ఉద్యోగుల్ని తొలగిస్తూ సీసీఐ ఇచ్చిన ఉత్తర్వులు రద్దుచేసిన హైకోర్టు
సాక్షి, హైదరాబాద్: ఉద్యోగంలో చేరే సమయంలో తప్పుడు అనుభవ ధ్రువీకరణ పత్రాలు సమర్పించారంటూ ప్రొబేషన్‌లో ఉన్న పలువురు జూనియర్ పత్తి కొనుగోలుదారులను తొలగిస్తూ కాటన్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (సీసీఐ) జారీ చేసిన ఉత్తర్వులను ఉమ్మడి హైకోర్టు రద్దు చేసింది. తొలగించిన జూనియర్ పత్తి కొనుగోలుదారులను ఆ పోస్టుల్లోకి వెంటనే తీసుకోవాలని సీసీఐని ఆదేశించింది. తొలగించిన నాటి నుంచి విధుల్లోకి తిరిగి తీసుకునేంత వరకు వారికి చెల్లించాల్సిన జీతభత్యాలను కూడా చెల్లించాలని స్పష్టం చేసింది.
శాఖాపరమైన విచారణ జరపకుండానే ఆ ఉద్యోగులను తప్పించడం సరికాదంది. అయితే వారిపై అభియోగాలు నమోదు చేసి, శాఖాపరమైన విచారణ జరిపి, దోషులుగా తేలితే తగిన చర్యలు తీసుకోవచ్చునని తెలిపింది. అందుకు ఈ ఉత్తర్వులు ఎంత మాత్రం అడ్డంకి కాదని స్పష్టం చేసింది. ఈ మేరకు న్యాయమూర్తి జస్టిస్ ఎం.ఎస్.రామచంద్రరావు ఇటీవల తీర్పు వెలువరించారు.
విచారణ లేకుండా ఉద్యోగస్తుల తొలగింపా?
Published Tue, Jan 10 2017 2:32 AM | Last Updated on Fri, Aug 31 2018 8:31 PM
Advertisement