కార్యాలయంలో సాప్ట్వేర్ ఇంజినీర్ మృతి | techie dies in office rest room | Sakshi
Sakshi News home page

కార్యాలయంలో సాప్ట్వేర్ ఇంజినీర్ మృతి

Published Tue, Aug 26 2014 9:34 AM | Last Updated on Fri, May 25 2018 7:14 PM

కార్యాలయంలో సాప్ట్వేర్ ఇంజినీర్ మృతి - Sakshi

కార్యాలయంలో సాప్ట్వేర్ ఇంజినీర్ మృతి

హైదరాబాద్: ఆదివారం విధులకు హాజరైన ఓ సాప్ట్వేర్ ఉద్యోగి కార్యాలయం విశ్రాంతి గదిలో సోమవారం శవమై కనిపించాడు. న్యూఢిల్లీకి చెందిన ప్రతీక్ హోరా(22) ఐఐటీ గౌహతీలో ఇంజినీరింగ్ పూర్తి చేశాడు. క్యాంపస్ సెలక్షన్స్‌లో గచ్చిబౌలిలోని అమెజాన్ ఐటీ కంపెనీలో సాప్ట్వేర్ ఉద్యోగం సంపాదించాడు. గత జూలై 14 నుంచి విధులకు హాజరవుతున్నాడు. గచ్చిబౌలి రాజీవ్‌నగర్‌లో హస్టల్‌లో ఉంటూ కార్యాలయానికి వెళ్లేవాడు.

 ఆదివారం ఉదయం విధులకు హాజరయ్యాడు. అయితే ఆరోగ్యం సరిగా లేదని చెప్పి అక్కడే ఉన్న విశ్రాంతి గదిలో పడుకున్నాడు. సోమవారం ఉదయం హౌస్ కీపింగ్ బాయ్ చూసేసరికి ప్రతీక్ అచేతన స్థితిలో కనిపించాడు. కంపెనీ ప్రతినిధులు నుంచి సమాచారం అందుకున్న పోలీసులు మృత దేహన్ని ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు. యువకుడి తల్లి హైదరాబాద్‌కు బయల్దేరినట్లు తెలుస్తోంది. ప్రతీక్ ముక్కు నుంచి  రక్తం, నోటి నుంచి నురగలు వచ్చినట్లుందని, అనారోగ్యంతో మృతి చెందినట్లు భావిస్తున్నామని సీఐ తెలిపారు.

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement