ఢిల్లీ: కాంగ్రెస్ నాయకుడు రాహుల్ గాంధీకి అధికారిక నివాసంగా తుగ్లక్ లేన్ 12 బంగ్లాను కేటాయించిన విషయం తెలిసిందే. దీనిపై రాహుల్ తన సమ్మతిని తెలపడానికి పార్లమెంటరీ కమిటీ విధించిన 15 రోజుల గడువు విధించింది. బుధవారంతో ఆ గడువు ముగిసినప్పటికీ.. లద్దాఖ్ యాత్రలో ఉన్న రాహుల్ ఆ బంగ్లాను తీసుకుంటానని సమ్మతిని తెలపలేదు. దీంతో మరో బంగ్లాను ఆయనకు కేటాయించనున్నట్లు తెలుస్తోంది.
మోదీ వ్యాఖ్యల కేసులో సూరత్ కోర్టు రాహుల్‌కు రెండేళ్ల శిక్ష విధించిన నేపథ్యంలో పార్లమెంట్ పదవిని కోల్పోయారు. దీంతో 2005 నుంచి ఎంపీగా నివాసం ఉంటున్న తగ్లక్ లేన్ 12 బంగ్లాను ఏప్రిల్ 22న ఆయన ఖాలీ చేశారు. జన్‌పథ్ 10లోని తన తల్లి సోనియా గాంధీ నివాసానికి మారారు.
తాజాగా సూరత్ కోర్టు తీర్పుపై సుప్రీంకోర్టు స్టే విధించడంతో రాహుల్ మళ్లీ తన ఎంపీ పదవిని పొందారు. ఈ నేపథ్యంలో పార్లమెంటరీ కమిటీ ఆయనకు అధికారికంగా భవనాన్ని కేటాయించాల్సి వచ్చింది. 2005 నుంచి ఆయన ఉంటున్న తగ్లక్ లేన్‌లోని 12 బంగ్లానే ఇచ్చారు. కానీ దీనికి ఆయన సమ్మతించనట్లు తెలుస్తోంది.
బంగ్లా 12పై రాహుల్ సమ్మతి తెలపనంత మాత్రనా పార్లమెంట్ నివాసాన్ని తిరస్కరించినట్లు కాదని కాంగ్రెస్ వర్గాలు తెలుపుతున్నాయి. ప్రస్తుతం రాహుల్.. ఆగష్టు 17న ప్రారంభమైన కశ్మీర్ పర్యటనలో ఉన్నారు. కార్గిల్‌ను కూడా సందర్శించనున్నారు. ఆగష్టు 25న ఈ యాత్ర ముగుస్తుందని సమాచారం.
ఇదీ చదవండి: రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్ర-2 ఖరారు.. ఎప్పటి నుంచి అంటే..
Comments
Please login to add a commentAdd a comment