‘ఇల్లు మన ఆశలు, ఆకాంక్షలు, అభిరుచికి అనుగుణంగా ఉండాలని కోరుకుంటాం. నగరాల్లో ఇప్పటి బిజీ లైఫ్‌లో ఎవరి ఇల్లు వాళ్లు కట్టుకోవడం ఊహకే అందదు. పైగా మల్టీస్టోరీడ్ బిల్డింగ్స్ హవా నడుస్తున్న పరిస్థితుల్లో తప్పని సరిగా బిల్డర్‌ను వెతుక్కోవలసిందే.
1. ఇల్లు కట్టించుకోవాలన్నా, ఫ్లాట్ కొనుక్కోవాలన్నా ముందుగా బిల్డర్ ట్రాక్ రికార్డును పరిశీలిస్తారు.
ఎ. అవును బి. కాదు
2. బ్రోచర్‌లో సూచించిన సౌకర్యాలన్నీ కల్పిస్తున్నారా లేదా అని, ముందుగా పూర్తి చేసిన వెంచర్స్‌లో ఇల్లు కొనుక్కున్న వాళ్ల ద్వారా (అడ్వాన్సు ఇవ్వడానికి ముందే) తెలుసుకుంటారు.
ఎ. అవును బి. కాదు
3. కొనుగోలు దారులకు చూపించడానికి కట్టిన మోడల్ ఫ్లాట్‌ను నిశితంగా పరిశీలిస్తారు. అందులో ఇంటీరియర్ డెకరేషన్‌ను కాకుండా నిర్మాణంలో నాణ్యతను గమనిస్తారు.
ఎ. అవును బి. కాదు
4. నిర్మాణానికి ప్రభుత్వశాఖల నుంచి అన్ని ఆమోదాలు ఉన్నాయా లేదా అని తెలుసుకుంటారు.
ఎ. అవును బి. కాదు
5. నిర్మాణ దశలో స్వయంగా వెళ్లి బ్రోచర్‌లో చెప్పిన క్వాలిటీ పరికరాలను వాడుతున్నారా అని చూసుకుంటారు.
ఎ. అవును బి. కాదు
6. ఇంట్లోకి చేరేముందుగానే కంప్లీషన్ సర్టిఫికేట్, ఆక్యుపెన్సీ సర్టిఫికేట్ తీసుకోవాలని మీకు తెలుసు.
ఎ. అవును బి. కాదు
7. పైకి కనిపిస్తున్న ధరలతోపాటు అంతర్లీనంగా ఉన్న చెల్లింపుల వివరాలను ముందుగానే బిల్డర్‌ను అడిగి స్పష్టంగా తెలుసుకుంటారు.
ఎ. అవును బి. కాదు
8. మీకు పర్యావరణ పరిరక్షణ పట్ల ఆసక్తి కాబట్టి రెయిన్ వాటర్ హార్వెస్టింగ్ యూనిట్, సోలార్ ఎక్విప్‌మెంట్ అమర్చుకోవడం వంటి జాగ్రత్తలు తీసుకుంటారు.
ఎ. అవును బి. కాదు
మీ సమాధానాల్లో ‘ఎ’లు ఆరు అంతకంటే ఎక్కువగా వస్తే మీరు ఖర్చు చేస్తున్న ప్రతి రూపాయికి తగిన విలువను రాబట్టుకోవడం తెలుసు. ‘బి’లు ఎక్కువైతే జాగ్రత్తగా ఇన్వెస్ట్ చేయడానికి ప్రయత్నించండి. అరకొర సౌకర్యాలతో ఏదో ఒకలా పూర్తయిందనిపించిన ఇంటిని స్వాధీనం చేసుకుంటే తర్వాత ఏ సమస్య వచ్చినా మీరే బాధ్యత వహించాల్సి ఉంటుంది.
Comments
Please login to add a commentAdd a comment