Just Dial
-
ఎలక్ట్రిక్ వాహనాలపై క్రేజ్ మరీ ఇంతగా ఉందా...!
Demand For Electric Vehicles Justdial Report: అధిక ఇంధన ధరలతో సతమతమవుతున్న వాహనదారులు సంప్రాదాయ శిలాజ ఇంధన వాహనాలకు గుడ్‌బై చెబుతూ ఎలక్ట్రిక్ వాహనాలపై ఎగబడుతున్నారు. ఎలక్ట్రిక్ వాహనాలకు డిమాండ్ గణనీయంగా పెరిగిందని జస్ట్‌డయల్ తన నివేదికలో వెల్లడించింది. టైర్ 1 నగరాల్లో ఈవీ ట్రెండ్‌లో ముందున్నాయి. ఢిల్లీ, ముంబై, హైదరాబాద్, కోల్కత్తా, బెంగళూరు, చెన్నై లాంటి టైర్ 1 నగరాల్లో ఈ-స్కూటర్, ఈ-కార్లకు భారీ డిమాండ్ నెలకొంది. గణనీయమైన వృద్ధి..! ఇంధన ధరలతో సతమతమవుతున్న వాహనదారులుతో పాటుగా, కొత్తగా వాహనాలను కొనేవారు కూడా ఎక్కువగా ఎలక్ట్రిక్ వాహనాలకే జై కొడుతున్నారు. జస్ట్ డయల్ కన్స్యూమర్ ఇన్సైట్ల ప్రకారం...ఈ-స్కూటర్లు సంవత్సరానికి అత్యధికంగా 220.7 శాతం మేర డిమాండ్‌ను సాధించగా, ఈ-కార్లు 132.4 శాతం, ఈ-మోటార్‌సైకిళ్లకు 115.3 శాతం , ఈ-సైకిళ్లకు 66.8 శాతం డిమాండ్ ఉన్నట్లు జస్ట్ డయల్ తన నివేదికలో పేర్కొంది. ఎలక్ట్రిక్ వాహనాలపై జస్ట్ డయల్‌కు వచ్చిన కాల్స్ ఆధారంగా ఈ నివేదికను రూపొందించనట్లు తెలుస్తోంది. ఇక టైర్ 2 నగరాల్లో మైసూర్, ఇండోర్, జైపూర్, సూరత్, ఆగ్రా, జోధ్‌పూర్, సాంగ్లీ, వడోదర, నాసిక్, చండీగఢ్ నగరాలు టాప్-10 లో ఉన్నాయి. ఎలక్ట్రిక్ కార్లకు డిమాండ్ వచ్చినప్పుడు ముంబై, ఢిల్లీ, బెంగళూరు మొదటి మూడు టైర్ 1 నగరాల్లో నిలవగా... తరువాతి స్థానాల్లో హైదరాబాద్, పూణే, చెన్నై, అహ్మదాబాద్, కోల్‌కతా నిలిచాయి. నాసిక్, లక్నో, నాగ్‌పూర్, కోయంబత్తూర్, జైపూర్, విజయవాడ, గోవా, సూరత్, జబల్పూర్ , విశాఖపట్నం ఈ-కార్ల డిమాండ్‌లో అగ్రస్థానంలో ఉన్నాయి. లగ్జరీ విభాగంలో కూడా ఎక్కువే..! లగ్జరీ కార్ల విభాగంలో కూడా డిమాండ్ పెరిగిందని జస్ట్ డయల్ నివేదిక వెల్లడించింది. బుగట్టి, ఫెరారీ, లంబోర్ఘిని , పోర్స్చే డిమాండ్‌లో పెరుగుదల కనిపించింది. బుగట్టి అత్యధికంగా శోధించబడిన బ్రాండ్‌గా సుమారు...ఈ పండుగ సీజన్లో 167 శాతం డిమాండ్‌ను కల్గి ఉన్నట్లు తెలుస్తోంది. -
రిలయన్స్ చేతికి జస్ట్ డయల్!
ముంబై: దేశీయ ఆన్లైన్ కామర్స్ మార్కెట్లో మరింత పట్టు సాధించే దిశగా రిలయన్స్ రిటైల్ వెంచర్స్(ఆర్ఆర్వీఎల్) అడుగులు వేస్తుంది. రిలయన్స్ రిటైల్ వెంచర్స్ సెప్టెంబర్ 1, 2021 నుంచి అమల్లోకి వచ్చిన సెబీ నిబంధనలకు అనుగుణంగా జస్ట్ డయల్ లిమిటెడ్ పై నియంత్రణ తీసుకున్నట్లు తెలిపింది. లోకల్ సెర్చి ఇంజిన్ జస్ట్ డయల్‌లో రిలయన్స్ రిటైల్ 40.95% వాటాలు కొనుగోలు చేసింది. ఇంతకు ముందు తెలిపిన వివరాల ప్రకారం.. కంపెనీ తదుపరి వృద్ధి లక్ష్యాల సాధనకు తోడ్పడేలా జస్ట్‌డయల్ వ్యవస్థాపకుడు వీఎస్ఎస్ మణి ఇకపైనా మేనేజింగ్ డైరెక్టర్, సీఈవోగా కొనసాగుతారని ఆర్ఆర్వీఎల్ తెలిపింది. రిలయన్స్ రిటైల్ ఈ రోజు స్టాక్ ఎక్స్ఛేంజీలకు తెలిపిన ఒక ప్రకటనలో.. ఆర్ఆర్వీఎల్, జస్ట్‌డయల్, వీఎస్ఎస్ మణి, ఇతరుల మధ్య కుదిరిన ఒప్పందం ప్రకారం 2.12 కోట్ల ఈక్విటీ షేర్లను రూ.1,022.25 రేటు చొప్పున ప్రిఫరెన్షియల్ ప్రాతిపదికన ఆర్‌ఆర్‌వీఎల్‌కు కేటాయించినట్లు తెలిపింది. అలాగే వీఎస్ఎస్ మణి నుంచి షేరు ఒక్కింటికి రూ.1,020 రేటు చొప్పున ఆర్ఆర్వీఎల్ 1.31 కోట్ల షేర్లను కొనుగోలు చేసింది. జస్ట్ డయల్ అనేది భారతదేశంలోని ప్రముఖ లోకల్ సెర్చి ఇంజిన్ ఫ్లాట్ ఫారం. ఇది టెలిఫోన్ మరియు టెక్ట్స్ ద్వారా వెబ్ సైట్లు, యాప్ లు వంటి బహుళ ఫ్లాట్ ఫారాల ద్వారా దేశవ్యాప్తంగా యూజర్లకు సెర్చ్ సంబంధిత సేవలను అందిస్తుంది.(చదవండి: వాట్సాప్‌కు ఐర్లాండ్ భారీ షాక్...!) -
క్యూ1 ఫలితాలు, ప్రపంచ పరిణామాలే కీలకం
ముంబై: కార్పొరేట్ల తొలి క్వార్టర్ ఆర్థిక ఫలితాలు, ప్రపంచ పరిణామాలు ఈ వారం స్టాక్ సూచీల గమనాన్ని నిర్దేశిస్తాయని నిపుణులు భావిస్తున్నారు. దేశీయ ఈక్విటీ పట్ల విదేశీ ఇన్వెస్టర్ల వైఖరి కీలకంగా మారొచ్చని చెబుతున్నారు. డాలర్ మారకంలో రూపాయి విలువ, క్రూడాయిల్ కదలికల అంశాలు సైతం ట్రేడింగ్ ప్రభావితం చేయవచ్చని విశ్లేషిస్తున్నారు. అలాగే కొత్త రకం కరోనా వేరియంట్లు, రుతుపవనాల కదలికలపైనా ఇన్వెస్టర్లు దృష్టి సారించవచ్చు. మార్కెట్ సోమవారం ముందుగా హెచ్డీఎఫ్సీ బ్యాంక్ ఆర్థిక గణాంకాలు, రిలయన్స్ – జస్ట్ డయల్ విలీన ప్రక్రియ అంశాలపై స్పందించాల్సి ఉంటుంది. బక్రీద్ పండుగ సందర్భంగా బుధవారం ఎక్సే్చంజీలకు సెలవు ప్రకటించారు. కావున ఈ వారంలో ట్రేడింగ్ నాలుగు రోజులకే పరిమితం కానుంది. ‘‘దేశీయంగా సానుకూల సంకేతాలు నెలకొన్నప్పటికీ.., ప్రపంచ ఈక్విటీ మార్కెట్లలో బలహీనతలు నెలకొన్నాయి. విదేశీ ఇన్వెస్టర్ల అమ్మకాలు ఆగడం లేదు. సూచీల తాజా గరిష్టాల వద్ద లాభాల స్వీకరణకు అవకాశం ఉంది. ఈ అంశాలు ఒడిదుడుకుల ట్రేడింగ్‌ను ప్రేరేపించవచ్చు. సాంకేతికంగా నిఫ్టీ 15,600 వద్ద బలమైన మద్దతు స్థాయిని కలిగి ఉంది. ఎగువస్థాయిలో 15,950 వద్ద కీలకమైన నిరోధాన్ని కలిగి ఉంది. ఈ స్థాయిని అధిగమిస్తే 16200 స్థాయి వద్ద మరో ప్రధాన అవరోధాన్ని పరీక్షిస్తుంది’’ అని ఈక్విటీ రీసెర్చ్ హెడ్ నిరాలి షా తెలిపారు. దేశీయంగా మెరుగైన స్థూల ఆర్థిక గణాంకాల నమోదు కావడంతో పాటు కంపెనీలు ఆశాజన ఆర్థిక ఫలితాల ప్రకటన, అంతర్జాతీయ మార్కెట్ల నుంచి సానుకూల సంకేతాలు అందడంతో నెలరోజుల తర్వాత గతవారంలో సూచీలు తిరిగి సరికొత్త గరిష్టాలను నమోదు చేశాయి. ఐటీ, ఆర్థిక, బ్యాంక్స్, క్యాపిటల్ గూడ్స్, హెల్త్‌కేర్, మెటల్స్ షేర్లు రాణిండంతో క్రితం వారంలో సెన్సెక్స్ 754 పాయింట్లు, నిఫ్టీ 234 పాయింట్లను ఆర్జించగలిగాయి. కీలక దశకు కార్పొరేట్ ఆర్థిక ఫలితాల సందడి... దేశీయ కార్పొరేట్ల తొలి త్రైమాసికపు ఆర్థిక ఫలితాల ప్రకటన సందడి కీలక దశకు చేరుకుంది. బ్యాంకింగ్, ఆటో, ఐటీ రంగాలకు చెందిన అనేక పెద్ద కంపెనీలు ఈ వారంలో తమ క్యూ1 ఫలితాలను వెల్లడించనున్నాయి. ఇందులో రిలయన్స్ ఇండస్ట్రీస్, ఐటీసీ, ఐసీసీఐ బ్యాంకులతో సహా నిఫ్టీ 50 ఇండెక్స్‌లోని మొత్తం పది కంపెనీలున్నాయి. జూన్ క్వార్టర్ ఫలితాల ప్రకటన నేపథ్యంలో స్టాక్ ఆధారిత ట్రేడింగ్‌కు అవకాశం ఉంది. నేడు రెండు లిస్టింగ్‌లు... ఇటీవల ఐపీఓ ఇష్యూలను పూర్తి చేసుకున్న రోడ్ల నిర్మాణ సంస్థ జీఆర్ ఇన్ఫ్రా ప్రాజెక్ట్స్, ప్రత్యేక రసాయనాల తయారీ కంపెనీ క్లీన్ సైన్స్ టెక్నాలజీ షేర్లు నేడు(సోమవారం) ఎక్సే్చంజీల్లో లిస్ట్‌కానున్నాయి. గ్రే మార్కెట్లో ఇరు కంపెనీల షేర్లు 55–60 శాతం ప్రీమియం ధర పలుకుతున్నాయి. కావున లాభదాయక లిస్టింగ్‌కు అవకాశం ఉందని ట్రేడర్లు అంచనావేస్తున్నారు. ఆగని విదేశీ ఇన్వెస్టర్ల అమ్మకాలు దేశీయ ఈక్విటీ మార్కెట్లో విదేశీ ఇన్వెస్టర్ల అమ్మకాలు ఆగడం లేదు. ఈ జూలై తొలి భాగంలో రూ.4,515 కోట్ల షేర్లను విక్రయించినట్లు ఎక్సే్చంజీ గణాంకాలు చెబుతున్నాయి. సూచీలు రికార్డు గరిష్టాల వద్ద ట్రేడ్ అవుతుండటంతో ఎఫ్ఐఐలు లాభాల స్వీకరణకు మొగ్గుచూపుతున్నారు. -
రిలయన్స్ చేతికి జస్ట్ డయల్
న్యూఢిల్లీ: దేశీ ఆన్లైన్ కామర్స్ మార్కెట్లో మరింత పట్టు సాధించే దిశగా రిలయన్స్ రిటైల్ వెంచర్స్ (ఆర్ఆర్వీఎల్) .. తాజాగా లోకల్ సెర్చి ఇంజిన్ జస్ట్ డయల్‌లో 40.95% వాటాలు కొనుగోలు చేయనున్నట్లు ప్రకటించింది. ఈ డీల్ విలువ రూ. 3,497 కోట్లని శుక్రవారం వెల్లడించింది. సెబీ టేకోవర్ నిబంధనల ప్రకారం మరో 26% వాటా (సుమారు 2.17 కోట్ల షేర్లు) కోసం ఓపెన్ ఆఫర్ ప్రకటించనున్నట్లు ఎక్సే్చంజీలకు తెలిపింది. కంపెనీ తదుపరి వృద్ధి లక్ష్యాల సాధనకు తోడ్పడేలా జస్ట్‌డయల్ వ్యవస్థాపకుడు వీఎస్ఎస్ మణి ఇకపైనా మేనేజింగ్ డైరెక్టర్, సీఈవోగా కొనసాగుతారని ఆర్ఆర్వీఎల్ తెలిపింది. జస్ట్ డయల్‌లో ఇన్వెస్ట్ చేసే నిధులతో కంపెనీ సమగ్రమైన లోకల్ లిస్టింగ్, కామర్స్ ప్లాట్‌ఫాంగా కార్యకలాపాలు విస్తరించగలదని పేర్కొంది. లక్షల కొద్దీ లఘు, చిన్న, మధ్య స్థాయి భాగస్వామ్య వ్యాపార సంస్థలకు డిజిటల్ ఊతమిచ్చేందుకు ఈ డీల్ ఉపయోగపడగలదని ఆర్ఆర్వీఎల్ డైరెక్టర్ ఈషా అంబానీ తెలిపారు. తమ లక్ష్యాల సాధనకు, వ్యాపార పురోగతికి రిలయన్స్‌తో వ్యూహాత్మక భాగస్వామ్యం దోహదపడగలదని వీఎస్ఎస్ మణి తెలిపారు. డీల్ స్వరూపం ఇలా..: ఆర్ఆర్వీఎల్, జస్ట్‌డయల్, వీఎస్ఎస్ మణి, ఇతరుల మధ్య కుదిరిన ఒప్పందం ప్రకారం 2.12 కోట్ల ఈక్విటీ షేర్లను రూ. 1,022.25 రేటు చొప్పున ప్రిఫరెన్షియల్ ప్రాతిపదికన ఆర్‌ఆర్‌వీఎల్‌కు కేటాయిస్తారు. అలాగే వీఎస్ఎస్ మణి నుంచి షేరు ఒక్కింటికి రూ. 1,020 రేటు చొప్పున ఆర్ఆర్వీఎల్ 1.31 కోట్ల షేర్లను కొనుగోలు చేస్తుంది. జస్ట్‌డయల్ కార్యకలాపాలు 1996లో ప్రారంభమయ్యాయి. మొబైల్, యాప్స్, వెబ్సైట్, టెలిఫోన్ హాట్‌లైన్ వంటి మాధ్యమాల ద్వారా జస్ట్‌డయల్ సర్వీసులను పొందే యూజర్ల సంఖ్య మూడు నెలల సగటు సుమారు 13 కోట్ల దాకా ఉంటుంది. -
టాటాల తరువాత జెస్ట్డయిల్ వేటలో రిలయన్స్ ఇండస్ట్రీస్
-
రిలయన్స్ ఇండస్ట్రీస్ మరో కీలక నిర్ణయం..!
రిలయన్స్ ఇండస్ట్రీస్ మరో కీలక నిర్ణయం తీసుకుంది. జస్ట్ డయల్‌ను కొనుగోలు చేయడానికి పావులు కదుపుతోంది. సుమారు 900 మిలియన్ డాలర్లతో జస్ట్‌డయల్‌ను సొంతం చేసుకునేందుకు రిలయన్స్ ఇండస్ట్రీస్ చర్చలు జరుపుతున్నట్లుగా తెలుస్తోంది. ఈ చర్చలు విజయవంతమైతే..జస్ట్ డయల్‌కు దేశవ్యాప్తంగా ఉన్న వ్యాపారుల డేటాబేస్ రిటైల్ మార్కెట్లో రిలయన్స్ వేగంగా పుంజుకోవడానికి సహాయపడుతుందని నిపుణులు అంచనా వేస్తున్నారు. కాగా గతంలో జస్ట్ డయల్ టాటాతో చర్చలు జరపగా, ఆ చర్చలకు జస్ట్ డయల్ ముగింపు పలికినట్లుగా తెలుస్తోంది. 2021 మార్చి 31 తో ముగిసిన త్రైమాసికంలో జస్ట్‌డయల్ నికర లాభం సంవత్సరానికి 55.9% (రూ. 33.6 కోట్లకు), ఆపరేటింగ్ ఆదాయం 25.2% తగ్గి 175.7 కోట్లకు చేరుకుంది. ప్రస్తుతం జస్ట్‌డయల్ విలువ రూ .2,387.9 కోట్లు. రిలయన్స్ ఇండస్ట్రీస్ జస్ట్‌డయల్‌ను కొనుగోలు చేస్తోందన్న ఊహగానాలతో జస్ట్‌డయల్ స్టాక్ ధర గురువారం రోజున 2.5 శాతం పెరిగి రూ .1,107 వద్ద ముగిసింది. -
జొమాటో.. పబ్లిక్ ఇష్యూ బాట
ముంబై: ఫుడ్ డెలివరీ కంపెనీ జొమాటో పబ్లిక్ ఇష్యూ బాట పట్టింది. తద్వారా దేశీ స్టాక్ ఎక్స్ఛేంజీలలో తొలిసారి లిస్టయిన ఆధునిక ఇంటర్నెట్ వినియోదారు కంపెనీగా నిలిచే వీలున్నట్లు నిపుణులు పేర్కొంటున్నారు. ఇంతక్రితం 2019 జూన్‌లో బీటూబీ ఆన్లైన్ కంపెనీ ఇండియామార్ట్ ఇంటర్మెష్ మార్కెట్లలో లిస్టయ్యింది. ఇంటర్నెట్ ఆధారిత సేవలందించే ఇతర కంపెనీలను పరిగణిస్తే.. 2006లో ఇన్ఫో ఎడ్జ్, 2013లో జస్ట్ డయల్ పబ్లిక్ ఇష్యూలను విజయవంతంగా ముగించాయి. జొమాటోలో ఇన్ఫో ఎడ్జ్ ఇన్వెస్ట్ చేసిన విషయం విదితమే. కాగా.. 2010లో ఆన్ లైన్ ట్రావెల్ సేవల కంపెనీ మేక్ మై ట్రిప్.. నాస్డాక్ లో లిస్టింగ్ సాధించింది. కొటక్ మహీంద్రా.. పబ్లిక్ ఇష్యూకి మర్చంట్ బ్యాంకుగా కొటక్ మహీంద్రాను జొమాటో ఎంపిక చేసుకున్నట్లు తెలుస్తోంది. ఇష్యూకి న్యాయ సలహాదారులుగా సైరిల్ అమర్‌చంద్ మంగళ్‌దాస్, ఇండస్ లా సేవలందించనున్నట్లు సంబంధిత వర్గాలు పేర్కొన్నాయి. కాగా.. దేశీయంగా దిగ్గజ కంపెనీలుగా ఆవిర్భవించిన ఫ్లిప్ కార్ట్, పేటీఎమ్, బిగ్ బాస్కెట్ సైతం భవిష్యత్ లో పబ్లిక్ ఇష్యూలు చేపట్టే యోచనలో ఉన్నట్లు మార్కెట్ వర్గాలు పేర్కొంటున్నాయి. ఫుడ్ డెలివరీ కంపెనీ జొమాటోలో.. ఇప్పటికే ఇన్ఫో ఎడ్జ్, టెమాసెక్, యాంట్ ఫైనాన్షియల్, టైగర్ గ్లోబల్ తదితర సంస్థలు ఇన్వెస్ట్ చేసిన విషయం విదితమే. దేశీ మార్కెట్ ఓకే విదేశీ లిస్టింగ్ కాకుండా దేశీయంగానే ఐపీవో చేపట్టాలని జొమాటో నిర్ణయించుకున్నట్లు విశ్లేషకులు తెలియజేశారు. దేశీయంగానూ విజయవంతమైన కంపెనీలకు తగిన ధర లభిస్తుండటమే దీనికి కారణమని వివరించారు. టెక్నాలజీ, ఇంటర్నెట్ కంపెనీల పట్ల పలు దేశాల ఇన్వెస్టర్లు సైతం ఆసక్తి చూపుతున్నట్లు తెలియజేశారు. 2019 జులైలో రూ. 973 ధరలో ఐపీవోకు వచ్చిన ఇండియామార్ట్ ఇంటర్మెష్ ప్రస్తుతం రూ. 4891కు చేరిన విషయాన్ని ఈ సందర్భంగా ప్రస్తావించారు. ఈ కంపెనీ మార్కెట్ విలువ రూ. 14,240 కోట్లను తాకడం గమనార్హం. కాగా.. చివరిసారిగా నిధుల సమీకరణను పరిగణిస్తే జొమాటో విలువ 3.3 బిలియన్ డాలర్లుగా నమోదైంది. అయితే హెచ్ ఎస్బీసీ 5 బిలియన్ డాలర్లుగా అంచనా వేస్తున్నట్లు తెలుస్తోంది. -
రూ.10 మినహా.. 48గంటల్లో మొత్తం రిటర్న్
సాక్షి, సిటీబ్యూరో: అతడో మధ్య తరగతి వ్యక్తి..న్యూ నల్లకుంటప్రాంతంలో ప్రింటింగ్ ప్రెస్‌నిర్వహిస్తున్నారు... తన కుమారుడికి ఫీజు చెల్లించడం కోసం కొంత మొత్తం తన బ్యాంకు ఖాతాలోఉంచుకున్నారు..దీని నుంచిరూ.85 వేలు శనివారం సైబర్‌నేరగాళ్ల పరమైంది..ఆయన ఆలస్యం చేయకుండా సిటీ సైబర్ క్రైమ్ పోలీసుల్ని ఆశ్రయించడం, అధికారులు తక్షణం స్పందించడంతో 48 గంటల్లో పోయిన మొత్తం తిరిగి బాధితుడి ఖాతాలోకి వచ్చేశాయి. మంగళవారం సైబర్ క్రైమ్ ఠాణాకు వచ్చిన ఆయన తన కష్టార్జితాన్ని 48 గంటల్లోనే వెనక్కు రప్పించిన అధికారులకు కృతజ్ఞతలు తెలిపారు. పార్శిల్ కోసం ప్రయత్నిస్తే.. నగరంలోని న్యూ నల్లకుంట ప్రాంతానికి చెందిన పి.నందకుమార్ స్థానికంగా ప్రింటింగ్ ప్రెస్ నిర్వహిస్తున్నారు. ఆయన కుమారుడు గీతం కాలేజీలో బీటెక్ రెండో సంవత్సరం చదువుతున్నారు. నందకుమార్‌కు వీఆర్ఎల్ లాజిస్టిక్స్ ద్వారా రెండు బాక్సులు డెలివరీ కావాల్సి ఉంది. వీటి విషయం అగడటానికి ఆయన ఆ సంస్థ నెంబర్ కోసం శనివారం జస్ట్ డయల్‌కు కాల్ చేశారు. వారు రెండు నెంబర్లు ఇవ్వడంతో వాటిని నందకుమార్ సంప్రదించారు. సాంకేతిక కారణాల నేపథ్యంలో ఆ రెండు బాక్సులు డెలివరీ కాలేదని, తమకు రూ.10 చెల్లిస్తే పంపిస్తామంటూ అవతలి వ్యక్తులు చెప్పారు. దీంతో నందకుమార్ ఆ మొత్తం చెల్లించడానికి సిద్ధమని చెప్పడంతో సైబర్ నేరగాళ్లు ఆయన నుంచి డెబిట్‌కార్డ్ వివరాలతో పాటు కాస్సేపటికి ఆయన సెల్‌ఫోన్‌కు వచ్చిన పిన్ నెంబర్ కూడా తెలుసుకున్నారు. ఈ వివరాలతో నందకుమార్ డెబిట్‌కార్డును సైబర్ నేరగాళ్లు తమ గూగుల్ పే ఖాతాకు అనుసంధానించుకున్నారు. మొదట కేవలం రూ.10 మాత్రమే తీసుకున్న వాళ్ళు ఆపై మూడు దఫాల్లో రూ.85,588 కాజేశారు. స్వల్ప వ్యవధిలోనే ఈ మూడు లావాదేవీలు జరిగిపోయాయి. అదే రోజు రాత్రి ఫిర్యాదు.. శనివారం సాయంత్రం ఇలా జరగడంతో తాను మోసపోయానని గుర్తించిన బాధితుడు రాత్రి 8 గంటల ప్రాంతంలో సిటీ సైబర్ క్రైమ్ ఠాణాకు వచ్చాడు. ఆ సమయంలో ఫిర్యాదు స్వీకరించినా కేసు నమోదు చేసే సిబ్బంది అందుబాటులో ఉండరు. అయితే ఆలస్యమైతే బాధితుడు నష్టపోతాడని భావించిన ఏసీపీ కేవీఎం ప్రసాద్ తక్షణం స్పందించి అవసరమైన చర్యలు తీసుకోవాల్సిందిగా ఇన్స్పెక్టర్ డి.ప్రశాంత్‌ను ఆదేశించారు. రంగంలోకి దిగిన ఆయన తొలుత బాధితుడి నుంచి ప్రాథమిక వివరాలు సేకరించి ఆయన ఖాతా నుంచి డబ్బు ఫ్లిప్‌కార్ట్‌కు వెళ్లినట్లు గుర్తించారు. మూడు వస్తువులు షాపింగ్ చేసిన నిందితులు ఆ మొత్తాన్ని బాధితుడి ఖాతా నుంచి లింకు చేసిన గూగుల్ పే ద్వారా చెల్లించారని తేల్చారు. దీంతో వెంటనే ఫ్లిప్‌కార్ట్ నోడల్ అధికారులకు సమాచారం ఇచ్చిన ప్రశాంత్ ఆ మూడు లావాదేవీలు రద్దు చేయించారు. తర్వాతి రోజు ఆదివారం రావడంతో... సోమవారం ఉదయం నందకుమార్ ఫిర్యాదును కేసుగా నమోదు చేశారు. మధ్యాహ్నానికే మూడు లావాదేవీల్లో రూ.85,588 ఫ్లిప్‌కార్ట్ నుంచి బాధితుడి ఖాతాలోకి వచ్చి చేరారు. దీంతో నందకుమార్ మంగళవారం మధ్యాహ్నం సైబర్ క్రైమ్ ఠాణాకు వచ్చి కృతజ్ఞతలు తెలిపారు. సైబర్ నేరాల్లోనూ ‘గోల్డెన్ అవర్స్’ సాధారణంగా రోడ్డు ప్రమాదాల్లో క్షతగాత్రులైన వారికి చికిత్స అందించడానికి గోల్డెన్ అవర్ అనేది ఉంటుంది. అయితే సైబర్ నేరాల్లోనూ బాధితులుగా మారిన వారి ఫిర్యాదు చేయడానికీ ‘గోల్డెన్ అవర్స్’ ఉంటాయి. నేరం బారినపడిన 24 గంటల్లోపు వచ్చిన తమకు సమాచారం ఇస్తే ఆ మొత్తం తిరిగి రప్పించేందుకు అవకాశం ఉంటుంది. అయితే ఈ లావాదేవీల్లో డబ్బు మర్చంట్ ఖాతాలుగా పిలిచే ఫ్లిప్‌కార్ట్ వంటి సంస్థలకు వెళితేనే ఇది సాధ్యమవుతుంది. సైబర్ నేరగాళ్ళకు చెందిన వ్యక్తిగత వాలెట్స్, ఖాతాల్లోకి వెళితే మాత్రం కష్టసాధ్యమే. – కేవీఎం ప్రసాద్, హైదరాబాద్ సైబర్ క్రైమ్ ఏసీపీ ఆ డబ్బుపై ఆశలు వదులుకున్నా శనివారం ఠాణాకు వచ్చేసరికి అధికారులు వెళ్ళిపోతున్నారు. రోడ్డుపైన నన్ను చూసి ఆగిన వాళ్ళు ఏమైందంటూ ప్రశ్నించి వెంటనే స్పందించారు. అయినప్పటికీ సైబర్ నేరాలు, ఆ నేరగాళ్ల విషయం విన్న తర్వాత నా డబ్బుపై ఆశలు వదులుకున్నా. కుమారుడికి ఫీజు చెల్లించడానికి ప్రత్యామ్నాయ మార్గాలు అన్వేషించాలని భావించా. అయితే హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు చూపిన చొరవ కారణంగా కేవలం 48 గంటల్లోనే నా డబ్బు తిరిగి వచ్చింది. మొత్తమ్మీద కేవలం రూ.10 మాత్రమే నష్టపోయా.– నందకుమార్, బాధితుడు -
జస్ట్ డయల్‌పై గూగుల్ కన్ను!
న్యూఢిల్లీ: దేశీయ సెర్చింజన్ సంస్థ జస్ట్ డయల్‌పై ప్రపంచ ఇంటర్నెట్ టెక్నాలజీ దిగ్గజం గూగుల్ కన్ను పడిందా...? జస్ట్ డయల్‌ను కొనుగోలు చేసేందుకు గూగుల్ ఉత్సాహం చూపిస్తోందా...? శుక్రవారం మార్కెట్లో ఈ సమాచారమే హల్చల్ చేసింది. ఈ దిశగా గూగుల్ చర్చలు కూడా మొదలు పెట్టిందని, త్వరలోనే జస్ట్ డయల్‌ను కొనుగోలు చేయవచ్చంటూ ఓ ప్రముఖ దినపత్రిక ప్రచురించిన కథనం ఇన్వెస్టర్లలో ఆసక్తికి దారి తీసింది. సంబంధిత కథనం ప్రకారం... దేశీయంగా తన స్థానాన్ని మరింత బలోపేతం చేసుకోవడంపై గూగుల్ దృష్టి సారించింది. ఈ నేపథ్యంలో పలు వ్యాపారాల్లో తనకు పోటీగా ఉన్న జస్ట్‌డయల్‌ను కొనేద్దామన్న ఆలోచనతో ఉంది. జస్ట్ డయల్‌లో దేశవ్యాప్తంగా ఇప్పటికే 2 కోట్ల సంస్థలు లిస్ట్ అయి ఉన్నాయి. దీంతో జస్ట్ డయల్‌ను సొంతం చేసుకుంటే వృద్ధికి కలిసొస్తుందన్నది గూగుల్ వ్యూహం. జస్ట్ డయల్ విస్తరణ... మరోవైపు జస్ట్‌డయల్ కూడా తన వ్యాపార విస్తరణలో వేగాన్ని ప్రదర్శిస్తోంది. ఈ సంస్థకు 70 శాతం ట్రాఫిక్ గూగుల్ ద్వారానే వస్తుండడం కీలకమైన అంశం. గూగుల్, ఆస్క్‌మి నుంచి పోటీని తట్టుకునేందుకు వీలుగా సెర్చ్‌ప్లస్ తరహా సరికొత్త ఆవిష్కరణలపై దృష్టి పెట్టింది. స్థానిక సమాచారం అందించే సంస్థగా ఉన్న జస్ట్ డయల్ నూతన వ్యాపార అవకాశాలపైనా కన్నేసింది. ఇందులో భాగంగా ఇటీవలే జేడీ ఓమ్నిని ప్రారంభించింది. చిన్న, మధ్యస్థాయి సంస్థలు ఆన్లైన్ వేదికగా తమ వ్యాపారాన్ని నిర్వహించుకునేందుకు పూర్తి సహకారాన్ని జేడీ ఓమ్ని అందిస్తుంది. అయినప్పటికీ సెర్చింజన్లలో సేవల్లో గూగుల్ నుంచి పోటీ పెరగడంతో జస్ట్ డయల్ వ్యాపారం అంత సులభం కాబోదన్నది విశ్లేషకుల అభిప్రాయం. ఒకవేళ గూగుల్ కనుక జస్ట్ డయల్‌ను కొనుగోలు చేస్తే, అప్పుడు జస్ట్ డయల్ చాలా వేగంగా వృద్ధి చెందుతుందన్న విశ్లేషణలు వ్యక్తమవుతున్నాయి. లాభపడిన షేరు గూగుల్ కొనుగోలు వార్తలు జస్ట్ డయల్ షేరును మార్కెట్లో పరుగులు పెట్టించాయి. ఇంట్రాడేలో 20 శాతం పెరిగి రూ.549.85 వరకు వెళ్లిన షేరు, ఆ తర్వాత కొనుగోలు వార్తలను కంపెనీ ఖండించడంతో 9 శాతం లాభంతో బీఎస్ఈలో రూ.500.30 వద్ద క్లోజయింది. -
జస్ట్ డయల్‌కి బై బ్యాక్ జోష్
ముంబై: స్థానిక సర్చ్ ఇంజీన్ జస్ట్ డయల్ దలాల్ స్ట్రీట్‌లో మెరుపులు మెరిపిస్తోంది. తదుపరం వారంలో బై బ్యాక్ ప్రతిపాదన నేపథ్యంలో జస్ట్ డయల్ కౌంటర్ బుధవారం దూసుకుపోతోంది. షేర్లను బై బ్యాక్ చేయనుందన్న అంచనాలతో ఇన్వెస్టర్ల కొనుగోళ్లు ఊపందుకున్నాయి. దీంతో ఈ షేరు 5 శాతం జంప్‌చేసింది. జూలై2 4న నిర్వహించనున్న సమావేశంలో డైరెక్టర్ల బోర్డు బైబ్యాక్ ప్రతిపాదనను పరిశీలించనున్నట్లు జస్ట్ డయల్ మార్కెట్ రెగ్యులేటరీకి తెలిపింది. దీంతో మార్కెట్ ఆరంభంలోనే జస్ట్ డయల్ షేరు 5.66శాతం జంప్ చేసి ప్రస్తుం 8శాతానికిపైగా లాభపడి రూ. 385 వద్ద ట్రేడ్అవుతోంది. కాగా గత రెండు వారాల్లో 2.22 లక్షల షేర్ల సగటు రోజువారీ వాటాతో పోలిస్తే బిఎస్ఇలో 2.85 లక్షల షేర్లను కౌంటర్లో ఇప్పటివరకు వర్తకం చేశారు. 2016 డిసెంబర్ 27 వ తేదీన ఈ కంపెనీ షేర్లు రూ. 619.45 వద్ద 52 నెలల గరిష్ఠ స్థాయికి చేరింది. మార్చి 20, 2017 నాటి రూ. 610.60 పోలిస్తే గత నాలుగు నెలల్లో కంపెనీ షేర్ ధర 42 శాతం క్షీణించి 354.45 రూపాయలకు చేరుకుంది.మరోవైపు ఈ నెలలోనే కంపెనీ క్యూ1 ఫలితాలను కూడా ప్రకటించనుంది. -
మిస్ అయిన జస్ట్ డయల్
ముంబై: ఎనలిస్టుల అంచనాలను అందుకోవడంలో జస్ట్ డయల్ మిస్ అయింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం మొదటి త్రైమాసికంలో నిరాశాజనక ఫలితాలను నమోదు చేసింది. క్యూ1(ఏప్రిల్-జూన్)లో నికర లాభం 8 శాతం పెరిగి రూ. 39 కోట్లుగా ప్రకటించింది. మొత్తం ఆదాయం 6 శాతం పెరిగి రూ. 176 కోట్లకు చేరింది. మార్చి క్వార్టర్ లో రూ.179 కోట్ల ఆదాయాన్ని ఆర్జించిన సంస్థ ఈ సారి మరింత క్షీణించింది. అటు నిర్వహణ లాభం(ఇబిటా) కూడా 35 శాతం క్షీణించి రూ. 29 కోట్లకు పరిమితమైంది. ఇబిటా మార్జిన్లు 27 శాతం నుంచి 17 శాతానికి పడిపోయాయి. దీంతో మదుపర్లు ఈ షేర్ అమ్మకాలవైపు మొగ్గు చూపారు. మొదట్లో 6 శాతానికిపైగా పతనమైనా అనంతరం కోలుకుంది. దాదాపు 3శాతం నష్టాల్లో ఉంది ఎక్కువ వ్యాపారకాంక్షతో ఇచ్చిన ఎగ్రెస్సివ్ డిస్కౌంట్లు ఆదాయాన్ని దెబ్బతీశాయని ఎనలిస్టుల అంచనా. మరోవైపు జొమాటో, ప్రాక్టో లాంటి సంస్థల పోటీ గత కొన్ని త్రైమాసికాల్లో ఒత్తిడిపెంచిందని తెలిపారు. -
ఫార్చ్యూన్ నెక్స్ట్ 500లో జస్ట్‌డయల్, ఐఆర్సీటీసీ
న్యూఢిల్లీ: ఈ ఏడాది ఫార్చ్యూన్ నెక్స్ట్ 500 భారతీయ కంపెనీల జాబితాను ఫార్చ్యూన్ మ్యాగజైన్ వెల్లడించింది. జస్ట్ డయల్, యూటీఐ అసెట్ మేనేజ్మెంట్ కంపెనీ, ఐఆర్సీటీసీ తదితర సంస్థల పేర్లు ఈ జాబితాలో ఉన్నాయి. ఈ జాబితాలో చోటు సాధించిన కంపెనీల్లో చాలా వరకూ మిడ్ సైజ్ కంపెనీలు. ఈ కంపెనీలను స్మాల్ వండర్స్‌గా ఈ మ్యాగజైన్ అభివర్ణించింది. ఈ జాబితాలో చోటు సాధించిన కంపెనీలు ఫార్చ్యూన్ ఇండియా 500 జాబితాలో చేరే అవకాశాలు ఉన్నాయని పేర్కొంది. వివరాలు.., ♦ ఈ జాబితాలో డైనమాటిక్ టెక్నాలజీస్ సంస్థ అగ్రస్థానంలో నిలిచింది. రూ.1,693 కోట్ల వార్షిక ఆదాయంతో ఈ కంపెనీ ఈ ఘనత సాధించింది. ♦ ఆ తర్వాతి స్థానాల్లో నెక్టార్ లైఫ్‌సైన్స్(రూ.1,692 కోట్లు), ఓస్వాల్ ఉలెన్ మిల్స్(రూ.1,689 కోట్లు), వీఆర్ఎల్ లాజిస్టిక్స్(రూ.1,682.5 కోట్లు), హిటాచి హోమ్ అండ్ లైఫ్ సొల్యూషన్స్(రూ.1,682 కోట్లు)లు ఉన్నాయి. ♦ నెక్స్ట్ 500 జాబితాలోని మొత్తం కంపెనీల ఆదాయం రూ.5,14,788 కోట్లుగా ఉంది. ఒక్కో కంపెనీ సగటు ఆదాయం రూ.1,000 కోట్ల పైమాటే. ♦ఈ జాబితాలో చోటు సాధించిన కంపెనీలు వివిధ రంగాలకు చెందినవి. ఈ కంపెనీలు బేసిక్ మెటీరియల్స్, ఆర్థిక సేవలు, ఆహారం,వ్యవసాయ ఉత్పత్తులు, ఫార్మా, ఐటీ, క్యాపిటల్ గూడ్స్, ఇనుము, ఉక్కు రంగాల్లో కార్యకలాపాలు నిర్వహిస్తున్నాయి. ♦ టాప్10లో ఉన్న కంపెనీల్లో కొన్ని-గుజరాత్ మినరల్ డెవలప్మెంట్ కార్పొ, లుకాస్-టీవీఎస్,గతి, అడెక్కో ఇండియా, జిందాల్ అల్యూమినియం, ♦ ఇండియన్ రైల్వేస్ టూరిజమ్ అండ్ కేటరింగ్ విభాగం ఐఆర్సీటీసీ తన ర్యాంక్‌ను మెరుగుపరుచుకుంది. గత ఏడాది జాబితాలో 328గా ఉన్న ఈ కంపెనీ ర్యాంక్ ఈసారి జాబితాలో 199కు పెరిగింది. ♦ ఈ జాబితాలో తొలిసారిగా చేరిన యూటీఐ అసెట్ మేనేజ్మెంట్ కంపెనీకి 442, జస్ట్ డయల్ కంపెనీకి 449 ర్యాంక్‌లు లభించాయి. ♦ ఇటీవలే ఐపీఓకు వచ్చిన నారాయణ హృదయాలయ, ఉజ్జీవన్ ఫైనాన్షియల్ సర్వీసెస్, డాక్టర్ లాల్ పాథ్‌ల్యాబ్స్, పరాగ్ మిల్క్ ఫుడ్స్ కంపెనీలు ఈ జాబితాలో స్థానాలు సాధించాయి. -
ఫార్చ్యూన్ లిస్ట్ లో ఐఆర్ సీటీసీ, జస్ట్ డయల్
న్యూఢిల్లీ : జస్ట్ డయిల్, ఐఆర్ సీటీసీ(ఇండియన్ రైల్వే కేటరింగ్ అండ్ టూరిజం కార్పొరేషన్), యూటీఐ అసెట్ మేనేజ్ మెంట్ కంపెనీలు ఫార్చ్యూన్ నెస్ట్ 500 భారత కంపెనీల జాబితాలో చోటు దక్కించుకున్నాయి. డైనమ్యాటిక్ టెక్నాలజీ ఈ జాబితాలో అగ్రస్థానంలో నిలిచింది. మధ్యస్త కంపెనీలే ఈ జాబితాలో ఎక్కువగా చోటుదక్కించుకోగా, వార్షిక ఆదాయం రూ.1,693 కోట్లతో డైనమ్యాటిక్ టెక్నాలజీ టాప్ లో ఉంది. డైనమ్యాటిక్ తర్వాత రూ.1,692 కోట్లతో నెక్ట్రా లైఫ్ సైన్స్, రూ,1,689 కోట్లతో ఓస్వాల్ వుల్లెన్ మీల్స్, రూ.1,682.5 కోట్లతో వీఆర్ఎల్ లాజిస్టిక్స్, రూ.1,682.18 కోట్లతో హిటాచీ హోమ్ అండ్ లైఫ్ సొల్యూషన్స్ లు ఉన్నాయి. అయితే ఈ జాబితాలో చోటు దక్కించుకున్న యూటీఐ అసెట్ మేనేజ్ మెంట్ కంపెనీ(442), జస్ట్ డయిల్(449)లు కొత్త కంపెనీలుగా ఫార్చ్యూన్ జాబితాలో నిలిచాయి. అయితే గతేడాది 328 ర్యాంకు తో ఉన్న ఇండియన్ రైల్వేస్ టూరిజం అండ్ కేటరింగ్ సంస్థ ఐఆర్ సీటీసీ తన ర్యాంకింగ్ ను మెరుగుపరుచుకుని, 199 ర్యాంక్ ను దక్కించుకుంది. మరో ఇతర నాలుగు కంపెనీలు సైతం గతేడాది కంటే తమ ర్యాంకింగ్ లను మెరుగుపరుచుకున్నాయి. నెస్ట్ 500 కంపెనీలు మొత్తం రెవెన్యూలు రూ.5,14,788 కోట్లగా నమోదైనట్టు ఫార్చ్యూన్ మ్యాగజైన్ వెల్లడించింది. వివిధ రంగాల నుంచి ఈ సంస్థలు ఫార్చ్యూన్ జాబితాలో చోటు దక్కించుకున్నాయి. ఫైనాన్సియల్ సర్వీసులు, ఫుడ్ అండ్ అగ్రి ప్రొడక్ట్స్, ఫార్మా అండ్ ఇన్ ఫర్మేషన్ టెక్నాలజీ, క్యాపిటల్ గూడ్స్, ఐరన్ అండ్ స్టీల్ సంస్థలు ఈ జాబితాలో ఉన్నాయి -
రెండ్రోజుల్లోనే 30 శాతం పెరిగిన ‘జస్ట్ డయల్’ షేర్లు
హైదరాబాద్: ఇంటర్నెట్ సర్చ్ సంస్థ ‘జస్ట్ డయల్’ షేర్లు గత రెండు రోజుల్లోనే 30 శాతం మేర పెరిగాయి. బుధవారం నాడు ఏకంగా 19 శాతం పెరగ్గా, గురువారం నాడు పదిశాతం పెరిగాయి. సంస్థ షేర్ల ధర క్రమంగా పడిపోతున్న నేపథ్యంలో హఠాత్తుగా ఎలా పెరిగాయని వినియోగదారులు ఆశ్చర్యం వ్యక్తం చేస్తుండగా, ఇది తాత్కాలికమేనని, వ్యవహారం మళ్లీ మొదటికే వస్తుందని మార్కెట్ వర్గాలు అంటున్నాయి. ‘బై బ్యాక్’ విధానాన్ని ప్రవేశ పెట్టడం వల్లనే జస్ట్ డయల్ సంస్థ షేర్ల ధరలు హఠాత్తుగా పెరిగాయనడంలో సందేహం లేదు. ఈ బై బ్యాక్ విధానం అమలుకు కంపెనీ 164.5 కోట్ల రూపాయలను కేటాయించింది. ఈ సొమ్ముతో ఈక్విటి షేర్‌ను 1,550 రూపాయలతో దాదాపు పదిన్నర లక్షల షేర్లను తిరిగి వినియోగదారుడి నుంచి కొనేందుకు బై బ్యాక్ కింద కంపెనీ గ్యారంటీ ఇచ్చింది. మరోసారి బై బ్యాక్ విండోను ఫిబ్రవరి 25 నుంచి మార్చి పదో తేదీ వరకు తెరచి ఉంచుతామని, దాని వల్ల తమ షేర్ల విలువ మరింత పెరుగుతుందని కంపెనీ వర్గాలు తెలిపాయి. తమ వ్యాపారం అభివృద్ధిపై కంపెనీ యాజమాన్యానికి అపారమైన నమ్మకం ఉండడం వల్లనే బై బ్యాక్ విధానాన్ని ప్రవేశపెట్టిందని కొన్ని మార్కెట్ శక్తులు చెబుతుండగా, ఈ పెరుగుదల తాత్కాలికమేనని, బై బ్యాక్ విధానం ఉపసంహరించుకున్నాక షేర్ల ధర 400 రూపాయలకు పడిపోవడం ఖాయమని కొన్ని మార్కెట్ వర్గాలు చెబుతున్నాయి. -
ఆన్లైన్లో తక్కువ ధరకు కావాలా!
‘సాక్షి’ ఇంటర్వ్యూ జస్ట్ డయల్ ఫౌండర్ వీఎస్ఎస్ మణి వెండార్ల నుంచి లోయెస్ట్ కోట్స్ కోరండి ఏడు గంటల్లోనే ఉత్పత్తుల డెలివరీ హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: లోకల్ సెర్చ్ సర్వీసుల కంపెనీగా ప్రారంభమైన జస్ట్ డయల్ ఇప్పుడు ఈ-కామర్స్ రంగంలోకి ప్రవేశించింది. అదీ ఇతర ఈ-కామర్స్ కంపెనీలకు భిన్నంగా వినూత్న వ్యాపార విధానంతో అడుగిడింది. సాధారణంగా ఏదైనా ప్రొడక్ట్ కావాలంటే వెబ్సైట్లలో ఉన్న ధరకే కస్టమర్లు ఆర్డరు చేయాలి. కానీ జస్ట్ డయల్‌లో మాత్రం వెండార్ల నుంచి బెస్ట్ కోట్ కోరి తక్కువ ధరలో ఉత్పత్తిని చేజిక్కించుకోవచ్చని అంటున్నారు సంస్థ ఫౌండర్ వీఎస్ఎస్ మణి. ఉత్పత్తులను ఏడు గంటల్లోనే డెలివరీ చేస్తున్నామని సాక్షి బిజినెస్ బ్యూరోకు ఇచ్చిన ఇంటర్వ్యూలో చెప్పారు. మార్కెట్ అవకాశాలను చేజిక్కించుకునేందుకు రూ.1,000 కోట్ల సమీకరణకు కంపెనీ ఇటీవలే బోర్డు అనుమతి పొందింది. జస్ట్ డయల్ సేవలు, ఇంటర్నెట్ వినియోగం వంటి అంశాలపై ఆయన ఏమన్నారంటే.. బెస్ట్ కోట్ కావాలా.. మొబైల్స్, గృహోపకరణాలు, టీవీ, కంప్యూటర్, ల్యాప్‌టాప్, కెమెరా ఇలా ఉత్పత్తి ఏదైనా ఆన్లైన్లో విక్రయదారుల నుంచి బెస్ట్ కోట్ కోరవచ్చు. ఎవరు తక్కువ ధరకు విక్రయిస్తే వారి నుంచి కొనుక్కునే వెసులుబాటు ఉండడం కస్టమర్‌కు కలిసి వచ్చే అంశం. మధ్యాహ్నం 2 గంటలలోపు చేసిన ఆర్డర్లకు 7 గంటల్లో డెలివరీ అవుతుంది. క్యాష్ ఆన్ డెలివరీ సౌకర్యమూ ఉంది. వ్యాపారులను, కస్టమర్లతో అనుసంధానించడం వరకే మా పాత్ర. జస్ట్ డయల్ రివర్స్ యాక్షన్‌లో అయితే కస్టమర్లకే వ్యాపారులు ఫోన్ చేసి సర్వీసు అందిస్తారు. అంటే తక్కువ వడ్డీకి పర్సనల్ లోన్, కారు లోన్, బంగారంపై రుణం కావాలన్నా, ఏదైనా వ్యాపారంలో మంచి రాబడి రావాలనుకున్నా, అధిక వడ్డీకి ఫిక్స్డ్ డిపాజిట్ చేయాలన్నా.. పేరు, మొబైల్ నంబరు, ఈ-మెయిల్ ఐడీ ఇస్తే చాలు. సంబంధిత ఏజెన్సీకి కస్టమర్ల వివరాలు వెళ్తాయి. బెస్ట్ అనిపించిన వ్యాపారితో కస్టమర్లు చేతులు కలపొచ్చు. అరచేతిలో ప్రపంచం..: ఫోన్, వెబ్, ఎస్ఎంఎస్, వ్యాప్, యాప్ ద్వారా ప్రతిరోజూ 15 లక్షలకుపైగా కస్టమర్లు జస్ట్ డయల్‌ను సంప్రదిస్తున్నారు. వీరిలో 70% మంది ఆన్లైన్ కస్టమర్లు. ఆన్లైన్ వినియోగదార్లలో మొబైల్ ఫోన్ ద్వారా సెర్చ్ చేసే వారి సంఖ్య గతేడాదితో పోలిస్తే 183% పెరిగి 27%కి చేరింది. 3 లక్షలకుపైగా వ్యాపారులను ఈ-కామర్స్‌తో అనుసంధానించాం. చిన్న చిన్న వ్యాపారులు తమ ఉత్పత్తుల విక్రయానికి చక్కని వేదిక దొరికింది. సెప్టెంబర్ 30 నాటికి 1.45 కోట్ల ఉత్పత్తులు, సేవలను వెబ్సైట్లో పొందుపరిచాం. వెండార్ల నుంచి చందా మాత్రమే వసూలు చేస్తున్నాం. సెర్చ్ ప్లస్ సేవలు.. సేవల విషయంలో సమాచారమిచ్చే కంపెనీగా మొదలైన మా ప్రస్థానంలో ఆన్‌లైన్‌ను వేదికగా చేసుకుని ఒక అడుగు ముందుకేశాం. హోటల్లో టేబుల్ బుకింగ్, ఫుడ్ ఆర్డర్, డాక్టర్ అపాయింట్మెంట్, అన్ని రకాల టికెట్ల బుకింగ్ ఇలా ఏదైనా వెబ్సైట్ నుంచి చిటికెలో చేయవచ్చు. ప్రపంచవ్యాప్తంగా 211 దేశాల్లో 73,403 నగరాలు, పట్టణాల్లోని 5.80 లక్షలకుపైగా హోటళ్లు, రెస్టారెంట్లను అనుసంధానించాం. బెస్ట్ డీల్ పొంది గదులను బుక్ చేయొచ్చు. భారత్, కెనడా, యూకే, యూఎస్ఏలో విస్తరించాం. ఈ దేశాల్లో ఏ నగరంలో ఉన్నా జస్ట్ డయల్ ఒక గైడ్‌గా పనిచేస్తోంది. 43 భాషల్లో కస్టమర్ కేర్ సిబ్బంది అందుబాటులో ఉంటారు. బిగ్ డీల్స్, సూపర్ ఆఫర్స్ కొద్ది రోజుల్లో జస్ట్ డయల్ కస్టమర్ల ముందుకు రానున్నాయి. -
అమితాబ్ భారీగా కొనేశాడు!
ముంబై: స్టాక్ మార్కెట్ బ్రోకరేజ్ కంపెనీ స్టాంపెడ్ కాపిటల్ లిమిటెడ్ వాటాలను బాలీవుడ్ నటుడు అమితాబ్ బచ్చన్ భారీ సంఖ్యలో కొనుగోలు చేశారు. స్టాక్ మార్కెట్ అందించిన సమాచారం ప్రకారం స్టాంపెడ్ కాపిటల్ కంపెనీకి చెందిన 1.1 లక్షల వాటాలను కొనుగోలు చేసినట్టు తెలిసింది. స్టాంపెడ్ కాపిటల్ వాటా ఒక్కంటికి 109.92 రూపాయల చొప్పున 1.21 కోట్ల రూపాయల విలువైన వాటాలను కొనుగోళు చేశారు. గత నెలరోజుల్లో స్టాంపెడ్ కాపిటల్ 30 శాతం వృద్దిని నమోదు చేసింది. బుధవారం నాటి ట్రేడింగ్ స్టాంపెడ్ కాపిటల్ ఓ దశలో 119.95 గరిష్ట స్థాయిని నమోదు చేసుకుంది. చివరికి 114.90 వద్ద క్లోజైంది. ఇటీవల అమితాబ్ జస్ట్ డయల్ అనే కంపెనీలో షేర్లను కొనుగోలు చేశారు. జస్ట్ డయల్ కంపెనీ వాటాను 10 రూపాయల చొప్పున 62794 వాటాలను కొనుగోలు చేశారు. ప్రస్తుతం అమితాబ్ కొనుగోలు చేసిన జస్ట్ డయల్ వాటాలు 9 కోట్ల రూపాయల విలువ చేస్తున్నాయి.