get married
-
ఎట్టకేలకు పెళ్లి చేసుకున్న సుబ్బరాజు
-
రకుల్-జాకీ పెళ్లి.. ఈ జోడీ కోసం స్పెషల్ ట్రాక్!
బాలీవుడ్ హీరో–నిర్మాత జాకీ భగ్నానీ, హీరోయిన్ రకుల్ ప్రీత్‌సింగ్ ఇప్పుడు ఓ హాట్ టాపిక్. ఈ ఇద్దరూ భార్యాభర్తలుగా మారి, తమ జీవితాల్లో కొత్త అధ్యాయాన్ని ఆరంభించాలనుకుంటున్నారనే వార్త వినిపిస్తున్న సంగతి తెలిసిందే. వచ్చే నెల 22న గోవాలో కుటుంబ సభ్యులు, బాగా దగ్గర స్నేహితులు, సన్నిహితుల సమక్షంలో ఈ ఇద్దరి పెళ్లి జరగనుందని టాక్. కాగా.. పసందైన పాటలతో తమ పెళ్లిని ఆహ్లాదకరంగా జరుపుకోవాలని ప్లాన్ చేస్తున్నారట జాకీ–రకుల్. వెడ్డింగ్ వీడియోగ్రాఫర్ విశాల్ పంజాబీని నియమించారట. విరాట్ కోహ్లీ–అనుష్కా శర్మ, రణ్వీర్ సింగ్–దీపికా పదుకోన్, సిద్ధార్థ్ మల్హోత్రా–కియారా అద్వానీ వంటి స్టార్స్ వివాహ వేడుకలకు వీడియోగ్రాఫర్‌గా వ్యవహరించినది విశాల్ పంజాబీయే. వివాహ వేడుకల కోసం ప్రత్యేకంగా సౌండ్ ట్రాక్స్ చేస్తుంటారట విశాల్. ఇప్పటికే బాగా హిట్టయిన ప్రేమ పాటలను రీ–క్రియేట్ చేయడంతో పాటు కొత్త ట్యూన్లు కూడా చేస్తుంటారట. ఇంకా పెళ్లి కోసం ప్రత్యేకంగా పాటలు తయారు చేయడానికి, పాడటానికి సంగీతదర్శకులు విశాల్–శేఖర్, గాయనీమణులు యాషికా సిక్కా, హర్షదీప్ కౌర్ వంటి వారిని కూడా జాకీ–రకుల్ సంప్రదించారని భోగట్టా. తమ డేటింగ్ నుంచి పెళ్లి, భవిష్యత్తుని ప్రతిబింబించేలా విశాల్ పంజాబీతో ఓ ట్రాక్ తయారు చేయిస్తున్నారని సమాచారం. ఫిబ్రవరి మొదటి వారానికి ఈ ట్రాక్ రెడీ అవుతుందట. ఇలా ప్రత్యేకమైన, పసందైన పాటలతో తమ వివాహాన్ని ఓ కమ్మని పాటలా తీపి గుర్తులా ఉండేలా ఈ జోడీ ప్లాన్ చేసుకుంటోందని టాక్. -
తనకన్నా చిన్నవాడితో హీరోయిన్ డేటింగ్, ఇద్దరు పుట్టాక పెళ్లి !
Kirsten Dunst Jesse Plemons Get Married: వివాహబంధంలోకి అడుగు పెట్టే జంటల్లో వరుడి కన్నా వధువు వయసు తక్కువగా ఉంటుంది. కానీ ఇటీవల కాలంలో ఈ హెచ్చుతగ్గులు మారాయి. తన కన్నా తక్కువ వయసు ఉన్న అబ్బాయిలను ప్రేమించి పెళ్లాడుతున్నారు. అలాగే పదుల వయసు తేడా ఉన్నా పురుషులను కూడా మనువాడుతున్నారు నేటితరం యువతులు. ఇక ఏజ్ గ్యాప్ పెళ్లి తంతులు సెలబ్రిటీల్లో సర్వసాధారణం. ఇప్పటికే ప్రియాంక చోప్రా, అనుష్క శర్మ, కత్రీనా కైఫ్, నయన తార వంటి పలువురు స్టార్ హీరోయిన్స్ తమకన్నా చిన్న ఏజ్ వాళ్లని పెళ్లాడారు. తాజాగా ఓ హాలీవుడ్ బ్యూటీ తనకన్నా ఆరేళ్లు చిన్నవాడైన సహానటుడిని పెళ్లి చేసుకుంది. టోబే మాగైర్ నటించిన 'స్పైడర్ మ్యాన్' ట్రైయాలజీ ద్వారా పేరు తెచ్చుకుంది హాలీవుడ్ హీరోయిన్ కిరిస్టెన్ డంస్ట్. 40 ఏళ్ల క్రిస్టెన్ తనకన్నా ఆరేళ్లు చిన్నవాడైన జెస్సీ ప్లెమోన్స్ (34)ను వివాహమాడింది. 'పవర్ ఆఫ్ ది డాగ్' లో కలిసి నటించిన కిరిస్టెన్ డంస్ట్, జెస్సీ ప్లెమోన్స్ 2016 నుంచి డేటింగ్లో ఉన్నారు. 2017 జనవరి 34న వీరిద్దరికీ ఎంగేజ్మెంట్ కూడా అయింది. వీరు 2018లో కుమారుడు ఎన్నిస్, 2021లో జేమ్స్ రాబర్ట్‌కు జన్మనిచ్చారు. చదవండి: స్టార్ నటుడి భార్యపై కేసు.. రూ. 31 లక్షలు తిరిగి ఇవ్వట్లేదని ఫిర్యాదు ఇదిలా ఉంటే ఇదివరకు హాలీవుడ్లో తమకంటే చిన్నవాళ్లైన పురుషులతో రిలేషన్షిప్లో ఉన్న నటీమణులు చాలానే ఉన్నారు. గేబ్రియెల్ యూనియన్- డ్వేన్ వాడే దంపతులు(9 ఏళ్ల వ్యత్యాసం), షకీరా- గెరాడ్ పిక్(10 ఏళ్లు), కోర్ట్నీ కర్దాషియాన్- యూనస్ బెడ్జిమా(14 ఏళ్లు), జడా పింకెట్ స్మిత్- ఆగస్ట్ అల్సీనా(21 ఏళ్లు), లీసా బానెట్- జాసన్ మొమోవా దంపతులు(12 ఏళ్లు) తదితరులు ఈ జాబితాలో ఉన్నారు. చదవండి: విక్రమ్ ఆరోగ్య పరిస్థితిపై హెల్త్ బులిటెన్ విడుదల.. -
వెంటపడి మరీ ప్రేమించాడు...పెళ్లికి మాత్రం నో
బంజారాహిల్స్: ఇన్‌స్టాగ్రామ్‌లో పరిచయమైన యువకుడు ఓ యువతిని ప్రేమిస్తున్నాని..పెళ్లి చేసుకుంటానని నమ్మించి లైంగిక దాడి చేసిన ఘటన బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. మేడ్చల్ పోలీసులు ఈ కేసును జీరో ఎఫ్ఐఆర్గా నమోదు చేసి తదుపరి విచారణకు బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్‌కు బదిలీ చేశారు. వివరాల్లోకి వెళ్తే... బంజారాహిల్స్ రోడ్ నెం.2లో నివసించే భాను ప్రకాశ్(21)కి 2020లో ఓ యువతితో ఇన్‌స్టాగ్రామ్‌లో పరిచయం అయింది. ఇద్దరి మధ్యా పరిచయం కుదిరింది. ఇద్దరూ స్నేహితులయ్యారు. కొద్ది రోజులకే ఆ యువతితో పెళ్లి చేసుకుంటానంటూ చెప్పగా ఆమె అందుకు అంగీకరించలేదు. చాలా రోజులుగా ఒత్తిడి తీసుకొస్తుండటంతో ఆమె చివరకు అంగీకరించింది. 2020 నవంబర్ 11న భాను ప్రకాశ్ బైక్‌పై ఆమె ఇంటికి వెళ్లి బంజారాహిల్స్ రోడ్ నెం. 2లోని తన గదికి తీసుకొచ్చి లైంగికదాడికి పాల్పడ్డాడు. ఇలా ఏడుసార్లు అత్యాచారానికి పాల్పడ్డాడు. ఈ ఏడాది ఫిబ్రవరిలో భాను ప్రకాశ్ మరో యువతితో చాట్ చేస్తున్నాడని గమనించిన బాధిత యువతి తనను పెళ్లి చేసుకోవాలని అడిగింది. ఇందుకు నిరాకరించిన సదరు యువకుడు తనకు ఇప్పుడు పెళ్లి అవసరం లేదని, నువ్వు కూడా అవసరం లేదంటూ ముఖం మీద చెప్పేశాడు. దీంతో బాధితురాలు పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు నిందితుడిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. (చదవండి: నెంబర్ మీదే.. కానీ.. వాడేది కేటుగాళ్లు) -
త్వరలో పెళ్లి చేసుకుంటా!
తమిళసినిమా: నటి శ్రియకు పెళ్లిపై దృష్టి మళ్లినట్టుంది. త్వరలోనే వివాహం చేసుకుంటానంటోంది. ఈ అమ్మడు నటిగా దశాబ్దన్నర కాలాన్ని టచ్ చేసింది. తమిళంలో ఎనక్కు 20 ఉనక్కు 18 చిత్రం ద్వారా రంగప్రవేశం చేసిన శ్రియ ఆ తరువాత జయంరవికి జంటగా మళై చిత్రంలో నటించింది. అలా తక్కువ కాలంలోనే స్టార్ దర్శకుడు శంకర్ దర్శకత్వంలో సూపర్‌స్టార్ రజనీకాంత్‌తో జత కట్టే లక్కీచాన్స్‌ను దక్కించుకుంది. అదే విధంగా తెలుగులో ఇష్టం చిత్రంతో పరిచయమైన శ్రియ అక్కడ కూడా వేగంగానే స్టార్డంను అందుకుంది. ఇలా తమిళం, తెలుగు భాషల్లో ప్రముఖ కథానాయకిగా రాణిస్తూ బాలీవుడ్‌లోనూ కొన్ని చిత్రాల్లో నటించింది. ఇప్పటికీ హీరోయిన్గా రాణిస్తున్నా, అంత క్రేజ్ మాత్రం లేదనే చెప్పాలి. తాజాగా బాలకృష్ణతో నటించిన తెలుగు చిత్రం పైసావసూల్ శుక్రవారం విడుదల కానుంది. ఈ సందర్భంగా ఒక భేటీలో శ్రియ పేర్కొంటూ త్వరలోనే పెళ్లి చేసుకోనున్నానని వెల్లడించింది. తాను తమిళం, తెలుగు, హిందీ భాషా చిత్రాలలో నటిస్తూ ప్రముఖ కథానాయికిగా వెలుగొందుతున్నానని అంది. సూపర్‌స్టార్ రజనీకాంత్‌కు జంటగా శివాజీ చిత్రంలో నటించడం మరచిపోలేని అనుభవంగా పేర్కొంది. తానిప్పటికీ నటనను ప్రేమిస్తున్నానని, వృత్తిని గౌరవించేవాళ్లకు అది ఎప్పటికీ బోర్ కొట్టదని అంది. తానిక్కడ ఒంటరిగానే జయించానని చెప్పింది. తనకిక్కడ చేదు అనుభవాలెప్పుడూ ఎదరవలేదని అంది. నటిగా ఎలా నిలదొక్కుకోగలనా అని మొదట్లో సంకట పడ్డా సహ నటీనటులు, దర్శక నిర్మాతల సహకారంతో నటిగా మంచి పేరు తెచ్చుకున్నానని చెప్పింది. తనను చాలా మంది పెళ్లి ఎప్పుడు? అని అడుగుతున్నారని, స్త్రీ జీవితంలో పెళ్లి, పిల్లలు చాలా ముఖ్యం అని పేర్కొంది. తనకు త్వరలోనే వివాహం జరుగుతుందని, మనసుకు నచ్చినోడు తారస పడగానే పెళ్లి చేసుకుంటానని చెప్పింది. తనకు కాబోయే భర్త మంచి స్నేహితుడై ఉండాలని అంది. ముందున్న జీవితం కూడా మంచి సాగిపోవాలని అంది. ఇకసోతే చాలా మంది తన అందంలోని రహస్యం ఏమిటని అడుగుతుంటారని, తన అందానికి ప్రధాన కారణం యోగానేనని చెప్పింది. యోగా తన జీవితంలో చాలా మార్చు తీసుకొచ్చిందని, ఉద్రేకాలను అదుపు చేసుకోవడానికి యోగా ఎంతగానో దోహదపడుతుందని అంది. అదే విధంగా ధ్యానం కూడా చేస్తానని తెలిపింది. ఈ తరం యువత మాదక ద్రవ్యాల బారిన పడి జీవితాలను నాశనం చేసుకోవడం బాధగా ఉందని, ఎలాంటి చెడు అలవాట్లకు అలవాటు పడకుండా యువత చక్కగా చదువుపైనే దృష్టి సారించాలని హితవు పలికింది. కుటుంబంలో ఒక్కరు డ్రగ్స్‌కు అలవాటు పడితే ఆ కుటుంబం అంతా బాధింపునకు గురవుతుందన్నది తెలుసుకోవాలని శ్రియ పేర్కొంది. -
ఎట్టకేలకు బాలీవుడ్ భామ పెళ్లి ఖాయం?
ముంబై : బాలీవుడ్ బ్యూటీ, సొట్ట బుగ్గల సుందరి ప్రీతి జింతా పెళ్లి వార్త మళ్లీ తెరపైకి వచ్చింది. రీసెంట్గా నలభయ్యో పడిని దాటేసిన ఈ అమ్మడు ఎట్టకేలకు ఈ నెలలోనే పెళ్లికి రెడీ అవుతోందని సమాచారం. గత కొన్నాళ్లుగా ప్రేమలో ఉన్న అమెరికా బాయ్‌ఫ్రెండ్ జీనీ గుడేనఫ్తో కలిసి ఏడుఅడుగులు నడవనున్నట్టు తెలుస్తోంది. అదీ లాస్ ఏంజెల్స్‌లో.. ఒక వారం రోజుల్లోనే. ఈ విషయాన్ని తన సన్నిహితులతో ప్రీతి జింతా షేర్ చేసుకుందిట. లాస్ ఏంజెల్స్‌లో జరిగే తన పెళ్లికి రావాలని ఆహ్వానించిందట. ఈ ఆనందమైన క్షణాల్లో తనతో పాటు వుండాలని బాలీవుడ్లో కొద్దిమంది స్నేహితులను మాత్రమే ఆహ్వానించినట్టు తెలుస్తోంది. ఈ వివాహ వేడుక కోసం ఆమె ఫిబ్రవరి 12 నుండి 16 వరకు అయిదురోజుల పాటు అమెరికాలో ఉండనున్నట్టు సమాచారం. ఈ దిల్ సే హీరోయిన్, ప్రముఖ వ్యాపారవేత్త నెస్ వాడియాతో ఎఫైర్, 2008లో ఐపిఎల్ కింగ్స్ ఎలెవెన్ పంజాబ్ కొనుగోలు, అనంతరం వారిద్దరి మధ్య వివాదం, పరస్పరం కేసులు దాకా వెళ్లిన సంగతి తెలిసిన విషయాలే. కాగా ప్రీతి బర్త్ డే అయిన జనవరి 31న పెళ్లి కూతురు కాబోతున్నట్లు గత ఏడాది బిటౌన్లో వార్తలు గుప్పుమన్నాయి. అమెరికన్ బాయ్‌ఫ్రెండ్ జీనే కోసమే ప్రీతి తరచు అమెరికా వెళ్లొస్తోందనీ పుకార్లు షికారు చేశాయి. అప్పట్లో ఈ వార్తలను ప్రీతి ఖండించింది కూడా. ప్రీతి పెళ్లి వార్త దాదాపుగా కన్ఫర్మ్ అయినా... ఇది వాస్తవమా కాదా తేలాలంటే మాత్రం వెయిట్ చేయక తప్పదు. -
తొమ్మిదో తరగతి పిల్లలు.. పెళ్లికోసం జంప్!
డెహ్రాడూన్: దేశంలో అత్యంత పేరు ప్రతిష్టలు గల డూన్ స్కూలు నుంచి తొమ్మిదో తరగతి చదువుతున్న ఏడుగురు విద్యార్థులు ఈనెల 14న అదృశ్యమయ్యారు. వాళ్లలో నలుగురు అబ్బాయిలు, ముగ్గురు అమ్మాయిలు ఉన్నారు. వాళ్లంతా ఎక్కడకు, ఎందుకు వెళ్లారో తెలుసా? ముంబై వెళ్లి, హాయిగా పెళ్లి చేసుకుని, మంచి ఉద్యోగాలు సంపాదించాలని వెళ్లారు!! స్కూలు యాజమాన్యం విద్యార్థుల అదృశ్యంపై వారి తల్లిదండ్రులకు సమాచారం అందజేసింది. దీంతో వారు పోలీసులను ఆశ్రయించారు. విద్యార్థుల తల్లిదండ్రులు, పోలీసులు వారి కోసం గాలింపు చర్యలు ముమ్మరం చేశారు. చేతిలో సొమ్ము ఖాళీ కావడం, ఆకలి వేయడంతో ఓ జంట తిరిగి స్కూలుకు తిరిగొచ్చింది. ఆ జంటను విచారించగా పెళ్లి చేసుకుని... ముంబైలో పెద్ద ఉద్యోగం సంపాదించాలనే లక్ష్యంతో వెళ్లినట్లు చెప్పారు. దీంతో హతాశులైన విద్యార్థుల తల్లిదండ్రులు, పోలీసులు మిగిలిన వారి కోసం గాలింపు చర్యలు చేపట్టారు.