నకిలీ.. మకిలీ.. | Fake.. fake.. | Sakshi
Sakshi News home page

నకిలీ.. మకిలీ..

Published Sat, Oct 8 2016 5:27 PM | Last Updated on Mon, Sep 4 2017 4:40 PM

Fake.. fake..

* పరిచయంలేని వ్యక్తి కారుపై రుణం పొందిన వైనం
అక్రమానికి సహకరించిన ఆర్‌టీఏ అధికారులు
మరో 8 మంది బాధితుడి ఫిర్యాదుతో నలుగురి అరెస్టు 
 
గుంటూరు రూరల్‌: పరిచయంలేని వ్యక్తి ఆధార్‌ కార్డును ఆన్‌లైన్‌ ద్వారా డౌన్‌లోడ్‌ చేసుకుని అతని కారుౖపై మాగ్జిమా అనే ప్రైవేటు సంస్థలో రూ 5.5 లక్షల రుణం పొందిన ఘటనలో నిందితులను నల్లపాడు పోలీస్‌లు అరెస్ట్‌ చేసిన సంఘటన శుక్రవారం వెలుగు చూసింది. పోలీసుల కథనం మేరకు... నగరంలోని నవభారత్‌నగర్‌కు చెందిన చైతన్య అనే వ్యక్తి 2014లో రూ 5.7 లక్షల రుణంతో కారు కొనుగోలు చేశాడు. ఈ క్రమంలో నగరంలోని అరండల్‌పేట, విజయవాడ గవర్నర్‌పేట తదితర పోలీస్‌ స్టేషన్లలో  నమ్మించి మోసం చేసే కేసులున్న తాడేపల్లి పాతూరుకు చెందిన సంకురు రవికిరణ్‌ అనే వ్యక్తి చైతన్యకు చెందిన ఆధార్‌ కార్డును ఆన్‌లైన్‌ ద్వారా 2015లో డౌన్‌లోడ్‌ చేశాడు. ఆధార్‌ కార్డుతో ఆతని వివరాలు తెలుసుకునే ప్రయత్నంలో అతనికి కారుందని గమనించాడు. ఇదే అదనుగా భావించిన రవికిరణ్‌ చైతన్యకు చెందిన కారు తాను కొనుగోలు చేసినట్లు నకిలీ క్లియరెన్స్‌ పత్రాలను సృష్టించాడు.
 
ఆధార్‌ కార్డుతోనే అంతా....
క్లియరెన్స్‌ పత్రాలు, ఆధార్‌ కార్డుతో సహా ఆర్‌టీఏ కార్యాలయానికి స్థానికంగా ఉండే ఏజెంట్‌ రఘునా«థరాం ద్వారా వెళ్ళి తన కారు సీబుక్‌ పోయిందని చెప్పి విజయవాడ కృష్ణలంక పోలీస్‌స్టేçÙన్‌లో పొందిన ఎప్‌ఐఆర్‌ కాపీతో కారుకు చెందిన నకిలీ సీబుక్‌ను ఆర్‌టీఐ అధికారులనుంచి పొందాడు. అనంతరం తన వద్దనున్న నకిలీ క్లియరెన్స్, సీబుక్‌తో మాగ్జిమా సంస్థకు చెందిన ఏజెంట్‌ రాజేష్‌బాబును కలిసి తన కారుపై రుణం కావాలని కోరాడు. విషయం తెలిసిన రాజేష్‌బాబు సంస్థకు చెందిన ఉద్యోగి వెంకటశివనాగరాజును కలిసి కారుపై రూ 5.5 లక్షల రుణాన్ని పొందాడు. రుణం అందిన వెంటనే కనుమరుగయ్యాడు. ఈ క్రమంలో చైతన్య తన కారుపై ఉన్న రుణం తీర్చి క్లియరెన్స్‌ను పొదేందుకు ఫైనాన్స్‌ సంస్థ వద్దకు వెళ్ళగా తన కారు తనపేరుపై లేదని గమనించి నిర్ఘాంతపోయాడు. ఏం జరిగిందని ఆర్‌టీఏ అధికారులను ప్రశ్నించటంతో విషయం ఎక్కడ బయటకు వచ్చి తమ మెడకు చుట్టుకుంటుందోనని ఆర్‌టీఏ అధికారులు ఏజెంట్లు గుట్టు చప్పుడు కాకుండా చైతన్య కారుపై మాగ్జిమా సంస్థలో ఉన్న రుణాన్ని చెల్లించారు. 
 
కేసులో 10 మంది నిందితులు..
ఈ క్రమంలో గత 5 రోజుల కిందట ఏడాది కిందట కనుమరుగైన రవికిరణ్‌ ఆర్‌టీఏ కార్యాలయం వద్ద ఏజెంట్‌ రఘునాధరాంకు కనిపించటంతో అతనిని పట్టుకుని ఆర్‌టీఏ కార్యాలయంలోని ఉద్యోగులకు తెలియజేయగా తమను మోసం చేశాడని ఆర్‌టీఏ అధికారులు నల్లపాడు పోలీసులకు ఫిర్యాదు చేయటంతో పోలీసులు తమదైన శైలిలో రవికిరణ్‌ను విచారించారు. నకిలీ పత్రాలు సృష్టించి ఆ పత్రాలతో మాగ్జిమా సంస్థలో రుణం పొందిన వైనాన్ని వెళ్ళగక్కాడు. దీంతో ఈ ఘటనలో 10 మంది నిందితులున్నట్లు పోలీసులు నిర్థారణకు వచ్చి అందులో ఏజెంట్‌ రఘునాథబాబు, రవికిరణ్, మాగ్జిమా సంస్థ ఉద్యోగి వెంకటశివనాగరాజు, రాజేష్‌బాబులను అరెస్ట చేసి శుక్రవారం కోర్టుకు హాజరు పరిచారు.  నిందితులైన ఆర్‌టీఏ కార్యాలయ సిబ్బంది ఇద్దరు కోర్టులో లొంగిపోయి బెయిల్‌ను సైతం పొందారు.  10 మంది నిందితులలో ఒకరు మృతి చెందగా ఇప్పటికి 6గురు అదుపులో ఉన్నట్లు మరో ముగ్గురి కోసం గాలింపు చేపడుతున్నారని తెలిసింది. ఆన్‌లైన్‌ ద్వారా మోసాలు చేస్తూ ఇతరులను ఇబ్బందులు  పెట్టే ఘరానా మోసగాళ్ళతో జాగ్రత్తగా ఉండాలని, ఎట్టిపరిస్థితుల్లోనూ ఏమరు పాటు తగదని నల్లపాడు పోలీస్‌ స్టేషన్‌ సీఐ శ్రీనివాసరావు తెలిపారు. 
 
పోలీసుల తప్పుడు సర్టిఫికెట్‌ ఇవ్వడమే..
రవాణాశాఖలో ఆరునెలల కిందట జరిగిన పొరపాటు  సర్దుబాటు చేసినా ఇంకా వెంటాడుతునే ఉంది. ఆరునెలల  తర్వతా అసలు నిందితుడు దొరకటంతో  పునర్విచారణ పేరుతో  అరెస్టుల పర్వం కొనసాగుతుంది. దొంగను పట్టించిన రవాణాశాఖ అధికారులపై సైతం కేసులు నమోదు కావటం సంచలనంగా మారింది. కేసులో రవాణాశాఖ అధికారులదే తప్పంటూ పోలీసులు నిర్ధారిస్తుండగా .. పోలీసులు ఇచ్చిన తప్పుడు మిస్సింగ్‌ సర్టిఫికేట్‌ వల్లే  ఈ తప్పు జరిగినట్లు రవాణాశాఖ అధికారులు మండిపడుతున్నారు. మార్చినెలలో యార్లగడ్డ నాగ చెతన్య తన వాహనం పై సంకూరి రవికిరణ్‌ అనే వ్యక్తి తనకు తెలియకుండా రూ.5.5లక్షలు రుణం తీసుకున్నాడని దీనిపై విచారించి బాధ్యులపై చర్య తీసుకోవాలని ఉప రవాణా కమిషనరును కోరారు. దీనిపై విచారించిన రవాణాశాఖ అధికారులు పోలీసులు ఇచ్చిన మిస్సింగ్‌ సర్టిఫికేట్‌ ఆధారంగానే రవికిరణ్‌ సృష్టించిన నకిలీ సర్టిఫికెట్లుతో పొరపాటు జరిగిందని గ్రహించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement