న్యూఢిల్లీ: తక్షణమే బకాయిలు చెల్లించాలంటూ డిస్కంకు నోటీసులు జారీ చేయాలంటూ ఉత్తర ఢిల్లీ మున్సిపల్ కార్పొరేషన్ (ఎన్‌డీఎంసీ) మేయర్ యోగేందర్ చందోలియా సంబంధిత అధికారులను ఆదేశించారు. ఈ సంస్థ ఈ ఏడాది జనవరి నుంచి బకాయిలు చెల్లించాల్సి ఉందన్నారు. చెల్లింపులో జాప్యం జరిగినందువల్ల జరిమానా విధిస్తామంటూ సదరు నోటీసుద్వారా టాటా పవర్ ఢిల్లీ డిస్ట్రిబ్యూషన్ లిమిటెడ్ (టీపీడీడీఎల్)ను హెచ్చరించాలని ఆదేశించారు. ఢిల్లీ మున్సిపల్ కార్పొరేషన్ (ఎన్‌డీఎంసీ) కింద బకాయిపడిన సంస్థకు 20 శాతం వరకూ జరిమానా విధించవచ్చన్నారు. ఇదే విషయమై ఎన్‌డీఎంసీ చైర్మన్ భరద్వాజ్ మాట్లాడుతూ డిస్కం సంస్థ రాబడి వచ్చిన 40 రోజుల్లోగా పన్ను చెల్లించాల్సి ఉంటుందన్నారు. అయితే టీపీడీడీఎల్ ఈ విషయంలో నిర్లక్ష్యం వహించిందన్నారు. ఈ ఏడాది జనవరి నుంచి టీపీడీడీఎల్ తమకు పన్ను చెల్లించలేదన్నారు. డిస్కం సంస్థ నిబంధనల ప్రకారం పనిచేయడం లేదన్నారు.
డిస్కంకు నోటీసులు పంపండి
Published Sat, Jul 19 2014 10:35 PM | Last Updated on Sat, Sep 2 2017 10:33 AM
Advertisement