NDMC
-
ఆస్పత్రి నుంచి 23 మంది కరోనా బాధితులు పరార్
ఢిల్లీ: ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న కరోనా బాధితులు చెప్పాపెట్టకుండా అదృశ్యమయ్యారు. ఆస్పత్రి సిబ్బందికి చెప్పకుండా ఎక్కడికి వెళ్లారో తెలియదు. అలా ఒక్కరు కాదు ఇద్దరు కాదు.. ఏకంగా 23 మంది ఆస్పత్రి నుంచి పరారయ్యారు. ఈ ఘటన ఢిల్లీలోని బారా హిందూ రావ్ ఆస్పత్రిలో చోటుచేసుకుంది. అకస్మాత్తుగా మాయమవుతుండడంతో ఆస్పత్రి అధికారులు తలలు పట్టుకుంటున్నారు. దీనికి సంబంధించిన వివరాలు ఉత్తర ఢిల్లీ మున్సిపల్ కార్పొరేషన్ (ఎన్డీఎంసీ) మేయర్ జై ప్రకాశ్ వెల్లడించారు. హిందూ రావు ఆస్పత్రిలో మొత్తం 250 బెడ్లు ఉన్నాయి. ప్రస్తుతం కరోనా ఆస్పత్రిగా మార్చారు. బెడ్లన్నీ ఎప్పుడూ నిండుగా ఉంటున్నాయి. అయితే రికార్డుల్లో ఏప్రిల్ 19 నుంచి మే 6వ తేదీ వరకు జాబితా పరిశీలించగా 23 మంది కనిపించలేదు. వారు చెప్పాపెట్టకుండా వెళ్లిపోయారని గుర్తించారు. అయితే ఆ కరోనా బాధితులు మంచి సౌకర్యాలు ఉన్న ఆస్పత్రిలో చేరేందుకు వెళ్లి ఉంటారని మేయర్ చెప్పారు. ఈ విధంగా ఢిల్లీలోని ప్రభుత్వ ఆస్పత్రుల్లో జరగడం సాధారణంగా మారిందని పేర్కొన్నారు. ఈ విషయాన్ని ఢిల్లీ పోలీసులకు సమాచారం ఇచ్చినట్లు తెలిపారు. చదవండి: కరోనా కల్లోలం: 14 రాష్ట్రాల్లో లాక్డౌన్ చదవండి: హిందూ యువతికి పాక్‌లో అత్యున్నత పదవి -
ఎన్డీఎంసీ రోడ్ల నిర్వహణపై పరిశీలన
సాక్షి, న్యూఢిల్లీ: దేశ రాజధాని న్యూఢిల్లీ మున్సి పల్ కౌన్సిల్ (ఎన్డీఎంసీ) పరిధిలోని రహదారుల మెరుగైన నిర్వహణ, అభివృద్ధి విధానా లను పరిశీలించడానికి జీహెచ్ఎంసీ ఇంజనీర్ల బృందం శనివారం ఇక్కడ పర్యటిం చింది. రాష్ట్ర పట్టణాభివృద్ధి శాఖ మంత్రి కేటీఆర్, కార్యదర్శి అర వింద్‌కుమార్ ఆదేశాల మేరకు ఎన్డీఎంసీ ఇంజనీర్లతో తెలం గాణ భవన్ ఆర్సీ గౌరవ్ ఉప్పల్, జీహెచ్ఎంసీ ఇంజనీర్లు సమావేశ మయ్యారు. ఇక్కడి తెలంగాణ భవన్ లో జరిగిన సమావేశంలో రహదారుల నాణ్యత, మరమ్మతులకు స్పందించే విధి విధా నాలను ఎన్డీఎంసీ ఇంజనీర్లు వివరించారు.ఎన్డీఎంసీ పరిధిలో ఉన్న అధికారులు, సిబ్బం ది రహదారుల నిర్వహణకు వాడే సామగ్రి, వాహనాల వివరాలు, సబ్‌వేల ఏర్పాటు, వాహనాల వేగం తగ్గించేందుకు తీసుకుంటున్న జాగ్రత్తలు. నిల్వ నీటిని తొలగించే విధానం, రోడ్ కటింగ్‌లో పాటించే నిబంధనలు, కాలనీ రోడ్ల నిర్వహణ, ప్రతి ఇంటి ముందు రోడ్లకు తీసుకుంటున్న జాగ్రత్తలు, ఫుట్‌పాత్‌లు, మరుగుదొడ్ల నిర్మాణం, బస్ షెల్టర్లు, సమాచార చిహ్నాల ఏర్పాటు, నీటిపారుదల వ్యవస్థ, కమ్యూ నికేషన్ వైరింగ్ గురించి జీహెచ్ఎంసీ ఇంజనీర్లకు వివరించారు. సమావేశంలో జీహెచ్ఎంసీ చీఫ్ ఇంజినీర్లు ఆర్.శ్రీధర్, మొహమ్మద్ జియా ఉద్దీన్, సూపరింటెండెంట్ ఇంజినీర్లు ఆర్.శం కర్ లాల్, టి.రవీంద్రనాథ్, పి.అనిల్ రాజ్ పాల్గొన్నారు. కాగా, ఎన్డీఎంసీ నుంచి చీఫ్ ఇంజనీర్ సంజయ్ గుప్తా, సూపరింటెండెంట్ ఇంజినీర్ హెచ్‌పీ సింగ్, ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్ కేఎమ్ గోయల్, అసిస్టెంట్ ఇంజినీర్ ఆర్కే శర్మ పాల్గొన్నారు. -
ఢిల్లీ తరహాలో హరిత సొబగులు
సాక్షి, హైదరాబాద్: న్యూఢిల్లీ మునిసిపల్ కౌన్సిల్ (ఎన్డీఎంసీ) ఆధ్వర్యంలో ఢిల్లీ నగరంలో చేపట్టిన పచ్చదనం నిర్వహణ, ఇతర పనులను ఆదర్శంగా తీసుకుని హైదరాబాద్‌లో సైతం పచ్చదనాన్ని మరింత వృద్ధి చేస్తామని మంత్రి కె.తారకరామారావు పేర్కొన్నారు. పచ్చదనం పెంపునకు నగరంలో ప్రభుత్వం ఇప్పటికే ప్రత్యేక చర్యలు తీసుకుంటోందన్నారు. ఎన్డీఎంసీ ప్రతినిధి బృందంతో సోమవారం కేటీఆర్ సచివాలయంలో సమావేశమయ్యారు. ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు నగరంలో చేపట్టిన పలు కార్యక్రమాలను మంత్రి వారికి వివరించారు. ఎన్డీఎంసీ బృందం ఢిల్లీలో చేపట్టిన పలు కార్యక్రమాలను మంత్రికి వివరించింది. తెలంగాణలో అనుకూల వాతావరణ పరిస్థితులు ఉన్న నేపథ్యంలో ఇక్కడ పచ్చదనాన్ని మరింతగా పెంచేందుకు అవకాశముందని తెలిపింది. హైదరాబాద్ నగరంలో పలు చోట్లా జీహెచ్ఎంసీ సైతం గార్డెనింగ్ బాగా చేస్తోందని అభినందించింది. మంత్రి కేటీఆర్ మాట్లాడుతూ.. ఎన్డీఎంసీ ఆధ్వర్యంలో ఢిల్లీలో పార్కులు, గార్డెనింగ్ పనుల తీరు ప్రశంసించారు. ఢిల్లీ తరహాలో పబ్లిక్ టాయిలెట్స్ నిర్మాణానికి కనీసం 45 స్థలాలను ఎంపిక చేయాలని మంత్రి కేటీఆర్ జీహెచ్ఎంసీ అధికారులను ఆదేశించారు. పార్కుల నిర్వహణకు అవసరమైన నీటి కోసం మినీ ఎస్టీపీల ఏర్పాటుకు ఉన్న అవకాశాలను పరిశీలించాలన్నారు. ఎన్డీఎంసీ తరహాలో స్ట్రీట్ స్కెపింగ్ కోసం ఢిల్లీలో పర్యటించాలని జీహెచ్ఎంసీ కమిషనర్‌కు సూచించారు. -
ఒక హత్య...అనేక ప్రశ్నలు
