అలోవెరాని తెలుగులో కలబంద అంటాం. దీన్ని ముఖానికి, శిరోజాల సంరక్షణకు ఉపయోగిస్తుంటారు. అంతేగాదు ఆరోగ్యానికి మంచిదని ఆహారం కూడా వినియోగిస్తుంటారు. ముఖ్యంగా ఆయుర్వేదంలో ఎక్కువగా వినియోగిస్తుంటారు. అలాంటి అలోవెరాతో బ్యాటరీల తయారు చేశారు ఇద్దరు టెక్కీలు. నూటికి నూరు శాతం పర్యావరణ హితమైన బ్యాటరీలు రూపొందించి అందరిచేత శభాష్ అనిపించుకున్నారు. పైగా కేంద్ర ప్రభుత్వంచే నేషనల్ స్టార్టప్ అవార్డును కూడా అందుకున్నారు. ఎవరా టెక్కీలు..? ఎలా ఈ ఆవిష్కరణకు పూనకున్నారంటే..
మనం సాధారణంగా వాడే బ్యాటరీల్లో కాడ్మియం వంటి విషపదార్థాలు ఉంటాయి. ప్రతి ఏడాది లక్షలకొద్ది బ్యాటరీ వ్యర్థాలు భూమిపై పేరుకుపోతున్నాయి. వాటివల్ల పర్యావరణ కాలుష్యం ఏర్పడుతుంది. వాటిని ఒకవేళ మండించిన విడుదల అయ్యే వాయువుల వల్ల ప్రజలు అనారోగ్యం బారినపడతారు. దీనికి ఎలా చెక్‌పెట్టాలని ఆలోచించారు జైపూర్ బీటెక్ విద్యార్థులు నిమిషా వర్మ, నవీన్ సుమన్‌లు.
ఆ దిశగా వివిధ ప్రయోగాలు చేశారు. పర్యావరణ హితమైన బ్యాటరీలు చేయాలన్నది వారి లక్ష్యం. ఆ ప్రయత్నాల్లో ఈ వినూత్న ఆలోచన తట్టింది. కలబంద పదార్థాలతో పర్యావరణ అనూకూల బ్యాటరీలను రూపొందిచొచ్చని కనుగొన్నారు. దీన్నే ఆచరణలో పెట్టి అలో ఇ సెల్ పేరుతో స్టార్టప్‌ని 2018 ఏర్పాటు చేసి.. అలోవెరాతో బ్యాటరీలను ఉత్పత్తి చేశారు.
ఈ బ్యాటరీలను మార్కెట్లో రూ. 9 నుంచి రూ.10 ధరల్లో అందుబాటులో ఉంచారు. బార్సిలోనాలో ష్నెడర్ ఎలక్ట్రిక్ నిర్వహించిన ఇన్నోవేషన్ సదస్సులో ప్రపంచవ్యాప్తంగా ఎనిమిది స్టార్ట్‌ప్‌లో ఈ ఆవిష్కరణ కూడా ఒకటి. అకడున్న వారందర్నీ ఈ ఆవిష్కరణ ఎంతగానో ఆకట్టుకుంది. అంతేగా ఈఅద్భుత ఆవిష్కరణగానూ ఆ టెక్కీలిద్దర్ని కేంద్ర ప్రభుత్వం జాతీయ స్టార్టప్ అవార్డుతో సత్కరించింది.
(చదవండి: వ్యాయామం చేయని మహిళలు తీసుకోవాల్సిన డైట్ ఇదే! ఐసీఎంఆర్ మార్గదర్శకాలు)
Comments
Please login to add a commentAdd a comment