పిరమాల్ ఎంటర్ప్రైజెస్ చేతికి అడాప్టివ్ | Piramal arm acquires Adaptive for potential payment of$24.5 million | Sakshi
Sakshi News home page

పిరమాల్ ఎంటర్ప్రైజెస్ చేతికి అడాప్టివ్

Published Wed, Mar 2 2016 1:55 AM | Last Updated on Sun, Sep 3 2017 6:46 PM

పిరమాల్ ఎంటర్ప్రైజెస్ చేతికి అడాప్టివ్

పిరమాల్ ఎంటర్ప్రైజెస్ చేతికి అడాప్టివ్

న్యూఢిల్లీ: పిరమాల్ ఎంటర్‌ప్రెజైస్ తాజాగా అమెరికాకు చెందిన అడాప్టివ్ సాఫ్ట్‌వేర్ సంస్థను కొనుగోలు చేసింది. ఈ డీల్ విలువ 24.5 మిలియన్ డాలర్లు (సుమారు రూ. 165 కోట్లు). పిరమాల్‌కు చెందిన అమెరికన్ అనుబంధ సంస్థ డెసిషన్ రిసోర్సెస్ గ్రూప్ (డీఆర్‌జీ) ఈ కొనుగోలు ఒప్పందం కుదుర్చుకుంది. ఇందుకోసం 7.4 మిలియన్ డాలర్లు చెల్లించింది. తదుపరి నిర్దిష్ట గడువులోగా, నిర్దిష్ట నిబంధనలకు లోబడి దశలవారీగా మిగతా మొత్తాన్ని చెల్లించనుంది. ఫార్మసీ నెట్‌వర్కింగ్, ప్రైసింగ్ తదితర అంశాలకు సంబంధించి సాఫ్ట్‌వేర్ సొల్యూషన్స్‌ను అడాప్టివ్ అందిస్తోంది. ఈ డీల్‌తో హెల్త్‌కేర్ పేయర్ విభాగంలోకి ప్రవేశించేందుకు డీఆర్‌జీకి వెసులుబాటు లభిస్తుంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement