
మగధీర సినిమాతో టాలీవుడ్ ప్రేక్షకులకు దగ్గరైన హీరోయిన్ కాజల్ అగర్వాల్. ఆ తర్వాత స్టార్ హీరోలందరి సరసన నటించింది. ఇటీవలే బాలకృష్ణ సరసన భగవంత్ కేసరి సినిమాతో మరోసారి ప్రేక్షకులను అలరించింది. దసరా కానుకగా థియేటర్లలో రిలీజైన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద పాజిటివ్ టాక్‌ను సొంతం చేసుకుంది. అనిల్ రావిపూడి దర్శకత్వంలో తెరకెక్కించిన ఈ చిత్రంలో పెళ్లిసందడి ఫేమ్ శ్రీలీల కీలక పాత్ర పోషించింది.
కాగా.. 2020లో తన ప్రియుడు గౌతమ్ కిచ్లును పెళ్లాడిన భామ కొన్నేళ్ల పాటు వెండితెరకు దూరమైంది. గతేడాదిలోనే ఈ జంటకు ఓ కుమారుడు జన్మించారు. తమ ముద్దుల కుమారుడికి నీల్ అనే పేరు పెట్టారు. ప్రస్తుతం మళ్లీ సినిమాలతో బీజీగా ఉంటోన్న ముద్దుగుమ్మ.. తాజాగా కొత్త ఇంటిని కొనుగోలు చేసింది. తన భర్త, కుమారుడితో కలిసి గృహ ప్రవేశం చేసింది. దీనికి సంబంధించిన ఫోటోలను కాజల్ తన ఇన్‌స్టాలో పంచుకుంది. ప్రస్తుతం ఈ ఫోటోలు సోషల్ మీడియాలో తెగ వైరలవుతున్నాయి.
కాజల్ తన ఇన్‌స్టాలో రాస్తూ..'నేను ఈ విషయాన్ని మీతో పంచుకోవడం చాలా భావోద్వేగాలతో ముడిపడి ఉంది. మా పవిత్రమైన కుటుంబ కోసం ఈ వారంలోనే గృహ ప్రవేశానికి సంబంధించిన పూజ జరిగింది. ఇది మేము ప్రేమతో కట్టుకున్నఇల్లు. ఇది నేను ఆ దేవుడి ఆశీర్వాదంగా భావిస్తున్నా. ఈ శుభ సందర్భంలో మా హృదయాలు కృతజ్ఞతతో నిండి ఉన్నాయి.' అంటూ పోస్ట్ చేసింది. ఈ విషయం తెలుసుకున్న పలువురు ప్రముఖ సినీతారలు, ఫ్యాన్స్ అభినందనలు చెబుతున్నారు.
Comments
Please login to add a commentAdd a comment