సాక్షి, హైదరాబాద్: 'చట్టాలను రూపొందించారు.. కానీ వాటిని అమలు చేయడం లేదు' అని తెలంగాణ ఐటీ మంత్రి కేటీఆర్ వ్యాఖ్యానించారు. అలాంటి పరిస్థితి గ్రేటర్ హైదరాబాద్‌లో మరీ ఎక్కువగా ఉందని ఆయన తెలిపారు. ఆయనిక్కడ శనివారం మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశారు. నగరంలో 300 స్క్వేర్ ఫీట్స్ నిర్మాణాల్లో ఇంకుడుగుంతలను తప్పకుండా నిర్మించాలని చెప్పారు.
అందుకోసం ప్రభుత్వం ఆరునెలల పాటు స్పెషల్ డ్రైవ్ నిర్వహించనున్నట్టు వెల్లడించారు. స్పెషల్ డ్రైవ్ తర్వాత కూడా ఇంకుడుగుంతలు నిర్మించని వారిపై చర్యలు తీసుకుంటామన్నారు. ఈ విషయంలో ఉపేక్షంచేది లేదని.. అవసరమైతే అధికారులను కూడా బాధ్యులను చేస్తామని కేటీఆర్ తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment