టొరంటొ ఫార్మా చేతికి ప్యూరో వెల్నెస్లో75% వాటా
డీల్ విలువ రూ.188 కోట్లు
న్యూఢిల్లీ: హెల్త్‌కేర్ స్టార్టప్ ప్యూరో వెల్నెస్లో 75 శాతం వాటాను టొరంటొ ఫార్మా కొనుగోలు చేయనున్నది. ప్యూరో వెల్నెస్లో 75 శాతం వాటాను టొరంటొ ఫార్మా రూ.188 కోట్లకు కొనుగోలు చేయనున్నామని ప్యూరో వెల్నెస్ తెలిపింది. దీంతో ఈ స్టార్టప్‌లో వ్యవస్థాపకుడు రుచిర్మోడికి 25%, టొరంటొ ఫార్మాకు 75% చొప్పున వాటాలుంటాయని వివరించింది.
రుచిర్ మోడీ రూ.62 కోట్లతో ఈ స్టార్టప్‌ను ప్రారంభించారని, సీడ్ ఫండింగ్‌గా రూ.250 కోట్లు సమీకరించామని వివరించింది. ముంబై కేంద్రంగా కార్యకలాపాలు నిర్వహిస్తున్న ఈ స్టార్టప్‌ను టొరంటొ ఫార్మా మాజీ ఈడీ రుచిర్ మోడీ ప్రారంభించారు. ఈ స్టార్టప్ సేంద్రియ ఆహార పదార్ధాలను తయారు చేస్తోంది. త్వరలో సొలైట్ బ్రాండ్ కింద ఉత్పత్తులను మార్కెట్లోకి అందించనున్నది.