
సాక్షి, హైదరాబాద్: బంజారాహిల్స్‌లో మతిస్థిమితం లేని ఓ యువకుడు హల్‌చల్ చేశాడు. శుక్రవారం తెల్లవారుజామున బంజారాహిల్స్‌రోడ్ నెంబర్ 3లోని టీవీ–9 చౌరస్తాలో ఓ యువకుడు దుస్తులులేకుండా న్యూసెన్స్‌కు పాల్పడుతూ రాళ్లతో అటునుంచి రాకపోకలు సాగిస్తున్నవారిపై దాడి చేశాడు. అదృష్టవశాత్తు ఎవరికీ గాయాలు కాలేదు. సమాచారం అందుకున్న బంజారాహిల్స్ పెట్రోలింగ్ కార్–2 వాహనం అక్కడకు చేరుకుంది. పోలీసులు వాహనంచూడగానే ఆ యువకుడు మరింత రెచ్చిపోయి రాళ్లతో కారు అద్దాలను ధ్వంసం చేశాడు.దీంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. ఆ యువకుడిని అదుపులోకి తీసుకునేందుకు అటు పోలీసు, ఇటు అక్కడ నుంచివెళుతున్న వాహనదారులు, పాదచారులు ప్రయత్నించగా వారిపై రాళ్లతో దాడి చేసేందుకు యత్నించాడు. ఎట్టకేలకు పోలీసులు బాధిత యువకుడిని అదుపులోకి తీసుకుని ఎర్రగడ్డ మానసిక చికిత్సాలయానికి పంపించారు.
ఆరా తీయగా ఆ యువకుడి పేరు అక్షయ్(25)గా గుర్తించారు. తిరుమలగిరిలో నివాసముండే అక్షయ్ హైటెక్ సిటీలోని ఓ సాఫ్ట్‌వేర్ సంస్థలో పనిచేస్తుంటాడని ఎప్పటిలాగే గురువారం రాత్రి 7 గంటలకు తిరుమలగిరిలో క్యాబ్ ఎక్కి డ్యూటీకి వెళ్లాడని తండ్రి వెల్లడించాడు. అయితే తెల్లవారు ఉదయం 7 గంటలకు ఇంటికి చేరాల్సివుంది. ఎంతకూ రాకపోయేసరికి ఆందోళనచెందిన కుటుంబసభ్యులు వెతుకుతుండగానే బంజారాహిల్స్‌లో బట్టలు విప్పేసి నగ్నంగా రోడ్డుపై తిరుగుతూ బీభత్సం సృష్టిస్తున్నట్లు సమాచారం అందింది. పోలీసులు ఈ ఘటనపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. అక్షయ్‌కి నాలుగేళ్ల క్రితం పెళ్లి జరిగిందని, ఇద్దరు కూతుళ్లు కూడా ఉన్నారని కుటుంబసభ్యులు తెలిపారు. ఇలా ఎందుకు తయారయ్యాడో తమకు అంతుపట్టడంలేదని ఆందోళన వ్యక్తం చేశారు. మొత్తానికి రెండు గంటల పాటు బంజారాహిల్స్ రహదారిపై అక్షయ్ చేసిన న్యూసెన్స్‌తో స్థానికంగా ఉద్రిక్తత ఏర్పడింది.
Comments
Please login to add a commentAdd a comment