ACTS
-
మా గోడు వినండి..భార్య వేధింపులు తట్టుకోలేక ఆత్మహత్య చేసుకున్న భర్త కథ
లక్నో: కట్టుకున్న భార్య (wife) రాచిరంపాన పెడుతోందంటూ జీవితాల్ని అర్థాంతరంగా జీవితాల్ని ముగుస్తున్న భర్తల సంఖ్య రోజురోజుకి పెరిగిపోతుంది. ఇప్పటికే బెంగళూరులో అతుల్ సుభాష్, కర్ణాటకలో ఓ కానిస్టేబుల్ తిప్పన్న.. రాజస్థాన్‌లో ఓ డాక్టర్ అజయ్.. ఇలా రోజుకొక ఉదంతం వెలుగులోకి వస్తోంది. ఇదిలా ఉండగానే.. ఉత్తరప్రదేశ్‌లో మరో అఘాయిత్యం వెలుగులోకి వచ్చింది.ప్రముఖ టెక్ కంపెనీ టీసీఎస్ (tcs)లో మేనేజర్‌గా విధులు నిర్వహిస్తున్న 25ఏళ్ల మానవ్ శర్మ(manav sharma) బలవన్మరణానికి పాల్పడ్డాడు. ఫిబ్రవరి 24న తన ఇంట్లో ఉరేసుకుని చనిపోయాడు. అయితే,మరణానికి ముందు మానవ్ శర్మ ఆవేదనతో కూడిన ఆరు నిమిషాల 50 సెకన్ల నిడివిగల ఓ వీడియోను రికార్డ్ చేశాడు. ఆ వీడియోలో తన వైవాహిక జీవితంలో సమస్యలు ఉన్నాయని, తన భార్య మరో వ్యక్తితో అక్రమ సంబంధం ఉందని, ఇదే విషయంలో తనకు, తన భార్యకు గొడవలు జరిగేవని అన్నారు. అయినా తనలో మార్పు రాలేదన్నారు. మగాళ్లకు రక్షణే లేదామానవ్ శర్మ ఏడుస్తూ.. దేశంలో మహిళలను రక్షించేలా చట్టాలు ఉన్నట్లు.. పురుషులను రక్షించేలా చట్టాలు ఉంటే బాగుంటుందన్న అభిప్రాయం వ్యక్తం చేశాడు. పురుషుల గురించి ఆలోచించండి’ అని న్యాయస్థానాల్ని వేడుకున్నాడు. పురుషులకు రక్షణ కల్పించకపోతే.. వారు అంతమవుతారని హెచ్చరించారు. కోడలి నిర్వాకం వల్లే ఈ సందర్భంగా తన మణికట్టుపై కత్తికోసుకున్న గుర్తులను చూపిస్తూ అంతకుముందు తాను ఆత్మహత్యకు ప్రయత్నించినట్లు శర్మ వెల్లడించాడు. నా మరణానంతరం నా తల్లిదండ్రులను ఇబ్బంది పెట్టొద్దని అర్జిస్తూ వీడియోను ముగించాడు. అనంతరం ఆత్మహత్య చేసుకున్నాడు. ఆత్మహత్యపై సమాచారం అందుకున్న శర్మ తండ్రి సదర్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. తన కుమారుడు మరణానికి తన కోడలు కారణమని ఆరోపించారు.అన్నీ అవాస్తవాలేమానవ్ శర్మ ఆత్మహత్యపై ఆయన సతీమణి ఖండించారు. నా భర్త మద్యానికి బానిసయ్యారు. అతిగా మద్యం సేవించి పలుమార్లు ఆత్మహత్యయత్నానికి ప్రయత్నించారు. మూడు సార్లు నేనే రక్షించా. మద్యం సేవించిన తరువాత నాపై దాడి చేసేవారు. ఇదే విషయాన్ని తన అత్తమామల దగ్గర ప్రస్తావించినా వారు పట్టించుకోలేదు.అవన్నీ పెళ్లికి ముందే.. పెళ్లి తర్వాత భర్తే నా సర్వసంవివాహేతర సంబంధంపై మీడియా ఆమెను ప్రశ్నించగా..అవన్నీ పెళ్లికి ముందే. పెళ్లి తర్వాత భర్తే నా సర్వసం’అని అన్నారు. ఈ సందర్భంగా వాట్సాప్ చాట్‌ను బహిర్ఘతం చేశారు. ఆ చాట్‌లో దీదీ, దయచేసి ఏదో ఒకటి చేయండి. తనను తాను చంపుకుంటాడు అని తన భర్త సోదరికి(వదిన) మెసేజ్ చేసింది. బదులుగా అతన్ని ఒంటరిగా ఉండనివ్వండి. నిద్రపోండి’ అని బదులిచ్చినట్లు గమనించవచ్చు.ఇప్పటి వరకూ జరగని అరెస్టులుమానవ్ శర్మ ఆత్మహత్యపై ఆగ్రా ఏఎస్పీ వినయక్ గోపాల్ మాట్లాడారు. ‘మాకు ఆగ్రాలోని మిలటరీ హాస్పిటల్లో మానవ్ మృతదేహం ఉందనే సమాచారం వచ్చింది. మానవ్ బలవన్మరణానికి పాల్పడ్డారు. అతని ఆత్మహత్య కేసులో ఇప్పటివరకు ఎవరినీ అరెస్ట్ చేయలేదు. బాధితుడు రికార్డ్ చేసిన వీడియోను గుర్తించాం. అందులో తన భార్యతో విభేదాలు, ఇతర సమస్యల కారణంగా ప్రాణాలు తీసుకున్నట్లు గుర్తించామని’ చెప్పారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టినట్లు తెలిపారు. -
IPC, CRPC, ఎవిడెన్స్ యాక్ట్స్ స్థానంలో కొత్త చట్టాలు
-
సామ్రాజ్య భారతి: 1926,1927/1947 ఘట్టాలు
ఘట్టాలు: బాంబేలో ‘బెస్ట్’ బస్సులు ప్రారంభం. (బాంబే ఎలక్ట్రిక్ సప్లయ్ అండ్ ట్రాన్స్పోర్ట్). పాండిచ్చేరిలోని అరవింద ఆశ్రమ బాధ్యతల్ని ‘మదర్’ కు (మీరా ఆల్ఫాన్సా) అప్పగించి ఆ విధుల నుంచి శ్రీ అరబిందో విరమణ. భారత స్వయం పాలన కోసం సైమన్ కమిషన్ ఏర్పాటు. న్యూఢిల్లీలో కౌన్సిల్ హౌస్ ప్రారంభం. డెహ్రాడూన్‌లో తీవ్ర మతకలహాలు. సిలోన్కు గాంధీజీ మొదటి, చివరి పర్యటన. చట్టాలు: పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఏర్పాటు. (అదే నేటి యు.పి.ఎస్.సి.), ట్రేడ్ యూనియన్స్ యాక్ట్, గుడ్ కాండక్ట్ ప్రిజనర్స్ ప్రొబేషనల్ రిలీజ్ యాక్ట్, ఇండియన్ బార్ కౌన్సిల్స్ యాక్ట్, కాటన్ ఇండస్ట్రీ (స్టాటిస్టిక్స్) యాక్ట్. ఇండియన్ ఫారెస్ట్ యాక్ట్, లైట్ హౌస్ యాక్ట్. జననాలు: ఓపీ నయ్యర్ : సినీ సంగీత దర్శకులు (లాహోర్); రాజ్ కుమార్ : బాలీవుడ్ నటుడు (పాకిస్థాన్); బాల్ థాకరే : రాజకీయనేత, ‘శివసేన’ వ్యవస్థాపకులు (పుణె); మహాశ్వేతాదేవి : బెంగాలీ రచయిత్రి (ఢాకా); రామకృష్ణ హెగ్డే : రాజకీయనేత (కర్ణాటక); జి.వరలక్ష్మి : రంగస్థల, సినీ నటి (ఒంగోలు). బలివాడ కాంతారావు : నవలా రచయిత (మడపాం); లాల్‌కృష్ణ అద్వానీ : రాజకీయవేత్త, భారత డిప్యూటీ ప్రధాని (కరాచీ); సుందర్‌లాల్ బహుగుణ : పర్యావరణ పరిరక్షణ కార్యకర్త (ఉత్తరాఖండ్); అంజలీదేవి : నటి (పెద్దాపురం); నయనతార సెహగల్ : ఆంగ్ల భాషా రచయిత్రి (అలహాబాద్); నేదునూరి కృష్ణమూర్తి : కర్ణాటక సంగీత విద్వాంసులు (పిఠాపురం); నండూరి రామ్మోహన్రావు : పాత్రికేయులు (విస్సన్నపేట). (చదవండి: జైహింద్ స్పెషల్: వీళ్లంతటివాడు పుల్లరి హనుమంతుడు) -
సామ్రాజ్య భారతి: 1922,1923/1947
ఘట్టాలు చౌరీచౌరా (గోరఖ్‌పుర్) లో హింసాత్మక ఘటనలు. సహాయ నిరాకరణోద్యమ విరమణకు గాంధీజీ పిలుపు. ఉద్యమ నాయకుల అసంతృప్తి. ‘రాజద్రోహం’ నేరారోపణపై ముంబైలో గాంధీజీ అరెస్టు. ఆరేళ్ల జైలు శిక్ష. రెండేళ్లకే విడుదల. స్వరాజ్య పార్టీ అవతరణ. వ్యవస్థాపకులు సి.ఆర్.దాస్, మోతీలాల్ నెహ్రూ. చట్టాలు: (1923) వర్క్‌మెన్ కాంపెన్సేషన్ యాక్ట్, ఆఫిషియల్ సీక్రెట్స్ యాక్ట్, ఇండియన్ బాయిలర్స్ యాక్ట్, కంటోన్మెంట్స్ (హౌస్–అకామడేషన్) యాక్ట్, ఇండియన్స్ నేవల్ ఆర్మమెంట్ యాక్ట్, ఇండియన్ మర్చంట్ షిప్పింగ్ యాక్ట్, కాటన్ ట్రాన్స్పోర్ట్ యాక్ట్. జననాలు: హృషికేష్ ముఖర్జీ : సినీ దర్శకులు (కలకత్తా); అల్లు రామలింగయ్య : హాస్య నటులు (పాలకొల్లు); దిలీప్ కుమార్ : బాలీవుడ్ నటుడు (పెషావర్); ఘంటసాల : గాయకులు, సంగీత దర్శకులు (కృష్ణా జిల్లా); యలవర్తి నాయుడమ్మ : కెమికల్ ఇంజినీర్ (గుంటూరు జిల్లా); ఎస్.రాజేశ్వరరావు : సంగీత దర్శకులు (సాలూరు మండలం); ధర్మభిక్షం : కమ్యూనిస్టు యోధులు (సూర్యాపేట); కుందుర్తి ఆంజనేయులు : కవి (గుంటూరు). మృణాల్ సేన్ : సినీ దర్శకులు (బెంగాల్ ప్రెసిడెన్సీ); ఎన్టీ రామారావు : సినీ నటులు, రాజకీయ నాయకులు (నిమ్మకూరు); దేవ్ ఆనంద్ : సినీ నటులు (పంజాబ్); ముఖేష్ : సినీ నేపథ్య గాయకులు (ఢిల్లీ); కాంతారావు : నటులు (కోదాడ). -
సామ్రాజ్య భారతి 1874/1947: ఈస్టిండియా కంపెనీ రద్దు
చట్టాలు: మ్యారీడ్ ఉమెన్స్ ప్రాపర్టీ యాక్ట్, సివిల్ జెయిల్స్ యాక్ట్, ఈస్టిండియా యాన్యుయిటీ ఫండ్స్ యాక్ట్, ఈస్టిండియా లోన్ యాక్ట్, కోర్ట్స్ (కొలోనియల్) జ్యూరిస్డిక్షన్ యాక్ట్, కొలొనియల్ క్లెర్జీ యాక్ట్. జననాలు: కవి కలాపి : గుజరాతీ కవి. ‘కలాపి’ అన్నది కలంపేరు. అసలు పేరు సుర్సిన్హ్జీ టఖ్టాసిన్హ్జీ గోహిల్. అతడి కవిత్వం నిండా భావోద్వేగమే ఉంటుంది. సాహు మహరాజ్ : మరాఠాల భోంస్లే వంశానికి మహారాజు. కొల్హాపూర్ సంస్థానానికి తొలి మహారాజు. భక్తి సిద్ధాంత సరస్వతీ ఠాకూర : వైష్ణవ హిందూ గురువు. అసలు పేరు విమల ప్రసాద్ దత్. పూరీలో జన్మించారు. షాపూర్జీ సక్లత్వాలా : కమ్యూనిస్టు కార్యకర్త. పార్సీ వంశీయుడు (ముంబై) టి.ఆర్.వెంకట్రామశాస్త్రి : న్యాయవాది. రాజకీయ నేత. మద్రాస్ ప్రెసిడెన్సీకి 1924 నుంచి 1928 వరకు అడ్వొకేట్ జనరల్‌గా పని చేశారు. జన్మస్థలం తమిళనాడులోని మాయవరం. (చదవండి: మనల్ని మనవాడిలా పాలించాడు!) -
చట్టం బలపడితేనే అడవి నిలబడేది
అడవులు వేగంగా అంతరిస్తున్న క్రమంలో.. దాన్ని అడ్డుకొని, వాటిని పరిరక్షించేందుకు ‘అటవీ సంరక్షణ చట్టం’ని పలు అనుమతి షరతులు, కఠిన నిబంధనలతో తెచ్చారు. 1988లో జరిగిన చట్ట సవరణ కూడా అడవుల రక్షణకు దన్నుగా నిలిచింది. ఇప్పుడు వాటన్నింటిని ఏదో రూపంలో సడలించి, చట్ట పరిధి నుంచి బయటకు తెచ్చే యత్నించేస్తున్నారు. పైకి చట్టం స్ఫూర్తిని కాపాడుతున్నట్టు చెబుతున్నా.... లోపల సవరణ ఫలాలు కార్పొరేట్ సంస్థలకు మేలు చేసేవే! సహజవనరుల దోపిడీకి రాచబాటలే! ఉన్న అడవికే రక్షణ లేని ప్రమాదం ముంచుకొస్తోంది. అడవి అమ్మలాంటిది. అన్నీ తనలో ఇముడ్చుకుంటుంది. యుగాలుగా మనిషి మను గడ అడవితో ఎంత గాఢంగా పెనవేసుకుందో వేద–వేదాంగాలు, పురాణ–ఇతిహాసాలు, సంస్కృతీ సంప్రదాయాలు చెప్పకనే చెబుతాయి. రామాయణ, మహాభారత ఇతిహాసాల నుంచి నైమి«శారణ్య బోధనలూ, పంచతంత్రం వరకు ఎన్నో గాథలకు వేదిక అడవి! కోట్ల ఏళ్లుగా మానవేతిహాసం అడవితో–సకల జీవరాశితో సహజీవన యానం (సింబయాసిస్ లివింగ్) చేస్తోంది. నింగి, నేల, గాలి, నీరు, ఆకాశం.... పంచభూతాలే ఇందుకు సాక్ష్యం! స్వార్థంతో మనిషి ప్రకృతికి చేసిన విఘాతాలే నేడు ఉగ్రరూపంతో మానవాళిని వేధిస్తున్న విపత్తులకు, ఉపద్రవాలకు కారణం. ఆ వరుసలో.. తాజాగా ఇపుడు అడవికి ముప్పు తెస్తున్నారు. భూతాపోన్నతి పెరిగి వాతావ రణ విపత్తులు ముంచుకు వస్తున్న వేళ, అడవుల్ని కాపాడుకొని, విస్తీర్ణం పెంచుకోవాల్సిన సమయంలో... ఉన్న చట్టానికి కేంద్రం తల పెట్టిన సవరణ ప్రతిపాదనలు మేలు చేయకపోగా కీడు చేసేవిగా ఉండటం యాదృచ్ఛికమేమీ కాదు, ఉద్దేశపూర్వకం! పైకి చట్టం స్ఫూర్తిని కాపాడుతున్నట్టు చెబుతున్నా... లోపల సవరణ ఫలాలు కార్పొరేట్లకు మేలు చేసేవే! సహజవనరుల దోపిడీకి రాచబాటలే! ఉన్న అడవికే రక్షణ లేని ప్రమాదం ముంచుకొస్తోంది. అటవీ భూముల్ని అటవీయేతర అవసరాలకు వాడే భూబదలాయింపులకు ఇక తలుపులు బార్లా తెరచినట్టే! కీలకాంశాల్ని చట్ట పరిధి నుంచి తప్పించనున్నారు. అప్పుడిక ఏ ముందస్తు అనుమతులూ తీసుకునే పనిలేదు. గిరిజనులకు, అడవి బిడ్డలకు తీరని కష్టాలే! గ్రామీణులు, వనవాసీల సహకారంతో చేపట్టే వనసంరక్షణ స్ఫూర్తి గాలికే! ప్రతి పాదనల్లోని కొన్ని అంశాలు 73, 74వ రాజ్యాంగ సవరణల స్ఫూర్తికి విరుద్ధం. సమాఖ్య స్ఫూర్తికి విఘాతం. కేంద్ర అధికారాల్ని మరింత కేంద్రీకృతం చేసేవే! చట్టం చేసే ముందరి సంప్రదింపుల విధాన (పీఎల్‌సీపీ) ప్రక్రియలో భాగంగా సంబంధీకుల వ్యాఖ్యలు, సూచ నల్ని ప్రభుత్వం ఆహ్వానిస్తోంది. కేంద్ర పర్యావరణ, అటవీ, వాతావ రణ మార్పు మంత్రిత్వ శాఖ ఒక (ఎఫ్.నం. ఎఫ్‌సీ–11/61/2021– ఎఫ్‌సీ) పత్రం విడుదల చేసింది. వాటిపై రాష్ట్ర–కేంద్రపాలిత ప్రాంత ప్రభుత్వాలే కాకుండా పర్యావరణవేత్తలు, శాస్త్రజ్ఞులు, హక్కుల కార్య కర్తలు.... ఆసక్తిగల పౌరులెవరైనా తమ అభిప్రాయాల్ని, అభ్యంత రాల్ని తెలుపవచ్చు. అక్టోబరు నెలాఖరు వరకు గడువుంది. పయనం ఎటు? మార్పు ఏదైనా మంచికి జరగాలి. 1980లో వచ్చిన ‘అటవీ సంరక్షణ చట్టం’ ముందుగా ఒక అత్యవసర ఆర్డినెన్స్! ఆ తర్వాత చట్టమైంది. అడవులు వేగంగా అంతరిస్తున్న క్రమంలో.. దాన్ని అడ్డుకొని, వాటిని పరిరక్షించేందుకు (42వ రాజ్యాంగ సవరణలో భాగంగా) ఈ చట్టాన్ని పలు అనుమతి షరతులు, కఠిన నిబంధనలతో తెచ్చారు. 1988లో జరిగిన చట్ట సవరణ కూడా అడవుల రక్షణకు దన్నుగా నిలిచింది. సుప్రీంకోర్టు 1996 (గోదావర్మన్ తిరుముల్పాడ్ వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా కేసు)లో సంచలన తీర్పిచ్చింది. అటవీ భూమి అయినా కాకపోయినా, ప్రయివేటు భూములైనా... ఏ ప్రాజెక్టు–కార్యక్రమం కింద అభివృద్ధి చేస్తున్నదైనా అడవి అడవేనని, అవన్నీ సదరు చట్ట పరిధిలోకే వస్తాయని, అలాంటి ఏ భూవినియోగ మార్పిడికైనా అను మతులు తప్పనిసరి అంది. అప్పట్నుంచి భూయాజమాన్య హక్కు లతో నిమిత్తం లేకుండా.. అడవులు, చెట్లు, మొక్కలు, ఇతర పచ్చ దనం అభివృద్ధి పరుస్తున్న వ్యవసాయేతర కార్యకలాపాలన్నీ అటవీ చట్ట పరిధిలోకి వచ్చాయి. ఫలితంగా పచ్చదనం పెరిగింది. ఇప్పుడు వాటన్నింటిని ఏదో రూపంలో సడలించి, చట్ట పరిధి నుంచి బయటకు తెచ్చే యత్నం చేస్తున్నారు. కానీ, పైకి ‘చట్టంలోని పలు అంశాలను చక్కదిద్దడానికి’ అని చెబుతున్నారు. ‘ఒకవైపు అడవుల రక్షణ, మరో వైపు అభివృద్ధిని వేగంగా సమీకృత పరచటానికే ఈ చట్ట సవరణ’ అనేది సర్కారు వాదన. సమాచార హక్కు చట్టాన్ని సవరించేప్పుడూ ఇదే చెప్పారు. చివరికేమైంది అందరికీ తెలుసు. అటవీ చట్టానికే గతి పట్టనుందో! ఎవరు ప్రస్తుత మార్పు కోరారు? ఏమడిగారు? ఎందు కడిగారు? వంటి విషయాల్లో పారదర్శకతే లేదు. ఈ 40 ఏళ్లలో చట్టం ఎలా అమలయింది? అందులో మంచి–చెడు ఎంత? అధ్యయనాలేవీ లేవు. మార్పులు చేస్తే... ఎక్కడ? ఎందుకు? దానికో హేతుబద్ధత లేదు. ప్రభుత్వం తలపోసింది, అధికారులు పత్రం రూపొందించారు, అంతే! ప్రస్తుత చట్టంలో ఉన్న రక్షణ వ్యవస్థను పలుచన చేయడం, విలువైన అటవీ భూముల్ని చట్టం ఛత్రచ్ఛాయ నుంచి తప్పించడం, ‘అభివృద్ధి’ ముసుగులో సహజవనరుల్ని కొల్లగొట్టేవారికి చేయూతే పాలకుల రహస్య ఎజెండా అని పర్యావరణవేత్తల ఆందోళన! కార్పొ రేట్ వ్యాపారాల్ని సులభం చేసే చర్యల్లో ఇదొక భాగమన్నది విమర్శ. రోగం కన్నా చికిత్స ఘోరమైతే....? అటవీ చట్ట సవరణకు పద్నాలుగంశాలు ప్రతిపాదించారు. వివిధ రకాల రక్షిత అటవీ భూముల్ని చట్టపరిధి నుంచి తప్పించడమో, భూబదలాయింపుల్ని సులభం చేయటమో, నియంత్రణ పట్టు సడలిం చడమో, నిబంధనల్ని నీరుగార్చడమో.. ఇలాగే సాగింది. ప్రయివేటు అటవీ భూముల్ని చట్టపరిధి నుంచి తప్పించడం, రైల్వేలు, హైవే అథారిటీ, ఇతర రవాణా సంస్థలు 1980కి పూర్వం పొందిన భూముల్ని మినహాయించడం, ఆయా సంస్థలు రోడ్డు, ట్రాక్ పక్క చెట్లు, పచ్చదనం పెంచిన స్థలాల్ని ఈ పరిధి నుంచి తప్పించటం, నివాస–ఇతర ప్రాజెక్టు అవసరాలకు 250 చదరపు మీటర్లలో నిర్మా ణాలు అనుమతించడం... వంటివి ప్రతిపాదించారు. అంతర్జాతీయ సరిహద్దుల్లో దేశ భద్రత–వ్యూహాత్మక మౌలిక వసతుల కోసం అటవీ భూముల్ని బదలాయించాల్సి వస్తే... అనుమతులు అక్కర్లేదంటు న్నారు. స్థలయాజమాన్య హక్కులు బహుళ రికార్డుల్లో నమోదై అటవీ –రెవెన్యూ, ఇతర విభాగాల మధ్య వివాదం ఉంటే, సదరు భూముల్ని చట్టపరిధి నుంచి తప్పించాలంటున్నారు. ఇలాంటి భూమి, ఒక్క తెలంగాణలోనే అయిదారు లక్షల ఎకరాలుంది. దేశమంతటా కనీసం 150 లక్షల ఎకరాలు చట్టపరిధి నుంచి బయటపడి, అటవీయేతర అవసరాలకు దారి మళ్లుతుంది. అడవుల విస్తరణపై ఇది ప్రతికూల ప్రభావమే! పోడు వ్యవసాయం చేసుకునే వనవాసీలకు హక్కులు కల్పించడం ఇప్పుడొక పెద్ద వివాదాస్పదాంశం, దాన్ని తేల్చరు. కానీ, ఖనిజాలు తవ్వే కార్పొరేట్లకు ఎర్రతివాచీ స్వాగతాలు ఇక సులభం. అడవి పెరిగేనా? తరిగేనా? సర్కారుది ఇంకో విచిత్ర వాదన. అడవులుగా ఉన్న అటవీయేతర, ప్రయివేటు భూముల్ని ఈ చట్టపరిధి నుంచి తప్పించి, భూయజమా నుల్లో భయాల్ని తొలగించాలట! నిర్భయంగా వారు ముందుకు వస్తారు కనుక, ఇప్పుడు 24.5 శాతంగా ఉన్న అడవుల వాటాను మొత్తం భూభాగంలో మూడో వంతుకు పెంచాలనే లక్ష్యం సాధ్యమౌ తుందట! అడవికి ఏ నష్టం కలిగించని ఆధునిక సాంకేతికత వచ్చింది కనుక.. చమురు, సహజవాయువు కోసం అడవుల కింద, ఏ ముందస్తు అనుమతులు లేకుండానే తవ్వకాలు జరుపుకోవచ్చని ప్రతి పాదించారు. ఖనిజాలు, ఇతర వనరుల తవ్వకాలకు జరిపే సర్వేలను కూడా అటవీ చట్ట పరిధి నుంచి మినహాయించాలన్నారు. అంటే, మన అమ్రాబాద్ ప్రాంతంలో యురేనియం తవ్వకాల వంటి సర్వేలు ఏ అనుమతులు లేకుండా చేసుకోవచ్చు! అంటే, ఏ అటవీ భూమి ఏ ఇతర అవసరాలకు దారి మళ్లుతుందో ఎవరికీ తెలియదు. నిశ్శబ్దంగా అంతా జరిగిపోతుంటుంది. తెలియనపుడు ప్రజాందోళనలుండవ్! న్యాయస్థానాలు సుమోటోగా స్వీకరించే సందర్భాలుండవు. ప్రస్తుత ప్రతిపాదనలపై రాష్ట్ర ప్రభుత్వాలు, కేంద్రపాలిత ప్రాంతాలు, పర్యా వరణ సంస్థలు, నిపుణులు, కార్యకర్తలు ఇతర బాధ్యతకలిగిన పౌరులు ఎలా స్పందిస్తారు? అన్నదాన్ని బట్టే దేశంలో అడవులు, పర్యావరణ భవిత ఆధారపడి ఉంది. అడవి ఎవరికీ శత్రువు కాదు. ఆయుధమెప్పుడూ అలీనం కాదు. ప్రజాస్వామ్యంలో ప్రజాభిప్రా యమే ఆయుధం. శమీ వృక్షంపైనుంచి దించి, జరిపే ఆయుధపూజకు వేళైంది. చెడుపై మంచి గెలుపే విజయదశమి! దిలీప్ రెడ్డి ఈ–మెయిల్ : dileepreddy@sakshi.com -
కాలంచెల్లిన చట్టాలో మార్పులు
సాక్షి, హైదరాబాద్ : దేశంలో నేటికీ అమల్లో ఉన్న బ్రిటిష్ కాలం నాటి చట్టాలతోపాటు ఇతర పురాతన చట్టాలను పునఃసమీక్షించి ప్రస్తుత అవసరాలకు అనుగుణంగా మార్పుచేర్పులు చేయడంపై కేంద్ర ప్రభుత్వం దృష్టి సారించింది. ఇందులో భాగంగా కేంద్ర పరిశ్రమలు, అంతర్గత వాణిజ్య ప్రోత్సాహక శాఖ (డీపీఐఐటీ) పరిధిలోని ఏడు విభాగాల పరిధిలో వివిధ చట్టాలకు సంబంధించిన నిబంధనలను సమీక్షించి సూచనలు ఇవ్వాల్సిందిగా రాష్ట్ర ప్రభుత్వాలను కోరింది. కార్మిక, తూనిక, కొలతలు, ఫ్యాక్టరీలు, బాయిలర్స్, విద్యుత్, పురపాలన, వాణిజ్య పన్నుల విభాగాల పరిధిలో పాత చట్టాలను అధ్యయనం చేసి వాటి సరళీకరణతోపాటు ఆయా చట్టాల్లో చేయాల్సిన మార్పులు చేర్పులపై అధ్యయనం చేయాలని సూచించింది. ప్రధాని మోదీ స్వయంగా ఈ అంశాన్ని పర్యవేక్షిస్తుండటంతో డీపీఐఐటీ కూడా కేంద్రం సూచించిన ఏడు విభాగాల పరిధిలోని చట్టాలకు సంబంధించిన నియమ నిబంధనలను అధ్యయనం చేయాలని కోరుతోంది. రాష్ట్రంలో 25 శాఖల పరిధిలో: రాష్ట్ర ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు మాత్రం ఈ అధ్యయనాన్ని కేవలం కేంద్రం సూచించిన ఏడు విభాగాలకే పరిమితం చేయకుండా పౌర సేవలతో ముడిపడిన అన్ని శాఖలకు వర్తింపచేయాలని ఆదేశించారు. పాత చట్టాలను అధ్యయనం చేయాల్సిన తీరు, వాటి సరళీకరణ, మార్పులు చేర్పులు తదితరాలకు సంబంధించిన మార్గదర్శకాలపై డీపీఐఐటీకి చెందిన అధికారుల బృందం శుక్ర, శనివారాల్లో హైదరాబాద్‌లో వర్క్‌షాప్‌ను నిర్వహించింది. కేంద్ర ప్రభుత్వం గుర్తించిన ఏడు ప్రభుత్వ విభాగాలతో పాటు సీఎం కేసీఆర్ ఆదేశాలకు అనుగుణంగా మొత్తం 25 రాష్ట్ర ప్రభుత్వ విభాగాల ఉన్నతాధికారులు ఈ వర్క్‌షాప్‌లో పాల్గొన్నారు. పౌర సేవలు సరళీకృతంగా అందించేందుకు అడ్డుగా ఉన్న చట్టాల్లోని నిబంధనలను గుర్తించడం, వాటికి చేయాల్సిన సవరణలను సూచించడం లక్ష్యంగా వర్క్‌షాప్‌లో కేంద్ర బృందం దిశానిర్దేశం చేసింది. చట్టాల్లోని నియమ నిబంధనలను సాకుగా చూపుతూ పౌర సేవలను అందించడంలో ఆలస్యాన్ని తొలగించేందుకు ఈ కసరత్తు దోహదం చేస్తుందని పరిశ్రమల శాఖ అధికారులు వెల్లడించారు. మార్చి 31లోగా అధ్యయనం పూర్తి చేసి ప్రభుత్వ విభాగాల వారీగా ప్రణాళికను డీపీఐఐటీ వెబ్సైట్లో అప్లోడ్ చేయాలని కేంద్ర అధికారుల బృందం గడువు విధించింది. ఈ నేపథ్యంలో డీపీఐఐటీ మార్గదర్శకాలకు అనుగుణంగా 25 రాష్ట్ర ప్రభుత్వ శాఖల పరిధిలో కసరత్తు ప్రారంభం కానున్నది. -
న్యాయ ప్రక్రియకు గండి
భావోద్వేగాలు చిక్కబడినప్పుడు విచక్షణ నీరుగారటం సహజం. తమకో, తమ వారికో అన్యాయం జరిగిందనుకున్నవారు తక్షణ న్యాయం కావాలని ఆశించడం తప్పు కాదు. కానీ ఆ న్యాయం ఫలానా విధంగానే ఉండాలనడం, అది ఫలానా సమయానికల్లా దక్కాలనడం వల్ల ఆ పనిలో ఉండే వ్యవస్థలు సమస్యలెదుర్కొంటాయి. అన్యాయానికి గురైన సాధారణ వ్యక్తులు భావోద్వేగాలకు లోనై ఎలా స్పందించినా వారిని సానుభూతితో అర్ధం చేసుకోవచ్చు. ఆ స్పందన చట్ట పరిమితులకు లోబడి వున్నంతవరకూ చట్టాలు సైతం మౌనంగా ఉంటాయి. కానీ ఈ మధ్యకాలంలో ఉన్నతంగా ఆలోచించాల్సిన, వృత్తి ధర్మాన్ని నిర్వర్తించాల్సిన సంఘాలు సైతం అదే మాదిరి ధోరణి ప్రదర్శిస్తున్నాయి. కశ్మీర్‌కు స్వేచ్ఛనివ్వాలంటూ ప్లకార్డు ప్రదర్శించిన కేసులో కర్ణాటకలోని మైసూర్ విశ్వవిద్యాలయం పూర్వ విద్యార్థినిని రాజద్రోహ నేరం కింద అరెస్టు చేయగా అక్కడి బార్ అసోసియేషన్ ఆమె తరఫున న్యాయవాదులెవరూ వాదించకూడదని తీర్మానం చేసింది. నళిని దేశద్రోహి కనుక, జాతి వ్యతిరేకి గనుక వాదించొద్దని ఆ తీర్మానం సారాంశం. అదే రాష్ట్రంలోని హుబ్లీలోనూ ఈ మాదిరి పరిణామమే చోటుచేసుకుంది. పాకిస్తాన్ అనుకూల నినాదాలు చేసిన కేసులో ముగ్గురు కశ్మీరీ విద్యార్థులను ఇలాంటి నేరారోపణలపైనే అరెస్టు చేయగా, అక్కడి బార్ అసోసియేషన్ కూడా వారికి న్యాయ సహాయం చేయరాదంటూ తీర్మానించింది. ఇతరులతో పోలిస్తే న్యాయం గురించి, చట్టాల గురించి న్యాయవాదులకు ఎక్కువ అవగాహన ఉంటుంది. అలా ఉండాలని అందరూ కోరుకుంటారు. కానీ ఆ రెండుచోట్లా బార్ అసోసియేషన్లు అందుకు విరుద్ధంగా వ్యవహరించాయి. మైసూర్లో నళిని తరఫున వాదించడానికి వేర్వేరు జిల్లాలకు చెందిన 170 మంది న్యాయవాదులు వెళ్లారు. హుబ్లీలో నిందితుల తరఫున వాదించడానికెళ్లిన ముగ్గురు న్యాయవాదులను దూషించడం, చంపేస్తామని బెదిరించడం వంటివి కూడా చోటు చేసుకున్నాయి. ఈ తీరు సరికాదని కర్ణాటక హైకోర్టు హితవు చెప్పడంతో హుబ్లీ బార్ అసోసియేషన్ తన తీర్మానాన్ని సవరించుకుని నిందితుల తరఫున వాదిం చడం న్యాయవాదుల వ్యక్తిగత ఇష్టానికి వదిలేస్తున్నామని తెలిపింది. కానీ ఇది కూడా తప్పేనని హైకోర్టు చెప్పడంతో తీర్మానాన్ని వెనక్కు తీసుకుంది. ‘రాజు తలచిందేను ధర్మం...రాజు చెప్పిందేను శాస్త్రం’ అన్నట్టు ఎలాంటి చట్టం, న్యాయం లేని మధ్యయుగాల నాటి పరిస్థితులనుంచి మానవ సమూహాలు ప్రజాస్వామ్య సమాజాలకు ఎలా పరివర్తన చెందాయో, ఏ పరిణామాలు అందుకు దోహదపడ్డాయో తెలిసున్నవారు ఇలాంటి అపరిపక్వ ఆలోచనలకు తావీయరు. ప్రజాస్వామ్య దేశాల్లోని రాజ్యాంగాలు, చట్టాలు అక్కడి సమాజాల సమష్టి వివేకానికి దర్పణాలు. అన్యాయానికి లోనైనవారికి న్యాయాన్ని అందించటం, సమాజానికి హానికరంగా పరిణమించినవారిని ఆ సమాజం నుంచి దూరంగా వుంచి, వారిని సంస్కరించటం చట్టాల మౌలిక ఉద్దేశం. రాజ్యాంగం రచించిననాటికి ఉన్న పరిస్థితుల ప్రభావం వల్ల కావొచ్చు, చట్టాలు రూపకల్పన చేసినప్పటి ఆలోచనల పర్యవసానంగా కావొచ్చు...ఆచరణలో సమస్యలెదురవుతుంటాయి. మారిన పరిస్థితులు, ఆలోచనల ఆధారంగా వాటికి సవరణలు చేసుకోవటం ఎక్కడైనా ఉండేదే. ఒక సమాజం న్యాయాన్ని మరింత చురుగ్గా, మరింత మెరుగ్గా అందించదల్చుకుని ఈ సవరణలు చేసిందా లేక తిరోగమన దృక్పథంతో వ్యవహరించిందా అన్నది ఆ సవరణల సారాంశం తేటతెల్లం చేస్తుంది. మన దేశంలో చట్టాలు ఏమేరకు ఆసరాగా నిలు స్తున్నాయో సాధారణ ప్రజానీకానికి నిత్యానుభవం. ఎడాపెడా దుర్వినియోగమవుతున్న చట్టాల జాబితాను రూపొందిస్తే మాత్రం అందులో రాజద్రోహ చట్టం మొట్టమొదట ఉంటుంది. 1962లో కేదార్నాథ్ కేసులో రాజ్యాంగ ధర్మాసనం దీన్ని గుర్తించి కొన్ని మార్గదర్శకాలు విధించింది. రాజద్రోహ చట్టం రాజ్యాంగబద్ధమేనని చెబుతూనే, దాని దుర్వినియోగం మాత్రం అధికంగానే వున్నదని అభిప్రాయపడింది. చిత్రమేమంటే ఇటీవల సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ దీపక్ గుప్తా సైతం ఇటువంటి అభిప్రాయాన్నే వ్యక్తం చేశారు. అంటే ఏళ్లు గడుస్తున్నా మన సమాజం తీరు తెన్నులు పెద్దగా మారలేదన్నమాట. ఇలా దుర్వినియోగమవుతున్న చట్టంలో చిక్కుకున్నవారికి కనీసం న్యాయస్థానాల్లో కూడా ఉపశమనం దక్కనీయకుండా నివారించే ప్రయత్నం చేయడం ధర్మం కాదని మైసూరు, హుబ్లీ బార్ అసోసియేషన్లకు తట్టకపోవడం ఆశ్చర్యం కలిగిస్తుంది. దాని సంగతలావుంచి వృత్తిపరంగా ఎలా వ్యవహరించాలో, ఎలాంటి సంప్రదాయాన్ని పాటించాలో బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా(బీసీఐ) నిబంధనలు చెబుతున్నాయి. తీవ్రమైన నేరం చేశాడని మొత్తం సమాజం భావించిన వ్యక్తి సైతం తన తరఫున వాదించమని ఆశ్రయించినప్పుడు ప్రత్యేక పరిస్థితుల్లో తప్ప ఏ న్యాయవాదీ అందుకు నిరాకరించరాదని గతంలో సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. పార్లమెంటు చేసే చట్టాలు మాత్రమే కాదు...వివిధ కేసుల్లో సుప్రీంకోర్టు, హైకోర్టులు ఇచ్చే ఆదేశాలు కూడా చట్టాలతో సమానమే. ఏ పౌరుడైనా తెలియక తప్పు చేశానంటే చట్టం ఊరుకోదు. చట్టానికి సంబం ధించినంతవరకూ తాను అజ్ఞానినని మొత్తుకున్నా అంగీకరించదు. నిత్యం ఆ చట్టాలకు సంబంధిం చిన పనిలోనే నిమగ్నమై వుండేవారికి ఇది తెలియదనుకోగలమా? తెలియక చేశారనుకున్నా అది కోర్టు ధిక్కారం కాదా? దేశ ప్రయోజనాలకు విఘాతం కలిగించడానికి ప్రయత్నించేవారిపట్ల కోపావేశాలుండటాన్ని అర్ధం చేసుకోవచ్చు. కానీ అలాంటివారిని సైతం చట్టబద్ధంగా విచారించి శిక్షించాలని కోరుకోవాలి తప్ప అన్నిటినీ బేఖాతరు చేసి, వారికి అన్ని దారులూ మూసేయాలన్న వితండవాదనకు దిగ కూడదు. ఇలా కోరుకోవడం ద్వారా తాము నాగరిక సమాజం మౌలిక పునాదులనే ప్రశ్నార్థకం చేస్తు న్నామని, న్యాయపరమైన ప్రక్రియ ముందుకు సాగకుండా అడ్డుకోవడంతోపాటు అసలు ఆ ప్రక్రి యనే సందేహాస్పదంగా మారుస్తున్నామని వారు గ్రహించాలి. -
ఎన్నికల చట్టాలు ఇవే.. ఉల్లంఘిస్తే శిక్షే
సాక్షి, సిటీబ్యూరో : లోక్‌సభ సార్వత్రిక ఎన్నికలు కొద్దిరోజుల్లో జరగనున్నాయి. ఈ నేపథ్యం దేశంలోని చట్టాల గురించి అవగాహన అవసరం. మన ప్రజాస్వామ్య దేశంలో ప్రభుత్వాన్ని ఎన్నుకోవడానికి ఎన్నికలే కీలకం. ఎన్నికల నియమావళిని రూపొందించి పకడ్బందీగా అమలు చేయడానికి ఎన్నికల కమిషన్ పని చేస్తోంది. ఎన్నికల నియమావళిని ఎవరు అతిక్రమించినా చట్టం తన పని తాను చేసుకుపోతుంది. ఎన్నికల సమయంలో ప్రజాప్రాతినిధ్య చట్టంలోని నిబంధనల ప్రకారం ఎక్కువగా కేసులు నమోదు చేస్తుంటారు. ప్రజాప్రాతినిధ్య చట్టంలో అనేక సెక్షన్లు ఉన్పప్పటికీ ఎక్కువగా ఎన్నికల సమయంలో కొన్నింటిని ఎక్కువగా నిబంధనలు అతిక్రమించిన పార్టీలు, వ్యక్తులపైన ప్రయోగిస్తుంటారు. ఆ చట్టాలేమిటో.. శిక్షలు ఏమిటో ఓసారి తెలుసుకుందాం. ఆర్పీ యాక్ట్ 123 : లంచగొండితనం, అనుచిత ఒత్తిడి, మతం, జాతి, కులం, సంఘం లేదా భాషా ప్రాతిపదికపై వర్గాల పౌరుల మధ్య ద్వేషాన్ని, శత్రుత్వాన్ని పెంపొందిస్తే శిక్షకు అర్హులు. ఆర్పీ యాక్ట్ 125 : ఎన్నికల సందర్భంగా వివిధ వర్గాల మధ్య శత్రుత్వాన్ని పెంపొందించినట్లయితే మూడేళ్లు జైలు శిక్ష లేదా జరిమానా లేదా రెండూ అమలు చేయవచ్చు. ఆర్పీ యాక్ట్ 126 : ఎన్నిక సమయానికి 48 గంటల ముందు బహిరంగ సభలు నిర్వహిస్తే శిక్షార్హులవుతారు. అందుకు రెండేళ్లు జైలు శిక్ష లేదా జరిమానా లేదా రెండూ విధించే అవకాశం ఉంది. ఆర్పీ యాక్ట్ 127 : ఎన్నికల సమావేశంలో అల్లర్లు చేస్తే యూఎస్ 42 సీఆర్పీసీ ప్రకారం వారికి ఆరు నెలల జైలు శిక్ష లేదా రూ. 2 వేలు జరిమానా లేదా రెండూ విధింవచ్చు. ఆర్పీ యాక్ట్ 127 అ: ఎవరైనా తన పేరు చిరునామా లేకుండా ఎన్నికల కరపత్రాలు, వాల్‌పోస్టర్లు ముద్రిస్తే ఆరు నెలల జైలు శిక్ష లేదా రెండు వేల రూపాయల జరిమానా లేదా రెండూ అమలు చేస్తారు. ఆర్పీ యాక్ట్ 128 : బహిరంగంగా ఓటేస్తే మూడు నెలల జైలు లేదా జరిమానా లేదా రెండూ విధిస్తారు. ఆర్పీ యాక్ట్ 130 : పోలింగ్ బూత్‌కు 100 మీటర్ల లోపల ప్రచారం చేయొద్దు. ప్రచారం చేస్తే రూ. 250 జరిమానా విధిస్తారు. ఆర్పీ యాక్ట్ 131 : పోలింగ్ బూత్‌కు సమీపంలో నిబంధనలకు వ్యతిరేకంగా ప్రచారం చేస్తే సామగ్రిని స్వాధీనపరచుకుంటారు. మూడు నెలల జైలు లేదా జరిమానా లేదా రెండూ అమలు చేస్తారు. ఆర్పీ యాక్ట్ 132 : ఓటేసే సమయంలో నియమ నిబంధనలు ఉల్లంఘిస్తే మూడు నెలలు జైలు శిక్ష లేదా జరిమానా లేదా రెండూ అమలు చేస్తారు. ఆర్పీ యాక్ట్ 133 : ఓటర్లను పోలింగ్ బూత్ వద్దకు చేరవేసేందుకు వాహనాలు సమకూరిస్తే శిక్షార్హులు. మూడు నెలలు జైలు శిక్ష లేదా జరిమానా లేదా రెండూ విధిస్తారు. ఆర్పీ యాక్ట్ 134 : ఎన్నికల సందర్భంగా అధికార దుర్వినియోగం చేస్తే శిక్షార్హులే. రూ. 500 వరకు జరిమానా ఉంటుంది. ఆర్పీ యాక్ట్ 134 అ : ప్రభుత్వ ఉద్యోగి ఎన్నికల పోలింగ్ ఓట్ల లెక్కింపు ఏజెంట్‌గా వ్యవహరిస్తే శిక్షార్హులు. మూడు నెలల జైలు శిక్ష లేదా జరిమానా లేదా రెండూ విధిస్తారు. ఆర్పీ యాక్ట్ 135 : బ్యాలెట్ పత్రం, ఈవీఎం అపహరిస్తే ఏడాది జైలు శిక్ష లేదా రూ. 500జరిమానా లేదా రెండు అమలు చేస్తారు. ఆర్పీ యాక్ట్ 135 అ: ప్రభుత్వ ఉద్యోగి అయి ఉండి పోలింగ్ బూత్ స్వాధీనం పరచుకుంటే ఏడాది నుంచి 5 ఏళ్ల వరకు జైలు శిక్ష లేదా రూ.500 జరిమానా లేదా రెండూ విధిస్తారు. ఆర్పీ యాక్ట్ 135 ఆ : ప్రభుత్వ ఉద్యోగులకు ఎన్నికల రోజు వేతన సెలవు మంజూరు చేస్తే రూ.5 వేలు వరకు జరిమానా విధిస్తారు. ఆర్పీ యాక్ట్ 135 ఇ : పోలింగ్ ఓట్ల లెక్కింపు రోజు మద్యం అమ్మకం, పంపిణీ నేరం. ఆరు నెలలు జైలు రూ. 2 వేలు జరిమానా విధిస్తారు. -
సెక్షన్ 49 పీ.. చట్టం
సాక్షి, దమ్మపేట: ఒక్కోసారి ఎన్నికల్లో దొంగ ఓట్లు కూడా వేస్తుంటారు. పోలింగ్ సమయంలో ఏజెంట్లు అప్రమత్తంగా లేని సమయంలో ప్రత్యర్థి పార్టీలకు చెందిన కార్యకర్తలు అవతలి వ్యక్తుల ఓటును వేసేసి వెళ్తుంటారు. అయితే మన ఓటు హక్కును తిరిగి సాధించుకునేందుకు ఎన్నికల చట్టం అవకాశం కల్పిస్తోంది. సెక్షన్ 49 పీ ప్రకారం. తన ఓటును మరొకరు వేసినట్లు గుర్తిస్తే వెంటనే సంబంధిత పోలింగ్ కేంద్రలో చాలెంజ్ ఓటును నమోదు చేసుకోవచ్చు. కాండక్ట్ ఆఫ్ ఎలక్షన్ రూల్స్ 1961లోని సెక్షన్ 49 పీ ప్రకారం.. పోలింగ్ సమయంలో మన ఓటు ఎవరైనా అంతకుముందే వేసినట్లు గుర్తిస్తే వెంటనే సంబంధిత పోలింగ్ కేంద్రానికి వెళ్లి ఆ ఓటును వెనక్కి తీసేయమని అధికారులను కోరవచ్చని న్యాయనిపుణులు చెబుతున్నారు. ఇందరు కోసం రూ.5 అక్కడి ప్రిసైడింగ్ అధికారికి చెల్లించి ఓటనును నమోదు చేయాలని కోరితే.. అతని వద్ద ఉన్న గుర్తింపుకార్డు తదితరాలన్నింటినీ పరిశీలించి అనుమతి ఇస్తారు. మొత్తం ఓట్లలో అదనపు ఓటుగా ప్రత్యేకంగా గుర్తిస్తూ ఈ ఓటును కలిపి లెక్కించకుండా దాచి ఉంచుతారు. ఓట్ల లెక్కింపు సమయంలో బ్యాలెట్‌పై మనం వేసిన ఓటును ఓట్ల లెక్కింపులో చివరికి లెక్కిస్తారు. గెలుపు ఓటముల్లో ఈ ఓటు అవసరాన్ని బట్టి దీనిని అప్పుడు పరిగణనలోకి తీసుకుంటారు. -
నల్లధనం అడ్డుకట్టకు ఈ చట్టాలు చాలవు
న్యూఢిల్లీ: ఎన్నికల్లో నల్లధన ప్రవాహాన్ని అరికట్టేందుకు ప్రస్తుతం దేశంలో ఉన్న చట్టాలు సరిపోవని ప్రధాన ఎన్నికల కమిషనర్ (సీఈసీ) ఓం ప్రకాశ్ రావత్ శనివారం వ్యాఖ్యానించారు. సమాచార తస్కరణ, నకిలీ వార్తల సృష్టి తదితర కార్యకలాపాలకు పాల్పడే కేంబ్రిడ్జ్ అనలిటికా వంటి సంస్థల వల్ల దేశంలో ఎన్నికల ప్రక్రియకు ఎంతో ప్రమాదం పొంచి ఉందని రావత్ ఆందోళన వ్యక్తం చేశారు. ‘భారత ఎన్నికల ప్రజాస్వామ్య సవాళ్లు’ అనే అంశంపై ఢిల్లీ ముఖ్య ఎన్నికల అధికారి ఏర్పాటు చేసిన సదస్సులో రావత్ మాట్లాడుతూ.. ప్రజలు ప్రలోభాలకు లోనుకాకుండా ఎన్నికలు నిర్వహించేందుకు మీడియాను సమర్థంగా ఉపయోగించుకోవడంతోపాటు సోషల్ మీడియాలో నకిలీ వార్తలు, చెల్లింపు వార్తలను అడ్డుకోవడం అత్యంత ముఖ్యమనీ, దీనిపై తాము ఇప్పటికే దృష్టిపెట్టామని చెప్పారు. -
బీ కేర్ ఫుల్
-
మగాళ్ల కోసం ఓ కమిషనా?!
ఆంధ్రప్రదేశ్ మహిళా కమిషన్ చైర్మన్ ‘పురుష కమిషన్’ కూడా ఉండా లని వాక్రుచ్చారు. దాంతో మహిళలే కాదు పురుష ప్రపంచం కూడా నివ్వెరపోయింది. ఎవరో కొద్దిమంది 498ఎ ముద్దా యిలు, 498ఎ బూచితో ఎన్ఆర్ఐ నిధులు పొందే ‘బాధితుల’ సంఘాలు మినహాయింపు అనుకోండి. ఈ అద్భుతమైన ఆలోచన, ఆమె దగ్గరికి వస్తున్న వారికి ఆమె కౌన్సెలింగ్ ఇస్తున్న సందర్భంలో ఆమె చైర్మన్‌గా ‘కేసు’ తెలుసుకోవడం మానేసి కౌన్సి లింగ్‌లు నిర్వహిస్తున్న సందర్భంలో వచ్చిందన్న మాట. 40 శాతం భార్యల తప్పు ఉన్నట్లు ఆమెకు తెలిసిందట. ఈ శాతం అంశంలో ఆమె అనుభవాల నయినా ఒక పద్ధతి ప్రకారం నమోదు చేసి విశ్లేషించి చెప్పలేదు. ఇటువంటి అరుదైన అధ్యయనాలతో మహిళా సంఘాల కళ్లు తెరిపించడానికి, లెక్కలు విడుదల చేయండి అంటే అబ్బే అలా చేయకూడదు. వాళ్ల పేర్లు బయటపెట్టకూడదన్నారు. అసలు 40 శాతం స్త్రీలు.. పురుషుల్ని బాధ పెట్టేంత సాధికారత పొందినట్లయితే ఇక మహిళా కమిషన్ అవసరం ఏముంది? 60 శాతం పురుషులు హింసిస్తున్నారట. సగం వాళ్లు సగం వీళ్లు హింసిస్తూ సాగే పవిత్ర కుటుంబ వ్యవస్థ ప్రపంచానికి ఆద ర్శంగా ఉంటుంది. అసలు కుటుంబం అంటే ఏమిటి? గృహ హింస ఏ ఆధిపత్య సంబంధాల వలన వస్తుంది? వాటిని ఆర్థిక వ్యవస్థ– (వనరుల్లేక స్త్రీలు ఆధారపడే స్థితి) ఎందుకు కొనసాగిస్తుంది? వంటì మౌలిక అవగాహన కూడా లేని వ్యక్తుల్ని కమి షన్లలో నియమించడమే అసలు దారుణం. ఆంధ్రప్రదేశ్‌లో భర్తల్ని చంపిన భార్యలకు చెందిన రెండు మూడు ఘటనలు, తెలంగాణలో జరి గిన ఐదు ఘటనలు.. ఇంకా దేశంలో అత్యంత అరు దుగా జరిగే ఇటువంటి ఘటనలు మీడియాలో చాలా సమయం పొందుతున్నాయి. ఒక నల్ల బానిస తెల్ల వాడిని చంపితే ఇటువంటి ఆగ్రహమే ప్రకటిత మయ్యేది ఒకప్పుడు. ఒక శూద్రుడు బ్రాహ్మడిని తన్నితే ఇలాగే కూసాలు కదిలిపోయేవి. ఒక స్త్రీ భర్తను కాదంటే ఇలాగే ఆవేశాలు పెల్లుబికేవి. 498ఎని నీరుకార్చడం ఎస్సీ, ఎస్టీ అత్యాచార నిరో ధక చట్టం బుట్టదాఖలు చేయటం ఇపుడు ఎదురు దాడి చేస్తున్న ఆధిపత్య వర్గాల వ్యూహంలో భాగమే. వ్యక్తిగతంగా నేరం చేసినవాళ్లని ఎవరినయినా చట్టప్రకారం సత్వరంగా న్యాయ విచారణ పూర్తిచేసి శిక్షించాలి. దీనికి ఆడ, మగా తేడా లేదు. అట్లాగే నేర ప్రవృత్తి స్త్రీలకు ఉండదు అనడం స్త్రీలను దేవతలుగా కీర్తిస్తూ బానిసలుగా మార్చిన సంస్కృతి తాలూకూ భావజాలమే. ఆమె మనిషి. మనిషికుండే మంచి చెడు లక్షణాలు ఆమెక్కూడా ఉంటాయనడం వాస్త వం. మహిళా కమిషన్ ఏర్పాటు జరిగింది మహిళలు ఏం చేసినా రక్షించడానికి కాదు. కుటుంబ వ్యవస్థకు కాపలా వేయడానికి కూడా కాదు. ప్రపంచ వ్యాప్తంగా 40 శాతం స్త్రీలు గృహ హింసకు గురవుతున్న విషయం నమోదు కాదు. కుటుంబ పరువు, ఆర్థికంగా ఆధారపడటం, పిల్లలకు వేరే భరోసా లేకపోవడంతో హింసను వీళ్లు మౌనంగా భరిస్తుంటారు. అలా భరించడమే ఉత్తమ ఇల్లాలి లక్షణమని సమాజం, మతం ఊదరగొట్టి స్త్రీల నరనరాల్లో దీన్ని నింపేశారు. కానీ ఇపుడు కాస్త చదువుకుని, ఉద్యోగాలు చేస్తూ ప్రపంచం తెలు సుకుని నేనూ మనిషినే అని తిరగబడితే అది మగా డిపై హింసగా మారిపోతోంది. ‘అత్తమామల్ని చూడ రంట. ఆడపడుచులకి సేవలు చేయరంట. ఎంత దారుణం’ అని సదరు చైర్మన్ వాపోతున్నది. అలా అయితే భార్య తల్లిదండ్రుల్ని చూసే బాధ్యత భర్తకు ఉందా? ఇద్దరూ సమానం అయినపుడు ఇరువైపులా తల్లిదండ్రులపట్లా సమానంగా బాధ్యత వహించాలి కదా. అట్లా కాకుండా తనపై పెత్తనం చేసే వారికి సేవలు చేయకపోవడం దారుణం అంటున్నామంటే కుటుంబం ‘మగాడిది’ అని అంగీకరించడమే. భర్త తాలూకు అధికారంతో తనపై నిరంతర నిఘా వేసి తప్పులుబట్టి సేవల్ని కూడా గుర్తించక పోవడం తమ హక్కుగా భావించే వారితో కలిసి ఉండాలని ఎవరికి ఉంటుంది? వారి జీవిత భాగస్వాములను వారికి బలవంతంగా సేవలు చేయమనడం సరికాదు. ‘మగాడి’ ఇంటికి వచ్చి ఇంటి పేరు (కొన్నిసార్లు స్వంత పేరు కూడా) మార్చుకుని, అత్తింటి మనిషిగా స్త్రీలను తయారు చేసే క్రమమే హింస. ఓ మనిషిగా గుర్తింపుని (కన్యాదానంతో) కోల్పోయే క్రమం. సామాజిక కట్టుబాట్లతో మొదలయ్యే హింస. స్త్రీలపై హింస నానాటికీ పెరుగుతుండటం అంటే ఆధిపత్యం, అసమానత పెరుగుతున్నదనే అర్థం. చదువురాని స్త్రీలు కూడా తమ అనుభవాల నుంచి∙దీనిని చక్కగా అర్థం చేసుకోగలరు. ఆధిపత్యాన్ని సమర్థించేవారు దీన్ని అర్థం చేసుకోవడానికి నిరాకరిస్తారు. పీడితులకు న్యాయం చేయాల్సిన పద విలో ఉన్న వారికి పీడిత వర్గ పక్షపాతం లేకుంటే వారికి అన్యాయం జరుగుతుంది. స్త్రీలకు చట్టపరమైన హక్కులు కల్పిస్తున్నాయా లేదా పర్యవేక్షించడానికి ఒక స్వతంత్ర సంస్థగా ఏర్ప రచినవే కమిషన్లు. వ్యక్తులు, సంస్థలు, ప్రభుత్వాలు అన్నింటిపైనా నిఘా ఉంచడం. వాటిని ప్రశ్నించడం, పనిచేసేలా ముల్లుగర్రతో పొడవటం. చట్టాల లోపాలను ఎత్తిచూపడం వీటి పని. వివాహేతర సంబంధాలలో పురుషుడికే స్వేచ్ఛ ఉంది. స్త్రీకే లేదు. స్త్రీ వివాహం వద్దని చెబితే గౌరవ హత్యలు జరుగుతాయి. విడాకులు కావాలంటే.. వెలి వేస్తారు. చుట్టూ వాతావరణం నేరం చేసినా తప్పిం చుకోవచ్చనే భరోసా కల్పిస్తుంది. భర్తను చంపే బదులు వదిలివేయవచ్చు కదా అని దీర్ఘాలు తీస్తు న్నారు కొందరు. రెండేళ్లలో 87 శాతం పెరిగిన వర కట్న హత్యలకు కారకులైన భర్తలక్కూడా అదే చెప్పి చూడండి. గృహ హింసకు కారణం అయిన వారికి ఈ నీతిబోధ చేయండి.స్త్రీలు ఇట్లా చేసినవి జరిగిన నేరాల్లో 0.0000 శాతం కూడా లేవు. దానికే ఇంత గగ్గోలు అంటే మనది ఎంత మగాధిపత్య సమాజమో, ఎంత మగ మీడియానో, స్త్రీలు అణగి ఉండాలనే భావజాలం మనలో ఎంత పేరుకుపోయిందో అర్థమౌతుంది. సమాజంలో గల అసమానతకు తద్వారా స్త్రీలపై హింసకు కుటుంబంలోని ఆధిపత్య సంబంధాలకూ, హింసకూ గల సంబంధాన్ని దాని చారిత్రక క్రమాన్ని అందరూ అధ్యయనం చేయక పోవచ్చు. కానీ కాస్త ఇంగిత జ్ఞానం, వాస్తవాల పట్ల గౌరవం ఉండాలి. కమిషన్ చైర్మన్‌గా ఉన్నప్పుడు తాను మాట్లా డిన మాట మహిళల ప్రయోజనాలకు గొడ్డలి వేటుగా మారుతుందనీ, స్త్రీలను హింసించేవారంతా ఈ తప్పుడు వాదనను భుజానేసుకుంటారనే సోయి కూడా లేనివారికి రాజ్యాంగ పదవి ఉండాలా? అర్హ తలేమీ లేకుండా ఒక రాజ్యాంగ పదవిలో వ్యక్తుల్ని నియమిస్తే ఏమవుతుందో ప్రభుత్వాలకు ఇప్పుడ యినా అర్థమైందో లేదో.. వారికి అర్థం కాకుంటే ఇటువంటి భావాలున్న వారినీ, అనర్హులనూ పదవి నుండి తొలగించాలని డిమాండ్ చేయాలి. దేవి వ్యాసకర్త సాంస్కృతిక కార్యకర్త -
అమ్మానాన్నా..అధైర్యపడొద్దు
గుంటూరు(పట్నంబజారు): నిండు నూరేళ్ళు.. చల్లగా ఉండాలన్న పేగు బంధానికి వెలకడుతున్నారు.. నవమాసాలు మోసిన అమ్మకు నాలుగు మెతులకు పెట్టులేకపోతున్నారు.. నీ బాగోగులపై.. మాకు భాధ్యత లేదంటున్నారు... బ్రతుకు నడక నేర్పిన తల్లితండ్రులను భారమంటున్నారు... కన్నపేగుపై కాఠిన్యంగా.. వ్యవహరిస్తున్నారు.. కష్టపడి పెంచిన నాన్నను నడిరోడ్డు పాలుచేస్తున్నారు.. ఆస్ధి కోసం ఎంతటి వేధింపులకు వెనుకాడటంలేదు.. సభ్య సమాజం తలదించుకునేలా.. జన్మనిచ్చిన వారు.. బతుకు జీవుడా.. అంటున్నా... కనికరం చూపటం లేదు. అందుకే వృధ్ధాశ్రమాలు.. అనాధ శరణాలయాలు.. కిక్కిరిసి దర్శనమిస్తున్నాయి. వివరాల్లోకి వెళితే... గుంటూరు నగరంలోని మంగళదాస్‌నగర్‌లో ఉండే ఆదాం షఫీ 146 గజాల్లో రేకుల షెడ్డు నిర్మించుకున్నారు. భార్య హసన్బీకి పక్షవాతం రావటంతో పండుటాకుల పరిస్థితి దయనీయమంగా మారింది. ఇద్దరు కుమారులు ఉంటే.. వారిలో చిన్న కుమారుడు, కోడలు వేధించడంతో పోలీసులను ఆశ్రయించారు. అమృతలూరులో ఉండే సూర్యకుమారికి ఇద్దరు సంతానం, ఉన్న ఆస్తులను సమానంగా పంచారు. సుమారు రూ.50 లక్షల విలువ చేసే ఆస్తులు ఇచ్చానని, పెద్ద కుమారుడు మృతి చెందిన తరువాత పెద్ద కోడలు, చిన్న కుమారుడు, పెద్ద కోడలు పట్టించుకోవటం లేదని కన్నీరు మున్నీరయ్యారు. ఇలాంటి వారు అధైర్యపడాల్సిన పని లేదని చట్టాలతో రక్షణ పొందవచ్చని న్యాయస్థానాలు చెబుతున్నాయి. వృద్ధాశ్రమాల బాట జిల్లాలో వృద్ధాశ్రమాలు కూడా రోజురోజుకీ పెరిగిపోతున్నాయి. 2016లో 76, 2017లో 117, ప్రస్తుతం 140 వరకు ఆశ్రమాలు ఉన్నాయని అధికారులు చెబుతున్నారు. కేవలం ఈ ఏడాది ఐదు నెలల వ్యవధిలో బిడ్డలు తమను పట్టించుకోవడం లేదంటూ 162 కేసులు నమోదయ్యాయి. అధికారంగా ఉన్న వృధ్ధాశ్రమాలతోపాటు కొన్ని స్వచ్ఛంద సేవా సంస్థలు వృద్ధులను ఆశ్రయం కల్పిస్తున్నాయి. పండుటాకుల రక్షణగా చట్టాలు ♦ తల్లితండ్రులను ఇబ్బందులు గురి చేసినా..వేధించినా తల్లిదండ్రులు సెక్షన్ 125 సీఆర్పీసీ ప్రకారం కోర్టులో దావా వేయవచ్చు. వీటికి సంబంధించి పూర్తి న్యాయ సలహాలు అందించేందుకు న్యాయస్థానాలు అవకాశం కల్పిస్తున్నాయి. ♦ పోలీసు సహాయంతో సీనియర్ సిటిజన్ ప్రొటెక్షన్ అండ్ వెల్ఫేర్ యాక్ట్, సెక్షన్ – 4 కింద కేసులు నమోదు చేసే అవకాశం ఉంది. ♦ 2007లో కేంద్ర ప్రభుత్వం తల్లితండ్రులు, వృద్ధు సంరక్షణ చట్టాన్ని రూపొందించింది. ఈ చట్టం పండుటాకులకు బాసటగా నిలుస్తోంది. 2011లో మన రాష్ట్రంలో వృద్ధుల సంక్షేమం కోసం ఏపీ సీనియర్ సిటిజన్ చట్టాన్ని అమల్లోకి తీసుకొచ్చారు. దీని ద్వారా పోషించుకోలేని పరిస్థితుల్లో, సంపాదించుకోలేని స్థితిలో ఉన్న వారికి ఈ చట్టం కింద దరఖాస్తు చేసుకోవచ్చు ఫిర్యాదు చేసే విధానం.. తల్లిదండ్రులు నేరుగా వచ్చి ఫిర్యాదు చేయటమే కాకుండా స్వచ్ఛంద సంస్థల ద్వారా కూడా అధికారులను కలవొచ్చు. బిడ్డల అన్యాయాన్ని నేరుగా ట్రిబ్యునల్ (ఆర్డీవో స్థాయి అధికారి) దృష్టికి తీసుకెళ్లే అవకాశం ఉంది. ఫిర్యాదుదారుడు నివసించే స్థలం, గతంలో ఉన్న ప్రాంతం, పిల్లలు, బంధువులు నివసించే ప్రదేశాల్లో ఫిర్యాదు చేసే అవకాశం ఉంది. కావాలనే ఉద్దేశపూర్వంగా తల్లితండ్రులను వేధిస్తే...సెక్షన్ 25 ప్రకారం మూడు నెలల జైలు శిక్షతోపాటు రూ.5 వేలు జరిమానా వి«ధించే అవకాశాలు ఉన్నాయి. పోషిస్తామని చెప్పి ఆస్తులు రాయించుకున్న తరువాత వారిని విస్మరిస్తే.. ఆ పత్రాలు, దస్తావేజులు అప్పటికప్పుడు రద్దవుతాయి. -
పైపూతలే పరిష్కారమా?
కొత్త కోణం అత్యాచారాలు కేవలం వ్యక్తుల చేష్టలు మాత్రమే కావు. ఆ దుర్మార్గాలకు సమాజం నిండా ఆవరించి ఉన్న అహంకారం, పెత్తనం, ఆధిపత్యంలాంటి భావాలు అటువంటి వాటిని పెంచి పోషిస్తున్న సంస్థలు బాధ్యులు. రేపిస్టులకు శిక్షలూ, బాధిత కుటుంబాలకు న్యాయం అనే రెండూ సరైన డిమాండ్లే. కానీ అవే సమస్యకు సంపూర్ణ పరిష్కారం కావు. అత్యాచారాలకు వ్యక్తులు మాత్రమే కారణం కాదనీ, వాటిని ప్రేరేపిస్తున్న భావజాలానిదీ, రాజకీయాలదే ప్రధాన బాధ్యత అని గ్రహించినప్పుడు వ్యవస్థపైనే మనం యుద్ధం ప్రకటించగలుగుతాం. అప్పుడెప్పుడో 2012లో ఢిల్లీలో నిర్భయ మీద జరిగిన ఘటనపై దేశ వ్యాప్తంగా ఉద్యమాలు వెల్లువెత్తాయి. భవిష్యత్తుపై ఆశలు రేకెత్తించాయి. ఓ చట్టం తేవడంతోనో, లేదా వాళ్ళని ఉరితీయాలని కోరడంతోనో ఆగ్రహం చల్లారిపోతోంది. నిజానికి మనం ఏం కోరుకుంటున్నాం. తప్పు చేసిన వారికి శిక్ష పడాలనా? తప్పులు జరగకుండా ఉండాలనా? మనమంతా కోరుకునేది తప్పులు జరగకుండా ఉండడమే అయితే అసలు తప్పుకి కారణాలేమిటో వెతకాలి. దాని మూలాలను విశ్లేషించాలి. ఈ దేశంలో స్త్రీలపైనా, ప్రధానంగా పాపం పుణ్యం ఎరుగని పసిబిడ్డలపైనా జరుగుతున్న హింస, అత్యాచా రాలూ, హత్యలూ మానవత్వం మిగిలివున్న మనసులను, మనుషులనూ కలవరపెడుతున్నాయి. ఘటనలు జరిగినప్పుడు వెల్లువెత్తుతోన్న ఆగ్రహం, ఉద్యమాలు ఆ తరువాత చప్పున చల్లారిపోతున్నాయి. మళ్ళీ ఏదైనా ఘటన జరిగినప్పుడే మన గొంతు వినిపించేది. మనలో ఆందోళన కనిపించేది. మన లోని ఆగ్రహావేశాలు ఉద్యమరూపం దాల్చేదీ. ఈ నిరసనలన్నీ కూడా వ్యక్తుల దగ్గరే ఆగిపోతున్నాయి. వాళ్ల శిక్షలవరకే పరిమితమౌతున్నాయి. అంతగా అయితే బా«ధిత కుటుంబాలకు న్యాయం జరగాలన్న డిమాండ్ వరకూ కొన సాగుతున్నాయి. ఇవి రెండూ న్యాయమైన డిమాండ్లే, సరైనవే. కానీ అవే సమ స్యకి సంపూర్ణ పరిష్కారం కావు. భవిష్యత్‌లో జరగబోయే అఘాయిత్యాలకు యీ డిమాండ్లే విముక్తి పలకలేవు. అత్యాచారం వ్యక్తిగతం కాదు నిజానికి అత్యాచారాలకూ, హత్యలకూ పాల్పడుతున్న వారు వ్యక్తులు గానే కనిపించినప్పటికీ, కొన్ని వ్యవస్థలకీ, రాజకీయాలకీ ముడివడి వున్న విష యమిది. అందుకే ఆయా రాజకీయాలూ, ఆ భావజాలం కొన్నిసార్లు బహి రంగంగానే నిందితులకు అండగా నిలుస్తుంటాయి. ఈ దేశంలో చిన్నా పెద్దా తేడా లేకుండా వయసుతో నిమిత్తం లేకుండా అత్యాచారాలు జరగడానికీ, పసిబిడ్డలని కూడా చూడకుండా అత్యంత క్రూరంగా హత్యలకు సైతం ఒడి గట్టడానికీ, మతం, ప్రాంతం, భాష, పితృస్వామ్య భావజాలం కారణాలని పదే పదే రుజువవుతూ వస్తున్నది. జమ్మూలోని కథువా గ్రామంలో ఎనిమిదేళ్ల పసిపాపను ఒక ప్రార్థనా మందిరంలో బంధించి, కొన్ని రోజులపాటు పసికూనపై అత్యాచారం చేసి చివరకు అతిక్రూరంగా చంపేసిన దారుణం దేశంలో ప్రకంపనలు సృష్టిం చింది. ప్రపంచం మొత్తాన్ని కలవరపరిచింది. కానీ గతంలో ఎప్పుడూ లేన ట్టుగా ఈ దారుణాన్ని బహిరంగంగా నిస్సిగ్గుగా సమర్థించడం దేశంలో మారుతున్న సామాజిక, రాజకీయ పరిస్థితులకు ప్రత్యక్ష ఉదాహరణ. ఆ పసి పాపను∙అత్యాచారం చేసి, హత్య చేసిన వారి సామాజిక వర్గం నేతలు, చివ రకు బీజేపీ మంత్రులు, నాయకులు కూడా నిందితులను బహిరంగంగా సమ ర్థించారు. పైగా వారికి మద్దతుగా జెండాలు పట్టుకొని వీరావేశంతో వీ«ధుల్లో కెక్కారు. ఇట్లా ప్రవర్తించడం వెనుక మతపరమైన, రాజకీయపరమైన కారణా లున్నాయనేది నమ్మక తప్పని వాస్తవం. ఘాతుకానికి బలైన ఎనిమిదేళ్ల చిన్నారి ఆసిఫాను, మహమ్మద్ యూసుఫ్, ఆయన భార్య నసీమా బీబీ రెండేళ్ల వయస్సులో దత్తతకు తీసు కున్నారు. మహమ్మద్ యూసుఫ్ గొర్రెలను, మేకలను మేపుతూ బతుకుతు న్నాడు. పదేళ్ల నుంచి తువా జిల్లా రసనగ్రామంలో స్థిరపడ్డాడు. అయితే జమ్మూలో హిందువులదే మెజారిటీ. మహమ్మద్ యూసఫ్ లాంటి వాళ్ళు ఇక్కడ స్థిరపడితే, శ్రీనగర్లాగా జమ్మూలో కూడా ముస్లింల సంఖ్య పెరుగు తుందనే అనుమానం ఇక్కడి హిందువులలో ఉన్నది. అందుకుగాను మేకలు, గొర్రెలు మేపుకొని బతికే వారిలో భయాందోళనలు సృష్టించడానికి ఇటువంటి ఘాతుకానికి పాల్పడినట్టు అనుమానిస్తున్నారు. కామవాంఛ కాదు. నిజానికి ఒక సామూహిక విద్వేషం ఈ ఘాతుకానికి పురికొల్పింది. అలాగే ఉత్తరప్రదేశ్‌లోని ఉన్నావ్ ఘటన. పద్దెనిమిదేళ్ల దళిత యువతి ఉద్యోగం అడగడానికి స్థానిక ఎమ్మెల్యే కుల్దీప్ సెనేగర్ ఇంటికి వెళితే, అతను తనపై అత్యాచారం చేసినట్టు పోలీసులకు ఆమె ఫిర్యాదు చేసింది. కానీ పోలీసులు పట్టించుకోలేదు. మెజిస్ట్రేట్ ముందు ఆ విషయం చెప్ప కుండా పోలీసులు అడ్డుకున్న వాస్తవాన్ని కూడా ఆ యువతి బయటపెట్టింది. చివరకు న్యాయం చేయాలని అడగడానికి పోలీస్ స్టేషన్‌కు వెళ్ళిన ఆమె తండ్రిని ఎమ్మెల్యే సోదరుడు మరికొంత మంది తీవ్రంగా కొట్టి గాయపరిస్తే ఆయన ఆసుపత్రిలోనే మరణించారు. అత్యాచారానికి గురైన ఆ యువతి ముఖ్యమంత్రి ఇంటి ముందర ఆత్మహత్యాయత్నానికి పాల్పడడంతో పోలీ సుల్లో కదలిక వచ్చింది, దీంతో కేసు విచారణకు ఆదేశించారు. అనేక నిరస నలు, దేశవ్యాప్తంగా దళితుల ఆందోళనల వల్ల ఎమ్మెల్యేను అరెస్టు చేశారు. అత్యాచారానికి పాల్పడిన వాళ్ళు ఆధిపత్య కులానికి చెందినవారు కాబట్టే ఇటు పోలీసులూ, అటు ప్రభుత్వం నిమ్మకు నీరెత్తినట్టు ఉండిపోయారు. కుల, మతాధిపత్యమే ప్రధాన భూమిక మహారాష్ట్రలోని భండార జిల్లాలో జరిగిన ఖైర్లాంజి ఘటన కూడా అదే కోవ లోకి వస్తుంది. ఇక్కడ కూడా దళితులపైనే అఘాయిత్యం జరిగింది. ఆ గ్రామంలోని భయ్యాలాల్ బూత్ మాంగే కుటుంబాన్ని ఆ ఊరి పెత్తందార్లు నిర్మూలించారు. డోమబిమ్తే భార్య సురేఖ బూత్ మాంగే, కూతురు ప్రియాం కలపై సామూహిక అత్యాచారం జరిపి చంపేశారు. భయ్యాలాల్ తన భూమిని ఊరు పెత్తందారులు ఆక్రమించుకోవడాన్ని వ్యతిరేకించినందుకు అహం దెబ్బతిని అత్యంత దారుణంగా ఆ కుటుంబాన్ని చంపేశారు. ఇక్కడ కూడా కులాధిపత్యం వల్లే అత్యాచారం జరిగిందనేది వాస్తవం. యుద్ధంలో కూడా స్త్రీల శరీరాలపైనే శత్రువు ప్రథమ దాడి. అనేక యుద్ధాల్లో శత్రువు చేతికి చిక్కిన స్త్రీలను చెరచకుండా వదిలిపెట్టిన దాఖ లాలుండవు. చివరకు శ్రీలంక తమిళులపై అక్కడి సైన్యం పాల్పడిన అకృ త్యాలు మనం చూశాం. మగాళ్ళనైతే అతి క్రూరంగా చంపేయడం, ఆడవా ళ్ళంటేనే పురుషుడి ప్రతాపం చూపించుకొనే ఒక అవకాశంగా మారుతున్న స్థితి. నిజానికి అది భౌతిక వాంఛ కాదు. ప్రతీకారేచ్ఛ. ఆ వ్యక్తుల్ని పట్టుకొని చంపినా తీరని ప్రతీకారం వారి స్త్రీలపై అత్యాచారాలకు పాల్పడడంతో కసి తీరుతుంది. విశాఖ జిల్లా వాకపల్లిలో ఆగస్టు 20, 2007న గ్రేహౌండ్స్ పోలీ సులు పదకొండుమంది ఆదివాసీ మహిళలపై సామూహిక అత్యాచారానికి పాల్పడినట్టు పోలీసులు కేసు నమోదు చేశారు. 2007న జరిగిన ఘటనపై ఇంకా విచారణ పూర్తికాలేదు. దోషులపై చర్యలు తీసుకున్నదీ లేదు. ఈ ఉదంతం కూడా ప్రతీకారంతో జరిగిందే తప్ప మరొకటి కాదు. నక్సలైట్ల కోసం గాలింపు జరుపుతున్న సమయంలో పోలీసులు ఈ దారుణానికి ఒడి గట్టారు.. నక్సలైట్లకు ఎటువంటి సాయం అందకుండా చేయడంలో భాగంగా ఈ ఘటన జరిగింది. గతంలో కూడా నైజాంకు వ్యతిరేకంగా జరిగిన సాయుధ పోరాట సమయంలో సైతం ఎంతో మంది మహిళలపై సైన్యమే సామూహిక అత్యాచారాలకు పాల్పడినట్టు అనేక నివేదికలున్నాయి. ఈ అత్యాచారాలు కేవలం పగ, ప్రతీకారంతో జరుగుతున్నవే. కఠిన శిక్షలే సమస్యకు పరిష్కారమా? ఇటీవల ఢిల్లీ, ఉత్తర ప్రదేశ్లాంటిచోట్ల ఈశాన్య రాష్ట్రాల అమ్మాయిలపైన జరి గిన సామూహిక అత్యాచారాలే అందుకు ప్రత్యక్ష ఉదాహరణ. నవంబర్ 24, 2010న ఢిల్లీ ఔటర్ రింగ్‌రోడ్డు దగ్గర ఈశాన్య రాష్ట్రాలకు చెందిన అమ్మాయిని కిడ్నాప్ చేసి సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. మే 8, 2005న రోడ్డు పక్కన నడచివెళ్తుండగా మిజోరాంకు చెందిన ఢిల్లీ విశ్వవిద్యాలయానికి చెందిన అమ్మాయిని అపహరించి, కారులోనే అతిక్రూరంగా సామూహిక అత్యాచారం చేసారు. బెంగుళూరులో కూడా ఈశాన్య రాష్ట్రాలకు చెందిన విద్యార్థులపై దాడులు జరిగాయి. సిక్కింకు చెందిన 22 ఏళ్ళ యువతిపై ఢిల్లీ నుంచి గుర్గావ్ వెళ్తుండగా కారులో అత్యాచారం జరిపి ఢిల్లీలో పడేశారు. ఈశాన్య రాష్ట్రాల విద్యార్థులపై విద్వేషాన్ని రెచ్చగొట్టే విధంగా నేటికీ ప్రచారం జరుగుతున్నది. రెచ్చగొడుతోన్న విద్వేషం ఫలితమే ఇటువంటి ఘటనలు. గత డెబ్భై ఏళ్ల భారత స్వాతంత్య్ర చరిత్రలో మహిళల రక్షణ కోసం అనేక చట్టాలు వచ్చాయి. 2012 నిర్భయ చట్టం అందులో చాలా కఠినమైనది. తాజాగా కేంద్రం జారీచేసిన ఆర్డినెన్స్ మరింత శక్తివంతమైందని చెబుతు న్నారు. పన్నెండేళ్ళలోపు అమ్మాయిలపై అత్యాచారం జరిపిన వారికి మరణ దండన విధించేలా చట్టాలలో సవరణలు చేశారు. మరణశిక్ష ఇవ్వాళ భార త్లో కొత్తేమీకాదు. హత్యానేరాల్లో దానిని అమలు చేస్తున్నారు. కానీ హత్యలు ఏమేరకు తగ్గాయనేది ఆలోచించాలి. మరణశిక్షని చూసి మారిన వాళ్లెందరు? ప్రతి సంవత్సరం హత్యలు పెరుగుతున్నాయే తప్ప తగ్గడం లేదు. మరణ శిక్షలు లేని దేశంలో ఇంతకన్నా ఎక్కువగా హత్యలు జరుగుతున్నదీ లేదు. ఒకరకంగా చెప్పాలంటే ఈ రకమైన శిక్షలు వేస్తామని చట్టాలు చేయడం అసలు విషయాలపైన దృష్టిపోకుండా చూడటానికే. నిజానికి మన దేశంలో ఉన్న సామాజిక, సాంస్కృతిక పరిస్థితులను, ఆలోచనలను మార్చకుండా ఏ చట్టాలూ ఫలితాలను ఇవ్వవు. రాజకీయంగా విమర్శల నుంచి బయటపడేందుకు ప్రభుత్వాలు చేస్తున్న విన్యాసాలు మాత్రమే ఇవి. కులాలు, మతాలు, ప్రాంతాలు, భాషలు, రాజకీయ సిద్ధాం తాల విద్వేషాలను రెచ్చగొడుతున్న మనమే చట్టాలను పరిష్కారంగా చూపు తున్నాం. అందుకే ఈ దేశానికి కావాల్సింది శిక్షలు వేసే చట్టాలు మాత్రమే కాదు, మానవీయ భావాలను పెంచగలిగే శిక్షణ. తాము ఎక్కువ కులం మిగతావాళ్లు మాకన్నా తక్కువ, వాళ్లను ఏం చేసినా ఎవ్వరూ ఏమీ అనరనే అహంకారం, తాము మెజారిటీ ఇతరులు మైనారిటీలు అనే ఆధిపత్య భావన, తాము మగవాళ్లం ఆడవాళ్ల మీద మాకు సర్వాధికారాలూ ఉన్నాయనే ధోరణి అన్నిరకాల క్రూరత్వాలకు కారణం. అందుకే అత్యాచారాలు కేవలం వ్యక్తుల చేష్టలు మాత్రమే కావు. ఆ దుర్మార్గా లకు సమాజం నిండా ఆవరించి ఉన్న అహంకారం, పెత్తనం, ఆధిపత్యం లాంటి భావాలు అటువంటి వాటిని పెంచి పోషిస్తున్న సంస్థలు బాధ్యులు. ఇది గ్రహించినప్పుడే అత్యాచారాలకు వ్యక్తులే కారణం కాదనీ, వాటిని ప్రేరే పిస్తున్న భావజాలానిదీ, రాజకీయాలదే ప్రధాన బాధ్యత అని గ్రహించగలు గుతాం. అది అర్థం చేసుకుంటే అత్యాచారాలకు కారణమైన భావజాలాన్ని పెంచి పోషించే వ్యవస్థపైనే మన యుద్ధం ప్రకటించగలుగుతాం. - మల్లెపల్లి లక్ష్మయ్య వ్యాసకర్త సామాజిక విశ్లేషకులు ‘ 97055 66213 -
'ఆ పరిస్థితి హైదరాబాద్‌లో మరీ ఎక్కువ'
సాక్షి, హైదరాబాద్: 'చట్టాలను రూపొందించారు.. కానీ వాటిని అమలు చేయడం లేదు' అని తెలంగాణ ఐటీ మంత్రి కేటీఆర్ వ్యాఖ్యానించారు. అలాంటి పరిస్థితి గ్రేటర్ హైదరాబాద్‌లో మరీ ఎక్కువగా ఉందని ఆయన తెలిపారు. ఆయనిక్కడ శనివారం మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశారు. నగరంలో 300 స్క్వేర్ ఫీట్స్ నిర్మాణాల్లో ఇంకుడుగుంతలను తప్పకుండా నిర్మించాలని చెప్పారు. అందుకోసం ప్రభుత్వం ఆరునెలల పాటు స్పెషల్ డ్రైవ్ నిర్వహించనున్నట్టు వెల్లడించారు. స్పెషల్ డ్రైవ్ తర్వాత కూడా ఇంకుడుగుంతలు నిర్మించని వారిపై చర్యలు తీసుకుంటామన్నారు. ఈ విషయంలో ఉపేక్షంచేది లేదని.. అవసరమైతే అధికారులను కూడా బాధ్యులను చేస్తామని కేటీఆర్ తెలిపారు. -
ఫేస్‌బుక్‌కు స్ట్రాంగ్ వార్నింగ్
మాస్కో: ప్రముఖ సోషల్ నెట్వర్కింగ్ దిగ్గజం ఫేస్‌బుక్‌పై రష్యా సంచలన హెచ్చరిక జారీ చేసింది. నిబంధనలకు అనుగుణంగా వ్యవహరించకపోతే ఫేస్‌బుక్‌ను తమ దేశంలో నిషేధిస్తామని స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చింది. తమ చట్టాలను అతిక్రమిస్తే 2018లో తమ దేశంలో ఫేస్‌బుక్‌ను నిషేధిస్తామని రష్యా టెలికాం సంస్థ అల్టిమేటమిచ్చింది. ఈ మేరకు ఇప్పటివరకు తాము ఫేస్‌బుక్‌తో ఎలాంటి సంప్రదింపులు జరపలేదని కానీ, తమ దేశ చట్టాల నిబంధనలకు లోబడి అది పనిచేయాలని స్పష్టం చేసింది. టెలికం రెగ్యులేటరీ హెడ్ అలెగ్జాండర్ ఝరోవ్ స్థానిక మీడియాతో మాట్లాడుతూ ఈ హెచ్చరిక చేశారు. చట్టముందు అందరూ సమానమేనని, ఎలాంటి మినహాయింపులేవని స్పష్టం చేశారు. ఫేస్బుక్ తమ దేశ చట్టాలను అనుసరించేలా చేస్తామని తెలిపారు. 2018లో కచ్చితంగా ఇది జరుగుతుందని వెల్లడించారు. దీనికి సంబంధించి త్వరలోనే ఫేస్బుక్ తగిన నివారణ చర్యలు తీసుకోవాలన్నారు. లేదంటే లింక్డ్ఇన్ మాదిరిగానే రష్యాలోనిషేధిస్తామని ఝరోవ్ వెల్లడించారు. వ్యక్తిగత డేటా నిల్వపై రష్యా చట్టం 2015 సెప్టెంబరులో అమల్లోకి వచ్చింది. దీని ప్రకారం విదేశీ మెసేజింగ్ సర్వీసులు, సెర్చ్ ఇంజన్లు, సామాజిక మాధ్యమాల వెబ్సైట్లు రష్యన్ ప్రజల వ్యక్తిగత సమాచారాన్ని నిక్షిప్తం చేయడానికి కావాల్సిన విధివిధానాలను దీనిలో రూపొందించారు. దీని ప్రకారం ఆ దేశస్థుల అన్ని విషయాలను రష్యాలోని సర్వర్లలోనే నిక్షిప్తం చేయాలి. ఫేస్బుక్, ట్విట్టర్ తదితర సామాజిక మాద్యమాలు వినియోగదారుల సమాచారాన్ని వారి ప్రమేయం లేకుండానే తస్కరిస్తున్నాయని అక్కడి టెలికం సంస్థలు ఆరోపిస్తున్నాయి. 2016 అమెరికా ఎన్నికలకు సంబంధించిన ప్రకటనలపై రష్యన్లకు సంబంధమున్న ఖాతాలను ఉపయోగించారని ఫేస్బుక్వె ల్లడించిన కొన్ని రోజులు తరువాత రష్యా అధికారులు తాజా హెచ్చరికలను జారీ చేయడం గమనార్హం. -
సమ్మెటివ్‌పై రోజుకో ఉత్తర్వు
నల్లజర్ల : విద్యాశాఖలో భాగమైన ఎన్సీఈఆర్టీ ఉన్నతాధికారులు రోజుకోరకంగా తీసుకుంటున్న నిర్ణయాలు అటు ఉపాధ్యాయులు, ఇటు విద్యార్థుల్లో గందరగోళం సృష్టిస్తున్నాయి. పరీక్షల షెడ్యూల్ ప్రకటించిన తర్వాత బాహ్య మూల్యాంకనం (సమ్మెటివ్) విషయంలో తీసుకున్న నిర్ణయాలతో ఉపాధ్యాయులు తలలు పట్టుకుంటున్నారు. ప్రభుత్వ బడుల్లో చదువుతున్న 6,7,9 తరగతుల విద్యార్థుల వార్షిక పరీక్షల జవాబు పత్రాలను పాఠశాల స్థాయిలో మూల్యాంకనం చేయాలని, వీటిలో ఐదు శాతం మాత్రమే, 8వ తరగతి విద్యార్థుల జవాబు పత్రాలు పూర్తిగా మండల కేంద్రానికి పంపాలని ముందుగా ఉత్తర్వులిచ్చారు. అయితే దీనిని సవరిస్తూ 8, 9 తరగతుల జవాబు పత్రాలన్నింటినీ మండల కేంద్రానికి పంపాలని తాజాగా ఉత్తర్వులిచ్చారని ఉపాధ్యాయులు అంటున్నారు. ఇదే నిర్ణయం ముందే తీసుకుంటే ఉపాధ్యాయులకు వ్యయప్రయాసలు తప్పేవని చెబుతున్నారు. పరీక్ష పూర్తయిన వెంటనే జవాబు పత్రాలను ఏరోజుకారోజు మండల విద్యావనరుల కేంద్రానికి తీసుకెళ్లాల్సి ఉంటుంది. దీని వల్ల ఆచరణలో ఎదురయ్యే సమస్యలపై ఉన్నతాధికారులు దృష్టి పెట్టకపోవడంపై ఉపాధ్యాయవర్గాల నుంచి తీవ్ర వ్యతిరేకత వ్యక్తం అవుతోంది. విద్యాబోధన కన్నా బోధనేతర పనులే ఎక్కువైపోయాయని పిల్లలకు చదువు చెప్పడం కంటే కాగితాలపై రాతలకే గం టల సమయం తీసుకుంటున్నామని అంటున్నారు. పదో తరగతి పరీక్షల విధుల్లో చాలామంది ఉపాధ్యాయులు ఉండటంతో పాఠశాలల్లో ఉన్న కొద్దిమంది సమ్మెటివ్ ఉత్తర్వులతో సతమతమవుతున్నారు. -
కార్మిక చట్టాలు వర్తించకుండా కేంద్రం కుట్ర
– కార్పొరేట్ యజమానుల కనుసన్నల్లో ప్రభుత్వాలు – మంత్రి అచ్చన్నాయుడి ఆచూకీ చెబితే రూ.లక్ష బహుమతి – ఏఐటీయూసీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఓబులేశు మదనపల్లె: కార్మికులకు చట్టాలు వర్తించకుండా చేయాలని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కుట్రపన్నుతున్నాయని ఏఐటీయూసీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఓబులేశు ఆరోపించారు. ఆయన శుక్రవారం ప్రెస్‌క్లబ్‌లో విలేకరులతో మాట్లాడారు. చట్టంలో44 నిబంధనలు కార్మికులకు అనుకూలంగా ఉన్నాయని తెలిపారు. వాటిలో 40 నిబంధనలను పూర్తిగా సవరించి యజమానులకు అనుకూలంగా మారుస్తున్నారని ఆరోపించారు. జీవో నంబర్ 270 మున్సిపల్ కార్మికుల పని భద్రతకు భంగం కలిగించేలా ఉందన్నారు. ప్రభుత్వ రంగ సంస్థల్లో పనిచేస్తున్న కార్మికులకు భద్రత కల్పించాల్సి ఉందని, రాష్ట్రంలోని 1.70 లక్షల మందికి వేతన సవరణ చేసి రూ.18 వేలకు పెంచాలని డిమాండ్ చేశారు. కాంట్రాక్టు వ్యవస్థను ఫూర్తిగా రద్దుచేసి కార్మికులందరనీ పర్మినెంట్ చేయాలని కోరారు. రాష్ట్రంలో 63 షెడ్యూలులో పనిచేస్తున్న కార్మికులకు ఇప్పటి వరకూ జీతాలు పెంచిన దాఖలాలు లేవన్నారు. కార్పొరేట్ సంస్థల కనుసన్నల్లో ప్రభుత్వాలు నడవడం దురదృష్టకరమన్నారు. ముఖ్యంగా కార్మిక సంక్షేమం కోసం పనిచేయాల్సిన రాష్ట్ర మంత్రి అచ్చన్నాయుడు కనిపించకుండా పోయారని, ఆయన ఆచూకీ చెబితే రూ.లక్ష బహుమతిగా అందజేస్తామని దుయ్యబట్టారు. ఈ సమావేశంలో సీపీఐ నాయకులు కృష్ణప్ప, సాంబశివ, ఏఐటీయూసీ జిల్లా నాయకులుు మనోహర్‌రెడ్డి, మస్తాన్, నాయకులు హైదర్‌ఖాన్, గోపాల్ తదితరులు పాల్గొన్నారు. -
తిరిగి కడలి కడుపులోకి చిరుమీనాలు
ఒడిశా ముఠాలపై చర్యలకు పూనుకున్న అధికారులు అనుచితంగా వ్యవహరించిన కొందరు మత్స్యకార నేతలు కొత్తపల్లి : జిల్లాలోని తీరప్రాంతంలో తిష్టవేసి, సముద్రంలో చేపపిల్లలను వేటాడి, సీడ్‌గా అమ్ముకుంటున్న ఒడిశా ముఠాలపై మత్స్యశాఖ అధికారులు చర్యలకు ఉపక్రమించారు. ఆ ముఠాల కార్యకలాపాలపైనా, వారికి స్థానిక మత్స్యకార నాయకుల్లో కొందరు సహకరిస్తున్న వైనం పైనా సోమవారం ‘సాక్షి’లో ‘చిరు మీనాలపై పొరుగు వల’ శీర్షికన కథనం ప్రచురితమైన విషయం తెలిసిందే. కాగా కలెక్టర్ అరుణ్‌కుమార్ ఆదేశాల మేరకు మత్స్యశాఖ అధికారులు కొత్తపల్లి మండలం మూలపేట చిప్పలేరు వద్ద జరుగుతున్న చేపపిల్లల విక్రయూల్ని అడ్డుకున్నారు. వాటిని నిల్వ చేసిన ప్రాంతాల్లో దాడి చేసి, చేపపిల్లలను సముద్రంలో విడిచిపెట్టారు. ఒడిశా ముఠాలకు అండగా నిలుస్తున్న మత్స్యకార నాయకులు అధికారులను అడ్డగించడంతో పాటు వార్తాసేకరణకు వెళ్లిన విలేకరులను దుర్భాషలాడుతూ, కెమెరాలు లాక్కుంటూ దురుసుగా ప్రవర్తించారు. పోలీసుల రంగప్రవేశంతో వారు వెనక్కు తగ్గారు. ఈ సందర్భంగా మత్స్యశాఖ డీడీ కల్యాణ్ మాట్లాడుతూ జీవనోపాధికి మూలమైన చేపపిల్లలను =మత్స్యకారులే అమ్ముకోవడం బాధాకరమన్నారు. చేప పిల్లలను పట్టుకోవడం చట్టరీత్యా నేరమని, పూర్తిస్థాయిలో దర్యాప్తు చేసి నివేదికను కలెక్టర్‌కు అందిస్తామన్నారు. ఆయన వెంట ఏడీ కనకరాజు, స్థానిక మత్స్యశాఖాధికారి పవన్‌కుమార్ ఉన్నారు. అవగాహన సదస్సుల నిర్వహణ: ఎమ్మెల్యే వర్మ సొమ్ములకు ఆశపడి చేపపిల్లలను అమ్మడం నేరమని స్థానిక ఎమ్మెల్యే వర్మ అన్నారు. చేపపిల్లల అక్రమ తరలింపుపై సోమవారం పత్రికల్లో ప్రచురించిన కథనాలకు స్పందించిన ఎమ్మెల్యే వర్మ సోమవారం ఉదయం కలెక్టర్‌ను కలిసి ఫిర్యాదు చేశారు. అనంతరం ఆయన స్థానిక విలేకరులతో ఫోన్లో మాట్లాడుతూ కొందరు మత్స్యకారులకు అవగాహన లేక, కొందరు నాయకులు డబ్బులకు ఆశపడి చేపపిల్లల వేట, తరలింపులకు సహకరిస్తున్నా అది నేరమన్నారు. దీనిపై అవగాహన సదస్సులను ఏర్పాటు చే స్తామని చెప్పారు. -
చట్టాల్లో మార్పుతేవడమే సంస్కరణ లక్ష్యమా?
అవలోకనం చరిత్రలో ఎలాంటి మినహాయింపులూ లేకుండా విజయవంతమైన దేశాలన్నింటికీ రెండు పరిస్థితులు తోడయ్యాయని చెప్పాలి. మొదటిది ప్రభుత్వ జోక్యం. రెండోది నిత్య చలనశీలత. ప్రభుత్వం అనేది పెట్టుబడిదారీ, సోషలిస్టు, నియంతృత్వం లేదా ప్రజాస్వామ్యం.. ఎలాంటి స్వభావంతో ఉన్నదైనా కావచ్చు కాని అది కచ్చితంగా అర్థికరంగంలోని అన్ని అంశాల్లోనూ సరైనవిధంగా జోక్యం చేసుకోవాలి. గుజరాత్‌తో సహా భారత్‌లో ప్రభుత్వ వ్యవస్థ ఇక్కడే అనునిత్యం విఫలమౌతూ వస్తోంది. అగ్రరాజ్యం కావాలంటే భారత్‌కు అవసరమైన ది ఏమిటి? మొట్టమొదటిగా అది మహా శక్తి కావాలి. ప్రపంచ వ్యాప్తంగా తన ప్రభావాన్ని చూపగల సామర్థ్యంతో కూడిన సార్వభౌమాధికార ప్రభుత్వంగా భారత్, అంతర్జాతీయ సంబంధాల్లో తన్ను తాను నిర్వచించుకోవాలి. ఐక్యరాజ్యసమితి భద్రతా మండలిలో శాశ్వత సభ్యులైన యునెటైడ్ స్టేట్స్, చైనా, ఫ్రాన్స్, రష్యా, యునెటైడ్ కింగ్డమ్ లనే మనం మహాశక్తివంతమైన దేశాలుగా లెక్కించవచ్చు. భద్రతామండలిలో వీటికున్న వీటో అధికారం వల్లేకాక, వాటి సంపద, సైనిక శక్తి వల్ల కూడా ఈ ఐదు దేశాలూ ప్రపంచ ఘటనలపై ప్రభావం చూపగలవు. వీటిలోఫ్రాన్స్, యూకే వంటి కొన్ని దేశాల్లో సైనిక శక్తిని ఉద్దేశ పూర్వకంగానే తగ్గించుకుంటూ వస్తున్నారు. ఎందుకంటే దేశాల మధ్య ప్రస్తుతం యుద్ధం వచ్చే అవకాశం తక్కువ. ఈ అయిదు దేశాల తర్వాత సైనిక పరంగా కాకున్నా, ఆర్థికపరంగా ప్రపంచవ్యాప్తంగా ప్రభావితం చేసే రెండు దేశాలున్నాయి. అవి జర్మనీ, జపాన్. వీటి తర్వాత ఏమంత ప్రభావం చూపనప్పటికీ సంపద్వంతమైన చిన్న దేశాలు కొన్ని ఉన్నాయి. స్పెయిన్, సౌదీ అరేబియా, సింగపూర్, తైవాన్, ఇటలీ, చిలీ, ఆస్ట్రేలియా, నార్డిక్ దేశాలు (డెన్మార్క్, ఫిన్లాండ్, ఐర్లండ్, నార్వే, స్వీడెన్) ఈ జాబితాలో ఉన్నాయి. భారత్‌ను ఈ విభాగంలోని దేశాల్లో చేర్చవచ్చు. అధిక జనాభా క లిగిన దేశాలు కొన్ని సంపద్వంతమైనవి కావు. పైగా వనరుల లేమి కారణంగా ఇవి సైనికంగా శక్తివంతమైనవి కావు. ఇలాంటి దేశాల్లో దక్షిణాఫ్రికా, ఇండోనేషియా, బ్రెజిల్, నైజీరియా. నేను భారత్‌ను నైజీరియాతో పోల్చడం పాఠకులకు ఆశ్చర్యం కలిగించవచ్చు. కాని ఈ రెండు దేశాలూ ఒకే విధమైన తలసరి ఆదాయాన్ని కలిగివున్నాయి. అధిక జనాభాయే భారత్‌కు దాని వాస్తవ స్థితి కంటే మరింత యుక్తమైన దేశంగా గుర్తింపునిస్తోందనిపిస్తుంది. దీన్ని మరింత స్పష్టంగా చెప్పాలంటే, భారత వాస్తవ స్థూల దేశీయోత్పత్తి లేదా జీడీ పీ డాలర్ల విలువతో పోలిస్తే ఇటలీ జీడీపీ కంటే తక్కువ. కాని ఇట లీ జనాభా మాత్రం 60 మిలియన్లు (లేదా ఆరు కోట్లు) మాత్రమే. అంటే భారత జనాభాతో పోలిస్తే ఇటలీ జనాభా 20 రెట్లు తక్కువ, అంటే ఇటలీతో పోలిస్తే వ్యక్తిగతంగా భారత్ ఉత్పాదకత 5 శాతం కంటే తక్కువ మాత్రమే. ఇది కాస్త మంద్రస్థాయిలోనే కావచ్చు, పరిస్థితిని మనకు అనుకూలంగా మారుస్తోంది. కాబట్టి భారత్‌ను మహాశక్తిని చేయడానికి మనం చేయవలసింది ఏమిటి? దీంట్లో అతి చిన్న అంశం నా దృష్టిలో ఏమిటంటే ప్రభుత్వం చేయవలసిన పనే. ఆర్థిక వార్తాపత్రికలను మనం చూసినట్లయితే, వాటి ప్రధానాంశం సంస్కరణలే. పైగా భారత్ విజయబాట పట్టాలంటే ప్రభుత్వం సంస్కరణలను తీసుకు రావాల్సిందేనని ఒత్తిడి చేస్తున్నారు కూడా. సంస్కరణలు సాధారణంగా క్రమబద్ధీకరణను ఎత్తివేసి వాణిజ్యాన్ని సులభతరం చేస్తుంది. వాస్తవం ఏమిటంటే అనేక దేశాలు సంస్కరణలు మొదలుపెట్టేశాయి కాని అవేవీ మహా శక్తివంతమైన దేశాలు కాలేదు. ఉదాహరణకు సోవియట్ యూనియన్ ఒక నియంత్రిత ఆర్థిక వ్యవస్థ. అంటే ఆర్థిక వ్యవస్థకు సంబంధించిన ప్రతి విషయాన్ని ప్రభుత్వమే నిర్వహిస్తుందని అర్థం. కానీ ఆ దేశంలో ఏ సంస్కరణలూ ఉండేవి కావు. అయినప్పటికీ 1947 నుంచి 1975 వరకు సోవియట్లు ప్రతి సంవత్సరం డబుల్ డిజిట్ వృద్ధిని సాధిస్తూ వచ్చారు. అది కూడా భారత్ కంటే అత్యధిక తలసరి ఆదాయంతో వారు ఆ వృద్ధిని సాధించారు. అలాగే క్యూబా సైతం ఆర్థిక వ్యవస్థ క్రమబద్ధీకరణను రద్దు చేయలేదు కానీ ప్రపంచం మొత్తం మీద అత్యధిక మానవాభివృద్ధి సూచికలను (ఆరోగ్యం, విద్యా రంగాల్లో) నమోదు చేసింది. కాబట్టి ఆర్థికాభివృద్ధికి అవసరమైనది సంస్కరణలు మాత్రమే కాదని స్పష్టమవుతోంది. చరిత్రలో ఎలాంటి మినహాయింపులూ లేకుండా విజయ వంతమైన దేశాలన్నింటికీ రెండు పరిస్థితులు తోడయ్యాయని చెప్పాలి. మొదటిది ప్రభుత్వ జోక్యం. కాఠిన్యతను, తీవ్రతను తన గుప్పిట్లోకి తెచ్చుకునే ప్రభుత్వ సామర్థ్యంగా దీన్ని నేను నిర్వచిస్తాను. కాఠిన్యతను గుత్తకు తీసుకోవడం ఎలాగంటే, పౌరులందరూ స్వచ్ఛందంగా పన్నులు చెల్లించేలా చేయడం, న్యాయాన్ని, సేవలను సమర్థవంతంగా బదలాయించడం. ప్రభుత్వం పెట్టుబడి దారీ, సోషలిస్టు, నియంతృత్వం లేదా ప్రజాస్వామ్యం.. ఎలాంటి స్వభావంతో ఉన్నదైనా కావచ్చు కాని అది కచ్చితంగా అన్నింట్లోనూ తల దూర్చాలి. గుజరాత్‌తో సహా భారత్‌లో ప్రభుత్వ వ్యవస్థ ఈ అన్ని అంశాల్లో నిత్యం విఫలమౌతూ వస్తోంది. రెండోవిషయం సమాజంలో కాయపుష్టి, చలనశీలత. ప్రగతిశీలమైన ఏ సమాజమైనా కొత్త విషయాలను కనిపెట్టే సామర్థ్యంతోపాటు దాతృత్వాన్ని, పరోపకార తత్వాన్ని కలిగి ఉంటుంది. ఇది చాలా సంక్లిష్ట విషయం కాబట్టి మరోసందర్భంలో దీనిపై రాస్తాను. ఇక మొదటి విషయానికి సంబంధించి చూస్తే, సులభంగా చె ప్పాలంటే ఇది చట్టాలు లేదా చట్టాలలో మార్పులకు సంబంధించినది కాదు. క్లుప్తంగా చెప్పాలంటే ఇది సంస్కరణకు సంబంధించింది కాదు. అది పాలనకు సంబంధించింది. ఇది అమలు చేయడంలో ప్రభుత్వ సమర్థతకు సంబంధించింది. ఇది లేకుండా చట్టంలో మార్పులు ఏమీ చేయలేవు. అందుకనే ప్రధాని నరేంద్రమోదీ మలేసియాలో ఇచ్చిన ప్రసంగం నాలో ఆసక్తిని కలిగించింది. అక్కడ ఆయన చెప్పిన ప్రధానాంశాలు ఇవి. ‘సంస్కరణకు అంతం లేదు. సంస్కరణ అంటే గమ్యం చేరడానికి చేసే సుదీర్ఘ ప్రయాణంలో తగిలే స్టేషన్ మాత్రమే. భారత పరివర్తనే గమ్యం.’ తాను 2014లో ఎన్నికల్లో గెలిచినప్పుడు భారత్ అత్యంత అధిక స్థాయిలో ద్రవ్య, కరెంట్ ఖాతా లోటుకు సంబంధించి తీవ్రమైన సవాల్‌ను ఎదుర్కొనేదని మోదీ తన ప్రసంగంలో చెప్పారు. ‘సంస్కరణలు అవసరమనేది స్పష్టమే. మాకు మేముగా ఒక ప్రశ్న వేసుకున్నాం. సంస్కరణలు దేనికి? అంచనా వేసిన జీడీపీ వృద్ధిని పెంచడానికి మాత్రమేనా? లేదా సమాజంలో మార్పును తీసుకురావ డానికా? నా సమాధానం స్పష్టమే. మనం పూర్తిగా మారేందుకు సంస్కరణకు అవకాశం ఇవ్వాలి,’ అని ప్రధాని అన్నారు. ప్రధాని ఈ అంశాన్ని సరైన రీతిలో చెప్పగలిగారని నాకు అనిపిస్తోంది. అయితే సమాజాలు వెలుపలి నుంచి ప్రభుత్వం ద్వారా పరివర్తన చెందవని, అంతర్గతంగా సాంస్కృతికపరంగానే అవి మార్పు చెందుతాయన్నది నా అభిప్రాయం. కాకుంటే, ప్రధాని మాటల్లో చెప్పినంత స్పష్టతను వాటి అమలు విషయంలో కూడా ప్రదర్శించగలిగితే చూడ్డానికి అది మనోహరంగా ఉంటుందనడంలో సందేహమే లేదు. (వ్యాసకర్త కాలమిస్టు, రచయిత aakar.patel@icloud.com) ఆకార్ పటేల్ -
'మార్కెట్' లో కొనుక్కోవాలా?
