
ఢిల్లీ: ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న కరోనా బాధితులు చెప్పాపెట్టకుండా అదృశ్యమయ్యారు. ఆస్పత్రి సిబ్బందికి చెప్పకుండా ఎక్కడికి వెళ్లారో తెలియదు. అలా ఒక్కరు కాదు ఇద్దరు కాదు.. ఏకంగా 23 మంది ఆస్పత్రి నుంచి పరారయ్యారు. ఈ ఘటన ఢిల్లీలోని బారా హిందూ రావ్ ఆస్పత్రిలో చోటుచేసుకుంది. అకస్మాత్తుగా మాయమవుతుండడంతో ఆస్పత్రి అధికారులు తలలు పట్టుకుంటున్నారు.
దీనికి సంబంధించిన వివరాలు ఉత్తర ఢిల్లీ మున్సిపల్ కార్పొరేషన్ (ఎన్‌డీఎంసీ) మేయర్ జై ప్రకాశ్ వెల్లడించారు. హిందూ రావు ఆస్పత్రిలో మొత్తం 250 బెడ్లు ఉన్నాయి. ప్రస్తుతం కరోనా ఆస్పత్రిగా మార్చారు. బెడ్లన్నీ ఎప్పుడూ నిండుగా ఉంటున్నాయి. అయితే రికార్డుల్లో ఏప్రిల్ 19 నుంచి మే 6వ తేదీ వరకు జాబితా పరిశీలించగా 23 మంది కనిపించలేదు. వారు చెప్పాపెట్టకుండా వెళ్లిపోయారని గుర్తించారు. అయితే ఆ కరోనా బాధితులు మంచి సౌకర్యాలు ఉన్న ఆస్పత్రిలో చేరేందుకు వెళ్లి ఉంటారని మేయర్ చెప్పారు. ఈ విధంగా ఢిల్లీలోని ప్రభుత్వ ఆస్పత్రుల్లో జరగడం సాధారణంగా మారిందని పేర్కొన్నారు. ఈ విషయాన్ని ఢిల్లీ పోలీసులకు సమాచారం ఇచ్చినట్లు తెలిపారు.
చదవండి: కరోనా కల్లోలం: 14 రాష్ట్రాల్లో లాక్‌డౌన్
చదవండి: హిందూ యువతికి పాక్‌లో అత్యున్నత పదవి
Comments
Please login to add a commentAdd a comment