
రిలయన్స్ ఇండస్ట్రీస్ మరో కీలక నిర్ణయం తీసుకుంది. జస్ట్ డయల్‌ను కొనుగోలు చేయడానికి పావులు కదుపుతోంది. సుమారు 900 మిలియన్ డాలర్లతో జస్ట్‌డయల్‌ను సొంతం చేసుకునేందుకు రిలయన్స్ ఇండస్ట్రీస్ చర్చలు జరుపుతున్నట్లుగా తెలుస్తోంది. ఈ చర్చలు విజయవంతమైతే..జస్ట్ డయల్‌కు దేశవ్యాప్తంగా ఉన్న వ్యాపారుల డేటాబేస్ రిటైల్ మార్కెట్‌లో రిలయన్స్ వేగంగా పుంజుకోవడానికి సహాయపడుతుందని నిపుణులు అంచనా వేస్తున్నారు. కాగా గతంలో జస్ట్ డయల్ టాటాతో చర్చలు జరపగా, ఆ చర్చలకు జస్ట్ డయల్ ముగింపు పలికినట్లుగా తెలుస్తోంది.
2021 మార్చి 31 తో ముగిసిన త్రైమాసికంలో జస్ట్‌డయల్ నికర లాభం సంవత్సరానికి 55.9% (రూ. 33.6 కోట్లకు), ఆపరేటింగ్ ఆదాయం 25.2% తగ్గి 175.7 కోట్లకు చేరుకుంది. ప్రస్తుతం జస్ట్‌డయల్ విలువ రూ .2,387.9 కోట్లు. రిలయన్స్ ఇండస్ట్రీస్ జస్ట్‌డయల్‌ను కొనుగోలు చేస్తోందన్న ఊహగానాలతో జస్ట్‌డయల్ స్టాక్ ధర గురువారం రోజున 2.5 శాతం పెరిగి రూ .1,107 వద్ద ముగిసింది.