
ఇన్ఫోసిస్‌కు భారీ ఊరట
దేశీయ రెండవ అతిపెద్ద ఐటీ సేవల సంస్థ ఇన్ఫోసిస్‌కు భారీ ఊరట లభించింది.
న్యూఢిల్లీ: ఇటీవలి కాలంలో అనేక సమస్యలు, విమర్శలతో చిక్కుల్లో పడిన దేశీయ రెండవ అతిపెద్ద ఐటీ సేవల సంస్థ ఇన్ఫోసిస్‌కు భారీ ఊరట లభించింది. అమెరికా ఆధారిత సంస్థ పనయ కొనుగోలు విషయంలో నెలకొన్న వివాదంలో ఇన్ఫోసిస్ అంతర్గత ఆడిట్ కమిటీ క్లీన్ ఇచ్చింది.
పనయా ఒప్పందంలో అసంబద్ధతలపై ఆరోపణలకు మద్దతు ఇచ్చే ఆధారాలేవీ దర్యాప్తు సంస్థకు లభించలేదని ఇన్ఫోసిస్ పేర్కొంది. ఎలాంటి అక్రమాలు జరగలేదని తేలిందని ఇన్ఫీ శుక్రవారం ప్రకటించింది.