justice narsimha reddy
-
జస్టిస్ నర్సింహారెడ్డిని వైదొలగాలనడం ముమ్మాటికీ ధిక్కరణే
సాక్షి, హైదరాబాద్/ ఢిల్లీ: చట్టబద్ధ విచారణ కమిషన్నే తప్పుపట్టేలా, కమిషన్ చైర్మన్ జస్టిస్ నర్సింహారెడ్డి వైదొలగాలని మాజీ సీఎం కేసీఆర్ ఇచి్చన రాతపూర్వక వివరణ, బెదిరింపులతో కూడిన లేఖ ముమ్మాటికీ ధిక్కరణకు నిదర్శనమ ని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ మండిపడ్డారు. కమిషన్ నోటీసులకు వివరణ ఇస్తే సరిపోయేదని, అందుకు భిన్నంగా కమిషన్ నియామకాన్ని తప్పుబట్టి చైర్మన్ బాధ్యతల నుంచి వైదొలగాలంటూ సూచించడం దారుణమన్నారు.‘ఇది ముమ్మాటికీ ధిక్కరణ కిందకే వస్తుంది. తక్షణమే కేసీఆర్‌ని అరెస్ట్ చేసి విద్యుత్ కొనుగోళ్లలో జరిగిన అవినీతి, అక్రమాలపై విచారణ జరిపి వాస్తవాలను నిగ్గు తేల్చాల్సిన అవస రం ఉంది’ అని డిమాండ్ చేశారు. ప్రభుత్వానికి నిజంగా చిత్తశుద్ధి ఉంటే తక్షణమే కేసీఆర్‌తో సహా విద్యుత్ కొనుగోళ్లు, కాళేశ్వరం, గొర్రెల పంపిణీ స్కాంలలో అవినీతికి పాల్పడ్డ వారిని అరెస్ట్ చేయడంతోపాటు వాస్తవాలను ప్రజల ముందుంచాలన్నారు.సీఎంగా పనిచేసిన కేసీఆర్‌కు రాష్ట్ర ప్రభు త్వం నియమించిన కమిషన్‌కు కనీస గౌర వం ఇవ్వాలనే ఇంగిత జ్ఞానం లేకపోవడం శోచనీయమన్నారు. ఈ మేరకు శనివారం ఆయన ఒక ప్రకటన విడుదల చేశారు. ఈ కమిషన్ ఏర్పాటే తప్పు అని అనుకుంటే...దీనిపై ముందే కేసీఆర్ కోర్టుకు ఎందుకు వెళ్లలేదని ప్రశ్నించారు. అత్యున్నత న్యాయస్థానం చీవాట్లు మరిచారా? తెలంగాణ ఉద్యమ సమయంలో జస్టిస్ నర్సింహారెడ్డి నిజాయితీ, ధైర్యసాహసాలను కేసీఆర్ ప్రశంసించిన సంగతి మర్చిపోయారా అని ప్రశ్నించారు. విద్యుత్ కొనుగోళ్లలో జరిగిన తప్పిదాలను ఎలక్ట్రిసిటీ రెగ్యులేటరీ కమిషన్ (ఈఆర్సీ)పై నెట్టేసి కేసీఆర్ తప్పించుకోవాలని చూస్తున్నారా అని నిలదీశారు. ‘ఈఆర్సీ నిర్ణయాలను నర్సింహారెడ్డి కమిషన్ ఇంతవరకు ఎక్కడా ప్రశ్నించలేదు. నాటి కేసీఆర్ సర్కార్ విధానపరమైన నిర్ణయాలు, వాటి ఆధారంగా జరిగిన అవి నీతి, అక్రమాలపైనే విచారణ జరుపుతున్నారు తప్ప ఈఆర్సీపై కాదు. ఈ విషయం తెలిసి కూడా కేసీఆర్ తన తప్పిదాలను కప్పిపుచ్చుకోవడానికి ఈఆర్సీ ని వివాదంలోకి లాగి బదనాం చేయడం సిగ్గు చేటు’అని బండి సంజయ్ మండిపడ్డారు.తెలంగాణ బిడ్డ జస్టిస్ నర్సింహారెడ్డి అని సంబోధిస్తూనే ఆయన వ్యక్తిత్వాన్ని దెబ్బతీసేలా కేసీఆర్ పేర్కొనడం దుర్మార్గమన్నారు. తెలంగాణ ఉద్య మంలో అగ్రభాగాన ఉంటూ ఉస్మానియా వర్సిటీ లో వేసిన ముళ్ల కంచెను తీసివేయాలంటూ పోలీ సులకు ఆదేశాలు జారీ చేసిన తెలంగాణ ముద్దు బిడ్డ నర్సింహారెడ్డి అని తెలిపారు. తన తప్పులు, అవినీతి, అక్రమాలను కప్పిపుచ్చుకునేందుకు కేసీఆర్ ఎందాకైనా వెళతారనే దానికి ఈ ఉదంతం ఒక నిదర్శనమన్నారు.నాడు ఎమ్మెల్యేల కొనుగోళ్ల డ్రామా వ్యవహారం కోర్టు పరిధిలో ఉండగా... ప్రెస్‌మీట్ నిర్వహించి న్యాయస్థానాలను ప్రభావితం చేసేలా ఇదే తరహాలో ఎదురుదాడి చేసి బీజేపీపై అభాండాలు మోపి రాజకీయ లబ్ధిపొందాలనుకుని భావిస్తే... కోర్టు పరిధిలో ఉన్న అంశంపై ఇంగిత జ్ఞానం లేకుండా మాట్లాడతారా ? అంటూ అత్యున్నత న్యాయస్థానం చివాట్లు పెట్టిన సంగతి కేసీఆర్ మర్చిపోయినట్లున్నారని పేర్కొన్నారు. బీఆర్ఎస్ నేతల అవినీతి, అక్రమాలపై ఆధారాలున్నప్పటికీ కాంగ్రెస్ ప్రభుత్వం బాధ్యులను అరెస్ట్ చేయకపోవడం వెనుక ఉద్దేశం ఏమిటి? అని సంజయ్ ప్రశ్నించారు. -
నా వెంటే... ఓరుగల్లు నీతి, నిజాయితీ
జస్టిస్ నర్సింహారెడ్డి బార్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఘన సన్మానం వరంగల్ లీగల్ : వరంగల్ జిల్లా సాహిత్య, సాంసృ్కతిక, కళలకు నిలయమని.. రామప్ప దేవాలయ నిర్మాణ కళకు ప్రపంచంలోనే సరితూగే మరో నిర్మాణం లేదని జస్టిస్ నర్సింహారెడ్డి అన్నారు. ఇక్కడి సామాజిక సంబంధాలు, ప్రతిస్పందన లు, మానవత్వం పునాదిగా ఉంటాయని, బమ్మెర పోతన రచనల నుంచి నేర్చుకున్న నిబ ద్ధత, నిజాయితీ ఎల్లప్పుడూ తన వెంటే ఉం టాయని ఆయన పేర్కొన్నారు. పాట్నా హైకో ర్టు ప్రధాన న్యాయమూర్తిగా పదోన్నతిపై వెళ్తు న్న నర్సింహారెడ్డిని జిల్లా బార్ అసోసియేషన్ ఆధ్వర్యంలో జిల్లా కోర్టు ఆవరణలో సోమవా రం సాయంత్రం ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా వేదమంత్రోచ్ఛరణల నడుమ బార్ అసోసియేషన్ బాధ్యులు, న్యాయమూర్తులు, న్యాయవాదులు నర్సింహారెడ్డిని సభా ప్రాంగణం వద్దకు తీసుకొచ్చారు. అనంతరం బార్ అసోసియేషన్ అధ్యక్షుడు గుడిమల్ల రవికుమార్ అధ్యక్షతన సన్మాన సభ జరిగింది. సేవా కార్యక్రమాలు చేపట్టాలి న్యాయవాదులు, న్యాయమూర్తులు.. సమస్య ల పరిష్కారం కోసం ప్రయత్నం చేయాలని నర్సింహారెడ్డి కోరారు. గ్రామీణ జీవన నేపథ్యం ఉన్న వ్యక్తులు సామాజిక సేవ చేయడానికి ఎక్కువగా కృషి చేస్తారని ఆయన అభిప్రాయపడ్డారు. సన్మార్గంలో సంపాదించిన సొమ్ముతోనే సంతృప్తి లభిస్తుందని, అక్రమ మార్గంలో ప్రయాణం మొదలుపెడితే పతనం ఖాయమని తెలిపారు. అవసరానికి మించి ఆస్తులు ఉన్న వారు ఆకారపు, కొమురవెళ్లి వంశస్తులను ఆదర్శంగా తీసుకొని సామాజిక సేవా కార్యక్రమాలు నిర్వహించాలని సూచిం చారు. కాగా, తాను ఎక్కడికి వెళ్లినా వరంగల్ జిల్లా ఔన్నత్యాన్ని, గౌరవాన్ని పెంపొందించే లా పనిచేస్తానని, జిల్లా న్యాయవాదులకు తన సహకారం ఉంటుందని