'అంబేద్కర్ ఇల్లు కొంటున్నాం' | Maharashtra to Buy Ambedkar's London House in 15 Days: State Social Justice Minister | Sakshi
Sakshi News home page

'అంబేద్కర్ ఇల్లు కొంటున్నాం'

Published Tue, Aug 25 2015 8:25 AM | Last Updated on Mon, Oct 8 2018 5:45 PM

'అంబేద్కర్ ఇల్లు కొంటున్నాం' - Sakshi

'అంబేద్కర్ ఇల్లు కొంటున్నాం'

ముంబై: భారత రాజ్యంగ నిర్మాత డాక్టర్ బాబా సాహెబ్ లండన్‌లో నివసించిన ఇంటిని కొనేందుకు మరో రెండు రోజుల్లో ఒప్పందం చేసుకోనున్నట్లు  మహారాష్ట్ర సర్కారు సోమవారం ప్రకటించింది. ఆ ఇంటిని మహారాష్ట్ర ప్రభుత్వం మరో 15 రోజుల్లోగా స్వాధీనం చేసుకోనుందని ఆ రాష్ట్ర మంత్రి రాజ్‌కుమార్ బదోలే వెల్లడించారు. ఇంటి విక్రయానికి యజమాని సోమవారాన్ని చివరి తేదీగా నిర్ణయించారని, ఆలోగా స్పందించకపోతే.. మరో పార్టీకి ఇంటిని అమ్మనున్నారంటూ వచ్చిన వార్తల్ని ఆయన ఖండించారు. 

ఈ విషయమై ఇప్పటికే సాంస్కృతిక వ్యవహారాల మంత్రి వినోద్ తావ్డే లండన్ వెళ్లారన్నారు. ఇంటికోసం మహారాష్ట్ర ప్రభుత్వం బడ్జెట్లో రూ. 40 కోట్ల నిధులను కేటాయించింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement