Justdial Report: Demand For E Scooters Jumps 220 E Cars 132 In Tier 1 Cities - Sakshi
Sakshi News home page

Demand For Electric Vehicles: ఎలక్ట్రిక్‌ వాహనాలపై క్రేజ్‌ మరీ ఇంతగా ఉందా...!

Published Wed, Nov 17 2021 4:06 PM | Last Updated on Wed, Nov 17 2021 6:31 PM

Demand For E Scooters Jumps 220 E Cars 132 In Tier 1 Cities Justdial Report - Sakshi

Demand For Electric Vehicles Justdial Report: అధిక ఇంధన ధరలతో సతమతమవుతున్న వాహనదారులు సంప్రాదాయ శిలాజ ఇంధన వాహనాలకు గుడ్‌బై చెబుతూ ఎలక్ట్రిక్‌ వాహనాలపై ఎగబడుతున్నారు. ఎలక్ట్రిక్ వాహనాలకు డిమాండ్ గణనీయంగా పెరిగిందని జస్ట్‌డయల్‌ తన నివేదికలో వెల్లడించింది. టైర్ 1 నగరాల్లో ఈవీ ట్రెండ్‌లో ముందున్నాయి. ఢిల్లీ, ముంబై, హైదరాబాద్‌, కోల్‌కత్తా, బెంగళూరు, చెన్నై లాంటి  టైర్ 1 నగరాల్లో ఈ-స్కూటర్, ఈ-కార్లకు భారీ డిమాండ్‌ నెలకొంది. 

గణనీయమైన వృద్ధి..!
ఇంధన ధరలతో సతమతమవుతున్న వాహనదారులుతో పాటుగా, కొత్తగా వాహనాలను కొనేవారు కూడా ఎక్కువగా ఎలక్ట్రిక్‌ వాహనాలకే జై కొడుతున్నారు. జస్ట్ డయల్ కన్స్యూమర్ ఇన్‌సైట్‌ల ప్రకారం...ఈ-స్కూటర్‌లు సంవత్సరానికి అత్యధికంగా 220.7 శాతం మేర డిమాండ్‌ను సాధించగా, ఈ-కార్లు 132.4 శాతం, ఈ-మోటార్‌సైకిళ్లకు 115.3 శాతం , ఈ-సైకిళ్లకు 66.8 శాతం డిమాండ్ ఉన్నట్లు జస్ట్‌ డయల్‌ తన నివేదికలో పేర్కొంది. ఎలక్ట్రిక్‌ వాహనాలపై జస్ట్‌ డయల్‌కు వచ్చిన కాల్స్‌ ఆధారంగా ఈ నివేదికను రూపొందించనట్లు తెలుస్తోంది.

ఇక టైర్‌ 2 నగరాల్లో  మైసూర్, ఇండోర్, జైపూర్, సూరత్, ఆగ్రా, జోధ్‌పూర్, సాంగ్లీ, వడోదర, నాసిక్, చండీగఢ్ నగరాలు టాప్‌-10 లో ఉన్నాయి. ఎలక్ట్రిక్ కార్లకు డిమాండ్ వచ్చినప్పుడు ముంబై, ఢిల్లీ, బెంగళూరు  మొదటి మూడు టైర్ 1 నగరాల్లో నిలవగా... తరువాతి స్థానాల్లో హైదరాబాద్, పూణే, చెన్నై, అహ్మదాబాద్, కోల్‌కతా నిలిచాయి. నాసిక్, లక్నో, నాగ్‌పూర్, కోయంబత్తూర్, జైపూర్, విజయవాడ, గోవా, సూరత్, జబల్‌పూర్ , విశాఖపట్నం ఈ-కార్ల డిమాండ్‌లో అగ్రస్థానంలో ఉన్నాయి.

లగ్జరీ విభాగంలో కూడా ఎక్కువే..!
లగ్జరీ కార్ల విభాగంలో కూడా డిమాండ్ పెరిగిందని జస్ట్‌ డయల్‌ నివేదిక వెల్లడించింది. బుగట్టి, ఫెరారీ, లంబోర్ఘిని , పోర్స్చే డిమాండ్‌లో పెరుగుదల కనిపించింది. బుగట్టి అత్యధికంగా శోధించబడిన బ్రాండ్‌గా సుమారు...ఈ పండుగ సీజన్‌లో 167 శాతం డిమాండ్‌ను కల్గి ఉన్నట్లు తెలుస్తోంది.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement