అంబులెన్స్ డ్రైవర్, హెల్పర్ దారుణానికి పాల్పడ్డారు. బ్రెయిన్ సంబంధిత సమస్యలతో బాధపడుతున్న భర్తను అంబులెన్స్‌లో ఆస్పత్రికి తీసుకెళ్తున్న భార్యపై లైంగిక వేధింపులకు పాల్పడ్డారు. ఈ దారుణం నుంచి బాధితురాలు ప్రతి ఘటించడంతో నిందితులు ఆమె భర్తకు ధరించిన ఆక్సిజన్ మాస్క్ తొలగించారు. అందిన కాడికి డబ్బుల్ని దోచుకుని పరారయ్యారు.
పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. ఉత్తరప్రదేశ్ సిద్ధార్థ్ నగర్ జిల్లాలో బ్రెయిన్ సంబంధిత అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న భర్తను అతని భార్య చికిత్స కోసం ఓ ఆసుపత్రిలో చేర్పించారు. అయితే, ఆస్పత్రి ఖర్చులు భరించలేక మరుసటి రోజే అంబులెన్స్‌లో భర్తను ఇంటికి తరలించేందుకు ప్రయత్నించింది.
ఇందుకోసం ఓ అంబులెన్స్‌ను మాట్లాడుకుని ఇంటికి బయలు దేరారు బాధితురాలు, ఆమె తమ్ముడు. అర్ధరాత్రి కావడంతో మార్గం మధ్యలో అంబులెన్స్ డ్రైవర్, హెల్పర్ బాధిత మహిళపై దారుణానికి ఒడిగట్టేందుకు ప్రయత్నించారు. ముందు క్యాబిన్‌లో కూర్చోమని, ఆపై వేధించారు. వేధింపులకు పాల్పడడం గుర్తించిన బాధితురాలి తమ్ముడు అడ్డుకోగా.. చివరగా ఛవానీ పోలీస్ స్టేషన్ ప్రధాన రహదారిపై అంబులెన్స్‌ను ఆపారు. భర్తకు తగలించిన ఆక్సిజన్ మాస్క్‌ను తొలగించారు. బాధితుణ్ని బలవంతంగా కిందకు దించారు. అనంతరం డబ్బు, నగదుతో అక్కడి పరారయ్యారు.
ఆక్సిజన్ మాస్క్ తొలగించడంతో అత్యవసర చికిత్స ఆస్పత్రికి తరలించగా.. అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. ఈ దారుణ ఘటనపై మహిళ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు ఏడీసీపీ జితేంద్ర దుబే తెలిపారు
Comments
Please login to add a commentAdd a comment