నిజామాబాద్, న్యూస్‌లైన్: సమాజంలో నేర ప్రవృత్తిని అరికట్టడానికి చట్టాలు చేయలేని పని సంస్కారం చేస్తుందని, ప్రతి ఒక్కరిలో వ్యక్తిత్వ వికాసం జరగాలని హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ ఎల్.నర్సింహారెడ్డి అన్నారు. మన సంస్కృతి చాలా గొప్పదని, స్త్రీ జాతిని గౌరవిస్తుందని చెప్పారు. నిజామాబాద్ జిల్లా న్యాయ సేవా సంస్థ ఆధ్వర్యంలో బాలలపై లైంగిక నేరాల నిరోధక చట్టంపై జిల్లా కోర్టు ఆవరణలో శనివారం ఏర్పాటు చేసిన జిల్లా స్థాయి అవగాహన సదస్సులో ఆయన మాట్లాడారు. పిల్లలపై లైంగిక దాడులకు నైతిక విలువల పతనమే కారణమని తెలిపారు.
ప్రభుత్వ విధానాల కారణంగా మద్యం అమ్మకాలు పెరిగి మత్తులో అఘాయిత్యాలకు, లైంగిక వేధింపులకు పాల్పడుతున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. సినిమాలు, సీరియళ్లు మన సంస్కృతిని భ్రష్టు పట్టిస్తున్నాయన్నారు.