అవినీతిని అంతమొందిస్తామంటున్న పాలకుల డొల్లతనాన్ని వెల్లడించే సందర్భమిది. నేరం, రాజకీయం, వ్యాపారం ఎంతగా పెనవేసుకుపోయాయో రుజువు చేసే ఉదంతమిది. న్యూఢిల్లీ మున్సిపల్ కౌన్సిల్(ఎన్డీఎంసీ) ఎస్టేట్ ఆఫీసర్‌గా పనిచేస్తున్న ఎం.ఎం. ఖాన్‌ను గత నెల 16న ‘గుర్తు తెలియని దుండగులు’ కాల్చి చంపారు. ఇప్పుడా ఉదంతం తిరుగుతున్న మలుపులు అందరినీ దిగ్భ్రాంతికి గురి చేస్తున్నాయి. ఎం.ఎం. ఖాన్‌కు నిజాయితీపరుడైన అధికారిగా పేరుప్రతిష్టలు న్నాయి. ముక్కుసూటిగా పోయే వ్యక్తి అన్న అభిప్రాయం అందరిలోనూ ఉంది. అలాంటి అధికారిని ఎవరు పొట్టనబెట్టుకున్నారన్న అంశంపై దర్యాప్తు మొదలై ఆ ఉదంతం జరిగిన అయిదురోజుల తర్వాత నగరంలోని హోటల్ యజమాని రమేష్ కక్కడ్ అరెస్టయ్యాడు. మరో ఏడుగురిని కూడా అదుపులోకి తీసుకున్నారు. అందుకు సంబంధించిన దర్యాప్తు కొనసాగుతుండగానే వెల్లడవుతున్న అంశాలు మన ప్రభుత్వాల, ప్రజాప్రతినిధుల పనితీరును ప్రశ్నించేవిగా ఉన్నాయి. నిజాయితీపరుడని భావించే ఖాన్‌పై...ఆయన హత్యకు ముందు ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ నజీబ్ జంగ్కు మూడు ఫిర్యాదులందితే ఆ మూడింటిలో ఒకటి నిందితుడైన హోటల్ యజమాని రాసింది. రెండో ఫిర్యాదు స్థానిక బీజేపీ ఎంపీ మహేష్ గిరినుంచి రాగా మూడోది ఎన్డీఎంసీ వైస్ చైర్మన్, బీజేపీ నేత కరణ్‌సింగ్ తన్వర్ రాశారు. ఆ ఫిర్యాదుల ఆధారంగా ఖాన్‌పై చట్టప్రకారం తగిన చర్యలు తీసుకోమంటూ నజీబ్ ఎన్డీఎంసీకి రెండు లేఖలు రాశారు. ఇందులో ఒక లేఖను ఖాన్ హత్యకు అయిదు రోజుల ముందు పంపగా... రెండోది ఖాన్ హత్య జరిగిన మర్నాడు పంపారు. హోటల్ యజమాని ఫిర్యాదు చేయడాన్ని అర్ధం చేసుకోవచ్చు. ఎందుకంటే రూ. 140 కోట్ల లెసైన్స్ ఫీజు ఎగ్గొట్టిన కారణంగా నిరుడు ఫిబ్రవరిలో మూతబడ్డ హోటల్ విషయంలో జరుపుతున్న విచారణలో ఖాన్ తనకు అనుకూ లమైన నిర్ణయాన్ని ప్రకటిస్తారన్న నమ్మకం అతనికి లేదు. అందుకే ఆయన ఏక పక్షంగా వ్యవహరిస్తున్నారని జంగ్కు ఫిర్యాదు చేశాడు. చర్య తీసుకోమని కోరాడు. కానీ స్థానిక బీజేపీ ఎంపీ, ఎన్డీఎంసీ వైస్ చైర్మన్లు ఇదే కేసుపై లేఖలు రాయా ల్సిన అవసరమేమిటి? ఈ లేఖలు కూడా ఖాన్ ‘ఏకపక్షంగా... అన్యాయంగా’ వ్యవహరిస్తున్న తీరుపైనే ఫిర్యాదు చేశాయి. హోటల్ యాజమాన్యం ఈ వివాదం గురించి చెబుతున్నదేమిటో విని తుది నిర్ణయం తీసుకోమని ఢిల్లీ హైకోర్టు ఇచ్చిన తీర్పును ఖాన్ పట్టించుకోవడం లేదన్నాయి. వారు లేఖలు రాస్తే రాశారు... నిజా నిజాలేమిటో నిర్ధారించుకోకుండానే వాటిపై చర్య తీసుకోవాలని ఎన్డీఎంసీకి జంగ్ ఎలా సిఫార్సు చేస్తారు? సిఫార్సు చేస్తే చేశారు... కనీసం తనకొచ్చిన ఫిర్యాదుకు కేంద్రబిందువైన అధికారి ముందురోజే హత్యకు గురయ్యారన్న కనీస స్పృహ కూడా లేకుండా పోవడమేమిటి? జంగ్ రాసిన లేఖలు రెండూ ఖాన్ హత్యలో ఆయన ప్రమేయంపై అనుమా నాలు రేకెత్తిస్తున్నాయని, కనుక ఆయననూ... హోటల్ యజమానికి వకాల్తా తీసుకుని ఫిర్యాదులిచ్చిన ఇద్దరు నేతలనూ అరెస్టు చేయాలని ఢిల్లీ పాలకపక్షం ఆమ్ ఆద్మీ పార్టీ(ఆప్) కోరుతోంది. జంగ్‌కూ, ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్‌కూ మధ్య సంబంధాలు మొదటినుంచీ అంతంతమాత్రమే గనుక ఆ డిమాండ్‌లోని అంతరార్ధం తెలుసుకోవడం పెద్ద కష్టం కాదు. కానీ ప్రజా ప్రతినిధులుగా ఉంటున్న వారు బాధ్యతగా వ్యవహరించాల్సిన అవసరం లేదా? ఖాన్ గురించి ఫిర్యాదు వస్తే దాని ఆధారంగా తన కార్యాలయం ఒక లేఖ రూపొందించి నజీబ్ జంగ్కు పంపిందని, ఇంతకుమించి తనకేమీ తెలియదని ఎంపీ మహేష్ గిరి చెబుతున్నారు. ప్రజా ప్రతినిధులుగా తమకెన్నో లేఖలు వస్తుంటాయని, స్పందించాల్సిన బాధ్యత తమకున్నదని కూడా అంటున్నారు. ఈ జవాబు వింటే కొన్ని నెలల క్రితం హైదరాబాద్ కేంద్రీయ విశ్వవిద్యాలయం పరిశోధక విద్యార్థి రోహిత్ వేముల ఉదంతం విషయంలో కేంద్ర మంత్రి బండారు దత్తాత్రేయ వ్యవహరించిన తీరు గుర్తుకొస్తుంది. విశ్వవిద్యాలయంలో జాతి వ్యతిరేకులున్నారని తనకు ఫిర్యాదు అందితే కేంద్ర మానవ వనరుల అభివృద్ధి మంత్రిత్వ శాఖకు లేఖ రాశానని ఆయన చేతులు దులుపుకుంటే... ఒక ప్రజా ప్రతినిధి నుంచి వచ్చిన లేఖను పరిశీలించి చర్య తీసుకోమని విశ్వవిద్యాలయాన్ని కోరామని ఆ శాఖ చెప్పింది. వచ్చిన ఫిర్యాదులోని నిజా నిజాలేమిటో ప్రాథమికంగా అయినా నిర్ధారించుకోలేని అశక్తులుగా తాము ఉన్నప్పుడు చర్య కోరుతూ లేఖలు రాసే బాధ్యతను నెత్తినేసుకోవడం సబబు కాదని వారికి ఎందుకు అనిపించడంలేదో ఆశ్చర్యకరం. ఖాన్ హత్య విషయంలో తనపై ఆప్ చేస్తున్న ఆరోపణలను తోసి పుచ్చ డంతోపాటు ఈ విషాదాన్ని రాజకీయ ప్రయోజనాల కోసం ఆ పార్టీ వాడు కుంటున్నదని నజీబ్ జంగ్ అంటున్నారు. పైగా ఖాన్‌ను అమరుడిగా గుర్తించి, ఆయన కుటుంబానికి కోటి రూపాయల పరిహారం ఇవ్వాలన్న కేజ్రీవాల్ ప్రభుత్వ సిఫార్సును తాను సత్వరం అంగీకరించిన విషయాన్ని ఆయన గుర్తు చేస్తున్నారు. చనిపోయాక నిర్వహించిన కర్మకాండలనూ, వారసులకు అందజేసిన డబ్బునూ ఏకరువు పెట్టి చిత్తశుద్ధిని చాటుకోవడానికి ప్రయత్నించడం కంటే ఈ ఉదంతంలో తాను వ్యవహరించిన తీరుపై ఆయన ఆత్మ పరిశీలన చేసుకుని ఉంటే సబబుగా ఉండేది. ఖాన్ విషయంలో వచ్చిన ఫిర్యాదులకు మూల కారణమైన హోటల్ కేసేమిటో ముందుగా తెలుసుకుని ఉంటే ఆయనకు చాలా విషయాలు అవగాహనకొచ్చేవి. ఇలాంటి కేసులో తన జోక్యం మంచిది కాదన్న సంగతి అర్ధమయ్యేది. నాలుగైదు రోజులు ఆగితే ఖాన్ నివేదిక వచ్చేది. దాన్ని పరిశీలించి లోటుపాట్లుంటే ఆయనను నిలదీయడానికి, అవసరమైతే ఆయనపై చర్య తీసుకోవడానికి ఎటూ నజీబ్ జంగ్కు అధికారం ఉంటుంది. ఆ పని చేయకుండా... తనకొచ్చిన ఫిర్యాదులపై అంత తొందరపాటును ప్రదర్శించడం దేనికి సంకేతం? సామాన్య పౌరులు చేసే ఫిర్యాదుల విషయంలో ఇంత వేగిరం చర్య తీసు కుంటున్నారా? ఇంత యాంత్రికంగానూ వ్యవహరిస్తున్నారా? దీన్ని పాలన అంటారా...అరాచకమంటారా? జంగ్ సంజాయిషీ ఇవ్వాలి. కనీసం ఈ ఉదంతం తర్వాతైనా తమ పోకడల్ని మార్చుకోవలసిన అవసరాన్ని ప్రజా ప్రతినిధులంతా గుర్తించాలి. -
చాణుక్యలో మళ్లీ సినిమాలు
సాక్షి, న్యూఢిల్లీ: ఢిల్లీవాసులు మళ్లీ ‘చాణుక్య సినిమా’లో సినిమాలు చూడొచ్చు. ఏడు సంవత్సరాల తరువాత చాణుక్య సినిమాను నాలుగంతస్తుల మాల్, మల్టీప్లెక్స్ రూపంలో నగరవాసులకు అందుబాటులోకి తేవడానికి ఎన్డీఎంసీ సన్నాహాలు చేస్తోంది. చాణుక్య సినిమాలో వచ్చే ఏడాది మార్చి నుంచి మళ్లీ సినిమాలు ప్రదర్శించవచ్చు. ఎన్డీఎంసీ చాణుక్య సినిమాను ఓ రియల్ ఎస్టేట్ సంస్థకు అప్పగించి నాలుగంతస్తుల మాల్, మల్టీప్లెక్స్ నిర్మించే కాంట్రాక్టు కుదుర్చుకుంది. ఈ నిర్మాణ సంస్థకు చాణుక్య కాంప్లెక్స్‌ను 30 సంవత్సరాల లీజుకు ఇస్తూ ఎన్డీఎంసీ ఒప్పందం కుదుర్చుకుంది. ఇందుకు బదులుగా కంపెనీ ఎన్డీఎంసీకి 85 కోట్ల రూపాయలు ఇవ్వడంతోపాటు ప్రతి నెల కోటి రూపాయలు సర్వీస్ టాక్స్ కింద చెల్లించనుంది. మాల్, మల్టీప్లెక్స్ నిర్మాణం 2008లో ప్రారంభమైంది. కానీ ఢిల్లీ ఫైర్ సర్వీసెస్, ఎయిర్పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియా, ఢిల్లీ అర్బన్ ఆర్ట్ కమిషన్, డిడిఏ వంటి విభాగాలు అనుమతులు ఇవ్వడంలో ఆలస్యం చేయడంతో నిర్మాణం జాప్యమైంది. -
ఢిల్లీ కార్పొరేషన్ ఆధ్వర్యంలో ‘శక్తి’ క్యాబ్‌లు
న్యూఢిల్లీ: నగర మహిళకు భద్రత కల్పించాలని న్యూఢిల్లీ మున్సిపల్ కార్పొరేషన్(ఎన్డీఎంసీ) భావిస్తోంది. వారిపై మహిళలపై బస్సులు, ట్యాక్సీల్లో దాడులు పెరుగుతుండడంతో మహిళా ట్యాక్సీలను ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. ప్రపంచ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకొని ‘శక్తి’ పేరుతో 20 ట్యాక్సీలను ప్రారంభించాలని స్థానిక సంస్థ ఏర్పాట్లు చేసుకుంది. కానీ ఎన్డీఎంసీ కొన్ని కారణాలతో ఆ కార్యక్రమాన్ని వాయిదా వేసుకుంది. దీనిపై ఎన్ఎండీసీ చైర్పర్సన్ జలాజ్ శ్రీవాస్తవ మాట్లాడుతూ తాము ఇంకా రవాణా శాఖను సంప్రదించాల్సి ఉందని, ఇలాంటి సేవలను ప్రారంభించాలంటే మొదట 100 ట్యాక్సీల ఏర్పాటు చేయాల్సి ఉందని తెలిపారు. కానీ నిధులలేమి కారణంగా పైలట్ ప్రాజెక్ట్‌గా కేవలం 20 ట్యాక్సీలతో ప్రారంభించాలని నిర్ణయించినట్టు ఆమె వెల్లడించారు. ఈ సేవలను వ చ్చే నెల నుంచి ప్రారంభించనున్నట్లు ప్రకటించారు. కాగా, ఈ ట్యాక్సీలకు మహిళలే డ్రైవ ర్లుగా ఉంటారని పేర్కొన్నారు. చిన్న పిల్లలు సులువుగా నేరగాళ్ల బారిన పడుతుండడంతో కార్పొరేషన్ పరిధిలో నడిచే అన్ని పాఠశాలల బస్సుల్లోనూ మహిళా డ్రైవర్లనే నియమించేందుకు యత్నిస్తున్నట్టు తెలిపారు. -
ఫిర్యాదుల కోసం ఎన్డీఎంసీ ప్రత్యేక యాప్
న్యూఢిల్లీ: దీర్ఘకాలంగా తాము ఎదుర్కొంటున్న సమస్యలను నగరపాలక సంస్థ దృష్టికి తీసుకువెళ్లడానికి ఇకపై ప్రజలు అవస్థలు పడనక్కర్లేదు. తమ స్మార్ట్ ఫోన్లలో ‘ఎన్డీఎంసీ ప్లీజ్ ఫిక్స్’ అనే యాప్‌ని డౌన్లోడ్ చేసుకొని దాని ద్వారా నేరుగా ఫిర్యాదు చేయవచ్చు. ప్రత్యేకంగా ఫిర్యాదుల కోసం న్యూఢిల్లీ మున్సిపల్ కౌన్సిల్ (ఎన్డీఎంసీ) రూపొందించిన ఈ యాప్‌ని గత వారం ప్రారంభించింది. ఈ యాప్ ద్వారా సమస్య ఉన్న ప్రాంతం నుంచే ప్రజలు క్షణాల వ్యవధిలో ఫిర్యాదు చేయడం ద్వారా అధికారులను అప్రమత్తం చేయవచ్చని ఎన్ఎండీసీ ప్రాజెక్ట్స్ డెరైక్టర్ ఓపీ మిశ్రా తెలిపారు. పాడైపోయిన రహదారులు, వీధి దీపాలు, చెత్త చెదారం ఇలా అన్ని సమస్యలను ఫొటోతో సహా ఫిర్యాదు చేసే సౌకర్యం ఇందులో ఉందన్నారు. ఫిర్యాదులను ఎప్పటికప్పుడు అధికారులు పర్యవేక్షిస్తూ ఉంటారని, అవసరమైతే సమస్య ఉన్న ప్రాంతాలను మ్యాప్ ద్వారా గుర్తించి తగు చర్యలు తీసుకుంటారని మిశ్రా వివరించారు. -
హోలీకి ఎల్ఈడీ బల్బుల నజరానా
న్యూఢిల్లీ:సంస్థలో పనిచేస్తున్న సిబ్బందికి హోలీ సందర్భంగా ఎల్ఈడీ బల్బులను పంపిణీ చేయాలని న్యూఢిల్లీ మున్సిపల్ కౌన్సిల్ (ఎన్డీఎంసీ) నిర్ణయించింది. విద్యుత్ ఆదా కోసం మామూలు బల్బులు బదులు ఎల్ఈడీ బల్బులు వాడేలా ప్రజల్లో అవగాహన పెంచాలని ప్రధాని నరేంద్ర మోదీ ఇచ్చిన పిలుపు మేరకు ఈసారి హోలీకి తమ సిబ్బందికి స్వీట్లు బదులు ఎల్ఈడీ బల్బులను అందజేయనున్నట్లు ఎన్డీఎంసీ చైర్మన్ జలజ్ శ్రీవాత్సవతెలిపారు. ప్రతియేటా సంస్థలో పనిచేస్తున్న పారిశుద్ధ్య సిబ్బందికి హోలీ సందర్భంగా స్వీట్లు ఇవ్వడం సంప్రదాయమని, గత ఏడాది రూ.94 లక్షల విలువైన స్వీట్లను అందజేశామన్నారు.అయితే ఈ ఏడాది కేవలం పారిశుద్ధ్య సిబ్బందికే కాకుండా సంస్థలో పనిచేస్తున్న ప్రతి ఒక్కరికి మూడేసి ఎల్ఈడీ బల్బులను అందజేయాలని నిర్ణయించామన్నారు. సాధారణ కుటుంబం ఏడాదికి 5 బల్బులను వాడుతుందని, కాగా సిబ్బందికి తాము ఇచ్చిన మూడు బల్బులతోపాటు మరో రెండు బల్బులు వారు కొనుగోలుచేసుకునేవిధంగా ప్రోత్సహిస్తామని ఆయన తెలిపారు. కాగా, దీనికి ఎంత ఖర్చు పెట్టాలనేది ఇంకా నిర్ణయించలేదన్నారు. ఇదిలా ఉండగా, డొమెస్టిక్ ఎఫీషియంట్ లైటింగ్ ప్రోగ్రాం (డీఈఎల్పీ) కింద ఎల్ఈడీ బల్బుల పంపిణీ పథకాన్ని ప్రధాని నరేంద్ర మోదీ సోమవారం ప్రారంభించిన సంగతి తెలిసిందే. మార్కెట్లో రూ.350- 600 పలికే ఎల్ఈడీ బల్బును ఈ పథకం కింద లబ్ధిదారుడికి రూ.130కే అందజేస్తారు. దీనినిమిత్తం మొదట కేవలం రూ.10 తీసుకుంటారు. అనంతరం ఏడాదిపాటు కరెంటు బిల్లులో నెలకు రూ.10 చొప్పున అదనంగా వసూలుచేస్తారు. త్వరలోనే ఢిల్లీనగరంలోని గృహాలు,ఆస్పత్రులు, స్కూళ్లలో ఎల్ఈడీ బల్బుల వినియోగంపై అవగాహనపెంచి విద్యుత్ ఆదాకు కృషిచేస్తామని జలజ్ శ్రీవాత్సవ తెలిపారు. -
‘స్మార్ట్ సిటీ ప్రాజెక్టు’కు మెరుగులు
న్యూఢిల్లీ: స్మార్ట్ సిటీ ప్రాజెక్టు పథకాన్ని మరింత ముందుకు తీసెకెళ్లడానికి ఎన్డీఎంసీ నిర్ణయించింది. ఇందులో భాగంగా ఇప్పుడు ఉన్న ఎలక్ట్రిసిటీ మీటర్ల పద్ధతి-నీటి కనెక్షన్లను ఆధునికీకరించనుంది. ఇందుకోసం నగరపాలక సంస్థ ఆధ్వర్యంలో రేడియో ఫ్రీక్వెన్సీ అనుసంధానంతో ఎలక్ట్రిసిటీ మీటర్లను ఏర్పాటు చేయనుంది. వీటి ద్వారా మీటర్ రీడింగ్ ప్రతినెలా ఆటోమెటిక్‌గా నవీనీకరించబడుతోంది. ఈ ప్రాజెక్టును మొదట కన్నాట్ ప్రాంతంలో ప్రారంభించాలని నిర్ణయించింది. ఆటోమెటిక్‌గా సమాచార సేకరణ: ప్రస్తుతం నగరపాలక సంస్థ ఎలక్ట్రిసిటీ మీటర్లకు రేడియో ఫ్రీక్వెన్సీని అనుసంధానం చేసే పనిలో నిమగ్నమైంది. ఈ పద్ధతి ద్వారా మీటర్ రీడింగ్ ఆటోమెటిక్‌గా మారుతోందని సీనియర్ అధికారి తెలిపారు. ‘ తమ సిబ్బంది చేతిలో పట్టుకొనే సదుపాయం ఉన్న పరికరంతో ఓ భవన సముదాయానికి వెళ్తారు. రేడియో ఫ్రీక్వెన్సీ పరికరంలో ఉన్న సమాచారం ఆటోమెటిక్‌గా సిబ్బంది చేతిలో ఉన్న పరికరంలోకి ఎలాంటి అవాంతరం లేకుండానే మారుతోందని తెలిపారు. బిల్లింగ్‌లో తీవ్ర జాప్యానికి చెక్: నగరపాలక సంస్థ పరిధిలో ఇప్పుడు ఉన్న పద్ధతిలో మీటర్ రీడింగ్‌ను పరిశీలించి, సమాచారం సేకరించి బిల్లింగ్ చేయడానికి ఎన్డీఎంసీ సిబ్బందికి సుమారు రెండు మూడు నెలల సమయం పడుతోంది. ఇదే పద్ధతిలో నీటి బిల్లుల వసూళ్లలో కూడా జాప్యం జరుగుతోంది. నగర పాలక సంస్థకు నెలకు సుమారు 50 కోట్ల ఆదాయం విద్యుత్ సరఫరా ద్వారానే వస్తోంది. సమయానికి బిల్లులు అందజేయక ఆదాయానికి గండిపడుతోంది. ఇప్పుడు అందుబాటులోకి తెచ్చే సాంకేతిక పద్ధతిలో ఆదాయ లోటును తగ్గించడంతోపాటు వ్యవస్థను ఆధునికీకరించనుంది. త్వరలోనే టెండర్లను ఆహ్వానించడానికి సంస్థ చర్యలు తీసుకొంటోంది. -
ఎన్డీఎంసీ రద్దు..!
న్యూఢిల్లీ: పరిపాలనా వైఫల్యం కారణంగా న్యూఢిల్లీ మున్సిపల్ కౌన్సిల్(ఎన్డీఎంసీ)ను రద్దు చేస్తున్నట్లు హోం వ్యవహారాల మంత్రిత్వశాఖ బుధవారం ప్రకటించింది. నగరంలోని సంపన్నవర్గాలుండే లూట్యెన్స్ ప్రాంతంలో జనవరి 2011లోన్యూఢిల్లీ మున్సిపల్ కౌన్సిల్‌ను ఏర్పాటు చేశారు. మూడు కార్పొరేషన్ విభజనతో మునుపటి కౌన్సిల్‌ను రద్దు చేసిన తర్వాత ఏర్పాటు చేసిన ఎన్డీఎంసీ ఆర్థిక సమస్యలతోపాటు పరిష్కరించలేని పలు సమస్యలను ఎదుర్కొంటోందని, కనీసం కబ్జాలను కూడా నిరోధించలేకపోతోందని, అందుకే ఎన్డీఎంసీని రద్దు చేయాలని నిర్ణయించినట్లు హోం వ్యవహారాల మంత్రిత్వశాఖ విడుదల చేసిన నోటిఫికేషన్లో పేర్కొంది. వ్యక్తిగత అవకతవకలు కూడా భారీగానే చోటుచేసుకుంటున్నాయని, రోజువారి వేతనాల చెల్లింపు, హాజరు పట్టిక నిర్వహణ, తాత్కాలిక హాజరుపట్టిక నిర్వహణ, ఒప్పంద ఉద్యోగుల విధుల నిర్వహణ తదితరాల్లో ఇవి స్పష్టంగా కనిపిస్తున్నాయని మంత్రిత్వశాఖ పేర్కొం ది. ఎన్డీఎంసీ రద్దుతో ఆ సంస్థ నిర్వహిస్తున్న బాధ్యతలను ఐఏఎస్ స్థాయి అధికారులకు అప్పగించనున్నట్లు కేంద్రం స్పష్టం చేసింది. ఎన్డీఎంసీలో పనిచేస్తున్న ఐఏఎస్ అధికారులకే ఈ బాధ్యతలు అప్పగిస్తామని స్పష్టం నోటిఫికేషన్లో చేసింది. ఎన్డీఎంసీలో కొనసాగుతున్న అధికారులకు ఇతర విధులను అప్పగించాలని సూచించింది. ఎన్డీఎంసీలో పౌరవిభాగం సభ్యులుగా బీజేపీ నేత మీనాక్షి లేఖీతోపాటు అరవింద్ కేజ్రీవాల్‌తోపాటు మరో పదిమంది సభ్యులున్నట్లు అధికారిక వెబ్సైట్లో పేర్కొంది. నిజానికి ప్రస్తుత ఎన్డీఎంసీని ఏర్పాటైన ఐదేళ్ల తర్వాతే రద్దు చేయడానికి అవకాశముంది. కానీ ఇటువంటి అవకతవకలేవైనా జరుగుతున్నప్పుడు మధ్యలో కూడా రద్దు చేసే అధికారం కేంద్రానికి ఉందని ఢిల్లీ మున్సిపల్ కౌన్సిల్ చట్టం, 1994 చెబుతోంది. -
వైఫై ప్రాజెక్టు కార్యరూపం
ఖాన్ మార్కెట్ పరిసర ప్రాంత ప్రజలకు వైఫై సేవలు అందుబాటులోకి వచ్చాయి. త్వరలో కన్నాట్ ప్లేస్‌వాసులు కూడా వీటిని వినియోగించుకునే అవకాశముంది. ఈ దిశగా ఎన్డీఎంసీ ముందుకు సాగుతోంది. న్యూఢిల్లీ: న్యూఢిల్లీ మున్సిపల్ కౌన్సిల్ (ఎన్డీఎంసీ) అత్యంత ప్రతిష్టాత్మకంగా చేపట్టిన వైఫై ప్రాజెక్టు చేపట్టిన వైఫై ప్రాజెక్టు కార్యరూపం దాల్చింది. నగర ంలోని ఖాన్ మార్కెట్లో ఇందుకు సంబంధించిన సేవలు కొద్దిరోజుల క్రితం ప్రారంభమయ్యాయి. నగరంలోఈ తరహా సేవలు ప్రారంభమవడం ఇదే తొలిసారి. త్వరలో కన్నాట్‌ప్లేస్‌లోనూ ప్రారంభం కానున్నాయి. ఈ ప్రాజెక్టు విజయవంతంగా సాగుతోందని దీని బాధ్యతలను నిర్వహిస్తున్న ఓపీ మిశ్రా వెల్లడించారు. ఆదివారం ఆయన ఇక్కడ మీడియాతో మాట్లాడుతూ ఈ-మెయిల్ ఐడీ, మొబైల్ నంబర్లను పూర్తిచేయడం ద్వారా ఖాన్ మార్కెట్ పరిసరాల్లో నివసించేవారు వినియోగించుకోవచ్చన్నారు. ఇంటర్నెట్కు అనుసంధానమయ్యేందుకుగాను తాము వన్‌టైం పాస్వర్డ్ (ఓటీపీ) అందజేస్తామన్నారు. ఉచిత వినియోగం పూర్తయ్యాక స్క్రాచ్ కార్డులను కొనుగోలు చేసి వినియోగించుకోవాల్సి ఉంటుందన్నారు. ఇవి నగరంలోని అన్ని దుకాణాల్లోనూ అందుబాటులో ఉంటాయన్నారు. కాగా ఖాన్ మార్కెట్లో ఈ ప్రాజెక్టు విజయవంతంగా నడుస్తున్నప్పటికీ కన్నాట్‌ప్లేస్‌లో ఏర్పాటుకు సంబంధించి ఎన్డీఎంసీ కొన్ని ఇబ్బందులను ఎదుర్కొంటోంది. కన్నాట్‌ప్లేస్ అతి పెద్ద ప్రాంతమని, అయితే కన్నాట్‌ప్లేస్‌లో ఏర్పాటుకు సంబంధించి తమకు కొన్ని ఇబ్బందులు ఎదురవుతున్నాయన్నారు. ఇదిలాఉంచితే భారీఎత్తున కేబుళ్లను వినియోగించాల్సి ఉంటుందని, అందువల్ల పరిసరాలు వికృతంగా మారకుండా చేసేందుకుగాను కన్నాట్‌ప్లేస్‌లోని 1.2 కిలోమీటర్ల పొడవైన సొరంగ మార్గాన్ని వినియోగించుకోనున్నామని తెలిపారు. సర్వీస్ ప్రొవైడర్ల భరోసా ఎన్డీఎంసీ ఆలోచన ఇలా ఉండగా ఈ నెలాఖరునాటికల్లా కన్నాట్‌ప్లేస్ పరిసరాల్లో వైఫై సేవల అందుబాటులోకి తీసుకొస్తామని సర్వీస్ ప్రొవైడర్లయిన టాటా డొకొమో, వోడా ఫోన్ సంస్థలు భరోసా ఇస్తున్నాయి. కన్నాట్‌ప్లేస్ పరిధిలోని ఎన్‌బ్లాక్‌లో ప్రస్తుతం ైవె ఫై సేవలను ప్రయోగాత్మక ప్రాతిపదికన అందుబాటులోకి తీసుకొచ్చారు. వాస్తవానికి ఈ ప్రాంతంలో ైవె ఫై సేవలు జూలైలోనే ప్రారంభం కావాల్సి ఉంది. వివిధ సాంకేతిక సమస్యల కారణంగా అది కాస్తా ఆలస్యమైంది. అంతేకాకుండా కొన్ని భద్రతా విభాగాలు కూడా అభ్యంతరం చెప్పడం కూడా జాప్యానికి కారణమైంది. తమ నెట్‌వర్క్‌లకు ఎక్కడ ఇబ్బంది కలుగుతుందోనని భావించిన ఆ సంస్థలు అభ్యంతరం చెప్పాయి. అయితే టెలిఫోన్ శాఖ నుంచి సర్వీస్ ప్రొవైడర్లు అవసరమైన అనుమ తులను పొందుతారంటూ తాము ఆ సంస్థలకు భరోసా ఇచ్చామని, దీంతో ఈ వివాదానికి తెరపడిందని ఆయన వివరించారు. కన్నాట్‌ప్లేస్‌లో వైఫై నెట్వర్క్ ఏర్పాటు సమ యంలో ఇటువంటి సమస్యలు తలెత్తకుండా తగు జాగ్రత్త చర్యలు తీసుకుంటామని తెలిపారు. -
ఉచితంగా ఓపెన్ జిమ్
న్యూఢిల్లీ: లోధీ గార్డెన్లో న్యూఢిల్లీ మున్సిపల్ కౌన్సిల్ (ఎన్డీఎంసీ) ఏర్పాటుచేసిన ఓపెన్ జిమ్ అందుబాటులోకి వచ్చింది. దీనిని బీజేపీ ఎంపీ మీనాక్షి లేఖి మంగళవారం ప్రారంభించారు. ఇదే తరహాలో మరికొన్ని ఓపెన్‌జిమ్‌లను మరో 28 చోట్ల ఏర్పాటు చేయనుంది. ఈ విషయాన్ని ఎన్డీఎంసీ ప్రాజెక్టు డెరైక్టర్ ఓపీ మిశ్రా వెల్లడించారు. ‘ఓపెన్ జిమ్‌లు అందరికీ ఉచితంగా అందుబాటులో ఉంచాలనేదే మా ఆలోచన. తొలుత వీటిని ఉద్యానవనాల్లో ఏర్పాటు చేస్తాం. ఆ తర్వాత పాఠశాలలు, రెసిడెన్షియల్ కాలనీలతోపాటు పేవ్‌మెంట్లపైనా ఏర్పాటు చేస్తాం. ఓపెన్ జిమ్లలోని పరికరాల వినియోగానికి విద్యుత్ అవసరమే లేదు. నిర్వహణ వ్యయం కూడా తక్కువే. ఒక్కొక్క జిమ్ ఏర్పాటుకు రూ. 5.5 లక్షల వ్యయం అవుతోంది. ఇలా ఉద్యానవనాల్లో ఓపెన్ జిమ్‌లను ఏర్పాటు చేయ డం ఇదే తొలిసారి. జిమ్‌కు వెళ్లే స్తోమత అందరికీ ఉండదు. ప్రజల ఆరోగ్యాన్ని సంరక్షించడమే మా లక్ష్యం. ఏ వయసు వారైనా వీటిని వినియోగించుకోవచ్చు. జిమ్‌లకు వెళ్లేందుకు సీనియర్ సిటిజన్లు ఇష్టపడరు. అయితే వారు కేవలం మార్నింగ్ వాక్కు మాత్రమే వస్తారు. ఓపెన్ జిమ్‌ల ఏర్పాటువల్ల వాటిని వినియోగించుకునే అవకాశం కూడా ఉంటుంది. వారు వాకింగ్‌తో పాటు వ్యాయామంవైపు కూడా ఇకమీదట దృష్టి సారిస్తారు’ అని అన్నారు. కాగా సెంట్రల్ పార్కు (కన్నాట్‌ప్లేస్), సంజయ్ పార్కు, తాల్కటోరా స్టేడియం, నెహ్రూ పార్కు, ఎన్డీఎంసీ క్లబ్ తదితర ప్రాంతాల్లో ఓపెన్ జిమ్‌లను ఏర్పాటు చేయనుంది. ఓపెన్ జిమ్‌ల ఏర్పాటుకు ప్రస్తుత బడ్జెట్లో రూ. 40 లక్షల నిధుల్ని కేటాయించింది. వీటి ఏర్పాటుకు అనువైన పేవ్మెంట్ల కోసం ఎన్డీఎంసీ అన్వేషిస్తోంది. లోధీ గార్డెన్‌కు సందర్శకులు అత్యధిక సంఖ్యలో వస్తుంటారు. -
డిస్కంకు నోటీసులు పంపండి
న్యూఢిల్లీ: తక్షణమే బకాయిలు చెల్లించాలంటూ డిస్కంకు నోటీసులు జారీ చేయాలంటూ ఉత్తర ఢిల్లీ మున్సిపల్ కార్పొరేషన్ (ఎన్డీఎంసీ) మేయర్ యోగేందర్ చందోలియా సంబంధిత అధికారులను ఆదేశించారు. ఈ సంస్థ ఈ ఏడాది జనవరి నుంచి బకాయిలు చెల్లించాల్సి ఉందన్నారు. చెల్లింపులో జాప్యం జరిగినందువల్ల జరిమానా విధిస్తామంటూ సదరు నోటీసుద్వారా టాటా పవర్ ఢిల్లీ డిస్ట్రిబ్యూషన్ లిమిటెడ్ (టీపీడీడీఎల్)ను హెచ్చరించాలని ఆదేశించారు. ఢిల్లీ మున్సిపల్ కార్పొరేషన్ (ఎన్డీఎంసీ) కింద బకాయిపడిన సంస్థకు 20 శాతం వరకూ జరిమానా విధించవచ్చన్నారు. ఇదే విషయమై ఎన్డీఎంసీ చైర్మన్ భరద్వాజ్ మాట్లాడుతూ డిస్కం సంస్థ రాబడి వచ్చిన 40 రోజుల్లోగా పన్ను చెల్లించాల్సి ఉంటుందన్నారు. అయితే టీపీడీడీఎల్ ఈ విషయంలో నిర్లక్ష్యం వహించిందన్నారు. ఈ ఏడాది జనవరి నుంచి టీపీడీడీఎల్ తమకు పన్ను చెల్లించలేదన్నారు. డిస్కం సంస్థ నిబంధనల ప్రకారం పనిచేయడం లేదన్నారు. -
ఢిల్లీ.. ఇక సోలార్ సిటీ!
న్యూఢిల్లీ: జాతీయ రాజధానిలో భారీ భవంతులపై సౌర విద్యుత్ ప్లాంట్ల ఏర్పాటుకు న్యూఢిల్లీ మున్సిపల్ కౌన్సిల్(ఎన్డీఎంసీ) ప్రణాళికలు సిద్ధం చేసింది. దీనికి గాను నగరంలో ఇప్పటికే 40 భవంతులను గుర్తించింది. వీటిపై సౌరవిద్యుత్ ఉత్పత్తికి కావాల్సిన సామగ్రిని ఏర్పాటుచేయనుంది. ఈ సందర్భంగా ఎన్డీఎంసీ చైర్పర్సన్ జలజ్ శ్రీవాస్తవ మాట్లాడుతూ.. నగరంలో విద్యుత్ సమస్య పరిష్కారానికి తాము చర్యలు తీసుకుంటున్నామన్నారు. సౌరవిద్యుత్ ఉత్పత్తి ద్వారా ఢిల్లీని ‘సోలార్ సిటీ’గా మార్చాలని నిర్ణయించామన్నారు. దీనికోసం పైలట్ ప్రాజెక్టుగా ఇప్పటికే ఎండీఎంసీకి చెందిన పలు స్కూళ్లు, సబ్స్టేషన్లు, ఎంక్వైరీ కార్యాలయాలు, ఆస్పత్రులను గుర్తించామన్నారు. ఇవే కాక సోలార్ ప్లాంట్ల ఏర్పాటుకు ముందుకు వచ్చే ఇతర ప్రైవేట్, ప్రభుత్వ భవనాలపై కూడా వీటిని అమర్చనున్నట్లు ఆయన వివరించారు. నూతన పునరుత్పాదక ఇంధన వనరుల మంత్రిత్వ శాఖ ఆదేశాలకు అనుగుణంగా ఉండేవిధంగా సోలార్ యూనిట్ల గుర్తింపు, డిజైనింగ్, టెస్టింగ్, ఏర్పాటు తదితర అంశాలను పరిశీలించేందుకు ఒక ఆపరేటర్‌ను ఎన్డీఎంసీ నియమించనుంది. దీనికోసం ఇప్పటికే టెండర్లను సైతం ఆహ్వానించింది. గత ఫిబ్రవరిలో అధికారులు ఎన్డీఎంసీ పరిపాలనా విభాగపు పరిధిని ‘సోలార్ సిటీ’గా ఎంపిక చేసి ప్రతిపాదనలను సంబంధిత కేంద్ర మంత్రిత్వ శాఖకు పంపారు. దానికి ఆ శాఖ ఆమోద ముద్ర కూడా వేసింది. ఇదిలా ఉండగా, భవంతులపై సోలార్ యూనిట్లను బిగించడం పూర్తయితే దేశంలోనే న్యూఢిల్లీ రెండో ‘సోలార్ సిటీ’గా గుర్తింపు పొందనుంది. దేశంలో మొదటిగా చండీగఢ్‌లో ‘సోలార్‌సిటీ’ని ఏర్పాటుచేసిన విషయం తెలిసిందే. ఎన్డీఎంసీ, సోలార్ ఎనర్జీ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా మధ్య కుదిరిన ఒప్పందం ప్రకారం న్యూఢిల్లీ తన మొత్తం విద్యుత్ వాడకంలో కనీసం 5 శాతాన్ని సౌర విద్యుత్ ద్వారా సమకూర్చుకోనుంది. ఇదిలా ఉండగా, సోలార్ ప్లాంట్ల ద్వారా ఉత్పత్తి అయిన విద్యుత్‌ను ఎన్డీఎంసీ గ్రిడ్‌కు ఢిల్లీ ఎలక్ట్రిసిటీ రెగ్యులేటరీ కమిషన్(డీఈఆర్సీ) నిర్ణయించిన రేట్ల మేరకు అనుసంధానించాలనేది సంస్థ ప్రణాళిక అని అధికారులు చెబుతున్నారు. కాగా, ఏడాదిలోగా సోలార్ ప్లాంట్ల ద్వారా 8 ఎండబ్ల్యూ విద్యుత్‌ను ఉత్పత్తి చేయాలనేది ఎన్డీఎంసీ లక్ష్యమని శ్రీవాస్తవ తెలిపారు. పస్తుతం నగరంలో విద్యుత్ సమస్య తీవ్రంగా ఉన్న నేపథ్యంలో సౌరవిద్యుత్‌తో కొంతవరకైనా ఉపశమనం లభిస్తుందని అధికారులు అభిప్రాయపడుతున్నారు. ప్రస్తుతం నగర అవసరాలకు వేసవిలో రోజూ 350 ఎంవీఏ, శీతాకాలంలో 150 ఎంవీఏ విద్యుత్ అవసరమవుతోంది. ఇదిలా ఉండగా, ఓఖ్లాలో ఎండీఎంసీ ఏర్పాటుచేసిన ‘వేస్ట్ టు ఎనర్జీ’ ప్లాంట్ ద్వారా సుమారు 16 ఎండబ్ల్యూ విద్యుత్‌ను ఉత్పత్తి చేస్తూ 8 వేల గృహాలకు ఆ విద్యుత్‌ను సరఫరా చేస్తోన్న విషయం తెలిసిందే. -
డెంగీ నియంత్రణకు చర్యలు తీసుకోండి
- పడకలు, పరికరాలు సిద్ధంగా ఉంచాలి - ట్యాంకులకు మరమ్మతులు చేయాలి - ఆస్పత్రులకు ఎన్డీఎమ్సీ ఆదేశం న్యూఢిల్లీ: వర్షాకాలం సమీపిస్తున్నందున డెంగీ వంటి అంటువ్యాధుల నియంత్రణపై ఉత్తర ఢిల్లీ మున్సిపల్ కార్పొరేషన్ (ఎన్డీఎమ్సీ) దృష్టి సారించింది. ఈ వ్యాధుల చికిత్సకు అవసరమైన అత్యవసర పడకలు, రక్తం యూనిట్లు, పరికరాలను సిద్ధం గా ఉంచుకోవాలని ప్రభుత్వ ఆస్పత్రులను కార్పొరేషన్ గురువారం ఆదేశించింది. అంటువ్యాధుల నియంత్రణలో భాగంగా ఎన్డీఎమ్సీ కమిషనర్ ప్రవీణ్ గుప్తా సంబంధిత విభాగాల ఉన్నతాధికారులతో నిర్వహించిన భేటీలో పైఆదేశాలు జారీ చేశారు. వ్యాధుల నియంత్రణకు తమ విభాగాలు తీసుకునే చర్యలను అధికారులు ఈ సందర్భంగా వివరించారు. నీరు నిల్వకాకుండా, దోమలు వృద్ధి చెందకుండా అన్ని చర్యలూ తీసుకోవాలని గుప్తా ఆదేశించారు. ఎన్డీఎమ్సీ అదనపు కమిషనర్ (ఆరోగ్య విభాగం), మున్సిపల్ వైద్యాధికారి, ఢిల్లీ జలబోర్డు ప్రతినిధులు, ఢిల్లీ అభివృద్ధి సంస్థ (డీడీఏ), పీడబ్ల్యూడీ, ఢిల్లీ మెట్రోరైలు కార్పొరేషన్ (డీఎంఆర్సీ), ఢీల్లీ రవాణాసంస్థ (డీటీసీ) ఉన్నతాధికారులు సమావేశంలో పాల్గొన్నారు. వర్షాలు పడ్డప్పుడు నీరు నిల్వకాకుండా నిరోధించేం దుకు వ్యర్థాలను ఎప్పటికప్పుడు తొలగించాలని గుప్తా పర్యావరణ నిర్వహణ సేవాసంస్థ (డీఈఎంఎస్)ను ఈ సందర్భంగా ఆదేశించారు. గత ఏడాది డెంగీ విజృంభించడంతో ఎన్డీఎమ్సీ ఈ చర్యలు తీసుకుంది. నిరుడు 5,500 మందికి ఈ వ్యాధి సోక గా, ఆరుగురు మరణించారు. దక్షిణ ఢిల్లీ మున్సిపల్ కార్పొరేషన్ గణాంకాల ప్రకారం 2010లో ఢిల్లీలో అత్యధికంగా 6,200 కేసులు నమోదయ్యా యి. 2009లో 1,153, 2008లో 1,300 కేసులు, 2011లో 1,131 కేసులు, 2012లో 2,093 కేసులు, గత ఏడాది 5,574 డెంగీ కేసులు నమోదయ్యాయి. డెంగీ కారక దోమల వృద్ధి చెందకుండా నిరోధించడానికి అన్ని ప్రభుత్వ కార్యాలయాలు, నివాస ప్రాంతాల్లోని ఓవర్‌హెడ్ ట్యాంకులకు మూతలు ఉండేలా చూడాలని ఎన్డీఎమ్సీ వాటి ఇంజనీరింగ్ విభాగాలను ఆదేశించింది. ట్యాంకులకు కూడా మరమ్మతులు నిర్వహిం చాలని సూచించింది. ఫౌంటెయిన్లు, కృత్రిమ జల పాతాల నుంచి నీటిని తోడివేయాలని కమిషనర్ ప్రవీణ్ గుప్తా ఉద్యానవన విభాగాన్ని ఆదేశించారు. వ్యాధుల నియంత్రణ చర్యలపై చర్చించేందుకు సిబ్బందితో పక్షం రోజులకు ఒకసారి సమావేశాలు నిర్వహించాలని ఆయన జోనల్ డిప్యూటీ కమిషనర్లను ఆదేశించారు. -
ఉచితంగానే సర్టిఫికెట్ల జారీ
న్యూఢిల్లీ: ఇక నుంచి ఉచితంగానే జననమరణ ధ్రువపత్రాలు జారీ చేస్తామని న్యూఢిల్లీ మున్సిపల్ కౌన్సిల్ (ఎన్డీఎమ్సీ) ఆదివారం ప్రకటించింది. ఈ మేరకు సాఫ్ట్‌వేర్‌లోనూ మార్పులు చేశామని ఎన్డీఎమ్సీ చైర్మన్ జలజ్ శ్రీవాత్సవ వెల్లడించారు. ఆస్పత్రిలో శిశువు పుట్టడం లేదా ఎవరైనా మరణించినా అక్కడే ధ్రువపత్రం నకలును ముద్రించుకునేందుకు కూడా యాజమాన్యాలకు అవకాశం ఇస్తున్నట్టు తెలియజేశారు. ఈ ధ్రువపత్రాలపై సంతకాలు చేసేందుకు ప్రధాన రిజిస్ట్రార్ కార్యాలయం కేటాయించే అధికారులను ఆస్పత్రులు నియమించగానే వాటికి అనుమతులు మంజూరు చేస్తామని శ్రీవాత్సవ వివరించారు. ఈ విషయాలను వివరించేందుకు ఎన్డీఎమ్సీ జననాలు, మరణాల విభాగం ఇటీవల ప్రత్యేక కార్యక్రమాన్ని కూడా నిర్వహించింది. ఎన్డీఎమ్సీ పరిధిలోని అన్ని ఆస్పత్రుల ప్రతినిధులు దీనికి హాజరయ్యారు. వీరిలో ఎయిమ్స్, డాక్టర్ రామ్ మనోహర్ లోహియా ఆస్పత్రి, కళావతి సరణ్ ఆస్పత్రి, లేడీ హార్డింగ్ ఆస్పత్రి, సఫ్దర్‌జంగ్, శాంతి ఆవేదన, పాలికా మెటర్నిటీ, జేపీఎన్ఏ ట్రామా సెంటర్, నార్తర్న్ రైల్వే ఆస్పత్రి, చరక్ పాలికా ఆస్పత్రుల డాక్టర్లు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. శిశువు తల్లి, మృతుడి కుటుంబ సభ్యులకు జననమరణ ధ్రువీకరణ పత్రాలను ఉచితంగానే అందజేయాలని సుప్రీంకోర్టు, లెఫ్టినెంట్ గవర్నర్ నజీబ్ జంగ్ ఆదేశించడంతో ఎన్డీఎమ్సీ ఈ నిర్ణయం తీసుకుంది. -
ఆన్లైన్లో పార్కింగ్ బుకింగ్
న్యూఢిల్లీ: నగరంలోని పార్కింగ్ లాట్లను ఆధునీకరించాలని న్యూఢిల్లీ మున్సిపల్ కౌన్సిల్(ఎన్డీఎంసీ) నిర్ణయించింది. కుటుంబ సమేతంగా మార్కెట్ల వద్దకు వచ్చిన తర్వాత వాహనాన్ని పార్క్ చేసే స్థలం లేకపోవడంతో గంటల తరబడి వేచిచూడాల్సి వస్తోంది. దీంతో పార్కింగ్ లాట్లను ఆధునీకరించి, ఆన్లైన్ ద్వారా పార్కింగ్ కోసం బుకింగ్ చేసుకునే సదుపాయాన్ని అందుబాటులోకి తేవాలని ఎన్డీఎంసీ భావిస్తోంది. అంతేకాకుండా పార్కింగ్ లాట్లను పూర్తిగా కంప్యూటరీకరించాలనే యోచనలో కూడా ఉన్నట్లు సంబంధిత అధికారి ఒకరు తెలిపారు. ప్రధానంగా ఖాన్ మార్కెట్, సరోజినీనగర్ మార్కెట్, దిల్లీ హాట్, శంకర్ మార్కెట్ వంటి రద్దీగా ఉండే మార్కెట్లలోని పార్కింగ్ లాట్లను ఆధునీకరించాలని నిర్ణయించినట్లు చెప్పారు. ఇక చార్జీల విషయానికి వస్తే ఎంతసేపు వాహనాన్ని పార్క్ చేశారో అంత సమయానికి మాత్రమే సొమ్ము వసూలు చేస్తారని చెప్పారు. ఇందుకోసం డ్రైవర్లకు ముందుగానే పార్కింగ్ కార్డులను విక్రయిస్తారని, లాట్లోకి వాహనం ప్రవేశించే సమయంలో దానిని స్కాన్ చేయడం ద్వారా సమయం రికార్డు అవుతుందన్నారు. అలా బయటకు వెళ్లే ముందు కూడా స్కాన్ కావడంతో ఎంతసేపు పార్కింగ్ లాట్లో వాహనం ఉందో లెక్కించి, అంత సమయానికి మాత్రమే అద్దె వసూలు చేస్తారని చెప్పారు. ఇదంతా కంప్యూటర్ ఆధారంగానే సాగిపోతుంది. గత సంవత్సరమే ఈ పద్ధతిని ప్రవేశపెట్టాలని భావించినా ప్రైవేటు పార్కింగ్ లాట్ల యజమానుల అభ్యంతరం కారణంగా అమలు చేయలేకపోయామని, సాంకేతికపరమైన సమస్యలు కూడా మరో కారణమన్నారు. -
పచ్చదనానికి పెద్దపీట
సాక్షి, న్యూఢిల్లీ: తన పరిధిలోని ప్రాంతాలన్నింటిలోనూ పచ్చదనాన్ని పెంపొందించడంలో భాగంగా గార్డెన్ హట్స్, సుగంధపార్క్లను ఏర్పాటుచేయనున్నట్లు న్యూఢిల్లీ మున్సిపల్ కౌన్సిల్ (ఎన్డీఎంసీ) చైర్మన్ జలజ్ శ్రీవాస్త్తవ ఆదివారం తెలిపారు. ఎన్డీఎంసీ ప్రాంతం దేశంలోనే అత్యధిక పచ్చదనం ఉన్న మున్సిపాలిటీగా గుర్తింపు పొందింది. 2014- 15 ఎన్డీఎంసీ వార్షిక బడ్జెట్లో ఉద్యానవనాలు, పార్కుల కోసం రూ.75.2 కోట్లను కేటాయించినట్లు శ్రీవాస్తవ తెలిపారు. లక్ష్మీబాయినగర్, సరోజినీనగర్ పార్కుల్లో విభిన్న రకాల గార్డెన్ హట్స్ ఏర్పాటుచేయనున్నట్లు శ్రీవాస్తవ చెప్పారు. లక్ష్మీబాయినగర్లోనే సుగంధపార్క్ను అభివృద్ధి చేస్తారు. లోధీగార్డెన్ నర్సరీలో కాక్టస్హౌస్ను కొత్తగా ఏర్పాటు చేస్తారు. సరోజినీనగర్, మాల్చామార్గ్, జోర్‌బాగ్‌లోని పార్కుల్లో పది ఆక్యుప్రెషర్ ఉద్యానబాటలను నిర్మిస్తారు. వయోధికుల కోసం పార్కుల్లో గులకరాళ్లతో పది మీటర్ల పొడవు ఆక్యుప్రెషర్ మార్గాలను రెయిలింగ్‌లు సహా ఏర్పాటుచేయనున్నట్లు ఆయన చెప్పారు. సర్క్యులర్ రోడ్డు నర్సరీలో గ్రీన్‌హౌస్‌ను ఏర్పాటు చేస్తారని శ్రీవాత్సవ వివరించారు. తాల్కటోరా గార్డెన్లో టోపియరీ గార్డెన్‌ను అభివృద్ధి చేసే పనులు కొనసాగుతున్నాయని ఎన్డీఎంసీ ప్రకటించింది. ఉద్యానవనాల నిర్వహణలో సామర్థ్యాన్ని పెంపొందించడానికి ఎన్డీఎంసీ ప్రారంభించిన స్కూల్ ఆఫ్ గార్డెనింగ్ మూడు మున్సిపల్ కార్పొరేషన్లకు చెందిన 2,700 మంది ఫీల్డ్ ఆఫీసర్లు, సిబ్బందికి శిక్షణ ఇచ్చిందని శ్రీవాస్తవ చెప్పారు. స్కూళ్లు, ఆర్డబ్ల్యూఏలు, ఎకో-క్లబ్‌లు, సాధారణ ప్రజలు ఈ స్కూలులో శిక్షణ పొందవచ్చంటూ ఆయన ఆహ్వానించారు. శాంతిపథ్కు ఇరువైపులా ఉన్న సెంట్రల్వెజ్ను మరింత ఆకర్షణీయంగా తీర్చిదిద్దుతారు. ప్రజల ఆరోగ్య సంరక్షణ 33 బహిరంగ ప్రదేశాల్లో పర్యావరణ సన్నిహిత వ్యాయామశాలలనూ ఏర్పాటు చేయనున్నట్లు శ్రీ వాస్తవ చెప్పారు. వీటిని ఎవరైనా ఉచితంగా ఉపయోగించుకోవచ్చని ఆయన తెలిపారు. -
ఎన్డీఎంసీ ఆధ్వర్యంలో 33 ఎకో ఫ్రెండ్లీ జిమ్‌లు
న్యూఢిల్లీ: నగరవాసుల్లో ఆరోగ్యస్పృహ పెంచేందుకు న్యూఢిల్లీ మున్సిపల్ కౌన్సిల్(ఎన్డీఎంసీ) బృహత్తర ప్రణాళికతో ముందుకొచ్చింది. ఎన్డీఎంసీ పరిధిలోని వివిధ ప్రాంతాల్లో 33 పర్యావరణ అనుకూల జిమ్‌లను ఏర్పాటు చేయనుంది. అయితే వీటిని నగరవాసులు ఉచితంగానే ఉపయోగించుకోవచ్చు. ఈ జిమ్‌లలో ఏర్పాటు చేసే సదుపాయాలన్నీ పర్యావరణ అనుకూలమైనవేనని, సులభంగా ఉపయోగించే విధంగా వీటిని డిజైన్ చేశారని ఎన్డీఎంసీ చైర్పర్సన్ జలాజ్ శ్రీవాస్తవ తెలిపారు. పార్కులలో ఏర్పాటు చేయనున్న ఈ జిమ్‌లలో పదిమీటర్ల సామర్థ్యం కలిగిన ఆక్యుప్రెషర్ వాక్ సదుపాయాన్ని కల్పించనున్నామని, ప్రత్యేక రెయిలింగ్ కూడా ఏర్పాటు చేయడంతో సీనియర్ సిటిజన్లు కూడా ఉపయోగించేందుకు వీలుగా ఉంటుందన్నారు. ఎయిర్ వాకర్, సిట్ అప్ బెంచ్, ఎయిర్ స్వింగ్, ట్విస్టర్, సెట్ బ్యాక్, పుష్ అండ్ పుల్ అప్ చైర్, షోల్డర్ వీల్, స్పిన్నర్, బెంచ్ విత్ ఫిక్స్డ్ డంబుల్ తదితర సామగ్రి ఉన్నాయన్నారు. వీటి ఏర్పాటు ఇప్పటికే పూర్తయిందని, త్వరలో వీటిని ప్రారంభిస్తామని చెప్పారు. ఈ జిమ్‌లను కన్నాట్ ప్లేస్‌లోని సెంట్రల్ పార్క్, సంజయ్ పార్క్, తాల్కటోరా గార్డెన్, నెహ్రూ పార్క్, చరక్ పాలికా హాస్పిటల్, ఎన్డీఎంసీ క్లబ్, వర్కింగ్ ఉమెన్ హాస్టల్స్, ఓల్డేజ్ హోమ్స్లతోపాటు వివిధ ప్రజాసేవా కేంద్రాల్లో ఏర్పాటు చేస్తున్నామని చెప్పారు. వీటిని అందరూ ఉపయోగించుకునే అవకాశముందని, ఎటువంటి ఆంక్షలు లేవన్నారు. నగరవాసులను ఆరోగ్యవంతులుగా చేసేందుకే వీటిని ఏర్పాటు చేస్తున్నామన్నారు. ఇందుకోసం ఎన్డీఎంసీ రూ. 1.9 కోట్లు ఖర్చు చేసిందని చెప్పారు. -
ప్రజా సమస్యల పరిష్కారానికి ఎన్డీఎంసీ కాల్ సెంటర్
న్యూఢిల్లీ: ప్రజా సమస్యల పరిష్కారానికి న్యూఢిల్లీ మున్సిపల్ కౌన్సిల్(ఎన్డీఎంసీ) త్వరలో ఓ కాల్ సెంటర్‌ను ఏర్పాటు చేయనుంది. నాలుగంకెలుగల ఈ కాల్‌సెంటర్ నంబర్‌కు ఫోన్ చేసి తమ సమస్యలను నమోదు చేసుకోవాలని, నిర్ణీత సమయంలో వాటిని పరిష్కరిస్తామని ఎన్డీఎంసీ చైర్మన్ జల్‌రాజ్ శ్రీవాస్తవ తెలిపారు. ఇందుకు అవసరమైన అధికారులను కూడా నియమించినట్లు చెప్పారు. ప్రజల నుంచి సమస్యలు తెలుసుకొని, వాటిని సంబంధిత అధికారుల వద్దకు పరిష్కారం కోసం పంపుతారన్నారు. ఏదైనా సమస్యకు సంబంధించి రెండురోజుల్లో ఎటువంటి కదలిక లేనిపక్షంలో సదరు ఫిర్యాదు దానంతటదే ఉన్నతాధికారుల వద్దకు వెళ్లిపోయేలా ఏర్పాట్లు కూడా చేశామన్నారు. అప్పటికీ పరిష్కారం కాకపోతే నాలుగురోజుల తర్వాత సదరు ఫిర్యాదు ఎన్డీఎంసీ చైర్మన్ వద్దకు వెళ్తుందని శ్రీవాస్తవ తెలిపారు. ఈ నాలుగంకెల నంబర్ కోసం నమోదు ప్రక్రియ పూర్తయిందని, లాంఛనంగా ప్రారంభించాల్సింది మాత్రమే మిగిలిందన్నారు. మరో రెండు వారాల్లో ఈ కాల్‌సెంటర్‌ను ప్రారంభించే అవకాశముందని చెప్పారు. ఫిక్కీ లేడీస్ ఆర్గనైజేషన్ ‘ఫేస్ టు ఫేస్’ పేరిట శనివారం నిర్వహించిన ఓ కార్యక్రమంలో పాల్గొన్న ఆయన ఈ విషయాన్ని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఫిక్కీ సభ్యులతోపాటు ఉత్తర ఢిల్లీ మున్సిపల్ కమిషనర్ పీకే గుప్తా, దక్షిణ ఢిల్లీ మున్సిపల్ కమిషనర్ మనీశ్ గుప్తా తదితరులు పాల్గొన్నారు. నగరంలో చెత్త నిర్మూలన, మురుగునీటి పారుదల, మురుగునీటి కాల్వల పరిస్థితి, రహదారుల దుస్థితి తదితర విషయాలపై చర్చించారు.