Public sector organization
-
2019లోనూ కేంద్రానికి భారీగా నిధులు!
కేంద్ర ప్రభుత్వం 2018లో ప్రభుత్వరంగ సంస్థల్లో పెట్టుబడుల ఉపసంహరణ, వాటాల విక్రయం ద్వారా రూ.77,417 కోట్లను సమీకరించింది. ఇక 2019లోనూ ఎయిర్ ఇండియాలో వాటాలను ఎలాగైనా విక్రయించాలన్న లక్ష్యంతో ఉంది. దీంతో ఈ ఏడాది కూడా కేంద్రానికి గణనీయంగానే నిధులు సమకూరనున్నాయి. గతానికి భిన్నంగా కేంద్ర ప్రభుత్వం ప్రభుత్వరంగ కంపెనీల మధ్య విలీనాల ద్వారా తన నిధుల అవసరాలను తీర్చుకునే ప్రణాళికలను అమలు చేస్తున్న తీరు చూస్తూనే ఉన్నాం. ఓఎన్జీసీ ఇదే విధంగా హెచ్‌పీసీఎల్‌ను కొనుగోలు చేసింది. దీంతో హెచ్పీసీఎల్లో కేంద్రం తనకున్న వాటాను ఓఎన్జీసీకి విక్రయించడం ద్వారా గణనీయంగానే నిధులు సమకూరాయి. సీపీఎస్ఈ ఈటీఎఫ్, భారత్ 22ఈటీఎఫ్, కోల్ ఇండియాలో వాటాల అమ్మకం, ఆరు ప్రభుత్వరంగ సంస్థల ఐపీవోల ద్వారా కేంద్రానికి గత సంవత్సరంలో 77,417 కోట్ల నిధులు అందుబాటులోకి వచ్చాయి. 2019 అమ్మకాలు: ఎయిర్ ఇండియాలో వాటాలను కేంద్రం గతేడాది అమ్మకానికి పెట్టినప్పటికీ... ఏ ప్రైవేటు సంస్థ కూడా ముందుకు రాలేదు. ఎయిర్ఇండియాకు రూ.55వేల కోట్ల వరకూ రుణాలు ఉండటంతోపాటు కార్యకలాపాలపై పెద్ద ఎత్తున నష్టాలు వస్తున్న విషయం గమనార్హం. దీంతో ఎయిర్ ఇండియా అమ్మకానికి ముందు ఆ సంస్థను గాడిలో పెట్టే చర్యలను కేంద్రం అమల్లో పెట్టింది. తన ప్రణాళికలో భాగంగా ఎయిర్ ఇండియా సబ్సిడరీలు ఎయిర్ ఇండియా ట్రాన్స్పోర్ట్ సర్వీసెస్, ఎయిర్ ఇండియా ఇంజనీరింగ్ సర్వీసెస్, భవనాలు, ఖాళీ స్థలాలను విక్రయించనుంది. దీని ద్వారా రూ.29,000 కోట్ల వరకు రుణ భారం తగ్గించనుంది. ఎయిర్ ఇండియా లాభాల్లోకి వచ్చేందుకు గాను నిధుల సాయం కూడా చేయనుంది. ఇక 2019లో పవన్ హన్స్లో తనకున్న 51 శాతం వాటాను కేంద్రం విక్రయించనుంది. మిగిలిన 49 శాతం వాటా ఓఎన్జీసీకి ఉంది. ఇక ఓఎన్జీసీ, ఐవోసీఎల్, ఆయిల్ ఇండియా, ఎన్ఎల్సీ, బీహెచ్ఈఎల్ తదితర కంపెనీల షేర్ల బైబ్యాక్‌ల ద్వారా కేంద్రానికి రూ.12,000 కోట్ల నిధులు సమకూరనున్నాయి. ఆర్ఈసీలో కేంద్రం వాటాలను పీఎఫ్సీ కొనుగోలు చేయడం ద్వారా మరో రూ.15,000 కోట్లు సమకూరతాయి. ఎస్‌జేవీఎన్‌లో కేంద్రం వాటాను ఎన్టీపీసీ కొనడం ద్వారా రూ.6,000 కోట్లు రానున్నాయి. -
సీసీఐకి రైతుల షాక్ !
సంస్థకు విక్రరుుంచేందుకు వెనుకంజ తక్కువ ధర అరుునా.. వ్యాపారుల వైపే మొగ్గు వెంటనే డబ్బులు ఇవ్వకపోవడం.. బ్యాంకుల కొర్రీలే కారణం వరంగల్ సిటీ :ఆరుగాలం శ్రమించి పండించిన పంటను ఎక్కువ రేటుతో కొనుగోలు చేసే వారికి విక్రరుుంచేందుకు రైతులు పోటీపడతారు. ఇందులోనూ.. తెల్లబంగారాన్ని ప్రభుత్వ రంగ సంస్థ అరుున కాటన్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియూకు అమ్ముకునేందుకే ఎగబడతారు. వ్యాపారులు తమ జిమ్మిక్కులతో ధర తగ్గించి కొనుగోలు చేసినప్పుడల్లా... సీసీఐ కొనుగోలు చేయూలంటూ రైతులు ఆందోళనకు దిగిన సందర్భాలు ఎన్నో ఉన్నారుు. ఎన్ని రోజులు ఆలస్యమైనా సరే... ఆ సంస్థ అధికారులు కొనుగోళ్లు చేసేవరకూ కర్షకులు రోజుల తరబడి పత్తి బస్తాలతో మార్కెట్లోనే వేచి ఉండేవారు. ప్రభుత్వ మద్దతు ధర అందుతుండడమే ఇందుకు ప్రధాన కారణం. అలాంటిది... ఆసియూలోనే అతి పెద్దదిగా పేరొందిన వరంగల్ ఏనుమాముల మార్కెట్లో సీన్ రివర్స్ అరుుంది. పత్తి బస్తాలతో మంగళవారం మార్కెట్‌కు తరలివచ్చిన రైతులు తమ పం ట ఉత్పత్తులను సీసీఐకి అమ్మడానికి వెనుకంజ వేశారు. మంగళవారం మార్కెట్‌కు సుమారు 20 వేల పత్తి బస్తాలు వచ్చారుు. ఉదయం సీసీఐ అధికారులు 1,600 పత్తి బస్తాలను కొనుగోలు చేశారు. మరికొన్ని బస్తాలను కొనుగోలు చేస్తున్న క్రమంలో సీ న్ మారింది. రైతులందరూ ప్రైవేట్ వ్యాపారులకు విక్రరుుంచేందుకు మొగ్గుచూపా రు. మార్కెట్ అధికారులు నచ్చజెప్పినా... వారు సీసీఐకి విక్రరుుంచేందుకు ససేమిరా అన్నారు. సీసీఐకి అమ్మినదానికంటే రూ. 100 నుంచి రూ.200 తక్కువ అయినా... అడ్తిదారుల ద్వారా వ్యాపారులకే అ మ్మా రు. ముందుగా ప్రభుత్వ మద్దతు ధర క్విం టాల్‌కు రూ.4,050తో సీసీఐకి అమ్మిన రైతులు సైతం మనసు మార్చుకుని... వ్యా పారులకే విక్రరుుంచడం విశేషం. ఒక్క అ గ్రంపాడ్కు చెందిన రైతు వెంకటేశ్వర్లు మా త్రమే సీసీఐకి 25 బస్తాల పత్తిని అమ్మాడు. కారణం ఇదే.. పత్తి బస్తాలను సీసీఐకి విక్రరుుంచకపోవడంపై ‘సాక్షి’ ఆరా తీసింది. విక్రరుుంచిన వెంటనే సీసీఐ డబ్బులివ్వదని, వాళ్ల చు ట్టూ కాళ్లరిగేలా తిరగాలని పలువురు రైతు లు చెప్పారు. పంటల సాగు కోసం తెచ్చిన అప్పులు కుప్పలుగా పేరుకుపోయూయని.. మిత్తి కట్టేందుకు ఎంతో కొంతకు అమ్ముకున్నామని కొందరు తెలిపారు. చెక్‌లు ఇస్తుండడంతో బ్యాంకుల్లో ఇబ్బం దులు ఎదురవుతున్నాయని.. బ్యాంకులో అప్పు ఉంటే వారి ఖాతాల్లో జమ చేసుకుంటున్నారని.. అందుకనే తక్కువ వచ్చి నా... వ్యాపారులకే అమ్ముకున్నామని మరి కొందరు వాపోయూరు. అరుుతే.. అడ్తివ్యాపారులు ఏకమై రైతులను భయభ్రాంతులకు గురిచేసినట్లు వినికిడి. అందుకే అమ్మిన రైతులు సైతం అమ్మకాలు రద్దు చేసుకున్నట్లు మార్కెట్ వార్గాల్లో ప్రచారం జరుగుతోంది. -
పండుగకు పస్తులేనా?
దుబ్బాక: వేతనాలు అందక 104 సిబ్బంది నరకయాతన అనుభవిస్తున్నారు. దసరా పండుగకు సైతం పస్తులు తప్పేటట్టులేవంటున్నారు. పొద్దస్తమానం రోగులతోనే సహవాసం చేసే 104 సిబ్బంది కష్టాన్ని మాత్రం ఎవ్వరూ పట్టించుకోవడం లేదు. చేసిన రెక్కల కష్టానికి ఫలితం దక్కడం లేదు. శ్రమ దోపిడీకి గురవుతున్నా పట్టించుకునే అధికారి లేరు. ప్రభుత్వ రంగ సంస్థలో పని చేస్తున్నామన్న ధీమాతోనే కలో గంజో తాగుతూ విధులను క్రమం తప్పకుండా నిర్వహిస్తుంటారు. జిల్లాలో 10 క్లష్టర్లుండగా 21 వాహనాలు నడుస్తున్నాయి. వీటిలో 90 వరకు వివిధ హోదాల్లో (ఫార్మసిస్టు, డ్రైవర్, ల్యాబ్ టెక్నిషియన్, డాటా ఎంట్రీ ఆపరేటర్) సిబ్బంది విధులను నిర్వర్తిస్తున్నారు. ప్రజల యోగా క్షేమాలు ఎప్పటికప్పుడు చూసే 104 సిబ్బందికి మాత్రం మూడు నెలలుగా జీతం రావడం లేదు. ప్రభుత్వానికి ఉద్యోగుల మధ్య ఉండే వెండర్ వల్ల జీతాల్లో అవకతవకలు జరగడమే కాకుండా జీతాలు అలస్యంగా వస్తున్నాయి. ట్రెజరీ ద్వారా జీతాలిస్తే నెల నెలా వచ్చే అవకాశం ఉంది. 104 వాహనాలకు ఇన్సూరెన్స్ కూడా లేదు. ఒకవేళ ప్రమాదాలకు గురైతే మాత్రం ఆ కుటుంబాల పరిస్థితి అగమ్య గోచరమే. అధికారుల నిర్లక్ష్యం వల్లే వారికి వేతనాలు అందడంలేనట్టు తెలుస్తోంది. కుటుంబ పోషణకు అప్పులు చేయాల్సి వస్తోంది. బిల్లుల కోసం చెప్పులరిగేలా తిరిగినా ఫైల్ మాత్రం కదలదు. అమ్యామ్యాలు ముట్టచెప్పనిదే బిల్లుల ఫైల్ చేతికందదు. ‘దసరా పండుగ వస్తోంది. ఇంటిల్లిపాదికి కొత్త బట్టలు కొనివ్వాలి. ఇంత వరకు జీతాల ఊసెత్తడం లేదు. ఇప్పటికే అప్పులు చేశాం. అప్పులొళ్లు కూడా నమ్మడం లేదు. ఈ సారైనా జీతాలు రాకుంటే దసరా పండుగకు పస్తులు తప్పవ’ని 104 సిబ్బంది వాపోతున్నారు. వెంటనే జీతాలు చెల్లించి తమ కుటుంబాలను ఆదుకోవాలని వారు ప్రభుత్వానికి వేడుకుంటున్నారు.