
పనికిమాలిన చట్టాలను తొలగిస్తాం:మోడీ
బెంగళూరు:దేశంలో అవసరం లేని చట్టాలను తొలగించే పనిలో పడ్డామని ప్రధాని నరేంద్ర మోడీ స్పష్టం చేశారు. ఏ ఉపయోగమూ లేని చట్టాలను తొలగించేందుకు కసరత్తులు ఆరంభించనున్నట్లు ఆయన తెలిపారు. ఇందుకు సంబంధించి ఈ నెల 25వ తేదీ నుంచే పని మొదలు పెడతామన్నారు. జన్ ధన్ యోజన కింద 4 కోట్ల మందికి పేదలు ఖాతాలు తెరిచారన్నారు. బ్యాంకులు ధనికోసమే కాదని.. పేదల కోసం కూడా అని మోడీ పేర్కొన్నారు.
సెప్టెంబర్ 26 నుంచి 30 వరకు ప్రధాని నరేంద్రమోడీ అమెరికాలో పర్యటించనున్నారు. ఈ పర్యటనలో అమెరికాకు చెందిన ఆరు కంపెనీల సీఈవోలతో మోడీ సమావేశం కానున్నారు. ఈనెల 27న ఐక్యరాజ్యసమితిలో జరిగే సర్వసభ్య సమావేశంలో మోడీ హిందీలో ప్రసంగించనున్నారు. అనంతరం సెప్టెంబర్ 29, 30 తేదిల్లో అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామాతో నరేంద్రమోడీ భేటీ అవుతారు.