స్టాక్ మార్కెట్ బుధవారం స్వల్ప గ్యాప్ అప్‌తో మొదలైంది. అయితే ప్రారంభంలో అనూహ్య కొనుగోళ్లతో సూచీలు భారీ లాభాల్ని మూటగట్టుకున్నాయి. ముఖ్యంగా ఫైనాన్స్, ఎఫ్‌ఎంసీజీ, బ్యాంకింగ్ రంగ షేర్లకు కొనుగోళ్ల మద్దతు లభించడంతో సెన్సెక్స్ ఒకదశలో 400 పాయింట్ల లాభపడి 30,596.17 వద్ద, నిఫ్టీ 121 పాయింట్లు పెరిగి 9వేల స్థాయిని అందుకుంది. ఈ నేపథ్యంలో ప్రముఖ బ్రోకరేజ్ సంస్థ ఎస్‌ఎంసీ గ్లోబల్ సెక్యూరిటీస్‌కి చెందిన సీనియర్ సాంకేతిక నిపుణుడు షితిజ్ గాంధీ 3 స్టాక్‌లకు ‘‘బై’’ రేటింగ్‌ను కేటాయించారు. ఈ మూడు షేర్లు స్వల్పకాలంలో 13శాతం వరకు ర్యాలీ చేయవచ్చని ఆయన అభిప్రాయపడుతున్నారు.
షేరు పేరు: మారికో
బ్రోకరేజ్ సంస్థ: ఎస్‌ఎంసీ గ్లోబల్ సెక్యూరిటీస్
టార్గెట్ ధర: రూ.354
స్టాప్ లాస్: 285
అప్‌సైడ్: 13.40శాతం
విశ్లేషణ: ఈ స్టాక్ డైలీ చార్టులలో హయ్యర్ హై.., హయ్యర్ బాటమ్ ఫార్మాషన్ ఏర్పాటుతో ట్రేడ్ అవుతోంది. గత కొన్ని రోజులుగా షేరు 100 రోజులు ఎక్స్‌పోనెన్షియల్ మూవింగ్ యావరేజ్ రూ.306 వద్ద, అలాగే 200 రోజులు ఎక్స్‌పోనెన్షియల్ మూవింగ్ యావరేజ్ రూ.323 మధ్య కన్సాలిడేట్ అవుతోంది. బోర్డర్ స్ట్రక్చర్‌పై..., స్టాక్ డైలీ ఛార్ట్‌లో ఇన్వర్టెడ్ హెడ్ అండ్ షోల్డర్ నమూనా ఏర్పాటు చేసింది. ప్యాట్రన్ ఫార్మేషన్ నెక్‌లైన్‌పై తాజా బ్రేక్ అవుట్ అంచనా ఉంది. అదనంగా, మూమెంటమ్ ఇండికేటర్స్, ఓసిలేటర్స్ డైలీ, వీక్లీ స్కేల్ పై సానుకూల సంకేతాలను సూచిస్తున్నాయి.
కాబట్టి ట్రేడర్లు ఈ షేరును రూ.285 స్టాప్‌లాస్‌గా పెట్టుకొని రూ.354 టార్గెట్ ధరగా రూ.310-312 స్థాయిలో కొనుగోలు చేయడం ఉత్తమం.
షేరు పేరు: గోద్రేజ్ కన్జ్యూమర్ ప్రోడెక్ట్స్
బ్రోకరేజ్ సంస్థ: ఎస్‌ఎంసీ గ్లోబల్ సెక్యూరిటీస్
టార్గెట్ ధర: రూ.627
స్టాప్ లాస్: రూ.505
అప్‌సైడ్: 12.77శాతం
విశ్లేషణ: రూ.485 వద్ద సపోర్ట్ తీసుకున్న తర్వాత, షేరు వీ-ఆకారపు రీకవరీని తీసుకుంది. మరోసారి రూ.550 ధరను అధిగమించిన తర్వాత వెనక్కి వచ్చింది.ప్రస్తుత దశలో, ఈ స్టాక్ డైలీ చార్టులలో హెడ్ అండ్ షోల్డర్ ప్యాట్రన్స్‌ను ఏర్పాటు చేసింది. స్వల్ప హయ్యర్ వాల్యూమ్‌లతో బ్రేక్‌అవుట్ ఇచ్చింది. ఇది స్టాక్స్‌లో లాంగ్-బిల్డప్ నిర్మాణాన్ని సూచిస్తుంది. షేరు ధరలో తరువాత అప్‌స్వింగ్ ఉంటుందని మూమెంటమ్ ఓసిలేటర్లు సూచిస్తున్నాయి.
కాబట్టి ట్రేడర్లు ఈ షేరును రూ.505 స్టాప్‌లాస్‌గా పెట్టుకొని రూ.627 టార్గెట్ ధరగా రూ.రూ.550-553 స్థాయిలో కొనుగోలు చేయడం ఉత్తమం.
షేరు పేరు: భారతి ఇన్ఫ్రాటెల్
బ్రోకరేజ్ సంస్థ: ఎస్‌ఎంసీ గ్లోబల్ సెక్యూరిటీస్
టార్గెట్ ధర: రూ.240
స్టాప్ లాస్: 185
అప్‌సైడ్: 11.63శాతం
విశ్లేషణ: సిమెట్రికల్ ట్రయాంగిల్ ప్యాట్రన్‌కు పైన బ్రేక్‌అవుట్ ఇచ్చిన తర్వాత షేరులో తదుపరి కొనుగోళ్లను చూస్తున్నాము. ఈ వారం, స్టాక్ డైలీ ఇంటర్వెల్‌లో 100రోజుల ఎక్స్‌పోనెన్షియల్ మూవింగ్ యావరేజ్ కంటే పైన ట్రేడైంది. ఇది ధరలలో స్వల్పకాలిక రివర్సల్‌ను, రాబోయే సెషన్లలో మరింత అప్‌సైడ్ ట్రెండ్‌ను సూచిస్తుంది.
కాబట్టి ట్రేడర్లు ఈ షేరును రూ.185 స్టాప్‌లాస్‌గా పెట్టుకొని రూ.240 టార్గెట్ ధరగా రూ.రూ.205-210 స్థాయిలో కొనుగోలు చేయడం ఉత్తమం.
Comments
Please login to add a commentAdd a comment