నకిలీ నోట్ల ప్రింటింగ్ మిషన్ సీజ్
నకిలీ నోట్ల ప్రింటింగ్ మిషన్ సీజ్
Published Thu, Dec 29 2016 10:53 AM | Last Updated on Mon, Sep 4 2017 11:54 PM
గుజరాత్ : పాత నోట్ల రద్దుతో కొత్త నోట్లను ముద్రిస్తూ కేటుగాళ్లు కలకలం సృష్టిస్తున్నారు. ఖేడా జిల్లాలో గుజరాత్ పోలీసులు జరిపిన సెర్చ్ ఆపరేషన్లో నకిలీ నోట్ల ప్రింటింగ్ మిషన్ను బయటపడింది. ఈ కార్యకలాపాలకు పాల్పడుతున్న నలుగురిని పోలీసులు అరెస్ట్ చేశారు. వారి వద్ద నుంచి రూ.12.45 లక్షల నగదును పోలీసులు స్వాధీనం చేసుకోగా, వాటిలో ఎక్కువగా కొత్త రూ.2000 నోట్లే ఉన్నాయి. రాజ్కోట్ క్రైమ్ బ్రాంచ్ పోలీసులు బోపాల్ ప్రాంతంలోని బంగళాలో జరిపిన సెర్చ్ ఆపరేషన్లో వీరు పట్టుబడ్డారు. వీరి వద్ద నుంచి ఓ నకిలీ నోట్ ప్రింటింగ్ మిషన్ను, నోట్ల ముద్రణకు తీసుకొచ్చిన ఖాళీ పేపర్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.
హనుమాన్మధీ సమీపంలో రెండు రోజుల క్రితం రూ.2000, రూ.500 నోట్లతో పట్టుబడ్డ ఇద్దరు వ్యక్తుల్లో ఓ వ్యక్తి ఇచ్చిన సమాచారం మేరకు పోలీసులు ఈ సెర్చ్ ఆపరేషన్ను చేపట్టారు. దీనిలో ఒక మిషన్ను ఓ కారులోంచి రికవరీ చేయగా.. మరో మిషన్ బంగళాలో జరిపిన సెర్చ్ ఆపరేషన్లో పట్టుబడింది. ఈ గ్యాంగ్ అహ్మదాబాద్కు చెందిందని పోలీసులు చెప్పారు. వీరు కమిషన్పై నోట్లను మార్పిడి చేస్తున్నారని తెలిసింది. ప్రస్తుతం వీరిపై దర్యాప్తు చేపడుతున్నామని, వీరి నుంచి నకిలీ నోట్ల ముఠాల సమాచారం సేకరిస్తామన్నారు. రికవరీకి సంబంధించి ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్కు వెల్లడించామని పోలీసులు చెప్పారు.
Advertisement
Advertisement