పంద్రాగస్టుకు ఇంటికి మువ్వన్నెల జెండా.. ఫ్రీ డెలివరీ.. బుకింగ్‌ ఇలా.. | Buy National Flag from Post Office for Independence day | Sakshi
Sakshi News home page

పంద్రాగస్టుకు ఇంటికి మువ్వన్నెల జెండా.. ఫ్రీ డెలివరీ.. బుకింగ్‌ ఇలా..

Published Thu, Aug 10 2023 12:56 PM | Last Updated on Thu, Aug 10 2023 12:56 PM

Buy National Flag from Post Office for Independence day - Sakshi

పంద్రాగస్టు దగ్గరపడుతోంది. మువ్వన్నెల జెండాలకు డిమాండ్‌ పెరిగింది. గత ఏడాది మాదిరిగానే ఈ ఏడాది కూడా ప్రభుత్వం ‘హర్‌ ఘర్‌ తిరంగా’ నినాదాన్ని కొనసాగిస్తోంది. ఇందుకోసం పోస్టాఫీసులలో ప్రత్యేక ఏర్పాట్లు జరుగుతున్నాయి. దీంతో ఎవరైనా సరే సమీపంలోని పోస్టాఫీసు నుంచి త్రివర్ణ పతాకాన్ని కొనుగోలు చేయవచ్చు. ఇదేవిధంగా పోస్టాఫీసు నుంచి హోమ్‌ డెలివరీ సర్వీసును కూడా వినియోగించుకోవచ్చు. 

‘హర్‌ ఘర్‌ తిరంగా’ వేడుకల కోసం పోస్టల్‌  విభాగం తమ 1.60 లక్షల పోస్టాఫీసు కార్యాలయాల్లో జాతీయ జెండాలను విక్రయిస్తోంది. ప్రభుత్వం ఆగస్టు 13 నుంచి 15 వరకూ ‘హర్‌ ఘర్‌ తిరంగా’ కార్యక్రమాన్ని నిర్వహిస్తోంది. దేశ పౌరులెవరైనా ఈ- పోస్ట్‌ ఆఫీస్‌ ద్వారా జాతీయ పతాకాన్ని ఇంటికి తెప్పించుకోవచ్చు. ఇందుకోసం ఆన్‌లైన్‌లో బుక్‌ చేసుకోవాల్సి ఉంటుంది. దీనిలో ఎటువంటి డెలివరీ ఛార్జీలు ఉండవు. ఒక్కో జాతీయ పతాకం కోసం రూ. 25 చెల్లిస్తే సరిపోతుంది. 

బుకింగ్‌ ప్రాసెస్‌ ఇలా..
ఆన్‌లైన్‌ ఆర్డర్‌ చేసేందుకు ముందుగా పోస్ట్‌ ఆఫీస్‌ వెబ్‌సైట్‌ epostoffice.gov.inకు వెళ్లాలి. అక్కడ ‘హర్‌ ఘర్‌ తిరంగా అభియాన్‌’పై క్లిక్‌ చేయాలి. తరువాత త్రివర్ణ పతాకాల కొనుగోలును ఎంచుకోవాలి. దీనిలో ఎవరైనా అత్యధికంగా ఐదు జెండాల వరకూ కొనుగోలు చేయవచ్చు. ఇందుకోసం బై నౌపై క్లిక్‌ చేయాలి. తరువాత మన మొబైల్‌ నంబర్‌ ఇవ్వాలి. మన మొబైల్‌కు ఓటీపీ రాగానే దాని సాయంతో లాగిన్‌ కావాల్సి ఉంటుంది. చిరునామా వివరాలు అందించాక ఆన్‌లైన్‌లోనే పేమెంట్‌ చేయాల్సి ఉంటుంది. ఇది పూర్తయ్యాక త్రివర్ణ పతాకం మీ ఇంటికి చేరుతుంది.
ఇది కూడా చదవండి: స్వీట్‌ పాప్‌కార్న్‌ అడిగితే చేదు కాకర.. స్విగ్గీ ఎందుకలా చేసిందంటే..
 

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement