ఉద్యోగం చేస్తున్న చాలామంది ఎక్కువ జీతం వచ్చే ఉద్యోగం వస్తే.. దాన్ని ఎంచుకుని ముందుకు సాగిపోతారు. అయితే ఇటీవల ఒక ఉద్యోగికి లక్షల జీతం లభించే ఉద్యోగం లభించినప్పటికీ.. ఓ సందేహం వచ్చింది. తన సందేహానికి సమాధానం కోరుతూ.. రెడ్డిట్‌లో పోస్ట్ చేశారు.
నేను బెంగుళూరులో మెకానికల్ ఇంజనీర్, వయసు 31, పెళ్లయింది, ఇంకా పిల్లలు లేరు. నెలకు రూ.1.30 లక్షలు సంపాదిస్తున్నాను. ఇంటి అద్దె, తల్లితండ్రులకు డబ్బు పంపించిన తరువాత కూడా నాకు రూ. 50వేలు నుంచి రూ. 60వేలు మిగులుతుంది. అయితే ఇది ఈఎంఐ చెల్లించడానికి సరిపోతుంది. ఈఎంఐ ఇంకా సంవత్సరం పాటు చెప్పించాల్సి ఉంది.
ఉద్యోగ జీవితం బాగానే ఉంది, ఆరోగ్య భీమాకు సంబంధించినవన్నీ కంపెనీ చూసుకుంటుంది. అయితే ఇటీవల నాకు స్వీడన్‌లోని హెల్సింగ్‌బోర్గ్‌లో నెలకు రూ.3.90 లక్షల జీతం పొందే ఆఫర్ వచ్చింది. నా స్వగ్రామంలో నా మీదనే ఆధారపడిన తల్లిదండ్రులు ఉన్నారు. వారికి నేను ఒక్కడినే సంతానం. కాబట్టి నేను ఇప్పుడు స్వీడన్‌కు వెళ్లి అక్కడే స్థిరపడాలా? లేదా ఇక్కడే ఉండి.. ఉన్న ఉద్యోగం చేసుకోవాలా? ఆర్థిక పరంగా ఎదగటానికి 4-5 సంవత్సరాలు స్వీడన్‌కు వెళ్లడం నా పరిస్థితికి సహాయపడుతుందా?.. దయచేసి ఎవరైనా సలహా ఇవ్వగలరా? అని రెడ్డిట్‌లో సలహా కోరారు.
స్వీడన్ వెళ్లాలనుకుంటే.. మీరు ఒక్కరే కాకుండా, మీ భార్యను కూడా పని చేయడానికి ప్రేరేపించండి. లేకుంటే అక్కడ ఆమె ఒంటరిగా ఉండాల్సి వస్తుంది. సొంతంగా ఏదైనా చేయడానికి ప్రయత్నించేలా చేయండి. అక్కడ కొన్ని భాషా తరగతులకు హాజరయ్యేలా చూడండి అని ఒకరి రాశారు.
స్వీడన్ మీరు అధిక సంపాదన కోసం వెళ్లే దేశం కాదు. మీరు ఒంటరిగా ఉండి, పొదుపుగా జీవిస్తే మీరు ఎక్కువ ఆదా చేసుకోవచ్చని మరొకరు అన్నారు. మీరు సన్యాసిలా జీవిస్తే మీ జీతంలో సగం వరకు ఆదా చేయవచ్చు, కానీ ప్రయోజనం ఏమిటి, అని ఇంకొకరు వ్యాఖ్యానించారు. ఉద్యోగం మారితే మరింత ఎక్కువ సంపాదించవచ్చని మరికొందరు సలహా ఇచ్చారు.
Comments
Please login to add a commentAdd a comment