
టాలీవుడ్ స్టార్ హీరోయిన్లలో కాజల్ అగర్వాల్ ఒకరు. అయితే ఉత్తరాదిలో కంటే దక్షిణాదిలోనే స్టార్‌దా వెలుగొందుతున్నారు. ఇక తమిళంలో 2008లో పళని చిత్రంతో ఎంట్రీ ఇచ్చారు. ఆ చిత్రం తరువాత విజయ్, అజిత్, కార్తీ అంటూ స్టార్ హీరోలతో జతకట్టి అగ్రకథానాయకి వరుసలో చేరారు. అదేవిధంగా తెలుగులోనూ స్టార్ హీరోయిన్‌గా రాణిస్తున్న సమయంలోనే గౌతమ్ కిచ్లూ అనే వ్యక్తిని పేమించి 2020లో పెళ్లి చేసుకున్నారు. దీంతో కాజల్ అగర్వాల్ నటనకు గుడ్‌బై చెప్పినట్లే అనే ప్రచారం జరిగింది.
(ఇది చదవండి: స్టార్ హీరో మనవరాలు డేటింగ్.. సోషల్ మీడియాలో వీడియో వైరల్!)
కాగా.. 2021లో ఈమె పండంటి బిడ్డకు జన్మనిచ్చారు. అలాంటిది తల్లి అయిన రెండు మూడు నెలల్లోనే మళ్లీ నటించడానికి సిద్ధమయ్యారు. అంతకుముందే అంగీకరించిన ఇండియన్- 2 చిత్రంలో కమలహాసన్‌కు జంటగా నటించడం మొదలెట్టడంతో ఆ చిత్ర షూటింగ్ సమయంలోనే వర్కౌట్స్ చేసి మరింత నాజూగ్గా తయారయ్యారు. దీంతో కాజల్ సెకెండ్ ఇన్నింగ్ మొదలైంది.
ప్రస్తుతం కమలహాసన్ సరసన నటిస్తున్న ఇండియన్ 2 చిత్రం షూటింగ్ చివరి దశకు చేరుకుంది. కాగా తెలుగులో బాలకృష్ణకు జంటగా భగవంత్ కేసరి చిత్రంలో నటిస్తున్నారు. తాజాగా ఈ బ్యూటీ గురించి మరో షాకింగ్ ప్రచారం సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది. కాజల్ అగర్వాల్ నటనకు స్వస్తి చెప్పబోతున్నారన్నదే ఆ ప్రచారం.
కాజల్ రెండోసారి గర్భందాల్చారని.. దీంతో నటనకు గుడ్‌బై చెప్పబోతున్నారని వార్తలు హల్‌చల్ చేస్తున్నాయి. ఇందులో నిజం ఎంత అనేది తెలియాల్సి ఉంది. కారణం కాజల్ ఇటీవల తన అందమైన ఫొటోలను సామాజిక మాధ్యమాల్లో విడుదల చేస్తూ అభిమానులను అలరిస్తున్నారు. కొత్త అవకాశాల కోసం అనే మరో కోణం కూడా అందులో దాగి ఉందని వేరే చెప్పాల్సిన అవసరం లేదు.
(ఇది చదవండి: ఆ క్షణాలు అద్భుతం.. ఉపాసన ట్వీట్ వైరల్!)
ఇలాంటి సమయంలో నటనకు స్వస్తి చెప్పడం నమ్మశక్యం కాని ప్రచారం అనే భావించాలి. అయితే తన బిడ్డ సంరక్షణ కోసం కొంత కాలం నటనకు దూరంగా ఉండాలని ఆమె భావించవచ్చుననే అభిప్రాయం ఒక వర్గం నుంచి వ్యక్తం అవుతోంది. అయితే కాజల్ అగర్వాల్ మాత్రం ఇంకా నోరు మెదపడం లేదు. మరి ఇలాంటి ప్రచారంపై కాజల్ ఏమంటారో చూడాలి.
Comments
Please login to add a commentAdd a comment