అమితాబ్ భారీగా కొనేశాడు!
అమితాబ్ భారీగా కొనేశాడు!
Published Wed, May 28 2014 3:57 PM | Last Updated on Sat, Sep 2 2017 7:59 AM
ముంబై: స్టాక్ మార్కెట్ బ్రోకరేజ్ కంపెనీ స్టాంపెడ్ కాపిటల్ లిమిటెడ్ వాటాలను బాలీవుడ్ నటుడు అమితాబ్ బచ్చన్ భారీ సంఖ్యలో కొనుగోలు చేశారు. స్టాక్ మార్కెట్ అందించిన సమాచారం ప్రకారం స్టాంపెడ్ కాపిటల్ కంపెనీకి చెందిన 1.1 లక్షల వాటాలను కొనుగోలు చేసినట్టు తెలిసింది. స్టాంపెడ్ కాపిటల్ వాటా ఒక్కంటికి 109.92 రూపాయల చొప్పున 1.21 కోట్ల రూపాయల విలువైన వాటాలను కొనుగోళు చేశారు.
గత నెలరోజుల్లో స్టాంపెడ్ కాపిటల్ 30 శాతం వృద్దిని నమోదు చేసింది. బుధవారం నాటి ట్రేడింగ్ స్టాంపెడ్ కాపిటల్ ఓ దశలో 119.95 గరిష్ట స్థాయిని నమోదు చేసుకుంది. చివరికి 114.90 వద్ద క్లోజైంది. ఇటీవల అమితాబ్ జస్ట్ డయల్ అనే కంపెనీలో షేర్లను కొనుగోలు చేశారు. జస్ట్ డయల్ కంపెనీ వాటాను 10 రూపాయల చొప్పున 62794 వాటాలను కొనుగోలు చేశారు. ప్రస్తుతం అమితాబ్ కొనుగోలు చేసిన జస్ట్ డయల్ వాటాలు 9 కోట్ల రూపాయల విలువ చేస్తున్నాయి.
Advertisement
Advertisement