
పనయ కొనుగోలులో అవకతవకలు లేవు: సిక్కా
న్యూఢిల్లీ: పనయ కంపెనీ కొనుగోలుపై ఎలాంటి అవకతవకలు చోటు చేసుకోలేదని ఇన్ఫోసిస్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ విశాల్ సిక్కా పేర్కొన్నారు. ఈ మేరకు ఇన్ఫోసిస్ ఉద్యోగులకు సోమవారం ఒక ఈ మెయిల్ పంపారు. ఆటోమేషన్ కంపెనీ పనయను ఇన్ఫోసిస్ రూ.1,250 కోట్లకు కొనుగోలు చేసింది.
వాస్తవ విలువ కంటే 25 శాతం అదనంగా ఈ కంపెనీని కొనుగోలు చేశారంటూ సెబీకి ఒక లేఖ అందిన నేపథ్యంలో విశాల్ సిక్కా స్పందించారు. తనను బాధించడమే లక్ష్యంగా కొంతమంది దురుద్దేశపూరితంగా విమర్శలు చేస్తున్నారని, కట్టుకథల ప్రచారాన్ని ఉపేక్షించబోమని పేర్కొన్నారు.