తాము చేసిన చట్టాలను ప్రజలంతా పాటించాలని ఆశించే ప్రభువులు ఆ చట్టాలు జనానికి తెలిసే భాషలో సులువుగా దొరికే రీతిలో అందుబాటులోకి తేవలసి ఉంటుంది. విశ్లేషణ 1860లో వచ్చిన భారతీయ శిక్షాస్మృతిని చాలాసార్ల్లు సవరిం చారు. నిర్భయ దుర్మా ర్గం జరిగిన తరువాత ఐపీసీలో ఆత్మరక్షణ నియమాలను సవరిస్తూ తాజా చట్టం చేశారు. యాసిడ్ దాడులు, రేప్ ప్రయత్నాలను ప్రతిఘటించడానికి హత్య చేసినా ఆత్మరక్షణ మినహాయింపు వర్తిస్తుందని ఈ కొత్త సవరణ వివరిస్తున్నది. కొన్ని కొత్త నేరాలను కూడా ఐపీసీలో చేర్చారు. లైంగిక దాడుల కేసులను రిజిస్టర్ చేయకపోవడం నేరం అని శిక్ష నిర్దేశించారు. బాధితులు ఈ చట్టం ప్రకారం ఆత్మ రక్షణ హక్కు వినియోగించుకోవాలంటే, ఫిర్యాదు చేయాలంటే ఈ సమాచారం అందరికీ అందుబాటులో ఉండాలి. కాని అసలు చట్టమే అందుబా టులో లేకపోతే పౌరులకు ఏవిధంగా తెలుస్త్తుంది, ఏవిధంగా ఆత్మరక్షణ చేసుకుంటారు? సివిల్ ప్రొసీజర్ కోడ్ కూడా వందసార్లకు పైగా సవరణలకు గురైంది. అధికారికంగా సమ గ్రమైన, సవరించిన చట్టం కాపీ అందుబాటులో లేదు. ఇంతెందుకు భారత రాజ్యాంగం పరిస్థితి కూడా అంతే. వందసార్లు సవరణ జరిగిన ఈ కీలక జాతీయ శాసనం ప్రతి తుదిరూపం అందు బాటులో లేదు. డబ్బు పెట్టి కొనుక్కుంటే తప్ప. ఫలానా సెక్షన్‌ను సవరించిన చట్టం ఉంటుంది కాని. సవరించిన సెక్షన్ ప్రజలకు అందు బాటులో ఉండదు. ప్రైవేటు ప్రచురణకర్తలు పుస్తకాల మీద వ్యాపారం చేసేవాళ్లు సవరణలతో కూడిన అసలు చట్టాలను ప్రచురించి వందల రూపాయలకు అమ్ముతున్నారు. వ్యాఖ్యానాలు లేని కేవలం చట్ట పాఠం ఇదివరకు పది పాతిక రూపాయలకు అమ్మితే ఈ రోజు వంద రూపా యలు మించి అమ్ముతున్నారు. ప్రజలు పాటించి విధేయంగా ఉండవలసిన చట్టం కొనుక్కుంటే తప్ప దొరకదు. చట్టాలలో ఎవరికీ కాపీరైట్ ఉం డదు. చట్టాలు ఉచితంగా సులువుగా తెలుసుకునే అవకాశం ఉండాలి. పౌరులకు తమ ప్రభుత్వం చేసిన చట్టాలేమిటో తెలుసుకునే హక్కు ఉంది. చట్టాలను అందుబాటులో ఉంచాల్సిన బాధ్యత ప్రభుత్వంపైన ఉంది. ఫలానా చట్టం ఉందని నాకు తెలియదు అని నిందితుడు చెప్పుకునే అవ కాశాన్ని ఇవ్వడం లేదు. కనుక వారికి చట్టం గురించి చెప్పవలసిన బాధ్యత ఉంటుంది. జాతీయ న్యాయ విశ్వవిద్యాలయ విద్యార్థి ఒకరు క్రైస్తవ వివాహ చట్టం గురించి అధ్యయనం చేయవలసివచ్చింది. ఇది బ్రిటిష్ కాలపు చట్టం. ఎక్కడా దొరకలేదు. ప్రభుత్వం వారి దగ్గర కూడా లేదు. ఇండియా కోడ్ వెబ్సైట్లో ఉంది కాని అది చదవడానికి అనుకూలంగా లేదు. వాక్యాలు కలుపుకోవాలన్నా కొన్ని రోజులు పడుతుంది. ప్రైవేట్ పబ్లిషర్ల దగ్గర ఈ ప్రచురణ లేదు. క్రైస్తవ మహిళల హక్కులకు సంబంధించిన నియమాలు ఏమిటో తెలియకుండా ఆ హక్కుల రక్షణ సాధ్య మవుతుందా? కనుక ఆయన కాపీ కావాలని కేంద్ర న్యాయ శాఖను ఆర్టీఐ కింద అభ్యర్థించారు. కాని న్యాయమంత్రిత్వ శాఖ పీఐఓ ఏం చేయ గలరు? ఆ చట్టాన్ని వెతికి పట్టుకోవడం ఎడిట్ చేసి వెబ్సైట్లో పెట్టడం ఖర్చుతో కూడుకున్న పని. అదే జవాబు ఇచ్చారాయన. కాని పీఐఓ పబ్లిక్ అథారిటీకి ప్రతినిధి, వ్యక్తిగతంగా ఆయన చేతిలో పరిష్కారం లేనందువల్ల సమాచారం ఇచ్చే బాధ్యత నుంచి మినహాయింపు లభించదు. చట్టం ప్రతిని కచ్చితంగా పబ్లిక్ అథారిటీ ప్రజ లకు ఇవ్వవలసిందే. దీనికి ఏవిధమైన మినహా యింపూ సమాచార హక్కు చట్టంలో లేదు. దీని వల్ల ప్రైవేటు ప్రచురణ వ్యాపారులను ప్రోత్సహిం చడమేకాకుండా చట్టాలు సామాన్యులకు అందు బాటులోకి రావు. తాముచేసిన చట్టాలను ప్రజలం తా పాటించాలని ఆశించే ప్రభువులు ఆ చట్టాలు జనానికి తెలిసే భాషలో సులువుగా దొరికే రీతిలో అందుబాటులోకి తేవలసి ఉంటుంది. అన్ని చట్టాలను అప్డేట్ చేసి అందుబా టులో ఉంచే కార్యక్రమాన్ని తమ మంత్రిత్వశాఖ చేపట్టిందని సీపీఐఓ వివరించారు. ఇందుకు గాను ఇద్దరు ఇంగ్లిష్, మరో ఇద్దరు హిందీ సంప్రదింపు దారులను నియమించారు. అధికారులు కూడా చట్టాలను చదువుతున్నారు. నవీకరిస్త్తున్నారు. సవరణలను పొందుపరుస్తున్నారు. ఆంగ్లంలో చట్టాల నవీకరణ త్వరగా పూర్తవుతుంది. హిందీ నవీకరణ ఎక్కువ సమయం తీసుకుంటుంది. ప్రస్తుతం 2014 సంవత్సరం చట్టాల నవీకరణ పూర్తి చేస్తున్నారు. ఈ విధంగానే వెనుకటి సంవ త్సరాల చట్టాలకు సవరించిన తాజాప్రతులను తయారు చేయడం కొనసాగుతున్నదని పీఐఓ వివరించారు. ఈ చట్టాల సమాచారాన్ని ఇవ్వడం సెక్షన్ 4(1)(బి) కింద ప్రభుత్వ బాధ్యత. అడిగినా ఇవ్వకపోవడం చట్టం ఉల్లంఘన అవుతుంది. కనీసం అడిగిన ఈ చట్టాన్ని సవరించడానికి నెల రోజుల సమయం ఈ మంత్రిత్వ శాఖకు సరిపోక పోవడం సమంజసం కాదు. నెల కాకపోయినా కనీసం రెండు నెల్లకో ఏడాదిలోగానో ఇస్తే బాగుం డేది. కాని నాలుగేళ్లయినా ఇప్పటికీ ఇవ్వలేదు. అడిగిన విద్యార్థి నేషనల్ లా స్కూల్ ఆఫ్ ఇం డియా యూనివర్సిటీ నుంచి బంగారు పతకా లతో సహా డిగ్రీ తీసుకుని వెళ్లిపోయారు. ఇప్పుడు అతనికి అవసరం లేదు. కాని లా విద్యార్థులంద రికీ అవసరం. మంత్రిత్వ శాఖ ఆ యూనివర్సిటీకి పది వేల రూపాయల పరిహారం చెల్లించాలని ఆదే శించక తప్పలేదు. (CIC_SS_C_2013_900008-SA లో నా తీర్పు ఆధారంగా) (వ్యాసకర్త కేంద్ర సమాచార కమిషనర్ మాడభూషి శ్రీధర్) professorsridhar@gmail.com -
ఒకే తెరపై ఇద్దరు విలక్షణ నటులు
-
సందీప్ కిషన్ సరసన సమంత?
-
చట్టమే నీరుగారితే... భద్రతకు ముప్పే!
