Youtuber Brent Rivera Gifts Luxury House For His Pet Dog, Video Goes Viral - Sakshi
Sakshi News home page

Brent Rivera: ఈ కుక్క భలే లక్కీ.. సొంతంగా ఇల్లు, టీవీ, ఫ్రిజ్‌ సహా అన్ని సౌకర్యాలు

Published Mon, Jun 19 2023 12:45 PM | Last Updated on Fri, Jul 14 2023 4:23 PM

Yotuber Brent Rivera Gifts Luxury House For His Pet Dog - Sakshi

పెంపుడు కుక్కలను అపురూపంగా చూసుకునే వాళ్లు చాలామందే ఉంటారు గాని, పెంపుడు కుక్కకు ఏకంగా కొత్తిల్లు కట్టించిన ఘనత మాత్రం కాలిఫోర్నియాకు చెందిన యూట్యూబర్‌ బ్రెంట్‌ రివెరాకు మాత్రమే దక్కుతుంది. బ్రెంట్‌ కొంతకాలంగా చార్లీ అనే కుక్కను అల్లారుముద్దుగా పెంచుకుంటున్నాడు.

ఈ కుక్క ఏడాది పుట్టిన రోజు మే 29న జరిగింది. ఈ సందర్భంగా బ్రెంట్‌ తన కుక్కకు విలాసవంతమైన కొత్త ఇంటిని బహూకరించాడు. దీని కోసం అతడికి 20 వేల డాలర్లకు (రూ.16.54 లక్షలు) పైగానే ఖర్చయింది.

యూట్యూబ్‌లో బ్రెంట్‌ తన కుక్క ఇంటి వీడియోను పెడితే, ఏకంగా 7.9 మిలియన్‌వ్యూస్‌ వచ్చాయి. కుక్కగారి కొత్త ఇంట్లో చక్కని పడకతో పాటు టీవీ, ఫ్రిజ్‌ వంటి సౌకర్యాలు ఉండటం విశేషం.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement