Kajal Aggarwal Got Back To Work 4 Months After Giving Birth To Her Son - Sakshi
Sakshi News home page

Kajal Aggarwal: అంతకు ముందులా లేను.. కాజల్‌ ఆసక్తికర వ్యాఖ్యలు!

Published Thu, Sep 22 2022 9:52 AM | Last Updated on Thu, Sep 22 2022 10:40 AM

Kajal Aggarwal Talks About Returning To Work Post Pregnancy - Sakshi

శరీరం సహకరించకపోయినా అనుకున్నది సాధించే విషయంలో రాజీ పడేదే లేదు అంటున్నారు కాజల్‌ అగర్వాల్‌. నాలుగు నెలల క్రితం ఆమె ఓ బాబుకి జన్మనిచ్చిన విషయం తెలిసిందే. ఇప్పుడు మళ్లీ షూటింగ్స్‌లో జాయిన్‌ అయ్యేందుకు కాజల్‌ సమాయత్తమవుతున్నారు. అయితే ‘శారీరకంగా అంతకు ముందులా లేను... ఎనర్జీ లెవల్స్‌ కాస్త తగ్గినట్లుగా అనిపిస్తోంది. అయినా తగ్గను’ అని పేర్కొన్నారు కాజల్‌.

బ్రేక్‌ తర్వాత ఆమె ‘ఇండియన్‌ 2’ షూట్‌లో పాల్గొననున్నారు. ఈ సినిమా కోసం ప్రస్తుతం గుర్రపు స్వారీ నేర్చుకుంటున్నారు. ఈ క్రమంలో ప్రసవానంతరం తనలో వచ్చిన శారీరక మార్పు గురించి సోషల్‌ మీడియాలో కాజల్‌ చేసిన పోస్ట్‌ సారాంశం ఇలా..... ‘‘ప్రసవానంతరం నాలుగు నెలల తర్వాత మళ్లీ నా వర్క్‌ స్టార్ట్‌ చేసినందుకు చాలా ఉత్సాహంగా ఉంది. కానీ మొదట్నుంచి మళ్లీ మొదలుపెట్టానా? అనే భావన కలిగింది.

(చదవండి: సిగ్గూ, శరం ఉండాలి.. కోపంతో ఊగిపోయిన రేవంత్‌)

ప్రసవానికి ముందు ఉన్నట్లుగా నా శరీరం ఇప్పుడు నాకు సహకరించడం లేదు. బిడ్డకు జన్మనివ్వక ముందు లొకేషన్స్‌లో ఎంతో వర్క్‌ చేసి, ఆ తర్వాత వ్యాయామం కూడా చేసేదాన్ని. కానీ తల్లయ్యాక ఒకప్పుడు ఉన్న నా ఎనర్జీ స్థాయిని అందుకోవడం కష్టంగా ఉంది. ఇక గుర్రపు స్వారీ చేయడం అనేది నాకో పెద్ద టాస్‌్కగా అనిపిస్తోంది. అయినా పట్టుదలగా నేర్చుకుంటున్నాను. ఇంతకుముందు మార్షల్‌ ఆర్ట్స్‌ నేర్చుకునేటప్పుడు నా శరీరం నా మాట వినేది. పరిస్థితుల ప్రభావం వల్ల మన శరీరం మారొచ్చు కానీ మన ఆత్మవిశ్వాసం తగ్గకూడదు. నన్ను నేను అప్‌గ్రేడ్‌ చేసుకుంటున్నాను’’ అని చెప్పుకొచ్చారు కాజల్‌ అగర్వాల్‌. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement