next week
-
ఆర్బీఐ పాలసీ ఇక మార్కెట్లకు దిక్సూచి
ముంబై, సాక్షి: వచ్చే వారం దేశీ స్టాక్ మార్కెట్లు కన్సాలిడేషన్ బాటలో సాగే వీలున్నట్లు స్టాక్ నిపుణులు అంచనా వేస్తున్నారు. రిజర్వ్ బ్యాంక్ పాలసీ సమీక్షను చేపట్టడనుండంతో ట్రేడర్లు అప్రమత్తంగా వ్యవహరించవచ్చని తెలియజేశారు. ఆర్బీఐ గవర్నర్ శక్తికాంత దాస్ అధ్యక్షతన సమావేశాలు నిర్వహించనున్న మానిటరీ పాలసీ కమిటీ డిసెంబర్ 4న(శుక్రవారం) నిర్ణయాలు ప్రకటించనుంది. ఈ ఏడాది క్యూ2(జులై- సెప్టెంబర్)లో దేశ ఆర్థిక వ్యవస్థ అంచనాలకంటే మెరుగ్గా రికవర్కావడాన్ని ఈ సందర్భంగా విశ్లేషకులు ప్రస్తావిస్తున్నారు. క్యూ2లో జీడీపీ 7.5 శాతం క్షీణతను చవిచూసింది. కోవిడ్-19 కారణంగా లాక్‌డవున్‌ల అమలు, పలు వ్యవస్థలు స్థంభించడం తదితర ప్రతికూలతతో క్యూ1(ఏప్రిల్- జూన్)లో జీడీపీ 23.9 శాతం వెనకడుగు వేసిన విషయం విదితమే. ఇక అక్టోబర్‌లో మౌలిక పరిశ్రమలు 2.5 శాతం నీరసించాయి. వరుసగా 8వ నెలలోనూ వెనకడుగులో నిలిచాయి. వీటికితోడు రిటైల్(సీపీఐ), హోల్‌సేల్ ధరల(డబ్ల్యూపీఐ) గణాంకాలు ఆర్బీఐ పాలసీ నిర్ణయాలలో ప్రధానంగా ప్రభావం చూపుతాయని ఆర్థికవేత్తలు పేర్కొన్నారు. ఆర్బీఐ లక్ష్యమైన 6 శాతానికి ఎగువన సీపీఐ, 2 శాతానికంటే అధికంగా డబ్ల్యూపీఐ నమోదవుతుండటం గమనించదగ్గ అంశమని తెలియజేశారు. ఇప్పటికే ఆర్బీఐ ఈ ఏడాది వడ్డీ రేట్లకు కీలకమైన రెపో రేటును 1.15 శాతంమేర తగ్గించిన సంగతి తెలిసిందే. ఆటో అమ్మకాలు సోమవారం గురునానక్ జయంతి సందర్భంగా మార్కెట్లకు సెలవు. దీంతో ట్రేడింగ్ నాలుగు రోజులకే పరిమితంకానుంది. కాగా.. నవంబర్ నెలకుగాను మంగళవారం(డిసెంబర్ 1న) వాహన విక్రయ గణాంకాలు వెల్లడికానున్నాయి. పండుగల సీజన్లో భాగంగా నవంబర్లోనూ అమ్మకాలు మెరుగ్గా నమోదుకావచ్చని ఆటో రంగ నిపుణులు భావిస్తున్నారు. ఎఫ్ఐఐల అండ ఈ నెలలో ఇప్పటివరకూ విదేశీ సంస్థాగత ఇన్వెస్టర్లు(ఎఫ్ఐఐలు) నికరంగా ఈక్విటీలలో రూ. 65,317 కోట్లను ఇన్వెస్ట్ చేశారు. గత రెండు దశాబ్దాలలోనే నవంబర్ పెట్టుబడుల్లో ఇది అత్యధికమని విశ్లేషకులు చెబుతున్నారు. ఇది దేశీయంగా ఇన్వెస్టర్లకు హుషారునిస్తున్నట్లు వ్యాఖ్యానించారు. అయితే ఇదే సమయంలో దేశీ ఫండ్స్(డీఐఐలు) రూ. 48,319 కోట్ల పెట్టుబడులను వెనక్కి తీసుకోవడం గమనార్హం! సాంకేతికంగా.. శుక్రవారం(27)తో ముగిసిన వారంలో సెన్సెక్స్ 267 పాయింట్లు పుంజుకుని 44,150 వద్ద ముగిసింది. నిఫ్టీ సైతం 110 పాయింట్లు బలపడి 12,969 వద్ద స్థిరపడింది. బీఎస్ఈలో మిడ్, స్మాల్ క్యాప్ ఇండెక్సులు మార్కెట్లను మించుతూ 2-4 శాతం చొప్పున జంప్‌చేశాయి. కాగా.. గత వారం ఎన్ఎస్ఈ నిఫ్టీ కీలక అవరోధమైన 13,040 పాయింట్ల దిగువనే నిలిచింది. ఈ స్థాయి దాటితే నిఫ్టీకి 13,150 పాయింట్ల వద్ద రెసిస్టెన్స్ ఎదురుకాగలదని సాంకేతిక నిపుణులు అంచనా వేశారు. ఒకవేళ ఈ స్థాయిని కోల్పోతే.. 12,750 పాయింట్ల వద్ద సపోర్ట్ లభించవచ్చని అభిప్రాయపడ్డారు. -
వచ్చేవారమే వాట్సాప్ చెల్లింపు సేవలు..
వాషింగ్టన్ : వచ్చే వారం నుంచే భారత్‌లో వాట్సాప్ పేమెంట్ సేవలను ప్రారంభించేందుకు ఫేస్బుక్ సన్నాహాలు చేస్తోంది. భాగస్వామ్య సంస్థలు ఇంకా సన్నద్ధం కాకపోయినా మార్కెట్ వాటాను పెంచుకునేందుకే హడావిడిగా చెల్లింపు సేవలను చేపడుతున్నారని భావిస్తున్నారు. చెల్లింపు సేవల కోసం వాట్సాప్ ఇప్పటికే హెచ్డీఎఫ్సీ బ్యాంక్, ఐసీఐసీఐ బ్యాంక్, యాక్సిస్ బ్యాంక్‌లతో ఒప్పందం చేసుకుంది. త్వరలోనే ఎస్బీఐ కూడా వాట్సాప్ చెల్లింపులను అనుమతిస్తుందని కంపెనీ వర్గాలు తెలిపాయి. ప్రత్యర్థుల దూకుడుకు బ్రేక్ వేసేందుకు మూడు బ్యాంకులతో ఒప్పందాలతోనే ముందుకెళ్లాలని, వీలైనంత త్వరగా వాట్సాప్ పేమెంట్ సేవలను ప్రారంభించాలని ఫేస్బుక్ భావిస్తోంది. వాట్సాప్ పే పైలట్ వెర్షన్‌ను ఈ ఏడాది ఫిబ్రవరిలో పది లక్షల మంది యూజర్లకు అందుబాటులోకి తీసుకురాగా మెరుగైన స్పందన లభించిందని కంపెనీ వర్గాలు పేర్కొన్నాయి. వాట్సాప్ పేమెంట్స్ సేవలు తమకు తీవ్ర పోటీ ఇస్తాయని గూగుల్ తేజ్, అలీబాబా పేటీఎం భావిస్తున్నాయి. వాట్సాప్ మెసేజింగ్ సేవలను భారత్‌లో 20 కోట్ల మంది ఉపయోగిస్తున్న క్రమంలో వాట్సాప్ పేమెంట్ సేవలు విజయవంతమవుతాయని సంస్థ అంచనా వేస్తోంది. -
జస్ట్ డయల్‌కి బై బ్యాక్ జోష్
ముంబై: స్థానిక సర్చ్ ఇంజీన్ జస్ట్ డయల్ దలాల్ స్ట్రీట్‌లో మెరుపులు మెరిపిస్తోంది. తదుపరం వారంలో బై బ్యాక్ ప్రతిపాదన నేపథ్యంలో జస్ట్ డయల్ కౌంటర్ బుధవారం దూసుకుపోతోంది. షేర్లను బై బ్యాక్ చేయనుందన్న అంచనాలతో ఇన్వెస్టర్ల కొనుగోళ్లు ఊపందుకున్నాయి. దీంతో ఈ షేరు 5 శాతం జంప్‌చేసింది. జూలై2 4న నిర్వహించనున్న సమావేశంలో డైరెక్టర్ల బోర్డు బైబ్యాక్ ప్రతిపాదనను పరిశీలించనున్నట్లు జస్ట్ డయల్ మార్కెట్ రెగ్యులేటరీకి తెలిపింది. దీంతో మార్కెట్ ఆరంభంలోనే జస్ట్ డయల్ షేరు 5.66శాతం జంప్ చేసి ప్రస్తుం 8శాతానికిపైగా లాభపడి రూ. 385 వద్ద ట్రేడ్అవుతోంది. కాగా గత రెండు వారాల్లో 2.22 లక్షల షేర్ల సగటు రోజువారీ వాటాతో పోలిస్తే బిఎస్ఇలో 2.85 లక్షల షేర్లను కౌంటర్లో ఇప్పటివరకు వర్తకం చేశారు. 2016 డిసెంబర్ 27 వ తేదీన ఈ కంపెనీ షేర్లు రూ. 619.45 వద్ద 52 నెలల గరిష్ఠ స్థాయికి చేరింది. మార్చి 20, 2017 నాటి రూ. 610.60 పోలిస్తే గత నాలుగు నెలల్లో కంపెనీ షేర్ ధర 42 శాతం క్షీణించి 354.45 రూపాయలకు చేరుకుంది.మరోవైపు ఈ నెలలోనే కంపెనీ క్యూ1 ఫలితాలను కూడా ప్రకటించనుంది. -
ఎట్టకేలకు బాలీవుడ్ భామ పెళ్లి ఖాయం?
ముంబై : బాలీవుడ్ బ్యూటీ, సొట్ట బుగ్గల సుందరి ప్రీతి జింతా పెళ్లి వార్త మళ్లీ తెరపైకి వచ్చింది. రీసెంట్గా నలభయ్యో పడిని దాటేసిన ఈ అమ్మడు ఎట్టకేలకు ఈ నెలలోనే పెళ్లికి రెడీ అవుతోందని సమాచారం. గత కొన్నాళ్లుగా ప్రేమలో ఉన్న అమెరికా బాయ్‌ఫ్రెండ్ జీనీ గుడేనఫ్తో కలిసి ఏడుఅడుగులు నడవనున్నట్టు తెలుస్తోంది. అదీ లాస్ ఏంజెల్స్‌లో.. ఒక వారం రోజుల్లోనే. ఈ విషయాన్ని తన సన్నిహితులతో ప్రీతి జింతా షేర్ చేసుకుందిట. లాస్ ఏంజెల్స్‌లో జరిగే తన పెళ్లికి రావాలని ఆహ్వానించిందట. ఈ ఆనందమైన క్షణాల్లో తనతో పాటు వుండాలని బాలీవుడ్లో కొద్దిమంది స్నేహితులను మాత్రమే ఆహ్వానించినట్టు తెలుస్తోంది. ఈ వివాహ వేడుక కోసం ఆమె ఫిబ్రవరి 12 నుండి 16 వరకు అయిదురోజుల పాటు అమెరికాలో ఉండనున్నట్టు సమాచారం. ఈ దిల్ సే హీరోయిన్, ప్రముఖ వ్యాపారవేత్త నెస్ వాడియాతో ఎఫైర్, 2008లో ఐపిఎల్ కింగ్స్ ఎలెవెన్ పంజాబ్ కొనుగోలు, అనంతరం వారిద్దరి మధ్య వివాదం, పరస్పరం కేసులు దాకా వెళ్లిన సంగతి తెలిసిన విషయాలే. కాగా ప్రీతి బర్త్ డే అయిన జనవరి 31న పెళ్లి కూతురు కాబోతున్నట్లు గత ఏడాది బిటౌన్లో వార్తలు గుప్పుమన్నాయి. అమెరికన్ బాయ్‌ఫ్రెండ్ జీనే కోసమే ప్రీతి తరచు అమెరికా వెళ్లొస్తోందనీ పుకార్లు షికారు చేశాయి. అప్పట్లో ఈ వార్తలను ప్రీతి ఖండించింది కూడా. ప్రీతి పెళ్లి వార్త దాదాపుగా కన్ఫర్మ్ అయినా... ఇది వాస్తవమా కాదా తేలాలంటే మాత్రం వెయిట్ చేయక తప్పదు. -
వచ్చే వారంలో సెట్స్ నోటిఫికేషన్లు!
♦ అంతకంటే ముందుగా కన్వీనర్ల నియామకం ♦ ఎంసెట్ కన్వీనర్ బాధ్యతలపై ఉత్కంఠ! ♦ ఉన్నత విద్యా మండలి కసరత్తు సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో 2016-17 విద్యా సంవత్సరంలో వివిధ వృత్తి విద్యా కోర్సుల్లో ప్రవేశాలకు నిర్వహించే ఉమ్మడి ప్రవేశ పరీక్షల (సెట్స్) నోటిఫికేషన్లను వచ్చే వారంలో జారీ చేసేందుకు తెలంగాణ ఉన్నత విద్యా మండలి కసరత్తు చేస్తోంది. ఇప్పటికే ఎంసెట్, ఈసెట్, ఐసెట్, ఎడ్‌సెట్, పీజీఈసెట్, లాసెట్, పీఈసెట్ నిర్వహణ తేదీలను, పరీక్ష నిర్వహించే యూనివర్సిటీలను ఎంపిక చేసిన మండలి ప్రస్తుతం సెట్స్ కన్వీనర్ల నియామకానికి చర్యలు చేపట్టింది. ఇందులో భాగంగా హైదరాబాద్ జేఎన్టీయూ, ఉస్మానియా, కాకతీయ వర్సిటీలకు లేఖలు రాసింది. ఒక్కో సెట్ నిర్వహణకు ముగ్గురి పేర్లను సూచించాలని ఆదేశించింది. ఇప్పటికే కన్వీనర్ల ఎంపికకు కొన్ని సెట్లకు కొందరి పేర్లను సూచించగా, మరికొన్ని సెట్లకు పేర్లు రావాల్సి ఉంది. వాటిని రెండు మూడు రోజుల్లో అందజేయాలని విశ్వవిద్యాలయాలను మండలి ఆదేశించింది. అవి రాగానే ఈనెల 8 లేదా 9న ఒక్కో సెట్‌కు ఒక్కో కన్వీనర్‌ను ఎంపిక చేసి, వెంటనే ఆయా కన్వీనర్లు నోటిఫికేషన్లు జారీచేసేలా చర్యలు చేపట్టింది. మే 19న ఐసెట్ ను, 24న మూడేళ్ల, ఐదేళ్ల లాసెట్, పీజీ లాసెట్‌ను నిర్వహించే బాధ్యతలను కాకతీయ వర్సిటీకి అప్పగించింది. గత ఏడాది కూడా వాటిని కాకతీయనే నిర్వహించినందున అప్పుడు కన్వీనర్లుగా చేసిన వారికే ఈసారీ బాధ్యతలు అప్పగించే అవకాశం ఉంది. అయితే వర్సిటీ ఇచ్చే జాబితాలోని మూడు పేర్లలో వారుంటే వారికే అప్పగించే అవకాశం ఉంది. ఇక మే 11 నుంచి ఫిజికల్ ఎడ్యుకేషన్ సెట్, 27న ఎడ్‌సెట్, 29న పీజీఈసెట్‌లను నిర్వహించే బాధ్యతలను ఈసారి కూడా ఉస్మానియాకే అప్పగించింది. అందువల్ల వీటికి కూడా గత ఏడాది కన్వీనర్లుగా వ్యవహరించిన వారినే మళ్లీ నియమించే అవకాశం ఉంది. తేలాల్సింది ఎంసెట్ వ్యవహారమే ఇంజనీరింగ్, అగ్రికల్చర్ అండ్ మెడికల్ కోర్సుల్లో ప్రవేశాల కోసం మే 2న జరిగే ఎంసెట్-2016 నిర్వహణ బాధ ్యతలు ఎవరికి అప్పగిస్తారన ్న దానిపై ఉత్కంఠ నెల కొంది. గతంలోలాగే ఈసారి కూడా ఎంసెట్ నిర్వహణను హైదరాబాద్ జేఎన్టీయూకే అప్పగించినప్పటికీ, కన్వీనర్‌గా ఎవరిని నియమిస్తారన్నది చర్చనీయాంశమైంది. గత ఏడేళ్లు ఎంసెట్ కన్వీనర్‌గా ఉన్న ప్రొఫెసర్ ఎన్వీ రమణరావు దీన్ని విజయవంతంగా నిర్వహించారు. ఈసారి కూడా ఆయనకే అప్పగిస్తారా? లేదా? అన్నది తేలాల్సి ఉంది. 2015-16 విద్యా సంవత్సరంలో ప్రైవేటు ఇంజనీరింగ్ కాలేజీల అఫిలియేషన్ల విషయంలో కొన్ని యాజమాన్యాలు రిజిస్ట్రార్‌గా ఉన్న ఆయనపై పలు ఆరోపణలు చేశాయి. ఆ వ్యవహారంతో ఎంసెట్ నిర్వహణకు సంబంధం లేనప్పటికీ 2016-17లో ఆబా ధ్యతలు అప్పగిస్తారా లేదా అన్నది ఉత్కం ఠగా మారింది. అలాగే మే 12న ఈసెట్ నిర్వహణను కూడా జేఎన్టీయూకే అప్పగిం చింది. దీనికి గత ఏడాది కన్వీనర్‌గా వ్యవహరించిన ప్రొఫెసర్ యాదయ్యకే మళ్లీ బాధ్యతలు అప్పగిస్తారా అన్నది తేలాల్సి ఉంది. -
వచ్చే వారమే టీపీపీఎస్సీ తొలి నోటిఫికేషన్
-
వచ్చే వారమే టీపీపీఎస్సీ తొలి నోటిఫికేషన్
- వివిధ శాఖల్లో 1,998 ఇంజనీర్ పోస్టుల భర్తీ - త్వరలోనే మిగతా పోస్టుల భర్తీకి నోటిఫికేషన్లు - కమిషన్ సమావేశంలో నిర్ణయం! - గ్రూప్స్ సిలబస్‌పైనా విస్తృత స్థాయిలో కసరత్తు సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర పబ్లిక్ సర్వీసు కమిషన్ (టీఎస్పీఎస్సీ) ద్వారా ఉద్యోగాల భర్తీకి తొలి నోటిఫికేషన్ వచ్చే వారమే జారీ కానుంది. రాష్ట్రంలో వివిధ శాఖల్లో ఖాళీగా వున్న ఇంజనీర్ పోస్టుల భర్తీకి ఈ నోటిఫికేషన్‌ను జారీ చేయనుంది. శుక్రవారం టీఎస్పీఎస్సీ చైర్మన్ ఘంటా చక్రపాణి అధ్యక్షతన జరిగిన సమావేశంలో ఈమేరకు నిర్ణయం తీసుకున్నట్లు తెలిసింది. ముఖ్యంగా నీటి పారుదల, ఆయకట్టు అభివృద్ధి (ఐ అండ్ క్యాడ్), పంచాయతీరాజ్ గ్రామీణ నీటి సరఫరా విభాగం, పంచాయతీరాజ్ పబ్లిక్ హెల్త్, ఆర్ అండ్ బీ శాఖల్లో ఖాళీగా ఉన్న ఇంజనీర్ పోస్టులను భర్తీ చేయనున్నట్లు సమాచారం. ఇందులో కొన్ని పోస్టులను ఇంజనీరింగ్ సివిల్ అర్హతతో, కొన్నింటిని సివిల్ లేదా మెకానికల్ అర్హతలతో, మరికొన్నింటిని ఏఎంఐఈ, బీఎస్సీ ఇంజనీరింగ్, డిప్లొమా అర్హతలతో భర్తీ చేయనున్నారు. ఈ పోస్టుల భర్తీకి సంబంధించిన ఇండెంట్లు, రోస్టర్ కమ్ రిజర్వేషన్, అర్హతల వివరాలను టీఎస్పీఎస్సీ ఆయా శాఖల నుంచి తెప్పించుకుంది. నాలుగైదు రోజులపాటు కసరత్తు చేసి పరీక్షల విధానం, పూర్తిస్థాయి సిలబస్‌ను ఖరారు చేసినట్లు తెలిసింది. వీటన్నింటిపై మరోసారి పరిశీలన జరిపి వచ్చే వారంలో (20వ తేదీలోగా) నోటిఫికేషన్‌ను జారీ చేయాలని నిర్ణయించింది. ప్రస్తుతం వివిధ శాఖల్లో రెండు కేటగిరీలకు చెందిన 1,998 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. వాటికి త్వరలో నోటిఫికేషన్ జారీ కానుంది. అనంతరం వివిధ కేటగిరీల్లోని చిన్న చిన్న పోస్టులు, పదోతరగతి, ఇంటర్, ఐటీఐ వంటి అర్హతలతో ఉండే ఇతర పోస్టుల భర్తీకి వరుసగా నోటిఫికేషన్లు జారీచేయాలని టీఎస్పీఎస్సీ భావిస్తోంది. అలాగే గ్రూప్-1, 2, 3 పోస్టులకు సంబంధించి పూర్తిస్థాయి సిలబస్‌పై అధికారులు కసరత్తు చేస్తున్నారు. దీనిని త్వరలోనే పూర్తిచేసి, ఈ సిలబస్ ప్రకారం విద్యార్థులు పూర్తిస్థాయిలో సిద్ధమయ్యేలా (ప్రిపేర్ అయ్యేలా) అవకాశం కల్పించనుంది. ఈ లెక్కన అక్టోబర్ నాటికి గ్రూప్-2, డిసెంబర్ నాటికి గ్రూప్-1 నోటిఫికేషన్లు ఇచ్చే అవకాశముంది. అప్పటిలోగా కమల్‌నాథన్ కమిటీ ఉద్యోగుల విభజనను పూర్తిచేస్తే... ఆయా కేటగిరీల్లో వచ్చే పోస్టులతో పాటు ప్రస్తుతం ఉన్న ఖాళీ పోస్టులను కలిపి భర్తీ చేయనున్నారు.