
దర్శకధీరుడు రాజమౌళి కొత్త కారును కొనుగోలు చేశారు. ఆర్‌ఆర్‌ఆర్‌తో మరోసారి పాన్ ఇండియా సక్సెస్‌ని ఎంజాయ్ చేస్తున్న రాజమౌళి తాజాగా ఖరీదైన వోల్వో ఎక్స్‌సి40 కారు కొన్నారు. ఈ సందర్భంగా వోల్వో కార్స్ ఇండియా ప్రతినిధి రాజమౌళికి కారు తాళాలను అందించారు. దీనికి సంబంధించిన ఫోటోలను వోల్వో కార్స్ ఇండియా ఇన్‌స్టాగ్రామ్‌లో ఫోటోలను షేర్ చేసింది. ప్రస్తుతం ఈ ఫోటోలు నెట్టింట చక్కర్లు కొడుతున్నాయి.
కాగా రాజమౌళి కొనుగోలు చేసిన ఫ్యూజన్ రెడ్ కలర్‌లో ఉన్న ఈ కారు ధర సుమారు రూ. 44.50 లక్షలు. పనోరమిక్ సన్‌రూఫ్, వైర్‌లెస్ ఛార్జింగ్, డ్యూయల్ జోన్ క్లైమేట్ కంట్రోల్ లాంటి ఎన్నో ముఖ్యమైన ఫీచర్లు ఇందులో ఉన్నాయి. ఇక సినిమాల విషయానికి వస్తే ప్రస్తుతం ఆర్‌ఆర్‌ఆర్ సక్సెస్‌ని ఎంజాయ్ చేస్తున్న రాజమౌళి త్వరలోనే మహేశ్ బాబుతో సినిమా చేయనున్నారు.
Comments
Please login to add a commentAdd a comment