ఎట్టకేలకు బాలీవుడ్ భామ పెళ్లి ఖాయం? | Preity Zinta to get married next week? | Sakshi
Sakshi News home page

ఎట్టకేలకు బాలీవుడ్ భామ పెళ్లి ఖాయం?

Published Tue, Feb 9 2016 4:04 PM | Last Updated on Sun, Sep 3 2017 5:17 PM

ఎట్టకేలకు బాలీవుడ్ భామ పెళ్లి ఖాయం?

ఎట్టకేలకు బాలీవుడ్ భామ పెళ్లి ఖాయం?

ముంబై : బాలీవుడ్ బ్యూటీ, సొట్ట బుగ్గల సుందరి ప్రీతి జింతా పెళ్లి వార్త మళ్లీ తెరపైకి వచ్చింది.  రీసెంట్‌గా నలభయ్యో పడిని దాటేసిన  ఈ అమ్మడు ఎట్టకేలకు ఈ నెలలోనే పెళ్లికి రెడీ అవుతోంద‌ని స‌మాచారం. గత కొన్నాళ్లుగా ప్రేమలో ఉన్న అమెరికా  బాయ్‌ఫ్రెండ్  జీనీ గుడేనఫ్తో కలిసి ఏడుఅడుగులు నడవనున్నట్టు తెలుస్తోంది. అదీ  లాస్ ఏంజెల్స్లో.. ఒక వారం రోజుల్లోనే.

ఈ విషయాన్ని తన సన్నిహితులతో ప్రీతి జింతా షేర్ చేసుకుందిట.  లాస్ ఏంజెల్స్లో జరిగే తన పెళ్లికి రావాలని ఆహ్వానించిందట.  ఈ ఆనందమైన క్షణాల్లో తనతో పాటు వుండాలని బాలీవుడ్లో కొద్దిమంది స్నేహితులను మాత్రమే ఆహ్వానించినట్టు తెలుస్తోంది.  ఈ వివాహ వేడుక కోసం ఆమె ఫిబ్రవరి 12 నుండి 16 వరకు అయిదురోజుల పాటు అమెరికాలో ఉండనున్నట్టు  సమాచారం.

ఈ దిల్ సే  హీరోయిన్,  ప్రముఖ  వ్యాపారవేత్త నెస్ వాడియాతో ఎఫైర్,  2008లో ఐపిఎల్ కింగ్స్ ఎలెవెన్ పంజాబ్  కొనుగోలు, అనంతరం వారిద్దరి మధ్య వివాదం, పరస్పరం కేసులు దాకా వెళ్లిన సంగతి తెలిసిన విషయాలే.  

కాగా ప్రీతి బర్త్ డే అయిన జనవరి 31న పెళ్లి కూతురు కాబోతున్నట్లు గత ఏడాది బిటౌన్‌లో  వార్తలు గుప్పుమన్నాయి.  అమెరికన్ బాయ్‌ఫ్రెండ్‌ జీనే‌ కోసమే ప్రీతి తరచు అమెరికా వెళ్లొస్తోందనీ పుకార్లు షికారు చేశాయి.  అప్పట్లో ఈ వార్తలను ప్రీతి  ఖండించింది కూడా.  ప్రీతి పెళ్లి  వార్త  దాదాపుగా కన్ఫర్మ్  అయినా... ఇది వాస్తవమా కాదా తేలాలంటే మాత్రం  వెయిట్ చేయక తప్పదు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement