Kajal Aggarwal Jumps Into Coffee Cup, Video Goes Viral - Sakshi
Sakshi News home page

Kajal Aggarwal: కాఫీ కప్పుతో కాజల్ ఆటలు.. వైరల్ అవుతున్న ట్వీట్!

Published Tue, Jun 20 2023 4:34 PM | Last Updated on Tue, Jun 20 2023 4:58 PM

Kajal Aggarwal Jump Into Coffee Cup Video Goes Viral - Sakshi

కాజల్ అగర్వాల్ తెలుగువారికి పరిచయం అక్కర్లేని పేరు. స్టార్ హీరోలందరితో నటించింది ముద్దుగుమ్మ. ప్రస్తుతం బాలకృష్ణ సరసన భగవంత్‌ కేసరి చిత్రంలో కనిపించనుంది. ఇటీవల సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉంటోన్న భామ ఎప్పటికప్పుడు అభిమానులతో టచ్‌లో ఉంటోంది. తాజాగా ఈ భామ చేసిన ఓ వీడియో తెగ నవ్వులు తెప్పిస్తోంది. కాజల్ మ్యాజిక్ ఎప్పుడు నేర్చుకుంది? అంటూ ఫ్యాన్స్ ఆశ్చర్యపోతున్నారు. ఇంతకీ ఆ వీడియో ఏముందో తెలుసుకుందాం.

(ఇది చదవండి: సల్మాన్ కోసం వెళ్తే.. కుక్కలా తరిమేశారు: 'దబంగ్' నటి)

కాజల్  అగర్వాల్‌ ట్వీట్‌ చేసిన వీడియో చూస్తే మీరు తప్పకుండా షాకవ్వాల్సిందే. ఓ కాఫీ కప్పు ముందు పెట్టి ఒక్కసారిగా అందులోకి దూకేసింది. ఇంకేముంది ఎంచక్కా స్విమ్మింగ్ ఫూల్‌లోగా మళ్లీ బయటకు కనిపించింది. ఇదేంటీ కాఫీ కప్పులో మనిషి దూకడమేంటీ? మళ్లీ బయటికి రావడమేంటీ అనుకుంటున్నారా? అయితే మీరు కూడా ఈ వీడియో చూసేయండి.

మొదటి నేను కూడా నమ్మలేదు. కానీ వీడియో చూస్తే మాత్రం ఎవరైనా నమ్మకుండా ఉండలేరు. అలా ఉంది మరీ కాజల్ అగర్వాల్ క్రియేటీవిటీ. మరీ ఈ వీడియో ఎలా చేసిందో తెలియదు కానీ.. ఇది చూసిన నెటిజన్స్ మాత్రం ఇదేలా సాధ్యమంటూ కామెంట్స్ పెడుతున్నారు.  కాజల్ తన ట్వీట్‌లో రాస్తూ.. 'దృఢ నిశ్చయం, ప్రేమతో కాఫీ కప్పులోకి ఈ రోజు దూకేస్తున్నా. ఎక్కువ కాఫీ, కాదు.. ఎ‍క్కువ ప్రేమ.' అంటూ పోస్ట్ చేసింది.  

(ఇది చదవండి: 'సైతాన్' దర‍్శకుడి వెంటపడుతున్న ఓటీటీలు!)


 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement