ఆదేశాలు ఇప్పట్లో అమలుకు నోచుకునే పరిస్థితి కనిపించడం లేదు. రైతులు మాత్రం పత్తిని మార్కెట్ యార్డులకు తరలిస్తున్నారు. సోమవారం నుంచి ప త్తిని ఆదిలాబాద్ మార్కెట్ యార్డు కు తీసుకువస్తామని రైతు సంఘాల నాయకులు కలెక్టర్ ఎం.జగన్మోహన్‌ను కలిసి విజ్ఞప్తి చేశారు.
అదే జరి గితే యార్డుకు వచ్చిన పత్తిని కొనుగోలు చేసే వారెవరో తెలియక మా ర్కెటింగ్ శాఖ అధికారులు తలలు పట్టుకోవాల్సి వస్తోంది. బేల, తల మడుగు, ఆదిలాబాద్ మండలాల పరిధిలోని పలు గ్రామాల్లో రైతులు పత్తిని మార్కెట్ యార్డుకు తరలించేందుకు సిద్ధంగా ఉన్నారు. ఇప్పటికే కరీంనగర్, ఖమ్మం, వరంగల్ జిల్లాల్లో పత్తి కొనుగోళ్లు ప్రారంభమయ్యాయి. పత్తి కనీస మద్దతు ధర క్వింటాలుకు రూ.4,050లుగా ప్రభుత్వం నిర్ణయించింది. అయితే.. ఈసారి కూడా పత్తి రైతుకు కనీస మద్దతు ధర లభించే అవకాశాలు కనిపించడం లేదు. జిల్లాలో ప్రధానంగా ఆదిలాబాద్‌తోపాటు, భైంసా మార్కెట్ యార్డుకు రైతులు ఎక్కువగా పత్తిని తీసుకువస్తారు.
21 కేంద్రాల ద్వారా పత్తి కొనుగోళ్లు..
ఈ సీజన్‌లో ఆదిలాబాద్, నిజామాబాద్ జిల్లాల్లో 21 కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చే స్తామని సీసీఐ ఆదిలాబాద్ బ్రాంచ్ మేనేజర్ అర్జున్‌ధవా పేర్కొన్నారు. ఈ మేరకు సీసీఐ ఆయా కేంద్రాల పరిధిలో ఉన్న జిన్నింగ్ మిల్లులతో ఒప్పందం కుదుర్చుకుంది. కానీ.. కొనుగోళ్లు మాత్రం మరో పక్షం రో జుల తర్వాతేనని ఆ సంస్థ అధికారు లు చెబుతున్నారు. వ్యవసాయ శాఖ గణాంకాల ప్రకారం ఈ ఖరీఫ్ సీజ న్‌లో ఆదిలాబాద్ జిల్లాలో 3.18 లక్ష ల హెక్టార్లలో పత్తి సాగు చేసినట్లు అంచనాకొచ్చారు. ఈ లెక్కన సు మారు 35 నుంచి 40 లక్షల క్వింటాళ్ల పత్తి మార్కెట్‌కు వచ్చే అవకాశాలున్నట్లు మార్కెటింగ్ శాఖ అంచనా. అయితే.. ఈ సీజనులో పత్తి కొనుగోళ్లపై ఇటీవల అఖిలపక్ష నాయకులతో సమావేశం నిర్వహించిన జి ల్లా అధికార యంత్రాంగం, ఈనెల 14న ప్రైవేటు వ్యా పారులతో సమావేశం కావాలని నిర్ణయించారు.
సీసీఐ మీనమేషాలు..
Published Sat, Oct 11 2014 2:18 AM | Last Updated on Mon, Oct 1 2018 2:03 PM
Advertisement