టెకీ అనుమానాస్పద మృతి: భార్యకు తీవ్ర గాయాలు | Techie found dead in Dwarka flat, wife severely injured | Sakshi
Sakshi News home page

టెకీ అనుమానాస్పద మృతి: భార్యకు తీవ్ర గాయాలు

Published Mon, Jan 5 2015 10:13 AM | Last Updated on Tue, Aug 14 2018 3:47 PM

టెకీ అనుమానాస్పద మృతి: భార్యకు తీవ్ర గాయాలు - Sakshi

టెకీ అనుమానాస్పద మృతి: భార్యకు తీవ్ర గాయాలు

న్యూఢిల్లీ: ఓ ఎమ్ఎన్సీ కంపెనీలో సాఫ్ట్ వేర్ గా పనిచేస్తున్న అమిత్ బచ్చన్(32) ఆదివారం అనుమానాస్పద స్థితిలో మరణించాడు. ద్వారాక సెక్టార్ లోని ప్లాటినం హైట్స్ లో అతని ఫ్లాట్ లో చోటు చేసుకున్న ఈ ఘటన స్థానికంగా కలకలం రేపింది.  ఈ ఘటనలో అతని భార్య శివానీకి తీవ్ర గాయాలైయ్యాయి.  కాగా, అతను మృతిచెందిన సమయంలో కేబుల్ వైర్ మెడకు చుట్టుకుని ఉండటంతో పలు అనుమానాలకు తావిస్తోంది.

 

ఆదివారం ఉదయం ఐదు గంటల ప్రాంతంలో అమిత్ తనను హింసిస్తున్నాడంటూ భార్య శివానీ పోలీసులకు ఫోన్ చేసి చెప్పింది.  అయితే పోలీసులు అక్కడికి వెళ్లే సరికి అతని ఫ్లాట్ కు గడియ పెట్టి ఉంది. దీంతో తలుపులు బద్దలు కొట్టి లోనికి వెళ్లిన పోలీసులకు అమిత్ నిర్జీవంగా పడి ఉండటంతో పాటు తీవ్ర గాయాలతో శివానీ ఓ మూలన పడి ఉంది. శివానీ తల్లి కూడా సృహకోల్పోయి ఉన్నట్లు పోలీసులు తెలిపారు. ప్రస్తుతం ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న భార్య స్టేట్ మెంట్ ను రికార్డును నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement