కుక్క కోసం రూ. 16 లక్షల ఇల్లు! ఫ్రిజ్‌తో సహా.. | Viral Video: Man Builds Dream House For His Dog That Cost Rs 16 Laks | Sakshi
Sakshi News home page

కుక్క కోసం రూ. 16 లక్షల ఇల్లు! ఫ్రిజ్‌తో సహా..

Published Wed, May 31 2023 8:50 PM | Last Updated on Wed, May 31 2023 8:53 PM

Viral Video: Man Builds Dream House For His Dog That Cost Rs 16 Laks - Sakshi

కుక్క కోసం అత్యంత ఖరీదైన ఇల్లు నిర్మించాడో వ్యక్తి. ఏకంగా ఆ ఇంటిలో దానికో కుర్చి, షోఫా, టేబుల్‌, ఫ్రిజ్‌ అన్ని ఏర్పాటు చేశాడు. డ్రీమ్‌ డాగ్‌ హౌస్‌ పేరిట ఈ ఇల్లుని నిర్మించాడు. ఈ వింత ఘటన కాలిఫోర్నియాలో చోటు చేసుకుంది. బ్రెంట్‌ రివెరా అనే 25 ఏళ్ల యూట్యూబర్‌ తన కుక్కు చార్లీ కోసం  ఈ లగ్జరీ హౌస్‌ని ఏర్పాటు చేశాడు. ఆ కుక్క మొదటి పుట్టిన రోజు కానుకగా ఈ ఖరిదైన గిఫ్ట్‌ ఇచ్చానని చెబుతున్నాడు.

ఈ విషయాన్ని సోషల్‌ మీడియా వేదికగా నెటిజన్లతో పంచుకున్నాడు. ఆ కుక్క హాయిగా పడుకునేలా విలాసవంతమైన బెడ్‌, కాఫీ టేబుల్‌, టీవీ, ఫ్రిజ్‌తో సహా అచ్చం మానవులకు కావాల్సిన అన్ని వసతులను ఆ కుక్కకి సమకూర్చాడు. అలాగే  కుక్కి సంబంధించిన వస్తువులను కూడ ఏర్పాటు చేశాడు. ఆ ఇంటి వెలుపల బంగారు అక్షరాలతో చార్లీ హౌస్‌ అని రాయించడమే గాక ఓ సింబల్‌ని కూడా ఏర్పాటు చేశాడు. ఐతే నెటిజన్లు హుషారుగా తిరుగుతూ గడిపే జీవితాన్ని బంధించి మీరే పాడు చేస్తున్నారని కామెంట్లు చేస్తూ పోస్టులు పెట్టారు. 

(చదవండి: కొంపముంచిన టిక్‌టాక్ రెసిపీ.. దెబ్బకు ముఖం వాచిపోయింది!)

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement