ముంబై: స్థానిక సర్చ్ ఇంజీన్ జస్ట్ డయల్ దలాల్ స్ట్రీట్‌లో మెరుపులు మెరిపిస్తోంది. తదుపరం వారంలో బై బ్యాక్ ప్రతిపాదన నేపథ్యంలో జస్ట్ డయల్ కౌంటర్ బుధవారం దూసుకుపోతోంది. షేర్లను బై బ్యాక్ చేయనుందన్న అంచనాలతో ఇన్వెస్టర్ల కొనుగోళ్లు ఊపందుకున్నాయి. దీంతో ఈ షేరు 5 శాతం జంప్‌చేసింది.
జూలై2 4న నిర్వహించనున్న సమావేశంలో డైరెక్టర్ల బోర్డు బైబ్యాక్ ప్రతిపాదనను పరిశీలించనున్నట్లు జస్ట్ డయల్ మార్కెట్ రెగ్యులేటరీకి తెలిపింది. దీంతో మార్కెట్ ఆరంభంలోనే జస్ట్ డయల్ షేరు 5.66శాతం జంప్ చేసి ప్రస్తుం 8శాతానికిపైగా లాభపడి రూ. 385 వద్ద ట్రేడ్‌అవుతోంది.
కాగా గత రెండు వారాల్లో 2.22 లక్షల షేర్ల సగటు రోజువారీ వాటాతో పోలిస్తే బిఎస్ఇలో 2.85 లక్షల షేర్లను కౌంటర్లో ఇప్పటివరకు వర్తకం చేశారు. 2016 డిసెంబర్ 27 వ తేదీన ఈ కంపెనీ షేర్లు రూ. 619.45 వద్ద 52 నెలల గరిష్ఠ స్థాయికి చేరింది. మార్చి 20, 2017 నాటి రూ. 610.60 పోలిస్తే గత నాలుగు నెలల్లో కంపెనీ షేర్ ధర 42 శాతం క్షీణించి 354.45 రూపాయలకు చేరుకుంది.మరోవైపు ఈ నెలలోనే కంపెనీ క్యూ1 ఫలితాలను కూడా ప్రకటించనుంది.