Rainwater pits
-
'ఆ పరిస్థితి హైదరాబాద్లో మరీ ఎక్కువ'
సాక్షి, హైదరాబాద్: 'చట్టాలను రూపొందించారు.. కానీ వాటిని అమలు చేయడం లేదు' అని తెలంగాణ ఐటీ మంత్రి కేటీఆర్ వ్యాఖ్యానించారు. అలాంటి పరిస్థితి గ్రేటర్ హైదరాబాద్లో మరీ ఎక్కువగా ఉందని ఆయన తెలిపారు. ఆయనిక్కడ శనివారం మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశారు. నగరంలో 300 స్క్వేర్ ఫీట్స్ నిర్మాణాల్లో ఇంకుడుగుంతలను తప్పకుండా నిర్మించాలని చెప్పారు. అందుకోసం ప్రభుత్వం ఆరునెలల పాటు స్పెషల్ డ్రైవ్ నిర్వహించనున్నట్టు వెల్లడించారు. స్పెషల్ డ్రైవ్ తర్వాత కూడా ఇంకుడుగుంతలు నిర్మించని వారిపై చర్యలు తీసుకుంటామన్నారు. ఈ విషయంలో ఉపేక్షంచేది లేదని.. అవసరమైతే అధికారులను కూడా బాధ్యులను చేస్తామని కేటీఆర్ తెలిపారు. -
ఇంకుడు గుంతలో పడి ఇద్దరు చిన్నారుల మృతి
కనగానపల్లి (అనంతపురం జిల్లా) : కనగానపల్లి మండలం తూముచెర్ల గ్రామ శివారులో ఇంకుడుగుంతలో పడి ఇద్దరు చిన్నారులు మృత్యువాతపడ్డారు. ఈ సంఘటన సోమవారం మధ్యాహ్నం జరిగింది. తూముచెర్ల గ్రామానికి చెందిన మల్లేశ్, నిర్మల దంపతులు వ్యవసాయ కూలీలుగా పలిచేస్తున్నారు. సోమవారం ఉదయం యధావిధిగా ఇద్దరు పిల్లలు తేజ(9), తరుణ్(7)లను తీసుకుని కూలిపనులకు వెళ్లారు. దంపతులిద్దరూ పొలంలో పనిచేసుకుంటుండగా పిల్లలు ఆడుకుంటూ పక్కనే ఉన్న ఇంకుడుగుంతలో పడిపోయారు. పిల్లల అరుపులు విని వెళ్లేలోగానే వారిద్దరూ నీటిలో మునిగి చనిపోయారు. ఇద్దరు పిల్లలు కళ్లముందే మృతిచెందడంతో తల్లిదండ్రులు కన్నీరుమున్నీరవుతున్నారు. చిన్నారుల మృతితో గ్రామంలో విషాదఛాయలు అలముకున్నాయి.