ఒంగోలు టౌన్, న్యూస్‌లైన్:
పత్తిరైతుల దీనస్థితిని పట్టించుకునే నాథుడే కరువయ్యాడు. పండిన పంటకు గిట్టుబాటు ధర రాక విలవిల్లాడుతున్నాడు. జిల్లాలో 1.60 లక్షల ఎకరాల్లో ఈఏడాది పత్తి సాగు చేశారు. పర్చూరు, ఇంకొల్లు, అద్దంకి, గిద్దలూరు, యర్రగొండపాలెం, మార్కాపురం, దర్శి ప్రాంతంలో పత్తిని అధికంగా సాగు చేస్తున్నారు. ఆగస్టు ఆఖరు నుంచి సాగు మొదలుపెట్టిన పత్తిరైతు అననుకూల వాతావరణ పరిస్థితులు తట్టుకుని సాగుచేసినా వచ్చిన దిగుబడిని అమ్ముకునేందుకు మార్కెట్ సౌకర్యం లేక తీవ్రంగా నష్టపోతున్నాడు.
అందిన కాడికి అమ్ముకుంటున్నారు:పత్తి పంట వేసి మూడు నెలలు కావస్తుండడంతో
విలవిల
ఇప్పటికే పత్తి తీతలు మొదలయ్యాయి. రెండు తీతలు పూర్తైమూడో తీతలోకి వచ్చారు. అయితే పండించిన పత్తికి సక్రమమైన మార్కెట్ సౌకర్యం లేకపోవడంతో నిల్వ చేసుకునే వీలులేక రైతులు వచ్చిన కాడికి తెగనమ్ముకుంటున్నారు. ఇదే అదనుగా చేసుకుని వ్యాపారులు ఇష్టానుసారంగా కొనుగోలు చేస్తున్నారు. కొద్దిగా రంగు మారినా, తడిసినా అసలు కొనుగోలు చేయడంలేదు. ప్రభుత్వం క్వింటా పత్తికి * 4 వేలు మద్దతు ధర ప్రకటించినా రైతుకు ఆ ధర దక్కడం లేదు. వ్యాపారులు నాణ్యమైన పత్తికి క్వింటా * 3,200 చెల్లిస్తుండగా..నాణ్యతలేని పత్తిని అసలు కొనుగోలు చేయడం లేదు.
సీసీఐ కేంద్రాలు అడిగింది ఏడు చోట్ల..తెరిచింది ఒక్కచోటే:
కాటన్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (సీసీఐ) ఉన్నా పత్తి రైతుకు ఒరిగిందేమీ లేదు. జిల్లాలో ఏడుచోట్ల సీసీఐ కేంద్రాలు ఏర్పాటు చేయాలని రైతులు అధికారులను కోరారు. ఈ ఏడాది అక్టోబర్ 29న, డిసెంబర్ 3న రెండు దఫాలుగా జాయింట్ కలెక్టర్ యాకూబ్‌నాయక్ రైతు సంఘాల నేతలు, మార్కెటింగ్ శాఖ అధికారులు, సీసీఐ ప్రతినిధులతో చర్చలు జరిపారు. ఈనెల 3న జరిగిన సమీక్షలో రెండు మూడు రోజుల్లో సీసీఐ కేంద్రాలు మార్కాపురం ప్రాంతంలో ఒకటి, పర్చూరు ప్రాంతంలో మరొకటి ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చినా మార్కాపురంలో మాత్రమే గురువారం ఏర్పాటు చేశారు. పర్చూరులో ఇంకా తెరవలేదు. నేరుగా వ్యవసాయ మార్కెటింగ్ శాఖ కార్యాలయాల్లో కొనుగోలు కేంద్రాలు ఏర్పాటుచేసి రైతులు పండించిన పత్తిని కొనుగోలు చేయించాల్సిన మార్కెటింగ్ శాఖ అధికారులు నిద్రావస్థలో ఉన్నారు.
పత్తిరైతు విలవిల
Published Fri, Dec 13 2013 2:27 AM | Last Updated on Sat, Sep 2 2017 1:32 AM
Advertisement
Advertisement