చట్టాల తీరు, శిక్షల అమలు అధ్వానంగా ఉండటం వల్లే మన రోడ్లపై అరాచకం రాజ్యమేలు తోందని సుప్రీంకోర్టు మందలిస్తున్న సమయంలోనే ఓ కొత్త చట్టం ఊపిరి పోసుకొంటోంది. రోడ్డు భద్రత చట్టం ముసాయిదాను కేంద్రం వెలువరించింది. ప్రతిపాదిత శిక్షల్ని, కఠిన నిబంధనల్నీ తాజాగా సరళతరం చేసి, చట్టం పుట్టక ముందే దాన్ని నీరుకార్చేస్తోంది. సరిగ్గా సుప్రీం హెచ్చరించిన ‘చట్టమంటే భయం లేనితనాన్ని’ అది మరింత పెంచేట్టుంది. ఇక పౌర సమాజం చైతన్యంతో నియంత్రణ వ్యవస్థల్ని అంకుశంతో అదిలిస్తే గాని భద్రతకు హామీ లేదు. ఏడాదికోసారి వారోత్సవాలు నిర్వహించడం తప్ప రోడ్డు భద్రతపై మన ప్రభుత్వాలు చేపడుతున్న కార్యాచరణేదీ లేదు. చిత్తశుద్ధి అంతకన్నా లేదు. రోడ్డు ప్రమాదాల్ని తగ్గించి నిండు ప్రాణాల్ని కాపాడుకోవాల్సిన ఆవశ్యకత పైనా, అందుక్కావాల్సిన భద్రతా చర్యలపైనా సామాజిక చైతన్యం మన దేశంలో అంతంత మాత్రమే! ‘నిండు ప్రాణాలు బలి’,‘ నెత్తురోడుతున్న రహదారులు’, ‘అసువులు బాసిన కుటుంబం’ అని టీవీల్లో, పత్రికల్లో పతాక శీర్షికల్లో నిత్యం చూస్తూనే ఉంటాం. నిండు జీవితాలు అలా గాల్లో కలిసిపోవ డం... ఒక రోజు వార్తగానో, నాలుగు రోజుల దర్యాప్తుగానో, కారకులైన వారికి కొన్నాళ్ల శిక్షలుగానో మారి రికార్డుల్లో జమవుతున్నాయి. అంతేగానీ సమస్యకు పరిష్కారం మాత్రం లభించడం లేదు. మళ్లీ అవే ప్రమాదాలు, మరణాలు. వాహనాలు నడిపేవారి అలవిమాలిన అలక్ష్యం, అస్తవ్యస్థమైన రోడ్లు, నిద్రాణమైన వ్యవస్థలు, నీరుగారుతున్న దర్యాప్తులు, ప్రభావమే చూపక పలుచబారుతున్న చట్టాలు-శిక్షలు... వెరసి రోడ్డు భద్రత కేవల నినా దంగా మిగిలిపోతోంది. పైగా, కాలానుగుణంగా చట్టాలను మార్చుకుంటూ ఎప్పటికప్పుడు పదునెక్కించుకోవాల్సిందిపోయి, ప్రభుత్వాలే నీరుగారుస్తు న్నాయి. ఫలితంగా తప్పు చేసే వారికి భయమే లేకుండా పోతోంది. చట్టాల తీరు, శిక్షల అమలు ఇంత అధ్వానంగా ఉండటం వల్లే మన రోడ్లపై అరాచకం రాజ్యమేలుతోందని అత్యున్నత న్యాయస్థానం సోమవారం మందలిస్తున్న సమయానికే... ఒక కొత్త చట్టం ఊపిరి పోసుకోవడం మొదలైంది. కేంద్ర ప్రభుత్వం రోడ్డు భద్రత చట్టం ముసాయిదా ప్రతిని ప్రకటించింది. ఈ పార్లమెంటు సమావేశాల్లోనే దీన్ని చట్టంగా తీసుకురానున్నారు. దురదృష్ట మేమంటే, సరిగ్గా సుప్రీంకోర్టు మందలించిన ‘భయం లేకుండా పోవడాన్ని’ ప్రతిపాదిత చట్టం మరింతగా పెంచడానికి ఉద్దేశించినట్టుంది. ముందు ప్రతిపాదించిన శిక్షల్ని, కఠిన నిబంధనల్నీ ఈ తుది ముసాయిదాలో మరింత సరళతరం చేసి, చట్టం పుట్టకముందే ప్రభుత్వం దాన్ని నీరుకార్చేసిన తీరు దుర్మార్గం. శిక్షల్ని తగ్గించి ప్రభావమే లేకుండా చేశారని నిపుణుల అభిప్రా యం. డ్రైవర్లు ఒక్కొక్కరికీ నీతులు నేర్పి రోడ్డు ప్రమాదాల్ని నివారించలే మని, తప్పు చేస్తే శిక్షలు కఠినాతి కఠినంగా ఉంటాయనే సంకేతాల వల్ల కలిగే భయం మాత్రమే పరిస్థితిని నియంత్రించగలదని వారి భావన. ఇది ఇలాగే ఆమోదం పొందితే... నిర్లక్ష్యంతో, మితిమీరిన వేగంతో, నిద్రావస్థలో, మత్తులో జోగుతూ వాహనాల్ని నడిపి ప్రమాదాలకు కారకులవుతున్న వారికి ఇక చట్టమన్నా, శిక్షలన్నా భయమే ఉండదనే భావన వ్యక్తమౌతోంది. సుప్రీం ఆగ్రహాన్ని పట్టించుకోరా? తాగి వాహనాలు నడిపేవారు, నిర్లక్ష్యంగా డ్రైవింగ్ చేసేవాళ్ల ఇష్టారాజ్యమైపో యింది. వాళ్లు రోడ్ రాజాలయ్యారు. భారత శిక్షాస్మృతి (ఐపీసీ) 304 ఎ, కోర్టుల ఉదాసీన వైఖరి కలిసి చట్టమంటే భయమే లేని స్థితిని తీసుకు వచ్చా యని సుప్రీం ధర్మాసనం ఆగ్రహించింది. ప్రస్తుత చట్టాన్ని వెంటనే మార్చి, శిక్షల్ని మరింత కఠినతరం చేయాలని, శిక్షా కాలాన్ని పెంచాలనీ ఆదేశించింది. ‘మేమెంతో వేదనతో ఈ మాటలంటున్నాం. చట్టాలు చేసే పాలకులు లోతుగా ఆలోచించాలి, ఆ మేరకు చట్టాన్ని సవరించాలి. చట్టమంటే భయంలేని విచ్చలవిడితనమే ప్రమాదాలకు ప్రధాన కారణం...’ అని ధర్మాసనం పేర్కొంది. రోడ్డు ప్రమాదంతో ఇద్దరి మరణానికి కారణమయ్యాడని సౌరభ్ భక్షికి పాటియాలా కోర్టు విధించిన ఏడాది జైలు శిక్షను నష్టపరిహారం చెల్లించాడనే కారణంతో హైకోర్టు 24 రోజులకు తగ్గించడాన్ని సుప్రీం తప్పుబట్టింది. కోర్టు అభిప్రాయాల స్పూర్తికి పూర్తి విరుద్ధంగా కొత్త చట్టపు ముసాయిదా సిద్ధమైంది. మితిమీరిన వేగానికి అంతకు ముందరి ప్రతిపాదన ల్లోని రూ. 5,000 నుంచి రూ. 12,500 వరకు ఉన్న జరిమానాను తాజాగా రూ. 1,000 నుంచి 6,000 కు పరిమితం చేశారు. తాగి వాహనం నడిపి ప్రమాదం చేస్తే, రూ 30 వేల జరిమానా, 12-18 నెలల జైలు శిక్ష, 18 నెలల వరకు డ్రైవింగ్ లెసైన్సు రద్దు శిక్షను మొదట్లో ప్రతిపాదిస్తే, దాన్ని రూ.10,000-రూ.20,000 వరకు జరిమానా, 6 మాసాల వరకు జైలు, 6 మాసాల వరకు డ్రైవింగ్ లెసైన్సు రద్దుకు తగ్గించారు. వేగంగా, నిర్లక్ష్యంగా వాహనం నడిపి పిల్లల మృతికి కారణమైన వారికి రూ. 3 లక్షల వరకు జరి మానా, ఏడేళ్ల వరకు జైలు శిక్ష ప్రతిపాదనను రూ. 50 వేల వరకు జరిమానా, ఏడాది వరకు జైలు శిక్షగా సరళతరం చేశారు. చట్టాల్ని కఠినతరం చేసి శిక్షల్ని పెంచమని సుప్రీం పార్లమెంటును ఆదేశిస్తే, పూర్తి విరుద్ధమైన ముసా యిదాను పార్లమెంటు ముందుకు తేవడంపై తీవ్ర విమర్శలు రేగుతున్నాయి. నరకానికి నకళ్లు మన రోడ్లు అంతర్జాతీయ అధ్యయనాల ప్రకారం 90% పైగా రోడ్డు ప్రమాదాలు మితి మీరిన వేగం, నిర్లక్ష్యం, మద్యం సేవించి నడపడం మానవ తప్పిదాల వల్ల జరుగుతాయి. ఇవిగాక మానవతప్పిదాలకు దారితీస్తున్న ఇతరేతర అంశాల్లో రోడ్ల పరిస్థితి, వాహన దుస్థితి, చట్టాలు-నియంత్రణ వ్యవస్థలు ప్రభావశీ లంగా లేకపోవడం వంటివి కారణాలు. గత దశాబ్దకాలంలో పరిస్థితి కొంత మెరుగైనా దేశంలోనూ, రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ రోడ్ల పరిస్థితి దయనీ యంగానే ఉంది. నాలుగు, ఆరు లేన్ల రోడ్లుగా అభివృద్ధి పరచిన జాతీయ రహదారులను, కొన్ని రాష్ట్ర ప్రధాన రహదారులు మినహాయిస్తే మెజారిటీ రోడ్లు ప్రమాదరహిత స్థితిలో లేవు. అవిభక్త రాష్ట్రంలో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన రాజీవ్ రహదారి (హైదరాబాద్-కరీంనగర్)ని విస్తరించినా... పట్టణాలు, పెద్ద గ్రామాల్ని తప్పించే బైపాస్‌లు లేకపోవడం ప్రమాదాలకు కారణమౌతోంది. ఆరు లేన్ల రోడ్డుగా (హైదరాబాద్-రామగుండం) అభివృద్ధి పరిచాక తగ్గాల్సిన రోడ్డు ప్రమాదాలు ఈ కారణంగానే ఇక్కడ గణనీయంగా పెరిగాయి. అనంతపురం జిల్లా పెనుకొండలో ఇటీవల ద్విచక్రవాహనాలు మాత్రమే తిరగడానికి పనికివచ్చే మట్టి రోడ్డులో ఆర్టీసీ బస్సు గోతిలో పడి 16 మంది మరణించారు. అభివృద్ధి గురించి ఊదరగొట్టిన తర్వాత కూడా, ఏపీ లోని 13 జిల్లాల్లో 29% గ్రామాలకు ఇప్పటికీ ఆర్టీసీ బస్సు సదుపాయం లేదని అసెంబ్లీ సాక్షిగా ప్రభుత్వమే అంగీకరించింది. రెండేళ్ల కింద ప్రపంచ బ్యాంకొక మంచి ప్రతిపాదన చేసింది. హైదరాబాద్-బిజాపూర్, రేణి గుంట-కడప అనే రెండు రహదారుల్ని ప్రయోగాత్మకంగా చేపట్టి, 50 కిలో మీటర్లకొక ప్రమాద చికిత్సా (ట్రామా) కేంద్రం ఏర్పాటు, తరచూ ప్రమా దాలు జరిగే బ్లాక్స్పాట్లలో ప్రత్యేక చర్యలు, నిరంతర మొబైల్ పెట్రోలింగ్, ఆర్టీయే, పోలీస్, ఆరోగ్య, ఆర్ అండ్ బీ శాఖల మధ్య సమన్వయం, ప్రపంచ ప్రమాణాలతో రోడ్లు ఏర్పాటు చేసి నిర్వహించాలని అది ప్రతిపాదించింది. ప్రమాదాలు తగ్గి పరిస్థితి ఆశావహంగా ఉంటే, ఈ పద్ధతిని విస్తరించాలని యోచన. కొంత వ్యయాన్ని భరించడానికి ప్రపంచ బ్యాంకు ముందుకు వచ్చినా, మన ప్రభుత్వాలు ఇంకా ఈ పథకానికి ఓ స్వరూపం తేలేదు. ప్రమాదాలకు గురైన వారి కోసం ట్రామా సెంటర్ల ఏర్పాటు, డ్రైవర్లకు శిక్షణ, వాహనాలపై అదుపు, నిఘా, నియంత్రణ వ్యవస్థల్ని సక్రమంగా నడపడం వంటి విషయాల్లో ప్రభుత్వ నిర్లక్ష్యం తారస్థాయిలో ఉంటోంది. లోపాలతో మొదలై...లోపంతోనే ముగుస్తుంది! దేశంలో ఏటా లక్షన్నర మందికిపైగా రోడ్డు ప్రమాదాల్లో మరణిస్తున్న దుస్థి తికి రోడ్ల తర్వాత డ్రైవర్లు ప్రధాన కారణం. వృత్తి నైపుణ్య లోపం, ట్రాఫిక్ నిబంధనల పట్ల అవగాహన లేమి, తగిన విశ్రాంతి లేకుండా, విపరీతమైన ఒత్తిళ్ల మధ్య పనిచేయడం వంటివి ప్రమాదాలు చేయడానికి కారణం. లెసైన్సుల జారీ విధానమే అత్యంత లోపభూయిష్టంగా ఉంది. సరైన అర్హత పరీక్షల్లో ఉత్తీర్ణులు కాకుండానే లెసైన్సులు పొందుతున్న డ్రైవర్లకు లెక్కే లేదు. రెండు వేలో, మూడు వేలో ఇస్తే డ్రైవింగ్ ట్రాక్‌కు వెళ్లకుండాబ్రోకరే ఇంటికి లెసైన్స్ తెచ్చిచ్చే పరిస్థితి ఉంది. దీనికి తోడు డ్రైవర్ల జీతభత్యాలు అంతంత మాత్రం, పనిగంటలు విపరీతం! డ్రైవర్లకు సంబంధించి మోటారు వాహన చట్టం నిబంధనలు గాలికి పోతాయి. సల్మాన్‌ఖాన్ కేసులో లాగా ‘సల్మాన్ కాదు, నేనే వాహనాన్ని నడిపాన’ని కొత్త డ్రైవర్ తెర మీదికి వచ్చినా ఏమీ చేయలేని దుస్థితి. చట్టప్రకారం డ్రైవర్లు రోజుకు ఎనిమిది గంటలు అదీ కూడా మధ్యలో రెండు గంటల విశ్రాంతితో మాత్రమే పనిచేయాలి. కానీ, పది, పన్నెండు, ఇరవై గంటలు ఏకబిగిన వాహనాలు నడిపే డ్రైవర్లు, నడిపించే యజమానులున్నారు. వారానికి 48 గంటలకు మించి డ్రైవింగ్ చేయొద్దనే నిబంధన ఉన్నా అదీ అమలు కాదు. ప్రమాదాలకు కారణాలు, డ్రైవర్ మాన సిక, శారీరక స్థితిగతులపై శాస్త్రీయ అధ్యయనాలే ఉండవు. ప్రమాదాలకు కారకులైన వారి స్థితిని విశ్లేషించి తగు నివారణ చర్యలు తీసుకోవాలి. అలా తప్పిదాలకు పాల్పడ్డవారు తిరిగి తప్పు చేయకుండా జాగ్రత్త పడటానికి కఠినమైన నిబంధనలు, శిక్షలుండాలి. అవి సరిగ్గా అమలుకాకకపోవడంతో తిరిగి ప్రమాదాలు చేస్తున్న డ్రైవర్ల సంఖ్య కూడా ఎక్కువగానే ఉంటోంది. ట్రామా సెంటర్లు లేకపోవడం ఓ పెద్ద లోపం నిజమైన నరకం ప్రమాదం జరిగిన తర్వాత ఉంటుంది. అభివృద్ధి చెందిన దేశాలతో పోల్చి చూస్తే, తక్కువ తీవ్రమైన ప్రమాదాలు జరిగినా మరణాల సంఖ్య ఇక్కడ ఎక్కువ. ప్రమాదం జరిగిన వెంటనే, అక్కడ హెలికాప్టర్లలో కూడా బాధితుల్ని దగ్గర్లోని ప్రమాద చికిత్సా కేంద్రాలకు చేరుస్తారు. సత్వర వైద్యం ద్వారా బాధితుల ప్రాణాల్ని కాపాడగలిగే అవకాశాల్ని మనం చేజార్చుకుంటున్నాం. లేకుంటే, మరణాల సంఖ్యను బాగా తగ్గించవచ్చని నిపుణులంటారు. ప్రమాదం జరిగిన గంట(గోల్డెన్ అవర్)లోపు వైద్యం అందితే, ఎన్నో ప్రాణాల్ని కాపాడొచ్చు. కానీ, మన పరిస్థితి పూర్తి భిన్నం. పట్టించుకునే వారే ఉండరు. ప్రమాదస్థలి నుంచి రవాణాగానీ, సమీపంలో వైద్యశాలలుగానీ ఉండవు, ఉన్నా ఎమర్జెన్సీ విభాగాలు ఉండవు. పైగా ప్రమాదపు కేసులకు పెద్దగా ప్రాధాన్యం ఇవ్వవు. 2014లో తెలుగు రాష్ట్రాల్లో జరిగిన 23,512 రోడ్డు ప్రమాదాల్లో 7,862 మంది అసువులు బాసారు. 29,791 మంది క్షతగాత్రులయ్యారు. ఏ కోణంలో చూసినా ఇవి కంటతడి పెట్టించే గణాంకాలే! ఇన్ని లోపాల మధ్య పౌరుల ప్రాణాలు అకాల మర ణంతో ముగుస్తుంటే, ప్రభుత్వాలు నిస్సిగ్గుగా చట్టాల్ని నీరుగార్చి, అమ లును గాలికొదుల్తున్న ఈ తీరునే సుప్రీం తప్పుబట్టింది. ఇక పౌర సమాజం చైతన్యమై నిర్వహణ-నియంత్రణ వ్యవస్థల్ని అంకుశంతో అదిలిస్తే గాని... రోడ్డు భద్రతకు అర్థం లేదు, సగటు పౌరుల ప్రాణాలకు రక్షణ లేదు. దిలీప్ రెడ్డి, సాక్షి ఎగ్జిక్యూటివ్ ఎడిటర్ ఈమెయిల్: dileepreddy@sakshi.com -
పనికిమాలిన చట్టాలను తొలగిస్తాం:మోడీ
బెంగళూరు:దేశంలో అవసరం లేని చట్టాలను తొలగించే పనిలో పడ్డామని ప్రధాని నరేంద్ర మోడీ స్పష్టం చేశారు. ఏ ఉపయోగమూ లేని చట్టాలను తొలగించేందుకు కసరత్తులు ఆరంభించనున్నట్లు ఆయన తెలిపారు. ఇందుకు సంబంధించి ఈ నెల 25వ తేదీ నుంచే పని మొదలు పెడతామన్నారు. జన్ ధన్ యోజన కింద 4 కోట్ల మందికి పేదలు ఖాతాలు తెరిచారన్నారు. బ్యాంకులు ధనికోసమే కాదని.. పేదల కోసం కూడా అని మోడీ పేర్కొన్నారు. సెప్టెంబర్ 26 నుంచి 30 వరకు ప్రధాని నరేంద్రమోడీ అమెరికాలో పర్యటించనున్నారు. ఈ పర్యటనలో అమెరికాకు చెందిన ఆరు కంపెనీల సీఈవోలతో మోడీ సమావేశం కానున్నారు. ఈనెల 27న ఐక్యరాజ్యసమితిలో జరిగే సర్వసభ్య సమావేశంలో మోడీ హిందీలో ప్రసంగించనున్నారు. అనంతరం సెప్టెంబర్ 29, 30 తేదిల్లో అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామాతో నరేంద్రమోడీ భేటీ అవుతారు. -
చట్టాలు చేయలేని పని సంస్కారం చేస్తుంది
నిజామాబాద్, న్యూస్‌లైన్: సమాజంలో నేర ప్రవృత్తిని అరికట్టడానికి చట్టాలు చేయలేని పని సంస్కారం చేస్తుందని, ప్రతి ఒక్కరిలో వ్యక్తిత్వ వికాసం జరగాలని హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ ఎల్.నర్సింహారెడ్డి అన్నారు. మన సంస్కృతి చాలా గొప్పదని, స్త్రీ జాతిని గౌరవిస్తుందని చెప్పారు. నిజామాబాద్ జిల్లా న్యాయ సేవా సంస్థ ఆధ్వర్యంలో బాలలపై లైంగిక నేరాల నిరోధక చట్టంపై జిల్లా కోర్టు ఆవరణలో శనివారం ఏర్పాటు చేసిన జిల్లా స్థాయి అవగాహన సదస్సులో ఆయన మాట్లాడారు. పిల్లలపై లైంగిక దాడులకు నైతిక విలువల పతనమే కారణమని తెలిపారు. ప్రభుత్వ విధానాల కారణంగా మద్యం అమ్మకాలు పెరిగి మత్తులో అఘాయిత్యాలకు, లైంగిక వేధింపులకు పాల్పడుతున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. సినిమాలు, సీరియళ్లు మన సంస్కృతిని భ్రష్టు పట్టిస్తున్నాయన్నారు.