తెలిపారు. అనంతరం సభకు అధ్యక్షత వహించిన గుడిమల్ల రవికుమార్, బార్ కౌన్సిల్ సభ్యుడు సహోదర్‌రెడ్డి తదితరులు మాట్లాడుతూ పాట్నా హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా వెళ్తున్న నర్సింహారెడ్డి త్వరలోనే సుప్రీంకోర్టు న్యాయమూర్తి కావాల ని ఆకాంక్షించారు. సమావేశంలో జిల్లా ప్రధాన జడ్జి మఠం వెంకటరమణ, అదనపు జిల్లా జడ్జిలు నర్సింహులు, కృష్ణయ్య, సాల్మన్‌రాజ్, బార్ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి సూరం నర్సింహస్వామి, ఓరుగంటి కోటేశ్వర్రావు, సందసాని రాజేంద్రప్రసాద్, కొలునూరి సుశీల, సుదర్శన్, ఎం.మంజుల, సురేష్, ఆశీర్వాదం, దామోదర్, వివి.గిరి, వివిధ ప్రాం తాల న్యాయవాదులు పాల్గొన్నారు. -
డిసెంబర్ 6 తేదిన మెగా లోక్ అదాలత్!
హైదరాబాద్: లోక్ అదాలత్ లో చాలా కేసులు పెండింగ్ లో ఉన్నాయని హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ నరసింహరెడ్డి అన్నారు. మెగా లోక్ అదాలత్ పై జస్టిస్ నరసింహరెడ్డి మీడియా సమావేశం నిర్వహించారు. డిసెంబర్ 6 తేదిన లోక్ అదాలత్ నిర్వహించనున్నట్టు ఆయన తెలిపారు. సివిల్ కేసులను కూడా లోక్ అదాలత్ లో పరిష్కరించుకోవచ్చని ఆయన అన్నారు. కేసుల సంఖ్యను బట్టి అన్ని కోర్టుల్లో లోక్ అదాలత్ ఉంటుందని ఆయన తెలిపారు. గత ఏడాది నిర్వహించిన లోక్ అదాలత్ లో 1.11 లక్షల కేసులు పరిష్కారం అయ్యాయని జస్టిస్ నర్సింహరెడ్డి తెలిపారు. ఎఫ్ఐఆర్ దశలో ఉన్న కేసులను మెగా లోక్ అదాలత్ లో పరిష్కారమయ్యేలా చూస్తామన్నారు. ఏపీలో 10 లక్షల కేసులు పెండింగ్ లో ఉన్నాయని జస్టిస్ నర్సింహరెడ్డి వెల్లడించారు. -
చట్టాలు చేయలేని పని సంస్కారం చేస్తుంది
నిజామాబాద్, న్యూస్‌లైన్: సమాజంలో నేర ప్రవృత్తిని అరికట్టడానికి చట్టాలు చేయలేని పని సంస్కారం చేస్తుందని, ప్రతి ఒక్కరిలో వ్యక్తిత్వ వికాసం జరగాలని హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ ఎల్.నర్సింహారెడ్డి అన్నారు. మన సంస్కృతి చాలా గొప్పదని, స్త్రీ జాతిని గౌరవిస్తుందని చెప్పారు. నిజామాబాద్ జిల్లా న్యాయ సేవా సంస్థ ఆధ్వర్యంలో బాలలపై లైంగిక నేరాల నిరోధక చట్టంపై జిల్లా కోర్టు ఆవరణలో శనివారం ఏర్పాటు చేసిన జిల్లా స్థాయి అవగాహన సదస్సులో ఆయన మాట్లాడారు. పిల్లలపై లైంగిక దాడులకు నైతిక విలువల పతనమే కారణమని తెలిపారు. ప్రభుత్వ విధానాల కారణంగా మద్యం అమ్మకాలు పెరిగి మత్తులో అఘాయిత్యాలకు, లైంగిక వేధింపులకు పాల్పడుతున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. సినిమాలు, సీరియళ్లు మన సంస్కృతిని భ్రష్టు పట్టిస్తున్నాయన్నారు.