టొరంటొ ఫార్మా చేతికి ప్యూరో వెల్నెస్లో75% వాటా | Torrent Pharma invests Rs 188 cr to buy 75% stake in PurO Wellness | Sakshi
Sakshi News home page

టొరంటొ ఫార్మా చేతికి ప్యూరో వెల్నెస్లో75% వాటా

Published Thu, Oct 13 2016 12:45 AM | Last Updated on Mon, Sep 4 2017 5:00 PM

టొరంటొ ఫార్మా చేతికి ప్యూరో వెల్నెస్లో75% వాటా

టొరంటొ ఫార్మా చేతికి ప్యూరో వెల్నెస్లో75% వాటా

డీల్ విలువ రూ.188 కోట్లు
న్యూఢిల్లీ: హెల్త్‌కేర్ స్టార్టప్ ప్యూరో వెల్‌నెస్‌లో 75 శాతం వాటాను టొరంటొ ఫార్మా కొనుగోలు చేయనున్నది. ప్యూరో వెల్‌నెస్‌లో 75 శాతం వాటాను టొరంటొ ఫార్మా రూ.188 కోట్లకు కొనుగోలు చేయనున్నామని ప్యూరో వెల్‌నెస్ తెలిపింది. దీంతో ఈ స్టార్టప్‌లో వ్యవస్థాపకుడు రుచిర్‌మోడికి 25%, టొరంటొ ఫార్మాకు 75% చొప్పున వాటాలుంటాయని వివరించింది.

రుచిర్ మోడీ రూ.62 కోట్లతో ఈ స్టార్టప్‌ను ప్రారంభించారని, సీడ్ ఫండింగ్‌గా రూ.250 కోట్లు సమీకరించామని వివరించింది. ముంబై కేంద్రంగా కార్యకలాపాలు నిర్వహిస్తున్న ఈ స్టార్టప్‌ను టొరంటొ ఫార్మా మాజీ ఈడీ రుచిర్ మోడీ ప్రారంభించారు. ఈ స్టార్టప్ సేంద్రియ ఆహార పదార్ధాలను తయారు చేస్తోంది. త్వరలో సొలైట్ బ్రాండ్ కింద ఉత్పత్తులను మార్కెట్లోకి అందించనున్నది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement